జకార్తా

From tewiki
Jump to navigation Jump to search
జకార్తా

Daerah Khusus Ibukota Jakarta
Special Capital Territory of Jakarta
(From top, left to right): Jakarta Skyline, Jakarta Old Town, Hotel Indonesia Roundabout, Monumen Nasional, Jakarta traffic, Istiqlal Mosque
(From top, left to right): Jakarta Skyline, Jakarta Old Town, Hotel Indonesia Roundabout, Monumen Nasional, Jakarta traffic, Istiqlal Mosque
ముద్దుపేరు(ర్లు): 
The Big Durian[1]
నినాదం: 
Jaya Raya (Indonesian)
(Victorious and Great)
దేశంఇండోనేషియా
ప్రావిన్స్జకార్తా
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంSpecial administrative area
 • గవర్నర్Fauzi Bowo
విస్తీర్ణం
 • City740.28 km2 (285.82 sq mi)
 • భూమి662.33 km2 (255.73 sq mi)
 • నీరు6,977.5 km2 (2.0 sq mi)
సముద్రమట్టం నుండి ఎత్తు
7 మీ (23 అ.)
జనాభా
(2008)
87,92,000
 • సాంద్రత12,957.31/km2 (33.3/sq mi)
 • మెట్రో ప్రాంతం
24
 [2]
కాలమానంUTC+7 (WIB)
ప్రాంతీయ ఫోన్ కోడ్+6221
జాలస్థలిwww.jakarta.go.id

జకార్తా ఇండోనేషియా దేశ రాజధాని మరియు ఆ దేశంలో ఇది అతిపెద్ద నగరం. జావా వాయువ్య తీరంలో ఉన్న ఈ నగరం 661 చ.కి.మీ వైశాల్యం మరియు 8,490,000 జనాభా కలిగివుంది.[2] జకార్తా దేశ ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ కేంద్రంగా ఉంది. ఇది ఇండోనేషియా మరియు ఆగ్నేయాసియాలో అత్యధిక జనాభా కలిగిన నగరంగా మరియు ప్రపంచంలో పన్నెండోవ పెద్ద నగరంగా గుర్తింపు పొందింది. జబోడెటాబెక్‌గా పిలిచే దీని యొక్క మహానగరం ప్రాంతం, ప్రపంచంలో రెండో అతిపెద్ద మహానగరంగా గుర్తించబడింది. 2008 గ్లోబలైజేషన్ అండ్ వరల్డ్ సిటీస్ స్టడీ గ్రూప్ అండ్ నెట్‌వర్క్ (GaWC) పరిశోధనలో జకార్తా ఒక ప్రథమ శ్రేణి ప్రపంచ నగరంగా (ఆల్ఫా సిటీ లేదా గ్లోబల్ సిటీ) పరిగణించబడింది.[3] "జయకార్తా" (जयकर्) అనే సంస్కృత పదం నుంచి ఈ నగరం పేరు ఉద్భవించింది, దీనికి "విజయ కృత్యం," "సంపూర్ణ కార్యం,"లేదా "సంపూర్ణ విజయం" అనే అర్థాలు ఉన్నాయి.

నాలుగో శతాబ్దంలో ఏర్పాటైన ఈ నగరం సుండా సామ్రాజ్యంలో ముఖ్యమైన వాణిజ్య నౌకాశ్రయంగా అవతరించింది. ఈ నగరం తరువాత డచ్ ఈస్ట్ ఇండీస్ కాలనీల రాజధానిగా మారింది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఇండోనేషియాకు స్వాతంత్ర్యం లభించడంతో, దీనిని దేశ రాజధానిగా చేశారు. ఈ నగరాన్ని గతంలో సుండా కెలాపా (397–1527), జయకార్తా (1527–1619), బటావియా (1619–1942), మరియు డిజకార్తా (1942–1972) అని పిలిచేవారు.

జాతీయ స్మారక కట్టడం మరియు ఇస్తిఖ్లాల్ మసీదులు ఈ నగరంలో ప్రసిద్ధ కట్టడాలుగా గుర్తింపు పొందాయి. ASEAN సచివాలయం కూడా ఈ నగరంలోనే ఉంది. జకార్తాలో సుకర్ణో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయం, హలీమ్ పెర్డానాకుసుమా అంతర్జాతీయ విమానాశ్రయం మరియు తాంజుంగ్ ప్రియోక్ నౌకాశ్రయం ఉన్నాయి; ఇది పలు నగరాంతర మరియు ప్రయాణిక రైలు వ్యవస్థలతో అనుసంధానం చేయబడివుంది, అంతేకాకుండా ప్రత్యేకించబడిన బస్సు మార్గాల్లో తిరిగే అనేక బస్సులు ఈ నగర ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా ఉన్నాయి.

చరిత్ర

కాలనీలపూర్వ యుగం

బటావియా యొక్క మాజీ స్టాధుయిస్, VOC గవర్నర్ జనరల్ ఉండే చోటు. ఈ భవనం ఇప్పుడు జకార్తా హిస్టరీ మ్యూజియంగా సేవలు అందిస్తోంది, ఇది జకార్తా ఓల్డ్ టౌన్ ప్రాంతంలో ఉంది.

నాలుగో శతాబ్దంనాటి తారుమనగారా అనే భారత ప్రభావిత సామ్రాజ్యంలో జకార్తా ప్రాంతం భాగంగా ఉంది. AD 39లో, పూర్ణవర్మన్ అనే రాజు సుండా పురా పేరుతో సామ్రాజ్యానికి జావా ఉత్తర తీరంలో కొత్త రాజధాని నగరాన్ని ఏర్పాటు చేశాడు.[4] పూర్ణవర్మన్ ప్రస్తుత బాంటెన్ మరియు పశ్చిమ జావా ప్రావీన్స్‌లతోపాటు ఈ ప్రాంతవ్యాప్తంగా తన పేరు కలిగివున్న ఏడు స్మారక శిలా శాసనాలు ఏర్పాటు చేశాడు.[5]

తారుమనగారా సామ్రాజ్యం పతనమైన తరువాత, సుండా పురాతోపాటు, దీని యొక్క భూభాగాలు సుండా సామ్రాజ్యంలో భాగమయ్యాయి. ఆపై ఓడరేవు ప్రాంతం పేరును సుండా కెలాపాగా మార్చారు, ఒక హిందూ సన్యాసి యొక్క లాంతార్ గ్రంథాల్లో దీని ప్రస్తావన ఉంది.[6] పద్నాలుగో శతాబ్దం కాలానికి, ఈ సామ్రాజ్యంలో సుండా కెలాపా ప్రధాన వాణిజ్య ఓడరేవుగా రూపాంతరం చెందింది. ఈ ప్రాంతానికి వచ్చిన మొదటి ఐరోపా నౌకాదళంగా పరిగణించబడుతున్న, నాలుగు పోర్చుగీసు నౌకలు మలేకా నుంచి 1513లో ఇక్కడికి వచ్చాయి, పోర్చుగీసువారు సుగంధద్రవ్యాలు కోసం, ముఖ్యంగా నల్ల మిరియాలు కోసం మార్గం వెతుకుతూ ఇక్కడికి చేరుకున్నారు.[7] మధ్య జావా ప్రాంతంలో శక్తివంతమవుతున్న డెమాక్ సుల్తానేట్ (రాజ్యం) నుంచి పొంచివున్న ముప్పును ఎదుర్కొనేందుకు, 1522లో పోర్చుగీసువారిని ఇక్కడ ఒక నౌకాశ్రయం అభివృద్ధి చేసుకునేందుకు అనుమతించడం ద్వారా సుండా సామ్రాజ్య పాలకులు పోర్చుగల్‍‌తో ఒక శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.[8]

1527లో, డెమాక్‌కు చెందిన ఫతాహిల్లా అనే సుమత్రా మాలే యుద్ధవీరుడు సుండా సామ్రాజ్యంపై దాడి చేశాడు, జూన్ 22, 1527లో అతని నేతృత్వంలోని డెమాక్ సేనలు నౌకాశ్రయాన్ని స్వాధీనం చేసుకున్నాయి, ఆ తరువాత సుండా కెలాపా పేరును జయకార్తాగా మార్చారు.[8] సుండా సామ్రాజ్యం నుంచి బాంటెన్ మరియు సుండా కెలాపా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తరువాత ఏర్పాటయిన బెంటాన్ సుల్తానేట్‌లో ఇక్కడి ఓడరేవులు భాగమయ్యాయి. దీంతో ఆగ్నేయాసియా ప్రాంతంలో ఈ సుల్తానేట్ (రాజ్యం లేదా దేశం) ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా మారింది.

బటావియా కోట, పశ్చిమ కాలీ బెసార్ నుంచి చూసి ఆండ్రియస్ బీక్మాన్ సుమారుగా 1656-58 సమయంలో గీసిన చిత్రం.

బాంటెన్ రాజ్యం యొక్క యువరాజు జయవికార్తాతో సంబంధాలు ద్వారా డచ్ నౌకలు 1596లో జయకార్తాకు వచ్చాయి. 1602లో, సర్ జేమ్స్ లాంకాస్టెర్ నేతృత్వంలోని బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నౌకలు ఎసెహ్ ప్రాంతానికి చేరుకున్నాయి, అక్కడి నుంచి బ్రిటీష్‌వారు బాంటెన్ రాజ్యానికి వెళ్లారు, ఇక్కడ వాణిజ్య కేంద్రాన్ని నిర్మించేందుకు వారికి అనుమతి లభించింది. 1682 వరకు ఈ ప్రదేశం ఇండోనేషియాలో బ్రిటీష్ వాణిజ్య కేంద్రంగా ఉపయోగించబడింది.[9]

జయవికార్తా డచ్‌వారి ప్రత్యర్థులైన ఆంగ్లేయ వ్యాపారులతో వాణిజ్య సంబంధాలు పెట్టుకోవాలని భావించాడు, దీని కోసం 1615లో డచ్ భవనాలకు ఎదురుగానే గృహాలు నిర్మించుకునేందుకు బ్రిటీష్‌వారిని అనుమతించాడు.[10]

కాలనీల యుగం

యువరాజు జయవికార్తా మరియు డచ్‌వారి మధ్య సంబంధాలు దెబ్బతినడంతో, జయవికార్తా సైన్యం డచ్ కోటపై దాడి చేసింది. యువరాజు జయవికార్తా మరియు బ్రిటీష్‌వారి సైన్యాలను డచ్‌వారు ఓడించారు, జాన్ పీటెర్స్‌జూన్ కోయెన్ (J.P. కోయెన్) అధికారంలోకి వచ్చిన సమయంలో ఈ యుద్ధం జరిగింది. డచ్‌వారు ఆంగ్లేయ కోటను కాల్చివేయడం ద్వారా, ఆంగ్లేయులను వారి నౌకల్లోకి తరిమికొట్టారు. ఈ ప్రాంతంలో డచ్ అధికారాన్ని ఈ విజయం ఏకీకృతం చేసింది, 1619లో డచ్‌వారు ఈ నగరం పేరును "బటావియా"గా మార్చారు.

