"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

జవహర్ నవోదయ విద్యాలయం

From tewiki
Jump to navigation Jump to search

జేఎన్వీ అని సంక్షిప్తంగా పిలువబడే జవహర్ నవోదయ విద్యాలయం ఎంపిక చేయబడ్డ విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు భారత దేశ ప్రభుత్వం నెలకొలిపిన ప్రత్యేక విద్యాలయం. గ్రామ్య ప్రాంతాల విద్యార్థులకు వారి ఆర్థిక పరిస్థితికి తావు లేకుండా చక్కని, మెరుగైన, ఆధునిక విద్యను అందించటం ఈ విద్యాలయాల లక్ష్యం. తమిళనాడు తప్ప దేశ వ్యాప్తంగా ఈ విద్యాలయాలు ఉన్నాయి. 2010 నాటికి వీటి సంఖ్య 593. జిల్లా స్థాయిలో జరిగే దేశ వ్యాప్త పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది.

ప్రాంతాల వారీగా నవోదయ విద్యాలయాలు

భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ఎనిమిది ప్రాంతీయ కార్యాలయాలను స్థాపించింది. వీటి ఆధీనంలో 2010 వరకు సుమారు 600 విద్యాలయాలు పనిచేస్తున్నాయి.

గుర్తింపు పొందిన పూర్వ విద్యార్థులు

  • హిమదాస్ : 2018 లో అండర్-20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణ పతకం విజేత.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు