"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
జామ ఆకుల నూనె
జామ | |
---|---|
![]() | |
జామ కాయ | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Subclass: | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Genus: | సిడియమ్ |
Species | |
About 100, see text | |
Synonyms | |
Calyptropsidium O.Berg |
జామ ఆకుల నూనె ఒక ఆవశ్యక నూనె.జామ ఆకుల నూనెను జామాయిల్ అనబడు మరో ఆవశ్యకనూనెకు సంబంధం లేదు.జామాయిల్ అనేది నీలగిరి లేదా యూకలిప్తస్ ఆకులనుండి ఉత్పత్తిచేస్తారు.జామ మొక్కలు మిర్టిల్ కుటుంబానికి చెందిన సిడియం కోవకు చెందిన మొక్కలు.జామ చెట్తు పళ్లు ఆహార యోగ్యం.వాటిని తింటారు.జామ ఆకుల నూనెనే కాకుండా జామ ఆకు రసాన్ని/పసరును కొన్ని జబ్బుల నివారణకు దేశియ వైద్యంలో కూడా ఉపయోగిస్తారు.మొత్తం పండును తినవచ్చును.పళ్లనుండి జ్యూస్ ను తీసి జామ్ లు జెల్లీలీ తయారు చేస్తారు.
Contents
ఆవశ్యక నూనెలు అనగానేమి
ఆవశ్యక నూనెలు అనేవి మొక్కల నుండి, చెట్లనుండి ఉత్పత్తిచేయు నూనెలు. ఆవశ్యక నూనెలలో అత్యధిక భాగం మొక్కల/చెట్ల భాగాల నుండి అనగా ఆకులు, వేర్లు, కాండంల బెరడు, కాండం, పూమొగ్గలు, పూలరెమ్మలు, మరియు పళ్ల పైనున్న తొక్కలు (peels/skins) వంటి వాటిలో లభించును [2]. అతితక్కువగా కొన్ని రకాల ఆవశ్యక నూనెలను విత్తానాల నుండి తీయుదురు. వీటిని నూనెలని వ్యవహరించినను వీటిలో కొవ్వు ఆమ్లాలు వుండవు. ఆవశ్యక నూనెలు జలవికర్షణ (hydrophobic) లక్షణం కలిగి, నూనెలలో, హైడ్రొకార్బను సాల్వెంట్ లలో కరుగు లక్షణాలు కలిగి వుండును. ఆవశ్యక నూనె లన్నియు సువాసన కలిగిన నూనెలే. ప్రతి ఆవశ్యక నూనె తనకంటూ ఇక ప్రత్యేక వాసన కలిగి వుండును. ఆవశ్యక నూనెలలో ఒకటి రెండు మినగా యించి మిగతా నూనెలన్నియు తక్కువ బాష్పికరణ/మరుగు ఉష్ణోగ్రత వున్న నూనెలే.తక్కువ ఉష్ణోగ్రత వద్దనే బాష్పీకరణ చెందు ద్రవాలను ఒలటైలులు (volatiles) అంటారు. ఆవశ్యకనూనెలను మొక్కల/చెట్ల యొక్క ఎసెన్సు (Essence=సారం) లు అని కూడా అంటారు. ఆవశ్యక నూనెలు సువాసన భరితాలు కావటం వలన అనాదిగా వీటిని సువాసన/సుగంధ ద్రవ్యాలు/నూనెలుగా (perfumes), సౌందర్య లేపనాలలో/నూనెలలో (cosmetics) విరివిగా వాడెవారు. అలాగే సుధూప (incense) ద్రవ్యాలను (అగరుబత్తి, గుగ్గిలం, సాంబ్రాణి, వంటివి) కూడా ఆవశ్యక నూనెల నుండి తయారు చేసెవారు. దేశియ వైద్యవిధానాలలో దేహబాధ నివారణ (కండరాల, కీళ్ళ నొప్పులు) కై మర్ధన నూనెలుగా కొన్ని ఆవశ్యక నూనెలను ఉపయోగించెవారు. కొన్ని రకాల చర్మ వ్యాధులకు ఆవశ్యక నూనెలను వినియోగించెవారు. ఈ మధ్యకాలంలో అరోమ థెరపి (aromatherapy) అనే ప్రత్యాన్యమయ వైద్య విధానం ఒకటి బాగా ప్రాచర్యం పొందినది. ఈ అరోమ థెరపి[3]లో ఆవశ్యక నూనెలను వాడెదరు. క్రీస్తుకు పూర్వం 1800సంవత్సరంనాటీకీ ఆవశ్యకనూనెలను అరోమా థెరఫిలో ఉపయోగించినాట్లు తెలుస్తున్నది.భారతదేశంలో ఆయూర్వేదవైద్యంలోకూడా కొన్నివందలసంవత్సరాలుగా వాడిన దాఖాలాలు కన్పిస్తున్నాయి. క్రీ.పూ.2880నాటికే గ్రీసు, రోములలో పురాతన ఈజిప్టు పాలకుడు ఖుఫు (khufu) పాలనకాలంనాటికే సుగంధద్రవ్యాలలో, అవశ్యకపునూనెలను కలిపి ఉపయోగించినట్లుగా తెలుస్తున్నది[4]
జామ చెట్టు
జామ లేదా జామి (ఆంగ్లం Guava) మిర్టేసి కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు. భారతదేశంలో ఒక సాధారణమైన ఇంట్లో పెరిగే చెట్టు. దీనిని తియ్యని పండ్లకోసం పెంచుతారు. జామ పండ్లలో కొన్ని తెల్లగా ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి.జామ మొక్కలు మిర్టిల్ కుటుంబానికి చెందిన సిడియం కోవకు చెందిన మొక్కలు. శీతోష్ణస్థితి బట్టి 100 వేర్వేరు రకాలుగా లభ్యమవుతున్నాయి. ఇవి మెక్సికో, మధ్య మరియు దక్షిణ అమెరికాలకు జాతీయ మైనవి.ఇది పలు కొమ్మలనుకలిగిన బహు వార్షిక చెట్టు.ఆకులు దీర్ఘ అండాకారంగా వుండి, ప్రత్యేకమైన ఘాటైన వాసన, రుచి కల్గి వుండును.ఆకులను నమిలిన కొద్దిగా వగరు రుచిగా వుండును.
