"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
జడత్వ ద్రవ్యరాశి
ద్రవ్యరాశి వస్తువులోని పదార్థ పరిణామం. ఇది పదార్థం మొత్తాన్ని సూచిస్తుంది. ఒకి ఒక వస్తువు లేదా పదార్థం జడత్వాన్ని కొలుస్తుంది. ఇది వేగం మార్పులకు పదార్థం యొక్క నిరోధకత లేదా దానిని నడాపడాఅనికి అవసరమైన శక్తి. గమనించిన వేగం ఎక్కువ, ద్రవ్యరాశి ఎక్కువ. దీనిని జడత్వ ద్రవ్యరాశి అంటారు.[1] ==== న్యూటన్ రెండో గమనసూత్రం నుంచి F=ma సమీకరణం కనుకొన్నారు.అంచేత m=F/a అవుతుంది. అంటే ఒక వస్తువు ద్రవ్యరాశి,వస్తువుపై ప్రయొగించిన బలాన్ని దానివల్ల బలదిశలో కలిగే త్వరణంచే భాగిస్తే వస్తుంది.ఇలాగ వస్తువులోని ద్రవ్యరాశిని లెక్కగడితే వచ్చే విలువ, వస్తువు జడత్వ ద్రవ్యరాశి అంటారు.
ఏదో ఒక త్వరణంతో పోయేందుకు పఒక వస్తువు మీద F బలం ఉపయోగించినారనుకోండి.అదే త్వరణంతో పోయేందూకు మరొక వస్తువుపై 2 F బలం ప్రయోగించారనుకోండి.అప్పుడు మొదటి వస్తువు ద్రవ్యరాశి m అయితే రెండోదాని ద్రవ్యరాశి 2m (మొదటి దానికన్న రెండింతలు) అవుతుంది.ఇలా లెక్కించిన ద్రవ్యరాశిని "జడత్వ ద్రవ్యరాశి" అంటారు.[2]
ఇవి కూడా చూడండి
మూలాలు
- ↑ "ద్రవ్యరాశి మరియు వాల్యూమ్ మధ్య వ్యత్యాసం". te.mort-sure.com. Retrieved 2020-08-26.
- ↑ ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకం.