"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

జాజుల గౌరి

From tewiki
Jump to navigation Jump to search
జాజుల గౌరి
దస్త్రం:Jajula gowri.jpg
జననంమునింగం సుశీల
(1969-03-02) 2 మార్చి 1969 (వయస్సు 52)
లోతుకుంట,హైదరాబాదు,
తెలంగాణ భారతదేశం
నివాస ప్రాంతంహైదరాబాదు
భార్య / భర్తమునింగం నాగరాజు
పిల్లలువసంత పల్లవి,
మహేష్ కుమార్,
లేఖక్ సిద్ధార్థ
తండ్రిమల్లయ్య
తల్లిలక్ష్మి

జాజుల గౌరి పేరుపొందిన దళితవాద రచయిత్రి.

విశేషాలు

ఈమె అసలు పేరు మునింగం సుశీల. ఈమె హైదరాబాదు లోతుకుంటలో 1969 మార్చి 2[1]న మల్లయ్య, లక్ష్మి దంపతులకు జన్మించింది. ఈమె 8వ తరగతి చదివే సమయంలో మునింగం నాగరాజుతో వివాహం జరగడంతో చదువు ఆగిపోయింది. తరువాత ఈమె డా.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. డిగ్రీ సంపాదించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం చదివింది. ఈమె బాల్యం నుండే పాటలు వినడంలోను కవిత్వం వ్రాయడంలోను ఆసక్తి చూపింది. ఈమె మొదటి కవిత 1980లో కర్షకులు పేరుతో తన తల్లిదండ్రులను ఉద్దేశించి వ్రాసింది. అది మొదలుకొని ఈమె బాల కార్మికుల గురించి, పేదరికం గురించి సుమారు 300 కవితలు వ్రాసింది. ఆ కవితలు ప్రచురించడానికి పత్రికలు తిరస్కరించడంతో ఆమె దళిత దృక్కోణంలో కవిత్వం వ్రాయడం ప్రారంభించింది. ఈమె కవిత్వం ఆంధ్ర రాష్ట్రంలో దళితోద్యమం బలపడటానికి దోహదపడింది. ఈమె తెలంగాణ ప్రాంతం నుండి తొలి తరం దళిత రచయిత్రిగా వాసికెక్కింది[2].

జాజుల గౌరి జీవితం, సాహిత్యం వేరుకాదు. తాను గడిచివచ్చిన జీవితాన్ని సాహిత్యంలో చిత్రిస్తున్నది. తెలుగుసాహిత్యంలో మాదిగ దండోరా ఉద్యమ నేపథ్యంలో తనను తాను తెలుసుకుంటూ తమ జీవితాలు కూడా సాహిత్య యోగ్యమే అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న రచయిత్రి ఈమె. ఈమె ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక అధ్యక్షురాలిగా పనిచేస్తున్నది. దళిత బహుజన సామాజిక ఉద్యమాలలో ముఖ్యంగా స్త్రీ సమస్యలపై పోరాడే ఉద్యమాలలో ఈమె చురుకుగా పాల్గొంటున్నది.

రచనలు

 • మన్నుబువ్వ (కథల సంపుటి)

వొయినం (నవల)

పురస్కారాలు

జాజుల గౌరి కథా రచయిత్రిగా అనేక పురస్కారాలు, ప్రశంసలు అందుకున్నది. కేంద్ర సాహిత్య అకాడమీ బెంగళూరు, గుడివాడ, హైదరాబాదు తదితర ప్రాంతాలలో నిర్వహించిన సాహిత్య సభలలో రచయిత్రిగా ఆహ్వానించబడింది.

ఈమె అందుకున్న పురస్కారాలు కొన్ని:

 • మన్నుబువ్వ కథల సంపుటికి విశాల సాహితి పురస్కారం.
 • సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్ నుండి ఆర్థిక సహాయం.
 • మన్నుబువ్వ పుస్తకానికి చాసో పురస్కారం.
 • అధికార భాషాసంఘం అవార్డ్
 • పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం.
 • యద్దనపూడి సులోచనారాణి మాతృమూర్తి పురస్కారం.
 • రంగవల్లి మెమోరియల్ ట్రస్ట్ పురస్కారం.
 • దళిత సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ వారి వీరాంగన సావిత్రీబాయి ఫూలే పురస్కారం.

మూలాలు

 1. కథానిలయంలో జాజుల గౌరి వివరాలు
 2. Thummapudi, Bharathi (2008). A History of Telugu Dalit Literature (1 ed.). Delhi: KALPAZ PUBLICATIONS. pp. 169–171. ISBN 81-7835-688-0. Retrieved 18 April 2017.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).