"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
చెంగల్వ
చెంగల్వ | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Tribe: | |
Subtribe: | |
Genus: | |
Species: | C. asiaticum
|
Binomial name | |
Crinum asiaticum |
చెంగల్వ (లాటిన్ Crinum asiaticum) ఒకరకమైన పువ్వుల చెట్టు. ఇది 2 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది, లేత-ఆకుపచ్చ, 50-150 నుండి 3-20 సెం.మీ., సమాంతర సిరలను కలిగి ఉంటాయి.దీని పువ్వులు 10-50 సమూహాలలో, పొడవైన కొమ్మ పైభాగంలో పెరుగుతాయి. పువ్వులు రాత్రి వేళల సువాసనగా ఉంటాయి.పండ్లు 2.5-6.5 సెం.మీ వెడల్పుతో, 1-5 విత్తనాలతో ఉంటాయి. దీని విత్తనాలు 2-4.5 సెం.మీ వెడల్పుతో ఉంటాయి. ఇది తీరప్రాంత అడవులు, మడ అడవులు, ఇసుక తీరాలు , నీటి అంచుల సరిహద్దుల వెంట తక్కువ ఎత్తులో పెరుగుతుంది. చెంగల్వ చెట్టు పొడి నేలలు, తేమ నేలలు, బాగా ఎండిపోయిన నేలలలో పెరుగ గలదు [1] [2] చెంగల్వ పువ్వల చెట్టును కేసరచెట్టు, లక్ష్మీనారాయణచెట్టు ,విషమంగలి చెట్టు అని పిలుస్తుంటారు [3]
ఉపయోగములు : చెంగల్వ మొక్కల భాగాన్ని జీర్ణశయాంతర రుగ్మతలు, చర్మ వ్యాధులు, జ్వరం, చెవి, దిమ్మలు, టాన్సిలిటిస్, గవదబిళ్ళలు, హెర్నియా, రుమాటిజం, మూత్ర సమస్యలు, ఎముక పగులు, విషానికి విరుగుడుగా ఉపయోగిస్తారు [4][5] చెంగల్వ మొక్క నుంచి వచ్చే పెద్ద లిల్లీ మొక్క. ఇది ఇంటి తోట కోసం వేయవచ్చును . ముఖ్యంగా పెద్దది అయినప్పుడు, పూర్తి ఎండ నుండి కొంచము నీడ లో దీనిని పెంచవచ్చు. ఇది మాములు నీటి పారుదల ఉంటే కూడా పెరగడానికి సరిపోతుంది . చిత్తడి లిల్లీ పువ్వును చెరువు అంచుకు సమీపంలో కూడా పెంచవచ్చు [6] చెంగల్వ మొక్క విష మొక్క మొత్తం విషపూరితమైనది, వివిధ రకాల ఆల్కలాయిడ్లు ఉన్నాయి, వీటిని మనుషుల శరీరం తట్టుకోవు. చర్మంపై మొక్కల రసాలుపడకుండా ఉండటానికి చేతి తొడుగులు పెట్టుకోవలెను , ఎందుకంటే వాపు లేదా ఇతర సమస్యలను కలిగిస్తుంది . దీన్ని తినవద్దు . పిల్లలకు ,కు క్కలు, పిల్లులు దూరముగా ఈ మొక్కను ఉంచవలెను . మనుషులకు కూడా అంతే ప్రమాదకరం ఈ చెంగల్వ మొక్క
- ↑ "Crinum asiaticum L." https://www.nparks.gov.sg/. 22/9/2020. Retrieved 22/09/2020. Check date values in:
|access-date=
and|date=
(help); External link in|website=
(help) - ↑ "Crinum asiaticum L". https://indiabiodiversity.org/species/. 22-09-2020. Archived from the original on 2017-08-24. Retrieved 22-09-2020. Check date values in:
|access-date=
and|date=
(help); External link in|website=
(help) - ↑ "Crinum asiaticum - Grand Crinum Lily". www.flowersofindia.net. Retrieved 2020-09-23.
- ↑ "Flowering Plants of TDU - Crinum asiaticum". The University of Trans-Disciplinary Health Sciences and Technology (TDU) (in English). 2019-07-26. Retrieved 2020-09-23.
- ↑ "Crinum asiaticum Linn: A Medicinal Herb as Well as Ornamental Plant in Central India" (PDF). https://juniperpublishers.com/ijesnr. 24-09-2020. Retrieved 24-09-2020. line feed character in
|title=
at position 51 (help); Check date values in:|access-date=
and|date=
(help); External link in|website=
(help) - ↑ "National Tropical Botanical Garden | Crinum asiaticum var. pedunculatum - Plant Detail - Meet The Plants". National Tropical Botanical Garden (in English). Retrieved 2020-09-24.