"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

జాతాపులు

From tewiki
Jump to navigation Jump to search

జాతాపులు : శ్రీకాకుళం జిల్లాలోని కొండ ప్రాంతాలలో జాతాపులు సవరలతో కలిసి సహజీవనం (Symbiosis) సాగిస్తుంటారు. ఈ రెండు తెగలు కూడా పక్క పక్క గ్రామాల్లోనైనా లేదా వొకే గ్రామంలో వేర్వేరు చోటైనా నివసిస్తుంటారు. జాతాపులు బల్లపరుపు భూములనూ,నీటి వసతి ఉండే భూములనే ఎక్కువగా ఎంచుకుంటారు. అక్కడ బియ్యం పండిస్తారు. అంత బాగా పండని వ్యవసాయ యోగ్యం కాని కొండ ప్రాంతాలను జాతాపులు సవరలకు వొదిలి వేస్తారు. వాస్తవానికి జాతాపులు కోంద్ (Kond) తెగకు చెందిన వారే ఐనప్పటికీ, ఎక్కువ మంది తెలుగే మాట్లాడతారు. ఏదో కొద్ది మంది జాతాపులు మాత్రం కోందుల భాష అయిన "కుయ్" (kui) మాట్లాడతారు.


ప్రధానంగా నాగలితో స్థిర వ్యవసాయం చేసే సవరలు, అక్కడక్కడా వ్యవసాయ యోగ్యం కాని ఎగుడుదిగుడు కొండ భూముల్లో పోడు వ్యవసాయం కూడా చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలో, పక్కనే ఉన్న ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే జాతాపుల జనాభా సుమారుగా 80 వేల దాకా ఉంటుంది.

  • ఆంగ్ల మూలం : Tribes of India : The Struggle for Survival, Cristoph Von Furer-Haimendorf, (అనువాదం : అనంత్. -- మనుగడ కోసం పోరాటం .)