బటావియా, సుమారుగా 1870 కాలంలో

డచ్ కాలనీ రాజధానిలో వ్యాపార అవకాశాలు ఇండోనేషియా, ముఖ్యంగా చైనా వలసదారులను ఆకర్షించాయి, పెరుగుతున్న జనాభా సంఖ్య నగరంపై ఒత్తిళ్లు సృష్టించింది. కాలనీ ప్రభుత్వం బహిష్కరణల ద్వారా చైనీయుల వలసలను నిరోధించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. అక్టోబరు 9, 1740న జరిగిన సామూహిక హత్యాకాండలో 5,000 మంది చైనీయులు హత్య చేయబడ్డారు, తరువాతి ఏడాది, స్థానిక చైనీయులు నగర గోడలకు వెలుపల ఉన్న గ్లోడాక్‌కు తరలివెళ్లారు.[11] 1835 మరియు 1870 సంవత్సరాల్లో మహమ్మారుల కారణంగా నగరం దక్షిణంవైపుకు విస్తరించడం ప్రారంభమైంది, ఎక్కువ మంది పౌరులు నౌకాశ్రయానికి బాగా దక్షిణంవైపుకు తరలివెళ్లారు. కోనింగ్స్‌ప్లెయిన్, ఇప్పుడు మెర్డెకా స్క్వేర్ 1818లో పూర్తయింది, మెంటెంగ్ నివాస ప్రాంతం నిర్మాణం 1913లో ప్రారంభమైంది,[12] డచ్‌వారు-నిర్మించిన చివరి నివాస ప్రాంతంగా కెబయోరాన్ బారు నిలిచిపోయింది.[11] 1930నాటికి, బటావియాలో 500,000 మందికిపైగా పౌరులు ఉన్నారు,[13] వీరిలో 37,067 మంది ఐరోపావారు ఉన్నారు.[14]

జపానీయులు రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా ఇండోనేషియాను ఆక్రమించిన సందర్భంగా ఈ నగరం పేరును "జకార్తా"గా మార్చారు.

స్వాతంత్ర్య యుగం

రెండో ప్రపంచ యుద్ధం తరువాత, ఇండోనేషియన్ రిపబ్లికన్‌లు తమ ఇండోనేషియా స్వాతంత్ర్య పోరాటం సందర్భంగా మిత్రరాజ్యాల-ఆక్రమిత జకార్తా నుంచి బయటకు వెళ్లిపోయారు, వీరు యోగ్యాకార్తాలో తమ రాజధానిని ఏర్పాటు చేశారు. 1950లో, స్వాతంత్ర్యం పొందిన వెంటనే, జకార్తాను మరోసారి దేశ రాజధానిగా చేశారు.[11] ఇండోనేషియా వ్యవస్థాపక అధ్యక్షుడు, సుకర్ణో తమ రాజధాని జకార్తాను ఒక గొప్ప అంతర్జాతీయ నగరంగా ఊహించాడు. ఆయన భారీస్థాయిలో ప్రభుత్వ నిధులతో జాతీయవాద మరియు ఆధునిక నిర్మాణ ప్రాజెక్టులను ప్రేరేపించాడు.[15][16] వీటిలో ఒక క్లోవర్-లీఫ్ రహదారి, ఒక ప్రధాన వెడల్పైన రోడ్డు (జలాన్ MH థామ్రీన్-సుదీర్మాన్), జాతీయ స్మారక కట్టడం, ప్రధాన హోటళ్లు, షాపింగ్ కేంద్రం మరియు కొత్త పార్లమెంట్ భవనం వంటి స్మారక కట్టడాల ప్రాజెక్టులు ఉన్నాయి.

అక్టోబరు 1965లో, జకార్తా ఒక నిరర్థకమైన సైనిక తిరుగుబాటు ప్రయత్నానికి వేదికైంది, ఇందులో 6 మంది ఉన్నత సైనిక అధికారులు హత్య చేయబడ్డారు, చివరకు సుకర్ణో ప్రభుత్వం పతనం అవడానికి ఇది కారణమైంది, దీని తరువాత సుహార్తో యొక్క కొత్త ప్రభుత్వం ప్రారంభమైంది. సైనిక అధికారుల భౌతిక దేహాలు పూడ్చిపెట్టిన ప్రదేశం వద్ద ఒక స్మారక కట్టడాన్ని నిర్మించారు. 1966లో, జకార్తాను ఒక "ప్రత్యేక రాజధాని నగర జిల్లా" (డేరా ఖుసుస్ ఇబుకోటా )గా ప్రకటించారు, దీంతో జకార్తాకు దాదాపుగా ఒక రాష్ట్రం లేదా ప్రావీన్స్‌కు సమానమైన హోదా వచ్చింది.[17] "కొత్త ప్రభుత్వం" పాలన మొదలైన 60వ దశకం మధ్య కాలం నుంచి 1977 వరకు ఈ నగర గవర్నర్‌గా లెప్టినెంట్ జనరల్ అలీ సదీకిన్ బాధ్యతలు నిర్వహించారు; ఆయన రోడ్లు మరియు వంతెనల పనులను పునఃప్రారంభించడంతోపాటు, కళలను ప్రోత్సహించడం, అనేక ఆస్పత్రులు నిర్మించడం మరియు పెద్ద సంఖ్యలో కొత్త పాఠశాలల నిర్మాణాలు చేపట్టారు. ఆయన మురికివాడలను ఖాళీ చేయించి, వాటిలో నివసిస్తున్న వారిని కొత్త అభివృద్ధి ప్రాజెక్టుల్లోకి తరలించాడు-వీటిలో కొన్ని పనులు సుహార్తో కుటుంబ ప్రయోజనం కోసం చేయబడ్డాయి[18][19]-అంతేకాకుండా ఆయన రిక్షాలను తొలగించేందుకు మరియు వీధుల్లో సాగించే వ్యాపారాలను నిషేధించేందుకు ప్రయత్నించారు. జనసాంద్రత పెరగకుండా చూసేందుకు మరియు పేదరికం నిరోధం కోసం నగరంలోకి జరుగుతున్న వలసలను నియంత్రించడం ప్రారంభించారు.[20] విదేశీ పెట్టుబడులు నగరంలో స్థిరాస్తి రంగం విజృంభణకు కారణమయ్యాయి, ఇది నగర స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసింది.[21]

మే 14, 1998లో జకార్తా వీధుల్లో షాపులపై ఆందోళనకారులు లూఠీలకు పాల్పడి, వస్తువులను దగ్ధం చేశారు.

1997/98 తూర్పు ఆసియా ఆర్థిక సంక్షోభంతో నగరంలో ఈ విజృంభణకు తెరపడింది, దీని కారణంగా జకార్తా నగరం హింసాకాండ, నిరసనలు, రాజకీయ జిత్తులకు వేదికగా మారింది. సుదీర్ఘకాలంగా అధ్యక్షుడిగా ఉన్న సుహార్తో అధికారంపై నియంత్రణ కోల్పోవడం ప్రారంభమైంది. మే 1998నాటి జకార్తా అల్లర్లు సమయానికి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి, త్రిశక్తి విశ్వవిద్యాలయంలో నలుగురు విద్యార్థులను భద్రతా దళాలు కాల్చిచంపాయి; నాలుగు రోజులపాటు సాగిన అల్లర్లు మరియు హింసాకాండలో సుమారుగా 1,200 మంది మరణించారు, ఇందులో 6,000 భవనాలు ధ్వంసం అవడం లేదా దెబ్బతినడం జరిగింది.[22] జకార్తా అల్లర్లు చైనీస్ ఇండోనేషియన్లను (ఇండోనేషియాలో స్థిరపడిన చైనీయులు) లక్ష్యంగా చేసుకున్నాయి.[23] సుహార్తో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు, ఇండోనేషియా ప్రజాస్వామ్య పథంలోకి అడుగుపెట్టే ప్రక్రియలో కూడా జకార్తా ప్రధాన కేంద్రంగా కొనసాగింది.[24] 2000 నుంచి 2005 వరకు దాదాపుగా ప్రతి ఏడాది నగరంలో జెమా ఇస్లామియా-అనుబంధ బాంబు దాడులు జరిగాయి,[11] చివరిసారి 2009లో రెండు అంతర్జాతీయ హోటళ్లుపై బాంబు దాడులు జరిగాయి, 2005 తరువాత జకార్తాలో బాంబు దాడులు జరగడం ఇదే తొలిసారి.[25]

పరిపాలన

జకార్తా యొక్క కోటా లేదా కోటామాడ్యా (నగరాలు)

అధికారికంగా, జకార్తా ఒక నగరం కాదు, వాస్తవానికి ఇది ఇండోనేషియా రాజధానిగా ప్రత్యేక హోదా కలిగిన ఒక ప్రావీన్స్. దీనికి ఒక గవర్నర్ (మేయర్‌కు బదులుగా) ఉంటాడు, ఇది రెండు ఉప-ప్రాంతాలుగా విభజించబడివుంటుంది, వీటికి సొంత పరిపాలనా వ్యవస్థలు ఉంటాయి. ఒక ప్రావీన్స్‌గా, జకార్తా అధికారిక నామం డేరా ఖుసుస్ ఇబుకోటా జకార్తా ("జకార్తా ప్రత్యేక రాజధాని నగర జిల్లా"), ఇండోనేషియా భాషలో దీనిని DKI జకార్తాగా సంక్షిప్తీకరించారు.

