"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

జానకి అమ్మ

From tewiki
Jump to navigation Jump to search
జస్టిస్ పి. జానకి అమ్మ
దస్త్రం:Justice Janaki Amma.jpg
జస్టిస్ పి. జానకి అమ్మ
జననం
జానకి

1920
త్రిస్సూర్
మరణం2005 (aged 84–85)
జాతీయతభారతీయులు
వృత్తిన్యాయమూర్తి
ఉద్యోగంకేరళ హైకోర్టు
సురరిచితుడుSecond woman to be a Judge of High Court in India
బిరుదుHon. Justice
పదవీ కాలం30 May 1974 to 22 April 1982

జస్టిస్ జానకి అమ్మ(1920–2005), కేరళ ఉన్నత న్యాయస్థానానికి మాజీ న్యాయమూర్తి. ఆమె కేరళలోని త్రిస్సూర్ జిల్లలో ఒక గ్రామంలో జన్మించింది. జానకీ జీవితంలో ఎక్కువ భాగం మాత్రం ఎర్నాకుళంలో జీవించింది. 30 మే 1974న కేరళ ఉన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించింది. భారతదేశంలోనే రెండో మహిళా హైకోర్టు న్యాయమూర్తి జానకీ అమ్మ కావడం విశేషం. 22 ఏప్రిల్ 1982 వరకు జడ్జిగా పనిచేసింది ఆమె.

రాజకీయ జీవితం

ఆమె 1940-44 మధ్య కాలంలో భారత స్వాతంత్ర్య సంగ్రామంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఆమె తాన్ విద్యాభ్యాసం అనంతరం కొచ్చిన్ ప్రజా మండలంలొ చేరారు. తరుగాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలోనికి చేరారు.

ఆమె ట్రావెన్స్‌కోర్-కొచ్చిన్ లో మొదటి మహిళా మ్యునిసిపల్ చైర్‌పర్సన్ గా పనిచేసారు. ఆమె ఏప్రిల్ 1953 నుండి మార్చి 1956 వరకు ఎర్నాకుళం మ్యునిసిపల్ కౌన్సిల్ కు చైర్ పర్సన్ గా భాద్యతలు నిర్వహిమారు. ఆమె న్యాయ విభాగంలో చేరిన తరువాత తన రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పారు.

న్యాయ వ్యవస్థ

ఆమె తన న్యాయవాద వృత్తిని న్యాయవాది పనంపల్లి గోవింద మీనన్ వద్ద జూనియర్ గా ప్రారంభించారు. తరువాత ఆమె కొజికోడ్, టెలిచెర్రి మరియు మంజేరి ప్రాంతాలలో జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా మరియు సెషన్స్ జడ్జిగా భాద్యతలు నిర్వహించారు. ఆమె మే 30 1974లో కేరళ హైకోర్టులో న్యాయమూర్తిగా భాద్యతలు స్వీకరించారు. భారతదేశంలో న్యాయవాద వృత్తిని అలంకరించిన మహిళలలో ఆమె రెండవవారు. ఆమె ఏప్రిల్ 22, 1982 న కేరళ హికోర్టు నుండి పదవీ విరమణ చేశారు.

దర్యాప్తులు / విచారణ కమీషన్లు

ఆమె కేరళ హైకోర్టు నుండి న్యాయమూర్తిగా పదవి విరమణ చేసిన తదుపరి న్యాయ రంగంలో వివిధ సేవలనందించారు. 1983లో ఆమె అనేక మంది కారణమైన కల్తీ సారా ఉదంతం ను దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంచే నియమింపబడ్డారు. ఆమె చేసిన సిఫార్సులకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అబ్కారీ విధానంలో 57(A) సెక్షనును ప్రవేశపెట్టింది. ఆమె కేరళ ప్రభుత్వానికి సంబంధించిన అనేక దర్యాప్తులు, విచారణ కమీషన్లలో తన సేవలనందించారు.

ఇతర పదవులు

ఆమె ఎర్నాకుళం కారయోగం అధ్యక్షురాలిగా కూడా తన సేవలనందించారు.[1]

మూలాలు

ఇతర లింకులు