చీర్వానుప్పలపాడు

From tewiki
Jump to navigation Jump to search


చీర్వానుప్పలపాడు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

చీర్వానుప్పలపాడు, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.[1].ఎస్.టి.డి కోడ్:08593. పిన్ కోడ్: 523183

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

వెంపర్ల 2 కి.మీ, జమ్మలమడక 3 కి.మీ, వెలమవారి పాలెం 4 కి.మీ, గొర్రెపాడు 5 కి.మీ, మారెళ్ల 5 కి.మీ.

సమీప పట్టణాలు

ముండ్లమూరు12 కి.మీ, అద్దంకి 12.9 కి.మీ, తాళ్ళూరు 17.5 కి.మీ, బల్లికురవ 17.8 కి.మీ.

సమీప మండలాలు

దక్షణాన అద్దంకి మండలం, పశ్చిమాన నూజెండ్ల మండలం, దక్షణాన తాళ్ళూరు మండలం, తూర్పున బల్లికురవ మండలం.

గ్రామంలో మౌలిక వసతులు

త్రాగునీటి సౌకర్యం

ఈ గ్రామంలోని పానకాల చెరువును, రు. ఏడున్నర కోట్ల వ్యయంతో చిరుజలాశయంగా అభివృద్ధిచేసారు. ఈ చెరువు ద్వారా చదలవాడ, అగ్రహారం, పానకాలచెరువు, అమ్మనబ్రోలు, కనపర్తి, వినోదరాయునిపాలెం మొదలగు 9 గ్రామాలకు త్రాగునీరు సరఫరా చేసెదరు. దీనికి ప్రధాన నీటి వనరులు గుండ్లకమ్మ కాలువలే. [2]&[4]

ఈ గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఆర్.ఓ ప్లాంటును, 2017,జులై-6న ప్రారంభించినారు. [6]

వీధిదీపాలు

ఈ గ్రామానికి చెందిన శ్రీ గుళ్ళపల్లి శ్రీనివాసరావు, 2017,జులై-6న, తన స్వంత నిధులు ఐదు లక్షల రూపాయల వ్యయంతో, గ్రామంలో ఎల్.ఇ.డి దీపాలు అమర్చినారు. [6]

గ్రామానికి వ్యయసాయం, సాగునీటి సౌకర్యం

ఈ గ్రామం వద్ద, గుండ్లకమ్మ నదిపై, 14.8 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో, ఒక చెక్ డ్యాం నిర్మాణానికి అనుమతి మంజూరైనది. ఈ చెక్ డ్యాం నిర్మాణం పూర్తి అయినచో, ఈ ప్రాంతంలోని 22 గ్రామాలకు త్రాగునీరు, 4,860 ఎకరాలకు సాగునీరు అందజేయగలరు. ఈ చెక్ డ్యాంలో రైతులకు అవసరమైన వరకు నీటిని నిలువచేసుకొని, మిగిలిన నీటిని దుగువకు వదలుటకు వీలుగా ఇక్కడ గేట్లు గూడా ఏర్పాటు చేయుదురు. [5]

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి చప్పిడి సుశీల, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు. కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,913.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,449, మహిళల సంఖ్య 1,464, గ్రామంలో నివాస గృహాలు 707 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 847 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 2,988 - పురుషుల సంఖ్య 1,497 - స్త్రీల సంఖ్య 1,491 - గృహాల సంఖ్య 789

మూలాలు

వెలుపలి లంకెలు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మార్చి-16; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,ఆగస్టు-18; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,నవంబరు-8; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2015,నవంబరు-26; 16వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017,జులై-7; 2వపేజీ.