జకార్తా ఐదు కోటా లేదా కోటామాడ్యా లుగా ("నగరాలు" - గతంలో పురపాలక సంఘాలు) విభజించబడి ఉంటుంది, ప్రతి నగరానికి ఒక మేయర్ ఉంటాడు, జకార్తాలో ఐదు నగరాలతోపాటు ఒక రెగెన్సీ (కాబుపాటెన్ ) కూడా ఉంది, దీనికి ప్రభుత్వ ప్రతినిధి ఒకరు నేతృత్వం వహిస్తారు. ఆగస్టు 2007లో, జకార్తాలో గవర్నర్‌ను ఎన్నుకునేందుకు తొలిసారి ఎన్నికలు జరిగాయి, దీనికి ముందు వరకు గవర్నర్‌లను స్థానిక పార్లమెంట్ నియమించేది. అనేక ప్రాంతాల్లో ప్రత్యక్ష స్థానిక ఎన్నికలకు వీలు కల్పించిన దేశవ్యాప్త వికేంద్రీకరణ ప్రక్రియలో భాగంగా ఈ ఎన్నికల్లో కూడా జరిగాయి.[26]

జకార్తాలోని నగరాలు/పురపాలక సంఘాలు:

 • సెంట్రల్ జకార్తా (జకార్తా పుసాత్ ) జకార్తాలోని అతిచిన్న నగరం, జకార్తా యొక్క అనేక పాలక మరియు రాజకీయ కేంద్రాలు ఇందులో ఉన్నాయి. దీనిలో అనేక పార్కులు మరియు డచ్ కాలనీల భవనాలు గుర్తించవచ్చు. జాతీయ స్మారక కట్టడం (మోనాస్), ఇస్తిఖ్లాల్ మసీదు మరియు మ్యూజియాలు (వస్తు సంగ్రహాలయాలు) ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.[27]
 • పశ్చిమ జకార్తా (జకార్తా బరాత్ ), జకార్తాలోని కుటీర పరిశ్రమలు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. జకార్తా యొక్క చైనాటౌన్‌తోపాటు, చైనీస్ లాంగామ్ భవనం మరియు టోకో మెరాహ్ భవనం వంటి కట్టడాలను ఇక్కడ గుర్తించవచ్చు. జకార్తా పాత పట్టణంలోని కొంత భాగం పశ్చిమ జకార్తాలోనే ఉంది.[28]
 • దక్షిణ జకార్తా (జకార్తా సెలటాన్ ), మొదట దీనిని శాటిలైట్ సిటీగా రూపొందించేందుకు ప్రణాళిక రచించారు, ఇప్పుడు ఇక్కడ భారీస్థాయి, విలాసవంతమైన షాపింగ్ కేంద్రాలు మరియు సంపన్నుల నివాసాలు ఉన్నాయి. జకార్తా సెలటాన్ ప్రాంతం జకార్తా యొక్క భూగర్భ జల మధ్యస్థిగా పనిచేస్తుంది,[29] అయితే ఇటీవల, హరిత ప్రాంతాలకు కొత్త పరిణామాలు ముప్పుగా పరిణమించాయి. జకార్తా CBDలో ఎక్కువ ప్రాంతం సెటియా బుడి, దక్షిణ జకార్తాలో, తెనాహ్ అబాంగ్/మధ్య జకార్తా (సెంట్రల్ జకార్తా)లోని సుదీర్మన్ ప్రాంత సరిహద్దులో ఉంది.
 • తూర్పు జకార్తా (జకార్తా తైముర్ ) భూభాగం నగరంలో అనేక పారిశ్రామిక కేంద్రాలు కలిగివున్న ప్రదేశంగా గుర్తింపు పొందింది.[30] అయితే ఇప్పటికీ ఇక్కడ కొంత ప్రాంతంలో చిత్తడినేలలు మరియు వరి పొలాలు ఉన్నాయి[30]
 • ఉత్తర జకార్తా (జకార్తా ఉతరా ), జకార్తాలో సముద్ర తీరం (జావా సముద్రం) కలిగివున్న ఒకేఒక్క నగర ప్రాంతం ఇది. తాంజుంగ్ ప్రియోక్ ఓడరేవు ఈ ప్రాంతంలోనే ఉంది. భారీ మరియు మధ్య-తరహా పరిశ్రమలు ఎక్కువగా ఉత్తర జకార్తాలో కేంద్రీకృతమై ఉన్నాయి. జకార్తా పాత పట్టణం (జకార్తా ఓల్డ్ టౌన్), గతంలో, అంటే 17 శతాబ్దం నుంచి దీనిని బటావియాగా పిలిచేవారు, ఇది డచ్ ఈస్ట్ ఇండీస్‌లో VOC వాణిజ్య కార్యకలాపాలకు ఇది ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. ఇదిలా ఉంటే ఉత్తర జకార్తాలో అంకోల్ డ్రీమ్‌ల్యాండ్ (తమన్ ఇంపియాన్ జయా అంకోల్ ) కూడా ఉంది, ఆగ్నేయాసియాలో అతిపెద్ద సమగ్ర పర్యాటక ప్రాంతంగా ప్రస్తుతం ఇది గుర్తించబడుతోంది.[31]

జకార్తాలో ఉన్న ఒకేఒక్క రెగెన్సీ (కాబుపాటెన్ ) ఏమిటంటే:

 • వెయ్యి ద్వీపాలు (కెపులౌవాన్ సెరిబు ), గతంలో ఇది ఉత్తర జకార్తాలో ఉపజిల్లాగా ఉండేది, జావా సముద్రంలో ఉన్న 105 చిన్న ద్వీపాలు ఈ ప్రాంత పరిధిలోకి వస్తాయి. విలక్షణ మరియు ప్రత్యేక పర్యావరణ వ్యవస్థలు కలిగివున్న కారణంగా ఇది అధిక పరిరక్షణ విలువను కలిగివుంది. డైవింగ్, వాటర్ బైసైకిల్ మరియు విండ్ సర్ఫింగ్ వంటి సాగర పర్యాటకంలో భాగమైన క్రీడలు, వినోదాలు ఈ ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన పర్యాటక కార్యకలాపాలుగా ఉన్నాయి. స్పీడ్ బోట్‌లు లేదా చిన్న పడవలు ఈ దీవుల మధ్య ప్రధాన రవాణా సదుపాయాలుగా ఉన్నాయి.[32]

జకార్తా యొక్క నగరాలు/పురపాలక సంఘాలు (
కోటా అడ్మినిస్ట్రాసి/కోటామాడ్యా )
నగరం/రెగెన్సీ వైశాల్యం (km2) మొత్తం జనాభా (నమోదయిన) (2007)[33] మొత్తం జనాభా (2007)[33] జనసాంద్రత (km2)[33]
దక్షిణ జకార్తా 141.27 1,730,680 2,100,930 14,872
తూర్పు జకార్తా 188.03 2,159,785 2,421,419 12,878
సెంట్రల్ జకార్తా 48.13 880,286 889,680 18,485
పశ్చిమ జకార్తా 129.54 1,562,837 2,172,878 16,774
ఉత్తర జకార్తా 146.66 1,200,958 1,453,106 9,908
వెయ్యి ద్వీపాలు 8.7 19,915 19,980 2,297

ప్రభుత్వం

సెప్టెంబరు 1945లో, జకార్తా నగర ప్రభుత్వం జపనీస్ డిజకార్తా టోకు-బెట్సు షి రూపం నుంచి జకార్తా జాతీయ పాలనలోకి మారింది. 1960 చివరి వరకు మొదటి ప్రభుత్వం ఒక మేయర్ నేతృత్వంలో సాగింది, తరువాత మేయర్ స్థానంలో జకార్తాకు గవర్నర్ కార్యాలయం ఏర్పాటు చేయబడింది. జకార్తా చివరి మేయర్‌గా సుదీరో గుర్తింపు పొందారు, ఆయన తరువాత Dr. సుమర్నో గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

1974లో, ప్రాంతీయ ప్రభుత్వ మూలాధారాలకు సంబంధించిన యాక్ట్ No. 5 ఆఫ్ 1974 ఆధారంగా, జకార్తాను ఇండోనేషియా రాజధానిగా మరియు ఇండోనేషియాలోని 26 ప్రావీన్స్‌లలో ఒకదానిగా ప్రకటించారు.[33]

భౌగోళిక పరిస్థితులు మరియు వాతావరణం

భౌగోళిక పరిస్థితులు

జావా వాయువ్య తీరంలో, జావా సముద్రం యొక్క ఒక ద్వారంగా ఉన్న జకార్తా అఖాతంపై సిలివుంగ్ నది నోటి వద్ద జకార్తా ఉంది. ఈ నగరం పల్లపు ప్రాంతంలో ఉంది, సముద్రమట్టానికి ఇది సగటున 7 మీటర్లు (23 అడుగులు) ఎత్తులో ఉంది.[citation needed] అధికారికంగా, జకార్తా ప్రత్యేక జిల్లా భూభాగంపై 662 km2 వైశాల్యం, సముద్ర ప్రాంతంపై 6,977 km2 వైశాల్యం కలిగివుంది.[citation needed][34] నగరానికి ఉత్తరదిక్కున ఉన్న కొండలమయమైన దక్షిణ ప్రాంతాల నుంచి జాలువారే నదులు జావా సముద్రంవైపుకు ప్రవహిస్తున్నాయి. వీటిలో అతి ముఖ్యమైనది సిలివుంగ్ నది, ఈ నది నగరాన్ని పశ్చిమ మరియు తూర్పు భూభాగాలుగా విభజిస్తుంది.

జకార్తా ఉత్తర భాగం మైదనంపై ఉంది, ఇది సుమారుగా సముద్రమట్టానికి ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది తరచుగా వరదలకు కారణమవుతుంది. పశ్చిమం నుంచి తూర్పుకు తీర ప్రాంతం సుమారుగా 35 కి.మీ. (22 మై.) విస్తరించివుంది. నగరంలోని దక్షిణ భూభాగాలు కొండలతో నిండివున్నాయి. వర్షా కాలం సందర్భంగా, మూసుకుపోయిన మురుగునీటి గొట్టాలు మరియు నీటిమార్గాలు మరియు అటవీ నిర్మూలన ద్వారా జరుగుతున్న బోగోర్, డెపోక్ వేగవంతమైన పట్టణీకరణ కారణంగా జకార్తాను వరదలు ముంచెత్తుతున్నాయి, వాస్తవానికి దీనిలో 40% భూభాగం సముద్రమట్టానికి దిగువన ఉంది[citation needed]. 1996లో తీవ్రమైన వరదలు నగరాన్ని ముంచెత్తాయి[35][36] ఈ సమయంలో 5,000 హెక్టార్ల భూమి వరద ముంపుకు గురైంది [37].[38] మౌలిక సదుపాయాలు ధ్వంసం కారణంగా మరియు రాష్ట్ర ఆదాయానికి జరిగిన నష్టం కనీసం 5.2 ట్రిలియన్ రూపాయాలు (572 మిలియన్ US డాలర్లు)గా అంచనా వేశారు, వీటి కారణంగా సంభవించిన ప్రమాదాల్లో 85 మంది మరణించారు [39] మరియు 350,000 మంది పౌరులు నిరాశ్రయులయ్యారు..[40] జకార్తా మొత్తం ప్రాంతంలో సుమారుగా 70% భూభాగం వరదల్లో చిక్కుకుంది, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నాలుగు మీటర్ల ఎత్తున వరద నీరు నిలిచిపోయింది.[41][42]

పాలనాపరంగా జకార్తాలో భాగంగా ఉన్న వెయ్యి ద్వీపాలు నగరానికి ఉత్తరంగా ఉన్న జకార్తా అఖాతంలో ఉన్నాయి.

