"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం

From tewiki
Jump to navigation Jump to search

జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం ను ప్రతి సంవత్సరం అక్టోబరు 1 న జరుపుకుంటారు. 1975లో స్వరూప కృష్ణన్, డాక్టర్ జె.జి జోలీల చొరవతో ఈ పద్ధతి ప్రారంభమయింది. ఈ రోజున ప్రత్యేకంగా రక్తదానంపై కొన్ని కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు రక్తదానం యొక్క ఆవశ్యకత గురించి తెలియచేస్తూ వారు రక్తదానం చేసేలా వారిలో చైతన్యాన్ని కలిగిస్తారు.

ప్రపంచ రక్త దాతల దినోత్సవం

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జూన్ 14న ప్రపంచ రక్త దాతల దినోత్సవమును జరుపుకుంటారు. రక్తదాతలకు ధన్యవాదాలు తెలిపేందుకు, సురక్షితమైన రక్తం యొక్క ఆవశ్యకతను తెలియజేసేందుకు, రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని భద్రపరచే విధానాలను మెరుగు పరచుకునేందుకు 2005లో ఈ కార్యక్రమం ప్రారంభమయింది. ఎ, ఒ, బి, బ్లడ్ గ్రూపులను కనుగొన కార్ల్ లేండ్ స్టీనర్ జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజైన జూన్ 14న ప్రపంచ రక్త దాతల దినోత్సవమును జరుపుకుంటున్నారు.

ఇవి కూడా చూడండి

మూలాలు

  • సాక్షి దినపత్రిక - 01-10-2014 - (ఎన్నిసార్లు దానం చేసినా తరగని నిధి - నేడు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం)