"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

జాతీయ అర్హత మరియు ప్రవేశ పరీక్ష

From tewiki
Jump to navigation Jump to search

జాతీయ అర్హత మరియు ప్రవేశ పరీక్ష (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - NEET) అనేది భారతదేశంలోని ప్రభుత్వ లేదా/మరియు ప్రవేట్ వైద్య కళాశాలలోని ఏదైనా గ్రాడ్యుయేట్ వైద్య కోర్సు (ఎంబిబియస్), దంత కోర్సు (బిడిఎస్) లేదా పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సు (ఎండీ/ఎంఎస్) అధ్యయనం చేయాలనుకునే విద్యార్థులకు భారతదేశంలో ఒక ప్రవేశ పరీక్ష. నీట్-యుజి (అండర్గ్రాడ్యుయేట్), ఎంబిబిఎస్ మరియు బిడిఎస్ కోర్సులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) చే నిర్వహించబడుతున్నాయి. నీట్-యుజి ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ (AIPMT) మరియు రాష్ట్రాలు లేదా కళాశాలలు తాము నిర్వహించే అన్ని వ్యక్తిగత ఎంబిబియస్ పరీక్షలను నిర్వహించే స్థానాన్ని భర్తీ చేసింది.