వాతావరణం

కోపెన్ వాతావరణ వర్గీకరణ వ్యవస్థ ప్రకారం జకార్తా వేడి మరియు ఆర్ద్ర ఉష్ణమండల తేమతోకూడిన మరియు పొడి వాతావరణం (AW) కలిగివుంటుంది. భూమధ్యరేఖకు బాగా దగ్గరగా ఉన్నప్పటికీ, ఈ నగరం ప్రత్యేకమైన వర్ష మరియు వేసవి రుతువులు కలిగివుంది. జకార్తాలో ఏడాదిలో ఎక్కువ భాగం వర్షా కాలం ఉంటుంది, ఈ కాలం నవంబరు నుంచి జూన్ వరకు కొనసాగుతుంది. మిగిలిన నాలుగు నెలలు నగరంలో పొడి వాతావరణం (వేసవి కాలం) ఉంటుంది. ఇండోనేషియా పశ్చిమ ప్రాంతంలో ఉన్న జకార్తాలో, వర్షాకాలంలో సగటున 385 milliమీటర్లు (15.2 అం.) గరిష్ఠ వర్షపాతం జనవరి నెలలో నమోదవుతుండగా, పొడిగా ఉండే కాలంలో, అంటే జూలైలో సగటున 31 milliమీటర్లు (1.2 అం.) కనిష్ఠ వర్షపాతం నమోదవుతుంది.

Jakarta-వాతావరణం
నెల జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు సంవత్సరం
Source: World Meteorological Organisation [43]

సంస్కృతి

చైనీయుల కొత్త సంవత్సరాన్ని జరుపుతున్న తాంజిడోర్ వాద్యబృందం.

ఇండోనేషియా ఆర్థిక మరియు రాజకీయ రాజధానిగా, జకార్తా అనేక మంది దేశీయ వలసదారులను ఆకర్షించింది, వీరితోపాటు వారి వివిధ భాషలు, మాండలికాలు, ఆహారాలు మరియు ఆచారాలు కూడా నగరానికి చేరుకున్నాయి.

బెటావియా పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజల వారసులను వర్ణించేందుకు బెటావీ (ఓరంగ్ బెటావీ, లేదా "బెటావియా ప్రజలు") అనే పదాన్ని ఉపయోగిస్తారు, దీనిని సుమారుగా 18వ-19వ శతాబ్దం నుంచి ఒక జాతి సమూహంగా గుర్తిస్తున్నారు. వివిధ ఆగ్నేయాసియా జాతి సమూహాల నుంచి ఉద్భవించిన బెటావీ ప్రజలను కార్మిక అవసరాల కోసం తీసుకురావడం లేదా బెటావియాపట్ల వారు ఆకర్షితులవడం జరిగింది, వీరిలో ఇండోనేషియాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు.[44] బెటావీ భాష మరియు సంస్కృతి సుండనీస్ లేదా జావనీస్ సంప్రదాయాలకు భిన్నంగా ఉంటాయి. వీరి భాష ఎక్కువగా తూర్పు మాలే మాండలికంపై ఆధారపడివుంటుంది, సుండనీస్, జావనీస్, చైనీస్ మరియు అరబిక్ భాషల నుంచి స్వీకరించిన పదాలతో ఈ భాష మెరుగుపరచబడింది. ఈ రోజుల్లో జకార్తా మండలికం బహసా జకార్తా) నగరంలో పౌరులు ఒక వీధి భాషగా ఉపయోగిస్తున్నారు, ఇది కొంతవరకు బెటావీ భాష ఆధారంగా ఉంటుంది.

ఆండెల్-ఆండెల్ నృత్య ప్రదర్శన, ఇది బొమ్మ-ముసుగులు ధరించి చేసే ఒక ప్రసిద్ధ బెటావీ నృత్యం.

తక్కువ చరిత్ర కలిగివుండటం వలన మరియు ఎక్కువ మంది బెటావీ పౌరులు జకార్తా సరిహద్దులకు తరలిపోవడం, కొత్త వలసదారులు వారి స్థానాల్లోకి వచ్చిన కారణంగా బెటావీ కళలు జకార్తాలో చాలా అరుదుగా కనిపిస్తాయి. జకార్తాలో బెటావీ వివాహాలు గుర్తించడం కంటే, జావా లేదా మినాంగ్ వివాహ వేడుకలు గుర్తించడం చాలా సులభం. గాంబాంగ్ క్రోమోంగ్ (బెటావీ మరియు చైనీయుల సంగీత రీతుల మేళనం) లేదా తాంజిడోర్ (బెటావీ మరియు పోర్చుగీసు సంగీతాల మేళనం) లేదా మిరావీస్ (బెటావీ మరియు యమన్ సంగీతాల మేళనం)ల కంటే జావనీస్ గామెలాన్ సంగీత ప్రదర్శనలు గుర్తించడం కూడా సులభమే. అయితే, బెటావీ కళలను సంరక్షించేందుకు ఉద్దేశించిన చర్యల్లో భాగంగా, జలాన్ జక్సా వేడుక లేదా కెమాంగ్ వేడుక వంటి కొన్ని వేడుకల్లో సంబంధిత కళాకారులను ప్రదర్శనలు ఇచ్చేందుకు ఆహ్వానిస్తున్నారు.[45]

జకార్తాలో అనేక శతాబ్దాలుగా ఒక చైనీయులు సమూహం కూడా ఉంది. అధికారికంగా, జకార్తా జనాభాలో వారు 6% ఉన్నారు, ఇక్కడ వీరి సంఖ్య తక్కువ చేసి చూపించబడినట్లు అనుమానాలు ఉన్నాయి.[46]

జకార్తాలో అనేక రంగస్థల కళా కేంద్రాలు ఉన్నాయి, అవి సికినీలో తమన్ ఇస్మాయిల్ మార్జుకీ (TIM) కళా కేంద్రం, ప్లాజా సెమంగీ ప్రాంతంలోని బలాయ్ సర్బినీ, పాసర్ బరు సమీపంలో గెడుంగ్ కెసెనియన్ జకార్తా, పాల్మెరా ప్రాంతంలో బెంటారా బుడయా జకార్తా, అంకోల్‌లో పసార్ సెని (కళా క్షేత్రం), మరియు తమన్ మినీ ఇండోనేషియా ఇండాలోని కొన్ని పెవిలియన్‌ల వద్ద సంప్రదాయ ఇండోనేషియా కళా ప్రదర్శనలు జరుగుతుంటాయి. వాయాంగ్ మరియు గామెలాన్ వంటి సంప్రదాయ సంగీత ప్రదర్శనలను సంపన్న హోటళ్లులో కూడా గుర్తించవచ్చు. జావనీస్ వాయాంగ్ ఓరంగ్ ప్రదర్శనలు సెనెన్ బస్ టెర్మినల్ సమీపంలోని వాయాంగ్ ఓరంగ్ భారతా థియేటర్‌లో కూడా జరుగుతుంటాయి. దేశంలో అతిపెద్ద నగరం మరియు దేశ రాజధానిగా ఉన్న జకార్తా అనేక జాతీయ మరియు ప్రాంతీయ కళాకారులను ఆకర్షిస్తోంది, తమ కళా ప్రదర్శనలకు ఎక్కువ ఆదరణ మరియు విజయం కోసం మరిన్ని అవకాశాలు దొరకబుచ్చుకునేందుకు కళాకారులు ఎక్కువగా ఇక్కడికి తరలివచ్చారు.

జకార్తా అనేక ప్రతిష్ఠాత్మక కళ మరియు సాంస్కృతిక వేడుకలకు, ప్రదర్శనలకు ఆతిథ్యం ఇస్తుంది, జకార్తా అంతర్జాతీయ చలనచిత్ర వేడుకలు (JiFFest), జకార్తా ఇంటర్నేషనల్ జావా జాజ్ ఫెస్టివల్, జకార్తా ఫ్యాషన్ వీక్, జకార్తా ఫ్యాషన్ & ఫుడ్ ఫెస్టివల్ (JFFF), ఫ్లోనా జకార్తా (ఫ్లోరా అండ్ ఫౌనా ఎగ్జిబిషన్, ప్రతి ఏడాది ఆగస్టులో లాపెన్గాన్ బాటెంగ్ పార్కులో దీనిని నిర్వహిస్తున్నారు, పుష్పాలు, మొక్కలు, పెంపుడు జంతువులు ఇందులో ప్రదర్శిస్తారు), ఇండోనేషియా క్రియేటివ్ ప్రోడక్ట్స్, జకార్తా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ వీటిలో ప్రముఖమైనవి. నగర వార్షికోత్సవాల్లో భాగంగా జూన్ మధ్యకాలం నుంచి జూలై మధ్యకాలం వరకు ప్రతి ఏటా జకార్తా ఫెయిర్ నిర్వహించబడుతోంది. దీనిలో ఎక్కువగా వాణిజ్య సంబంధ ప్రదర్శనలు జరుగుతుంటాయి, అయితే నెలరోజులపాటు జరిగే ఈ వేడుకల్లో స్థానిక బృందాలు మరియు సంగీత కళాకారులతో వినోద కార్యక్రమాలు, కళా మరియు సంగీత ప్రదర్శనలు కూడా నిర్వహిస్తారు.

అనేక విదేశీ కళా మరియు సాంస్కృతిక కేంద్రాలు కూడా జకార్తాలో ఉన్నాయి, వీటిలో ప్రధానంగా లెర్నింగ్ సెంటర్లు, లైబ్రరీలు మరియు కళా క్షేత్రాల ద్వారా సంస్కృతి మరియు భాషా ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. విదేశీ కళా మరియు సాంస్కృతి కేంద్రాల్లో నెదర్లాండ్స్ ఎరాస్మస్ హూయిస్, UK బ్రిటీష్ కౌన్సిల్, ఫ్రాన్స్ సెంటర్ కల్చరల్ ఫ్రాంకాయిస్, జర్మనీ గోథీ-ఇన్‌స్టిట్యూట్, జపాన్ ఫౌండేషన్ మరియు జవహర్‌లాల్ నెహ్రూ ఇండియన్ కల్చరల్ సెంటర్ ప్రముఖమైనవి.

