జడ్చర్ల

From tewiki
Jump to navigation Jump to search
బస్సులు నిలుపు ప్రాంగణం, జడ్చర్ల

జడ్చర్ల, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా,జడ్చర్ల మండలానికి చెందిన జనగణన పట్టణం.[1]ఇది 7 వ నెంబరు జాతీయ రహదారి పై ఉన్న ముఖ్య కూడలి. హైదరాబాదు నుంచి కర్నూలు, బెంగుళూరు వైపు వెళ్ళు అన్ని ఆర్టీసీ బస్సులు ఇచ్చట ఆపుతారు. ఇది బాదేపల్లి జంట పట్టణం. ప్రస్తుతం ఈ రెండు పట్టణాల గ్రామపంచాయతీలు వేరువేరుగా ఉన్ననూ భౌగోళికంగా ఈ పట్టణాల మధ్య సరిహద్దు గుర్తించడం కష్టం. చాలా కాలం నుంచి ఈ రెండు పట్టణాలను కల్పి పురపాలక సంఘం చేయాలనే ప్రతిపాదన ఉన్ననూ రాజకీయ కారణాల వల్ల వాయిదా పడుతోంది. ఇది జడ్చర్ల పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]

గణాంకాలు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా మొత్తం 1,02,766 - పురుషులు 51,240 - స్త్రీలు 51,526.అక్షరాస్యుల సంఖ్య 61056.[3] అందులో జడ్చర్ల పట్టణ జనాభా 50366 కాగా, గ్రామీణ జనాభా 52191.

చరిత్ర

11వ శతాబ్ది నాటికే జడ్చర్ల ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉండేది.[4]19వ శతాబ్ది తొలి అర్థభాగంలో ఈ పట్టణంలో తన కాశీయాత్రలో భాగంగా మజిలీచేసిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ పట్టణాన్ని గురించి తన కాశీయాత్రచరిత్రలో వ్రాశారు. ఆయన వర్ణించినదాని ప్రకారం 1830నాటికే ఇది చక్కని బస్తీగా ఉండేది. రమణీయమైన కొలను, చుట్టూ మండపాలతో మంచి దేవాలయం ఉండేదన్నారు. పట్టణంలో సంపన్న వర్తకులైన ఉండేవారని వ్రాశారు. అప్పటికే జడ్చర్లలో సకల పదార్థాలూ దొరికేవన్నారు. ఆ ఊరు ఆరువేల నియోగి రాజగోపాలరావు అనే వ్యక్తికి తరతరాలుగా జమీందారీ కింద ఉండేదన్నారు. అయితే అతని వయస్సు అప్పటికి 12 సంవత్సరాలు కావడంతో ఆయన తల్లి పరిపాలన చేసేవారు. 3 లక్షల వరకూ సంవత్సరానికి నవాబుకు కట్టుకునే ఆ సంపన్న జమీందారీ పాలకులు ధర్మపాలన చేసేవారని పేరున్నట్టు వీరాస్వామయ్య వ్రాశారు. వారికి రాచూరు అనే గ్రామం రాజధానిగా ఉండేదన్నారు[5].

.....ఆయూరున్ను ఇంకా 36 గ్రామాలున్ను రాజగోపాలరావు అనే ఆరువేల నియోగి బ్రాంహ్మణునికి కొన్నితరాలుగా జమీను నడుచుచున్నది. 3 లక్షల రూయాయీలు గోలకొండ నవాబుకు కట్టుచున్నారు. ఇప్పుడు 12 సంవత్సరముల చిన్నవాడు తల్లికి సహాయముగా దొరతనము చేయుచున్నాడు. ధర్మ సంస్థాన మని చెప్పబడుచున్నది. రాచూరు అనేయూరు వారికి రాజధానిగా నున్నది.[6]

రవాణా సౌకర్యాలు

7 వ నెంబరు జాతీయ రహదారిపై ముఖ్యకూడలి కావడంతో బస్సు సౌకర్యం మంచి స్థితిలో ఉంది. హైదరాబాదు నుంచి దక్షిణం వైపుగా కర్నూలు, బెంగుళురు వైపు వెళ్ళు మార్గమే కాకుండా మహబూబ్ నగర్ నుంచి తూర్పు వైపున దేవరకొండ, నల్గొండ వెళ్ళు మార్గం కూడా ఈ పట్టణం ద్వారానే వెళ్తుంది. అంతేకాకుండా ఈ పట్టణానికి రైలు సదపాయము కూడా ఉంది. రోడ్డు మార్గములో హైదరాబాదు నుంచి 83 కిలోమీటర్లు, రైలు మార్గంలో సికింద్రాబాదు నుంచి 96 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది.

వినోదం

జడ్చర్ల పట్టణంలో 4 సినిమా థియేటర్లు ఉన్నాయి.

  • శ్రీనివాస థియేటర్
  • దేవి థియేటర్
  • వెంకట రమణ థియేటర్
  • రాఘవేంద్ర థియేటర్

విద్యాసంస్థలు

  • ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (స్థాపన:1982-1983)
  • ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (స్థాపన :1982-83)
  • మాస్టర్స్ జూనియర్ కళాశాల (స్థాపన :1997-98)
  • సెయింట్ ఆజ్ఞస్ బాలికల హై స్కూల్
  • జిల్లా ప్రజా పరిషత్తు బాలుర హై స్కూల్
  • డాక్టర్ బి.ఆర్.ఆర్.ప్రభుత్వ కళాశాల

దేవాలయాలు

  • శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం (బాదేపల్లి).
  • హనుమాన్ దేవాలయం, పాతబజార్ (బాదేపల్లి).
  • వేంకటేశ్వర స్వామీ దేవాలయం, కొత్త బస్సుస్టాండు రోడ్డు ( జడ్చెర్ల )
  • రంగనాయక స్వామీ దేవాలయం ( గుట్ట, బాదేపల్లి )
  • శివాలయం, గంగాపురం రోడ్డు, బాదేపల్లి
  • రాఘవేంద్రస్వామి దేవాలయం, సిగ్నల్ గడ్డ రోడ్డు, బాదేపల్లి
  • సాయిబాబా దేవాలయం, బాదేపల్లి చౌరస్తా
  • మైసమ్మ దేవాలయం, పాతబస్టాండ్ రోడ్డు చైతన్య నగర్. బాదేపల్లి

నీటిపారుదల, భూమి వినియోగం

మండలంలో 9 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 766 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[7]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. నమస్తే తెలంగాణ, తెలంగాణ (3 May 2021). "జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, న‌కిరేక‌ల్, అచ్చంపేట‌ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ ప్ర‌భంజ‌నం". Namasthe Telangana. Archived from the original on 3 May 2021. Retrieved 3 May 2021.
  3. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127
  4. కంభపు, వెంకటేశ్వర ప్రసాద్ (1999). మధ్యయుగ ఆంధ్రదేశ ఆర్థిక చరిత్ర (క్రీ.శ.1000 - 1323). p. 85. Retrieved 11 May 2019.[permanent dead link]
  5. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  6. https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Kasiyatracharitr020670mbp.pdf/89[permanent dead link]
  7. Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79

వెలుపలి లింకులు