"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

జగన్మోహన్ ప్యాలెస్

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Jagan mohan palace2.jpg
మైసూర్ లోని జగన్మోహన్ ప్యాలెస్
దస్త్రం:Statue of children with umbrella outside Jaganmohan Palace (crop).jpg
ప్యాలెస్ ముఖద్వారంలోని బొమ్మ

జగన్మోహన్ ప్యాలెస్,  కర్ణాటకలోని మైసూర్ నగరంలో ఉన్న ప్యాలెస్. ఈ ప్యాలెస్ నిర్మాణం 1861లో పూర్తయింది. మైసూరు మహారాజులైన ఒడయార్లు మొదటగా ఈ ప్యాలెస్ ను ఉపయోగించారు. ప్రస్తుతం దీనిని కళా ప్రదర్శనశాల గాను, ఫంక్షన్ హాల్ గానూ వాడుతున్నారు. మైసూరులోని 7 రాజభవనాల్లో ఇది ఒకటి. ఒడయార్లు తమ కాలంలో నిర్మించిన ఈ భవనం ఎంతో అందంగా ఉంటుంది. ఈ రాజకుటుంబం మైసూరులోనే కాక, బెంగుళూరు వంటి ప్రదేశాల్లో కూడా ఎన్నో కట్టడాలను నిర్మించడం విశేషం.

చరిత్ర

జగన్మోహన్ ప్యాలెస్ ను మూడవ కృష్ణరాజ ఒడయార్ 1861 లో నిర్మించాడు.[1] రాజకుటుంబ నివాసమైన మైసూరు ప్యాలెస్ అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. దాని స్థానంలో కొత్త ప్యాలెస్ నిర్మాణం 1897 లో మొదలైంది. 1912 లో ఈ కొత్త ప్యాలెస్ నిర్మాణం పూర్తయ్యే వరకూ రాజకుటుంబం జగన్మోహన్ ప్యాలెస్‌నే తమ నివాసంగా వాడారు.[2] 1902 లో రాజర్షి నలవాది కృష్ణరాజ ఒడయార్ మైసూరు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ పట్టాభిషేకం జగన్మోహన్ ప్యాలెస్‌ లోనే జరిగింది. అప్పటి బ్రిటిషు వైస్రాయ్, గవర్నర్ జనరలూ కర్జన్ కూడా హాజరయ్యాడు. రాజు ఈ భవనాన్ని తన రోజువారీ దర్బరుగా వాడాడు. దసరా ఉత్సవాల సమయంలో కూడా దర్బారుగా దీన్నే వాడాడు. 1915 లో ఈ ప్యాలెసును కళా ప్రదర్శన శాలగా మార్చారు. 1955 లోదీన్ని జయచామరాజేంద్ర ఒడయార్ పేరిట దీనికి శ్రీ జయచామరాజేంద్ర ఆర్ట్ గ్యాలరీ అని పేరు పెట్టారు. మైసూరు విశ్వవిద్యలయపు తొలి స్నాతకోత్సవాలు ఈ ప్యాలెస్ లోనే జరిగాయి. 1907 జూలైలో మైసూరు రాష్ట్ర శాసనమండలి తొలి సమావేశాలు ఇక్కడే జరిగాయి[3] శాసనమండలిని అప్పట్లో ప్రతినిధుల మండలి (రిప్రజెంటేటివ్ కౌన్సిల్) అనేవారు. దీనికి దివాన్ (రాష్ట్ర ప్రధానమంత్రి) అధ్యక్షత వహించేవారు. జయచామరాజేంద్ర ఒడయార్ దీన్ని ఒక ట్రస్టుగా మార్చి ప్రజల సందర్శనకు తెరిచాడు.[4]

వాస్తుశైలి

ప్యాలెస్‌ను సాంప్రదాయిక హిందూ నిర్మాణ శైలిలో నిర్మించారు. 1900 లో బయట ఒక ప్రంగణాన్ని దాని వెనక ఒక హాలునూ నిర్మించారు. దానిపై హిందూ దేవతల శిల్పాలు చెక్కారు.[5] ఒడయార్ల వంశవృక్షాన్ని కూడా ఒక గోడపై చిత్రించారు.[5] దశావతారాలను చిత్రించిన రెండు చెక్కలు కూడా అందులో ఉన్నాయి.

మూలాలు

  1. "Jaganmohan Palace".
  2. Priyanka Haldipur. "Of Monumental value". Online Edition of The Deccan Herald, dated 2005-04-19. Archived from the original on 15 October 2007. Retrieved 20 September 2007.
  3. "Jaganmohana Palace". Online webpage of the Mysore district. Archived from the original on 13 September 2007. Retrieved 2007-09-20.
  4. "Upper House turns 100". Online Edition of The Deccan Herald, dated 2007-07-06. Archived from the original on 6 April 2012. Retrieved 2007-09-20.
  5. 5.0 5.1 R Krishna Kumar (2004-10-11). "Priceless souvenirs of Mysore Dasara". Online Edition of The Hindu, dated 2004-10-11. Chennai, India. Retrieved 2007-09-20.