సంగ్రహాలయాలు

సెంట్రల్ జకార్తాలో నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండోనేషియా

జకార్తాలో సంగ్రహాలయాలు సెంట్రల్ జకార్తా మెర్డెకా స్క్వేర్ ప్రాంతం, జకార్తా ఓల్డ్ టౌన్ మరియు తమన్ మినీ ఇండోనేషియా ఇండా పరిసరాల్లో ఉన్నాయి.

జకార్తా ఓల్డ్ టౌన్‌లోని సంగ్రహాలయాలు బెటావియా మాజీ సంస్థాగత భవనాల్లో ఉన్నాయి. జకార్తా హిస్టరీ మ్యూజియం (బెటావియా మాజీ సిటీ హాల్), వాయాంగ్ మ్యూజియం, ఫైన్ ఆర్ట్ అండ్ సెరామిక్ మ్యూజియం (బెటావియా మాజీ న్యాయస్థాన భవనం), మారిటైమ్ మ్యూజియం (సుండా కెలాపా మాజీ గిడ్డంగి), బ్యాంక్ ఇండోనేషియా మ్యూజియం, బ్యాంక్ మండిరి మ్యూజియం వీటిలో ప్రముఖమైనవి.

మెర్డెకా స్క్వేర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక సంగ్రహాలయాల్లో (మ్యూజియం) నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండోనేషియా, మోనాస్, బయతల్-ఖురాన్ అండ్ ఇస్తిఖ్లాల్ ఇస్లామిక్ మ్యూజియం, జకార్తా కాథెడ్రల్ మ్యూజియం ప్రముఖమైనవి.

తూర్పు జకార్తాలోని కాలక్షేప ప్రదేశం తమన్ మినీ ఇండోనేషియా ఇండాలో పూర్ణ భక్తి పెర్తివి మ్యూజియం, అస్మాత్ మ్యూజియం, విజ్ఞానశాస్త్ర-ఆధారిత రీసెర్చ్ & టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సెంటర్, ఇన్‌సెక్ట్ మ్యూజియం, పెట్రోల్ అండ్ గ్యాస్ మ్యూజియం వంటి మొత్తం పద్నాలుగు సంగ్రహాలయాలు ఉన్నాయి.

ఇతర సంగ్రహాలయాల్లో సత్రియా మండల మిలిటరీ మ్యూజియం, సుంపా పెముడా మ్యూజియం మరియు లుబాంగ్ బువాయా ప్రసిద్ధమైనవి.

వంటకాలు

జకార్తాలో విస్తృతమైన వంటకాలు దొరుకుతాయి, నగరవ్యాప్తంగా వందలాది ఆహార సముదాయాలు ఉన్నాయి. భిన్నసంస్కృతుల జనాభా కలిగివున్న నగరం కావడంతో అంతర్జాతీయ ఆహారం, ముఖ్యంగా భారతీయ, చైనీస్, జపనీస్ మరియు కొరియన్ వంటకాలు ఇక్కడ దొరుకుతాయి.[47] జకార్తాలో బాగా ప్రసిద్ధి చెందిన స్థానిక వంటకం సోటో బెటావీ, గొడ్డు మాంసంలోని నరాలు, పేగులతో చేసిన ఆవు పాలు లేదా కొబ్బరి పాల రసాన్ని ఈ పేరుతో పిలుస్తారు. కెరాక్ టెలార్, గాడో-గాడో మరియు కుకుర్‌లను ఇక్కడ చేసే ఇతర ప్రసిద్ధ వంటకాలుగా చెప్పవచ్చు.

ప్రసార సాధనాలు

వార్తాపత్రికలు

జకార్తాలో వెలువడే దినసరి వార్తాపత్రికల్లో బిస్నిస్ ఇండోనేషియా, ఇన్వెస్టర్ డైలీ, జకార్తా గ్లోబ్, ది జకార్తా పోస్ట్, ఇండో పోస్, సెప్యుటార్ ఇండోనేషియా, కోంపాస్, మీడియా ఇండోనేషియా, రిపబ్లికా, పోస్ కోటా, వార్తా కోటా, లాంపు మెరాహ్ మరియు సుయరా పెంబరువాన్ ప్రముఖమైనవి.

టెలివిజన్

ఆర్థిక వ్యవస్థ

జకార్తా ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఆర్థిక సేవలు, వాణిజ్యం, ఉత్పాదక రంగంపై ఆధారపడివుంది. ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, కెమికల్స్, మెకానికల్ ఇంజనీరింగ్ మరియు బయోమెడికల్ సైన్సెస్ ఉత్పత్తుల తయారీ ఇక్కడి పరిశ్రమలో భాగంగా ఉంది.[48] 2009లో, నగరంలోని 13% జనాభా US$ 10,000 (Rp 108,000,000)లకుపైగా తలసరి ఆదాయం కలిగివుంది.[49]

జకార్తా ఆర్థిక వృద్ధి 2007లో 6.44% వద్ద ఉండగా, అంతకుముందు ఏడాది ఈ వృద్ధి రేటు 5.95% వద్దే ఉంది, రవాణా మరియు సమాచార ప్రసారాలు (15.25%), నిర్మాణ రంగం (7.81%) మరియు వాణిజ్య, ఆతిథ్య రంగాలు (6.88%) ఆర్థికాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.[33] 2007లో, GRP (ప్రాంతీయ దేశీయోత్పత్తి వృద్ధి రేటు) Rp. 566.45 ట్రిలియన్లకు చేరుకుంది. GDRPలో ఆర్థిక, యాజమాన్య మరియు వ్యాపార సేవలు (28.7%) సింహభాగం వాటా కలిగివున్నాయి; వాణిజ్యం, ఆతిథ్య రంగాలు (20.4%) మరియు ఉత్పాదక రంగం (15.97%) తరువాతి స్థానాల్లో ఉన్నాయి.[33] 2007లో, DKI జకార్తా పౌరుల తలసరి GRDP అంతకుముందు ఏడాదితో పోలిస్తే 11.63% పెరిగింది[33]

ప్రస్తుత మార్కెట్ ధర వద్ద GRDP మరియు 2000నాటి స్థిరమయిన ధర వద్ద GRDP రెండింటిపరంగా కూడా 2007లో సెంట్రల్ జకార్తా (జకార్తా పుసాత్) పురపాలక సంఘం DKI జకార్తాలోని మిగిలిన పురపాలక సంఘాల కంటే ఎక్కువ విలువ కలిగివుంది, దీని GRDP వరుసగా 145.81 మిలియన్ రూపియాలు మరియు 80.78 రూపియాల వద్ద ఉంది.[33]

2007లో తీసుకొచ్చిన కొత్త చట్టం పరిధిలో బిక్షగాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శనల (నృత్యం లేదా పాటలు పాడటం) ద్వారా ప్రజలను ఆకర్షించేవారికి, వీధి వ్యాపారులకు డబ్బు ఇవ్వడం నిషేధించబడింది, నది ఒడ్డులపై మరియు రహదారులపై గుడిసెలు వేసుకొని నివాసం ఉండటాన్ని కూడా నిషేధించారు, అంతేకాకుండా ఈ చట్టం కింద ప్రజా రవాణా వ్యవస్థలో ఉమ్మివేయడాలు, ధూమపానం నిషేధించబడ్డాయి. కార్ల అద్దాలు తుడిచే అపరిచితులు మరియు కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ను మళ్లించేందుకు డబ్బు తీసుకునేవారికి కూడా జరిమానా విధిస్తారు. ఈ కొత్త చట్టాన్ని అమలు చేయడం చాలా కష్టమని, రాజధాని వాసుల్లో ఉన్న అనేక మంది పేదలకు ఈ చట్టం నిరాశాపూర్వకంగా ఉందని విమర్శకులు వాదిస్తున్నారు.[50]

2005లో, జాతీయ GDPలో జకార్తా వాటా 17%నికి పెరిగింది, 2000 సంవత్సరంలో దీని వాటా 15% వద్ద ఉంది.[citation needed] జకార్తాలో ఉత్పాదక మరియు నిర్మాణ రంగాలు నీరసపడ్డాయి, జకార్తా పారిశ్రామిక నగరం నుంచి సేవల నగరంగా మారిపోయిందనేందుకు దీనిని ఉదాహరణగా చెప్పవచ్చు.[citation needed] జకార్తాలోని అనేక ఉత్పాదక కేంద్రాలు టాంజెరాంగ్, బోగోర్, డెపోక్ మరియు బెకాసీ వంటి నగర బయటి ప్రాంతాలకు తరలిపోయాయి.[citation needed]

జనాభా విజ్ఞానం

2007 జాతీయ సామాజిక-ఆర్థిక అధ్యయనం అంచనాల ఆధారంగా, DKI జకార్తా ప్రావీన్స్‌లో జనాభా సంఖ్య 9.06 మిలియన్ల వద్ద ఉంది.[citation needed] DKI జకార్తా 662.33 km2 వైశాల్యం కలిగివుంది, దీనిని బట్టి నగరంలో జనసాంద్రత 137,000 people/km2 (ప్రతి చదరపు కిలోమీటర్‌కు 137,000 మంది ప్రజలు) వద్ద ఉన్నట్లు లెక్కించారు.[citation needed] 2000 మరియు 2007 మధ్యకాలంలో జనాభా వృద్ధి రేటు 1.11 శాతంగా అంచనా వేయబడింది, 1990వ దశకంలో ఇది 0.15 శాతంగా నమోదయింది.[citation needed] నగరంలోకి జరుగుతున్న వలసలు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.[33] 1960లో నగర జనాభా 1.2 మిలియన్ల వద్ద ఉండగా, 2004లో ఈ సంఖ్య 8.8 మిలియన్లకు పెరిగింది, ఇది కేవలం నగరంలో చట్టబద్ధమైన గుర్తింపు ఉన్న పౌరుల సంఖ్య మాత్రమే కావడం గమనార్హం.[citation needed] గ్రేటర్ జకార్తా జనాభా 23 మిలియన్ల వరకు ఉంటుందని అంచనా వేయబడింది, ఈ కారణంగా ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద పట్టణ ప్రాంతంగా గుర్తించబడింది.[citation needed] 2015నాటికి జకార్తా జనాభా 24.9 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేశారు, దీనిలో నగర పరిసర ప్రాంతాల్లోని మిలియన్ల మంది పౌరుల సంఖ్యను చేర్చలేదు.[51]

పౌరులకు ప్రాథమిక అవసరాలు తీర్చడంలో ప్రభుత్వ సామర్థ్యంతో పోలిస్తే జనాభా విపరీతంగా పెరిగిపోయింది.[citation needed] జకార్తా తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతోంది. వాయు కాలుష్యం మరియు వ్యర్థాల నిర్వాహణ కూడా సమస్యాత్మకంగా ఉన్నాయి.[citation needed]

నగర దృశ్యం

జెండెరాల్ సుదీర్మన్ రోడ్డులో జకార్తా యొక్క మధ్య వ్యాపార జిల్లా, ఈ రోడ్డులో విస్మా 46 భవనం కూడా ఉంది, ప్రస్తుతం ఇండోనేషియాలో అత్యంత ఎత్తైన కార్యాలయ భవనంగా ఇది గుర్తింపు పొందింది.

