"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

చెరియాల్ పటచిత్రాలు

From tewiki
Jump to navigation Jump to search


చెరియాల పటచిత్రం

చెరియాల పటచిత్రాల కళ తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్ జిల్లా ప్రాంతానికి చెందిది. ఈ కళ స్థానిక మూలాంశాలతో చిత్రిస్తారు, దీనిని నకాశి కళగా కూడా వర్నిస్తారు. స్థానిక పురాణాలు, జానపద కథల నుండి ఈ పటచిత్రాలు సూచిస్తాయి. చాలా మట్టుకు ఈ చిత్రాలు రోల్ లేదా కామిక్ స్ట్రిప్ మాదిరిగా వుంటాయి. ఈ చిత్రాలు అల్లిక రూపంలో చిత్రించి సన్నిహిత సాహిత్యాలు, రామాయణము, మహా భారతము, పురాణాలు నుంచి కథలు చిత్రిస్తారు. ఈ చిత్రలేఖనాలు, దేశం యొక్క వివిధ ఇతర ప్రాంతాల్లో వలె, ఆంధ్ర అంతటా కూడా ప్రబలంగా ఉన్నాయి. వారి వారి విభిన్న శైలులు, స్థానిక ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతుల ప్రకారం స్థానిక సంక్లిష్టతలనుతో ఈ చిత్రలేఖనాలు దేశం యొక్క వివిధ ప్రాంతాల్లో, ఆంధ్ర ప్రాతంలో కూడా ప్రబలంగా ఉన్నాయి.

చరిత్ర

ఆసియా కళాత్మక సంప్రదాయంలో పటచిత్ర కళ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. చైనా సాంప్రదాయనికి భిన్నంగా ఇక్కడ ఈ చిత్ర కళను గ్రామాల్లో నకాషి కళాకారులు రూపొందిస్తారు. వీటిలో భిన్నమైన అంశాలు, కథలు, జానపద సంప్రదాయాలు స్పష్టంగా గోచరిస్తాయి.

చిత్ర లక్షణాలు

చేర్యాల పట చిత్రాల యొక్క లక్షణాలను విశేషాలను క్రింది పద్ధతుల ద్వారా సులభం గా కనుగొనవచ్చు ఈ పటలలో ఎరుపు వర్ణం బాక్గ్రౌండ్ గా ఉంటుంది., ప్రాథమిక రంగులనే వాడుతారు

ఇతర లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

వెలుపలి లంకెలు