జయంతి నటరాజన్

From tewiki
Jump to navigation Jump to search
జయంతి నటరాజన్
జయంతి నటరాజన్

నియోజకవర్గం రాజ్యసభ

వ్యక్తిగత వివరాలు

జననం (1954-06-07) 1954 జూన్ 7 (వయస్సు 67)
చెన్నై, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి వి.కె.నటరాజన్
సంతానం 1 కుమారుడు
నివాసం న్యూఢిల్లీ
మతం హిందూమతం
వెబ్‌సైటు [1]
26 January, 2007నాటికి

జయంతి నటరాజన్ (జ. జూన్ 7, 1954 ) భారతీయ న్యాయవాది, రాజకీయనేత. ఈమె భారత జాతీయ కాంగ్రెస్ సభ్యురాలు, పార్లమెంట్ సభ్యురాలిగా తమిళనాడు రాష్ట్రం తరపున రాజ్యసభకు మూడుసార్లు ఎంపికయ్యారు. ఈమె కేంద్ర మంత్రిమండలిలో మంత్రిగా కూడా పనిచేశారు.

ప్రారంభ సంవత్సరాలు

జయంతి నటరాజన్ తమిళనాడులో ఒక ముదలియారు కుటుంబంలో పుట్టారు. ఈమె తాత ఎం.భక్తవత్సలం ప్రముఖ కాంగ్రెస్ రాజకీయనేత మరియు 1963 నుంచి 1967 మధ్య కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. జయంతి న్యాయశాస్త్రం చదివి మద్రాసులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. తన న్యాయవాద వృత్తితో పాటుగా ఈమె అఖిల భారత మహిళా వేదిక, న్యాయ సహాయ మండలి వంటి పలు సాంఘిక సంస్థలలో సభ్యురాలిగా లాభాపేక్ష లేని పనులలో పాలు పంచుకున్నారు. [2]

రాజకీయ జీవితం

కాంగ్రెస్ సంవత్సరాలు

1980లలో ఈమెను రాజీవ్‌గాంధీ గుర్తించినప్పుడు ఆమె రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఈమె మొట్టమొదటిసారిగా రాజ్యసభకు 1986లో ఎంపికయ్యారు తర్వాత 1992లో మరోసారి ఎంపికయ్యారు.

తమిళ మానిళ కాంగ్రెస్

90లలో అప్పటి ప్రధాని నరసింహారావు వైఖరితో విసిగిపోయి తమిళనాడుకు చెందిన ఇతర కాంగ్రేసు నేతలతో పాటు జయంతి నటరాజన్ పార్టీనుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. వీరు జి.కె.మూపనార్ ఆధ్వర్యంలో తమిళ మానిళ కాంగ్రెస్‌ (త.మా.కా)ను స్థాపించారు. జయంతి నటరాజన్ రాజ్యసభ నుంచి రాజీనామా చేసి 1997లో తమిళ మానిళ కాంగ్రెస్ సభ్యురాలిగా తిరిగి ఎంపికయ్యారు.

త.మా.కా పార్టీ తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కళగంతో పొత్తు కుదుర్చుకుని కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్‌ ప్రభుత్వంలో భాగమైంది. జయంతి నటరాజన్ 1997లో బొగ్గు, పౌర విమానయానం, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా నియమితులయ్యారు.

ఈమె కుమారుడు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

కాంగ్రెస్‌లోకి పునరాగమనం

మూపనార్ మృతితో తమిళ మానిళ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్‌లో విలీనం కావాలని నిర్ణయించుకున్నారు. జయంతి నటరాజన్‌ని సోనియా గాంధీ గుర్తించి ఆమెను పార్టీ అధికారిక వ్యాఖ్యాతగా నియమించారు.