ప్రసిద్ధ కట్టడాలు మరియు పర్యాటక ఆకర్షణలు

వెస్ట్ ఇరియాన్ లిబరేషన్ విగ్రహం, నగరంలో సుకర్ణో శకంనాటి అనేక స్మారక చిహ్నాల్లో ఇది కూడా ఒకటి.
జాతీయ స్మారక కట్టడం

నగర సెంట్రల్ పార్కు, మెర్డెకా స్క్వేర్ వద్ద జాతీయ స్మారక కట్టడం ఉంది, ఇస్తిఖ్లాల్ మసీదు మరియు జకార్తా కాథెడ్రల్‌లను ఇతర ప్రసిద్ధ కట్టడాలుగా చెప్పవచ్చు. సెంట్రల్ జకార్తాలోని విస్మా 46 భవనం ప్రస్తుతం జకార్తా మరియు ఇండోనేషియాలో అత్యంత ఎత్తైన భవనంగా గుర్తింపు పొందింది. తమన్ మినీ ఇండోనేషియా ఇండా, రాగునాన్ జూ, జకార్తా ఓల్డ్ టౌన్ మరియు జకార్తా అఖాతంపై సీ వరల్డ్, అంట్లాంటిస్ వాటర్ అడ్వెంచర్ మరియు గెలాన్‌గాంగ్ సముద్ర తదితరాలతో కూడిన అంకోల్ డ్రీమ్‌ల్యాండ్ కాంప్లెక్స్‌లు ప్రధాన పర్యాటక ప్రదేశాలుగా పరిగణించబడుతున్నాయి.

100,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ వైశాల్యం కలిగిన జకార్తా షాపింగ్ మాల్స్‌గా గ్రాండ్ ఇండోనేషియా, ఫసిఫిక్ ప్లేస్, ప్లాజా ఇండోనేషియా, సెనయన్ సిటీ, ప్లాజా సెనయన్, పోండోక్ ఇండా మాల్, మాల్ తమన్ అంగ్రెక్, మాల్ కెలాపా గాడింగ్, మాల్ అర్థా గాడింగ్ గుర్తింపు పొందాయి.[52] నగరంలోని సంప్రదాయక మార్కెట్‌లలో బ్లాక్ M, తెనాహ్ అబాంగ్, సెనెన్, గ్లోడోక్, మంగా డువా, సెంపాకా మాస్, మరియు జటినెగరా ప్రముఖమైనవి.

పార్కులు

సెంట్రల్ జకార్తాలోని, మెంటెంగ్ గార్డెన్ సిటీ ఉపజిల్లాలో తమన్ సురోపాటి ఉంది. ఈ పార్కు చుట్టూ డచ్ కాలనీల కాలంనాటి అనేక భవనాలు ఉన్నాయి. తమన్ సురోపాటి పార్కును డచ్ కాలనీల కాలం సందర్భంగా బుర్గీమీస్టెర్ బిషోప్లెయిన్ అని పిలిచేవారు. వృత్తాకారంలో ఉండే ఈ పార్కు ఉపరితల వైశాల్యం 16,322 m2. ఈ పార్కులో అనేక ఆధునిక విగ్రహాలు కూడా ఉన్నాయి, వీటిని ASEAN దేశాలకు చెందిన కళాకారులు మలిచారు, దీని వలన పార్కుకు "తమన్ పెర్సాహాబటాన్ సెనిమాన్ ASEAN" ("పార్క్ ఆఫ్ ది ASEAN ఆర్టిస్ట్స్ రిలేషన్‌షిప్") అనే ముద్దుపేరు కూడా ఉంది.[53]

సెంట్రల్ జకార్తాలో తమన్ లాపన్‌గాన్ బాంటెంగ్ (బాంటెంగ్ ఫీల్డ్ పార్కు) ఉంది. ఇది 4,5 హెక్టార్ల విస్తీర్ణం కలిగివుంది. పార్కులోపల మోనుమెన్ పెంబెబాసన్ ఇరియన్ బరాత్ (లిబరేషన్ ఆఫ్ బరాత్ స్మారక కట్టడం) రూపంలో ఒక ప్రసిద్ధ కట్టడం ఉంది. 1980వ దశకంలో, ఈ పార్కును ఒక బస్సు టెర్మినల్‌గా ఉపయోగించారు. 1993లో, పార్కును తిరిగి సార్వజనిక ప్రదేశంగా మార్చడంతో ఇది ఒక కాలక్షేప కేంద్రంగా మారింది, అప్పుడప్పుడు దీనిని ప్రదర్శన కేంద్రంగా లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉపయోగిస్తున్నారు.[54]

తమన్ మోనాస్ (మోనాస్ పార్కు) లేదా తమన్ మెడాన్ మెర్డెకా (మెడాన్ మెర్డెకా పార్కు)లో జకార్తా చిహ్నం మోనాస్ లేదా మోనుమెన్ నాసియోనల్ (జాతీయ స్మారక కట్టడం) ఉంది. డచ్ గవర్నర్ జనరల్ హెర్మాన్ విలెమ్ డీన్‌డెల్స్ (1870) ఈ భారీ బహిరంగ ప్రదేశాన్ని సృష్టించారు, దీని నిర్మాణం కోనింగ్స్‌ప్లెయిన్ పేరుతో 1910లో పూర్తయింది. జనవరి 10, 1993లో, అధ్యక్షుడు సుహార్తో ఈ పార్కు సుందరీకరణ చర్యలకు ఆదేశించారు. ఒక జింకల పార్కు మరియు ఇండోనేషియాలోని 33 ప్రావీన్స్‌లను సూచించే 33 చెట్లు ఈ పార్కులో ప్రధాన విశేషాలుగా చెప్పవచ్చు.[55]

రవాణా

జలన్ థామ్రీన్, సెంట్రల్ జకార్తాలో ఇది ప్రధాన వీధి.

ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన నగరాల్లో ఒకటైన జకార్తా తీవ్రమైన రవాణా సమస్యలు ఎదుర్కొంటుంది.[56] ఇండోనేషియాలో ఎక్కువ భాగం ప్రజా రవాణా సేవలను మైక్రోలెట్‌లు అందిస్తున్నాయి, ప్రైవేట్ యాజమాన్యంలో నడిచే ఈ మినీబస్సులను ప్రధాన రోడ్లపైకి అనుమతించరు.

రోడ్డు రవాణా

జకార్తా ట్రాఫిక్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల కోసం ఉద్దేశించి 1992లో "త్రీ ఇన్ వన్" నిబంధనను ప్రవేశపెట్టారు, దీనిలో భాగంగా కొన్ని రోడ్లపై ముగ్గురు కంటే తక్కువ మంది ప్రయాణికులు ఉన్న కార్లను నిషేధిస్తారు.

మోటారుతో నడిచే బజాజ్

బజాజ్‌గా పిలిచే, ఆటో రిక్షాలు నగరంలోని కొన్ని భాగాల్లో వీధుల్లో రవాణా సేవలు అందిస్తున్నాయి. 1940వ దశకం నుంచి 1991 వరకు నగరంలో ఇవి స్థానిక రవాణాకు సాధారణ ప్రత్యామ్నాయంగా ఉన్నాయి.[citation needed] 1966లో, నగరంలో మొత్తం 160,000 రిక్షాలు నడుస్తున్నట్లు అంచనా వేశారు; జకార్తా మొత్తం కార్మిక శక్తిలో పదిహేను శాతం మంది రిక్షా చోదకులుగా ఉన్నారు.[citation needed] 1971లో, ప్రధాన రోడ్లపై రిక్షాలు నిషేధించడం మరియు తరువాత కొంతకాలం ప్రభుత్వం వీటిపై పూర్తిగా నిషేధం విధించడంతో రిక్షా చోదకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది, అయితే ప్రభుత్వ చర్యలు వీరిని పూర్తిగా తొలగించలేకపోయాయి.[citation needed] 1990 మరియు 1991లో ఆటో రిక్షాలను తొలగించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయి, అయితే 1998 ఆర్థిక సంక్షోభం సందర్భంగా, అసమర్థవంతమైన ప్రభుత్వ చర్యల కారణంగా సరైన నియంత్రణ లేకపోవడంతో అవి తిరిగి వచ్చాయి.[57]

జకార్తాలో ట్రాన్స్‌జకార్తా బస్సు సర్వీసు

నగరంలోని ఏడు ప్రత్యేకమైన బస్‌వే కారిడార్లలో ట్రాన్స్‌జకార్తా బస్ రాపిడ్ ట్రాన్సిట్ సేవలు అందుబాటులో ఉన్నాయి; ఈ బస్సు మార్గాలు జకార్తాలోని ఏడు ప్రధాన కేంద్రాలను కలుపుతూ ఏర్పాటు చేయబడ్డాయి. మొదటి ట్రాన్స్‌జకార్తా మార్గం బ్లోక్ M నుంచి జకార్తా కోటా వరకు ఉంటుంది, ఇది జనవరి 2004లో ప్రారంభమైంది.[citation needed]

నిర్మాణంలో ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డుపై దాదాపుగా పూర్తిస్థాయిలో రాకపోకలు జరుగుతున్నాయి[citation needed] దీనిలో నగర వాయువ్య ప్రాంతంలో జకార్తాను సుకర్ణో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంతో కలిపే ఒక టోల్ రోడ్డు, పశ్చిమంవైపున మెరాక్ నౌకాశ్రయం మరియు టాన్‌గెరాంగ్ ప్రాంతాలను కలుపే రోడ్డు మరియు దక్షిణాన బోగోర్ మరియు పుంకాక్‌లను కలుపే రోడ్డులు భాగంగా ఉన్నాయి. ఈ రోడ్డు తూర్పున బెకాసి, సికారంగ్, కరవాంగ్, సికంపెక్, పుర్వాకార్తా మరియు బండుంగ్ ప్రాంతాలను కలుపుతుంది.

రైలు వ్యవస్థ

సెంట్రల్ జకార్తాలోని గంబీర్ స్టేషను‌లో ఉన్న ఒక రైలు

రైల్వే వ్యవస్థ నగరాన్ని దాని పరసర ప్రాంతాలతో కలుపుతుంది: దక్షిణాన డెపోక్ మరియు బోగోర్, పశ్చిమాన టాంగెరాంగ్ మరియు సెర్పోంగ్, తూర్పున బెకాసీ, కారావాంగ్ మరియు సికాంపెక్ మధ్య రైలు మార్గాలు ఉన్నాయి. గాంబీర్, జకార్తా కోటా, జాటినెగరా, పసార్ సెనెన్, మంగారై మరియు తెనాహ్ అబాంగ్ ఇక్కడ ప్రధాన స్టేషన్లు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో, ప్రయాణికుల సంఖ్య రైలు వ్యవస్థ సామర్థ్యాన్ని దాటిపోతుంది, దీంతో కిక్కిరిసిన ప్రయాణాలు ఈ నగరంలో సాధారణంగా కనిపిస్తాయి.[citation needed]

జకార్తా మోనోరెయిల్ యొక్క రెండు మార్గాలు నిర్మాణంలో ఉన్నాయి: సెమాంగీ-కాసాబ్లాంకా రోడ్డు-కునిన్‌గాన్-సెమాంగీలను కలుపుతూ గ్రీన్ లైన్, కాంపుంగ్ మెలాయు-కాసాబ్లాంకా రోడ్డు-తెనాహ్ అబాంగ్-రోక్సీ మధ్య బ్లూ లైన్ నిర్మించబడుతున్నాయి.[citation needed] ఒక రెండు లైన్ల మెట్రో (MRT) వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలు కూడా పరిశీలనలో ఉన్నాయి, దీనిలో భాగంగా రెండు మోనోరైల్ మార్గాలను కలుపుతూ కోటా మరియు లెబాక్ బులస్ మధ్య ఉత్తర-దక్షిణ మార్గాన్ని నిర్మించాలనుకుంటున్నారు; సవాహ్ బెసార్ స్టేషను వద్ద ఉత్తర-దక్షిణ మార్గాన్ని కలిపుతూ తూర్పు-పశ్చిమ మార్గం కూడా ఇందులో పరిశీలించబడుతుంది.[citation needed] ప్రస్తుత ప్రాజెక్టు 2005లో ప్రారంభమైంది, నిధుల కొరత కారణంగా ఇందులో జాప్యం జరిగింది, మార్చి 2008లో ప్రాజెక్టు చేపట్టిన సంస్థ PT జకార్తా మోనోరైల్ దీనిని విడిచిపెట్టింది.[citation needed]

జలమార్గం

జూన్ 6, 2007లో, నగర పాలక యంత్రాంగం సిలివుంగ్ నదిలో ఒక కొత్త పడవ రవాణా వ్యవస్థను ప్రారంభించడం ద్వారా ఒక జలమార్గాన్ని ప్రవేశపెట్టింది.[56][58]

విమానయానం

సుకర్ణో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయం (CGK) జకార్తాలో ప్రధాన విమానాశ్రయంగా పరిగణించబడుతుంది.[citation needed] ఇండోనేషియాలో అత్యంత రద్దీగల విమానాశ్రయంగా ఇది గుర్తింపు పొందింది, ఏడాదికి 30 మిలియన్ల మందికిపైగా ప్రయాణికులు దీనిని ఉపయోగిస్తున్నారు.[citation needed] రెండో విమానాశ్రయం, హలీమ్ పెర్డానాకుసుమా అంతర్జాతీయ విమానాశ్రయం (HLP) ఎక్కువగా ప్రైవేట్ మరియు VVIP/అధ్యక్ష విమానాల రాకపోకలకు ఉపయోగించబడుతుంది.[citation needed]

సముద్రం

జకార్తాలో రవాణాకు ప్రధాన నౌకాశ్రయంగా తాంజుంగ్ ప్రియోగ్ ఓడరేవు ఉపయోగించబడుతుంది.

విద్య

జకార్తాలో అతిపెద్ద విశ్వవిద్యాలయంగా ఇండోనేషియా విశ్వవిద్యాలయం[citation needed] గుర్తింపు పొందింది, దీని క్యాంపస్‌లు సెలెంబా మరియు డెపోక్‌లలో ఉన్నాయి.[59] జకార్తా స్టేట్ యూనివర్శిటీ, జకార్తా స్టేట్ పాలిటెక్నిక్ మరియు జకార్తా ఇస్లామిక్ స్టేట్ యూనివర్శిటీ నగరంలోని ఇతర ప్రసిద్ధ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు. ఇక్కడ ఉన్న విశ్వవిద్యాలయాల్లో అతి ప్రాచీనమైనది యూనివర్శిటాస్ నాసియోనల్ (UNAS) ప్రైవేట్ యాజమాన్యంలో ఉంది.[clarification needed][60] త్రిశక్తి విశ్వవిద్యాలయం[61] ఆత్మ జయా విశ్వవిద్యాలయం మరియు తారుమనగారా విశ్వవిద్యాలయం జకార్తాలో ఉన్న ఇతర ప్రధాన ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు.

జకార్తాలో తొలి ఉన్నత పాఠశాలగా STOVIA గుర్తింపు పొందింది, దీనిని 1851లో ప్రారంభించారు.[62] అతిపెద్ద నగరం మరియు రాజధాని కావడంతో జకార్తాలో ఇండోనేషియాలోని వివిధ ప్రాంతాలకు చెందిన భారీ సంఖ్యలో విద్యార్థులు చదువుకుంటున్నారు, వీరిలో ఎక్కువ మంది విద్యా సంస్థల వసతి గృహాల్లో లేదా ఇతర వసతి గృహాల్లో ఉంటున్నారు. ప్రాథమిక విద్య కోసం, నగరంలో వివిధ రకాల ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి, వీటిని ప్రభుత్వ (నేషనల్ ), ప్రైవేట్ (నేషనల్ అండ్ బై-లింగ్వల్ నేషనల్ ప్లస్ ) మరియు ఇంటర్నేషనల్ పాఠశాలలుగా విభజించవచ్చు. జకార్తాలో ఉన్న రెండు ప్రధాన అంతర్జాతీయ పాఠశాలలుగా జకార్తా ఇంటర్నేషనల్ స్కూల్ మరియు బ్రిటీష్ ఇంటర్నేషనల్ స్కూల్ (BIS) గుర్తింపు పొందాయి.[citation needed]

క్రీడలు

100,000 సీట్లు సామర్థ్యం కలిగిన బుంగ్ కర్ణో స్టేడియం.

1962 ఆసియా క్రీడలు జకార్తాలో జరిగాయి,[63] అంతేకాకుండా ఆసియ కప్ 2007కు కూడా ఆతిథ్యం ఇచ్చింది, ప్రాంతీయ ఆగ్నేయాసియా క్రీడలు అనేకసార్లు ఈ నగరంలో జరిగాయి. జకార్తాలో అత్యంత ప్రసిద్ధ ఫుట్‌బాల్ క్లబ్ పేరు పెర్సిజా, ఇది తన మ్యాచ్‌లను బుంగ్ కర్ణో స్టేడియం లేదా లెబాక్ బులస్ స్టేడియంలో ఆడుతుంది. పెర్సిజా జట్టు అభిమానులను జాక్ మానియా అని పిలుస్తారు, బోనెక్ మానియాకు చెందిన పెర్సెబాయా అభిమానులతో వీరికి సుదీర్ఘ విరోధం ఉంది. మరో ప్రధాన జట్టు పేరు పెర్సితారా, ఇది తన మ్యాచ్‌లను సుమంత్రీ బ్రోజోనెగోరో స్టేడియంలో ఆడుతుంది.

జకార్తాలో అతిపెద్ద స్టేడియంగా బుంగ్ కర్ణో స్టేడియం గుర్తింపు పొందింది, ఇది 100,000 సీట్ల సామర్థ్యం కలిగివుంది[64]. బాస్కెట్‌బాల్ కోసం, ఉత్తర జకార్తాలోని కెలాపా గాడింగ్‌లో కెలాపా గాడింగ్ స్పోర్ట్ మాల్ ఉంది, ఇది 7,000 సీట్ల సామర్థ్యం కలిగివుంది, ఇది ఇండోనేషియా జాతీయ బాస్కెట్‌బాల్ జట్టు సొంత వేదికగా ఉంది.[citation needed] సెనాయన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేక క్రీడా వేదికలు కలిగివుంది, బుంగ్ కర్ణో సాకర్ స్డేడియం, మధ్య స్టేడియం, ఇస్టోరా సెనాయన్, ఒక షూటింగ్ రేంజ్, ఒక టెన్నిస్ కోర్టు మరియు ఒక గోల్ఫ్ డ్రైవింగ్ రేంజ్ దీనిలో ఉన్నాయి. 1962నాటి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు సెనాయన్ సముదాయం 1959లో నిర్మించబడింది.

2011లో, బాండుంగ్‌లు కలసి, జకార్తా మరోసారి ఆగ్నేయాసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వబోతుంది.[citation needed]

సమస్యలు

బెకాసీలోని బంటార్ గెబాంగ్‌లో ఒక చెత్తకుప్ప

పారిశుధ్యం

జకార్తాలో నాలుగో వంతు కంటే తక్కువ జనాభాకు మాత్రమే మెరుగైన నీటి వనరులు అందుబాటులో ఉన్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. మిగిలిన జనాభా వివిధ రకాల వనరులపై ఆధారపడుతున్నారు, వీరు నీటిని నదులు, సరస్సులు, ప్రైవేట్ నీటి వ్యాపారుల వద్ద నుంచి పొందుతున్నారు. సుమారుగా 7.2 మిలియన్ల మంది జకార్తా పౌరులకు [సురక్షిత నీరు అందుబాటులో లేదు]."[65]

జంట నగరాలు మరియు సోదరి నగరాలు

జకార్తాకు ప్రపంచవ్యాప్త పట్టణాలు మరియు ప్రాంతాలతో సోదరి సంబంధాలు:

ఇవి కూడా చూడండి

సూచనలు

 1. http://worldstepper-daworldisntenough.blogspot.com/2008/04/go-jakarta-how-to-appreciate-big-durian.html
 2. 2.0 2.1 Penduduk Provinsi DKI Jakarta: Penduduk Provinsi DKI Jakarta Januari 2008 (Demographics and Civil Records Service: Population of the Province of Jakarta January 2008
 3. "The World According to GaWC 2008". Globalization and World Cities Study Group and Network (GaWC). Loughborough University. Retrieved 2009-12-07.
 4. Sundakala: cuplikan sejarah Sunda berdasarkan naskah-naskah “Panitia Wangsakerta” Cirebon. Yayasan Pustaka Jaya, Jakarta. 2005.
 5. The Sunda Kingdom of West Java From Tarumanagara to Pakuan Pajajaran with the Royal Center of Bogor. Yayasan Cipta Loka Caraka. 2007.
 6. బుజంగా మానిక్ గ్రంథం, ఇది ఇప్పుడు ఇంగ్లండ్‌లోని ఆక్స్‌పోర్డ్ విశ్వవిద్యాలయ బోల్డియాన్ గ్రంథాలయంలో ఉంది, ప్రిన్స్ బుజంగా మానిక్ ప్రయాణ వివరాలు దీనిలో ఉంటాయి.(Three Old Sundanese Poems. KITLV Press. 2007.)
 7. Sumber-sumber asli sejarah Jakarta, Jilid I: Dokumen-dokumen sejarah Jakarta sampai dengan akhir abad ke-16. Cipta Loka Caraka. 1999.
 8. 8.0 8.1 "History of Jakarta". BeritaJakarta.
 9. Ricklefs, M.C. (1993). A History of Modern Indonesia Since c.1300 (2nd edition ed.). London: MacMillan. p. 29. ISBN 0-333-57689-6. Cite has empty unknown parameter: |coauthors= (help); |edition= has extra text (help)
 10. Heuken, Adolf (2000). Sumber-sumber asli sejarah Jakarta Jilid II: Dokumen-dokumen Sejarah Jakarta dari kedatangan kapal pertama Belanda (1596) sampai dengan tahun 1619 (Authentic sources of History of Jakarta part II: Documents of history of Jakarta from the first arrival of Dutch ship (1596) to year 1619). Jakarta: Yayasan Cipta Loka Caraka. Cite has empty unknown parameter: |coauthors= (help)
 11. 11.0 11.1 11.2 11.3 Witton, Patrick (2003). Indonesia. Melbourne: Lonely Planet Publications. pp. 138–139. ISBN 1-74059-154-2.
 12. [1]
 13. కాలనీల ఆర్థిక వ్యవస్థ మరియు సమాజం, 1870-1940. మూలం: U.S. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్.
 14. గవర్నెన్స్ ఫెయిల్యూర్: రీథింకింగ్ ది ఇన్‌స్టిట్యూషనల్ డైమెన్షన్స్ ఆఫ్ అర్బన్ వాటర్ సప్లై టు పూర్ హౌస్‌హోల్డ్స్. ScienceDirect.
 15. Kusno, Abidin (2000). Behind the Postcolonial: Architecture, Urban Space and Political Cultures. New York City: Routledge isbn=0415236150. Missing pipe in: |publisher= (help)
 16. Schoppert, P. (1997). Java Style. Paris: Didier Millet. ISBN 962-593-232-1. Unknown parameter |coauthor= ignored (|author= suggested) (help)
 17. "Jakarta". Encyclopedia Britannica Online. Encyclopædia Britannica, Inc. Retrieved 2007-09-17. Cite has empty unknown parameter: |coauthors= (help)
 18. Douglas, M. (1989). "The Environmental Sustainability of Development. Coordination, Incentives and Political Will in Land Use Planning for the Jakarta Metropolis". Third World Planning Review. 11 (2 pages=pp. 211-238). Missing pipe in: |number= (help)
 19. Douglas, M. (1992). "The Political Economy of Urban Poverty and Environmental Management in Asia: Access, Empowerment and Community-based Alternatives". Environment and Urbanization. 4 (2): 9–32.
 20. Turner, Peter (1997). Java (1st edition). Melbourne: Lonely Planet. p. 315. ISBN 0-86442-314-4. Cite has empty unknown parameter: |coauthors= (help)
 21. Sajor, Edsel E. (2003). "Globalization and the Urban Property Boom in Metro Cebu, Philippines". Development and Change. 34 (4): 713–742. doi:10.1111/1467-7660.00325.
 22. Friend, Theodore (2003). Indonesian Destinies. Harvard University Press. p. 329. ISBN 0-674-01137-6.
 23. వేజెస్ ఆఫ్ హేట్రెడ్. మైకెల్ షారీ. బిజినెస్ వీక్.
 24. Friend, T. (2003). Indonesian Destinies. Harvard University Press. ISBN 0-674-01137-6.
 25. [2]
 26. "Jakarta holds historic election". BBC News. BBC. 2007-08-08.
 27. "Central Jakarta Profile". The City Jakarta Administration. Jakarta.go.id. Retrieved 2009-12-19.
 28. "West Jakarta Profile". The City Jakarta Administration. Jakarta.go.id. Retrieved 2010-02-24.
 29. "South Jakarta Profile". The City Jakarta Administration. Jakarta.go.id. Retrieved 2009-12-19.
 30. 30.0 30.1 "East Jakarta Profile". The City Jakarta Administration. Jakarta.go.id. Retrieved 2009-12-19.
 31. "North Jakarta Profile". The City Jakarta Administration. Jakarta.go.id. Retrieved 2009-12-19.
 32. ""Thousand Island" Profile". The City Jakarta Administration. Jakarta.go.id. Retrieved 2009-12-19.
 33. 33.0 33.1 33.2 33.3 33.4 33.5 33.6 33.7 33.8 Jakarta in Figures. Statistics DKI Jakarta Provincial Office, Jakarta. 2008.
 34. 2007నాటి గవర్నర్ డిక్రీ, నెంబరు 171 ఆధారంగా, DKI జకార్తా ప్రావీన్సియల్ కార్యాలయం నుంచి సేకరించిన గణాంకాలు, జకార్తా ఇన్ ఫిగర్స్ , 2008, BPS ప్రావీన్స్ ఆఫ్ DKI జకార్తా
 35. ఏషియావ్యూస్ - ఏషియన్ న్యూస్
 36. "Floods in DKI Jakarta Province, updated 19 Feb 2007 Emergency Situation Report No. 6". ReliefWeb. 2007-02-19.
 37. 1996 "2007 Global Register of Major Flood Events" Check |url= value (help). Dartmouth Flood Observatory. Dartmouth College.
 38. Bloomberg.com: ఆసియా
 39. త్రీ కిల్డ్, 90,000 ఎవాక్యుయేటెడ్ ఇన్ జకార్తా ఫ్లడ్స్: అఫీషియల్స్ - Yahoo! న్యూస్
 40. డిసీజ్ ఫియర్స్ యాజ్ ఫ్లడ్స్ రావేజ్ జకార్తా
 41. జకార్తా ఫ్లడ్ Feb 2007 « (Geo) ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్
 42. http://www.dartmouth.edu/~floods/Archives/2007sum.htm
 43. "World Weather Information Service - Jakarta".
 44. బెటావీ - వీరి యొక్క వైవిద్యమైన మూలాలు కారణంగా - సమకాలీన జకార్తాలో వీరు జాతి మరియు జాతీయ గుర్తింపుకు సంబంధించి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు; see Knörr, Jacqueline: Kreolität und postkoloniale Gesellschaft. Integration und Differenzierung in Jakarta , Campus Verlag: Frankfurt a.M. & న్యూయార్క్, 2007, ISBN 978-3-593-38344-6
 45. Knörr, Jacqueline (2007). Kreolität und postkoloniale Gesellschaft. Integration und Differenzierung in Jakarta. Frankfurt: Campus Verlag. ISBN 978-3-593-38344-6.
 46. Johnston, Tim (2005-03-03). "Chinese diaspora: Indonesia". BBC News. BBC.
 47. http://travel.yahoo.com/p-travelguide-2881278-haveli_indian_cuisine_bar_jakarta-i
 48. [3]
 49. Tak ada Krisis untuk Konsumtivisme. http://epaper.kompas.com/. May 1st. Check date values in: |date= and |year= / |date= mismatch (help); External link in |publisher= (help)
 50. http://news.bbc.co.uk/1/hi/world/asia-pacific/6989211.stm; "కండెమ్నడ్ కమ్యూనిటీస్: ఫోర్స్‌డ్ ఎవిక్షన్స్ ఇన్ జకార్తా" హ్యూమన్ రైట్స్ వాచ్ సెప్టెంబరు 2006.
 51. ఫార్ ఈస్ట్రన్ ఎకనామిక్ రివ్యూ, ఆసియా 1998 ఇయర్‌బుక్, పేజి 63.
 52. http://www.expat.or.id/info/jakartamallsshoppingcenters.html
 53. "Taman Suropati (Indonesian)". deskominfomas. Jakarta.go.id.
 54. "Taman Lapangan Banteng (Indonesian)". deskominfomas. Jakarta.go.id.
 55. "Taman Medan Merdeka (Indonesian)". Dartmouth deskominfomas. Jakarta.go.id.
 56. 56.0 56.1 Williamson, Lucy (6 June 2007). "Jakarta begins river boat service". BBC News.
 57. అజుమా, యోషిఫుమీ (2003). అర్బన్ పీశాంట్స్: బెకా డ్రైవర్స్ ఇన్ జకార్తా . జకార్తా: పుస్తక సినార్ హారాపన్.
 58. "Jakarta gets its first klong taxis". Bangkok Post. The Post Publishing Public Co.
 59. http://www.ui.ac.id/en/profile/page/overview
 60. Web Universitas Nasional 1949
 61. [4]
 62. [5]
 63. http://www.ocasia.org/Game/GameParticular.aspx?GPCode=8
 64. ప్రపంచంలో ఫుట్‌బాల్ స్టేడియాలు - ఇండోనేషియాలో స్టేడియాలు
 65. ఐక్యరాజ్యసమితి మానవ అభివృద్ధి నివేదిక 2006, పేజి 39

బాహ్య లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.