జామ ఆకులు పలు రసాయనాలను, యాంటీ ఆక్సీడెంటులను కలిగి ఉన్నాయి.అంతేకాదు సహజ టానిన్ కూడా కల్గి ఉంది.జామ ఆకుల రసాన్నివీరేఛనాలను అరికట్టుటకు, దయాబేటీస్ నియంత్రణకు, దగ్గు నివారణకు, మరియు కాన్సరు నిరోధకానికి ఉపయోగిస్తారు.అలాగే జామ ఆకుల నూనెవలన పలు వైద్య ఉపయోగాలు.[5].జామ ఆకుల్లో టానిన్ 10% వరకు వుండును. టానిన్నీటిలో కరుగును. అయినా స్టీము దిస్టిలేశన్ పద్ధతిలో టానిన్ పొందలేము.అందువలన ఆకు రసాన్ని వాడినపుడు మాత్రమే టానిన్లు లభించును.
జామ ఆకులు పలు రసాయనాలను, యాంటీ ఆక్సీడెంటులను కలిగి ఉన్నాయి.అంతేకాదు సహజ టానిన్ కూడా కల్గి ఉంది.జామ ఆకుల రసాన్నివీరేఛనాలను అరికట్టుటకు, దయాబేటీస్ నియంత్రణకు, దగ్గు నివారణకు, మరియు కాన్సరు నిరోధకానికి ఉపయోగిస్తారు.అలాగే జామ ఆకుల నూనెవలన పలు వైద్య ఉపయోగాలు.[5]
జామ ఆకుల నూనె
జామ ఆకుల నుండి ఆవశ్యక నూనెను స్టీము డిస్తిలెసను ద్వారా సంగ్రహిస్తారు. జామ ఆవశ్యక నూనెను 5-7 సంవత్సరాలు నిల్వ వుంచవచ్చు.నూనె మింట్ వంటి వాసన కల్గి ఉంది.2010 లో ఇంటర్నేసల్ జర్నల్ ఆఫ్ పార్మాస్యూటికల్ రీచర్చిలో యాంటీ ఫంగల్ గుణాలను కలిగి వున్నదని క్లినికల్ టెస్ట్ లో రుజువు అయ్యిందని ప్రకటించారు. అలాగే 2012లో థాయ్ కి చెందిన ఒక పరిశీలనలో జామ ఆకుల నూనె యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ మైక్రో బియాల్ గుణాలను కల్గివున్నదని తెలిసింది.జామ ఆకులు పలు రసాయనాలను, యాంటీ ఆక్సీడెంటులను కలిగి ఉన్నాయి.అంతేకాదు సహజ టానిన్ కూడా కల్గి ఉంది.జామ ఆకుల రసాన్నివీరేఛనాలను అరికట్టుటకు, దయాబేటీస్ నియంత్రణకు, దగ్గు నివారణకు, మరియు కాన్సరు నిరోధకానికి ఉపయోగిస్తారు.అలాగే జామ ఆకుల నూనెవలన పలు వైద్య ఉపయోగాలు.
జామ ఆకుల నూనె రసాయన పదార్థాలు
నూనెలో మోనో టేర్పేనులు, ఆక్సైడులు, సెశ్కుయి టేర్పేనులు అడికంగా ఉన్నాయి.దిగువ పట్టికలో వాటివివరాలు ఇవ్వబడినవి.[6]
వరుస సంఖ్య | రసాయన పదార్థం | శాతం |
1 | Sesquiterpenes | 37.29%) |
2 | Monoterpenes | 35.94%) |
3 | Other | 8.58%) |
4 | Oxides | 8.44%) |
5 | Sesquiterpenols | 7.72% |
6 | Monoterpenols | 1.35%) |
7 | Aliphatic Aldehydes | 0.43%) |
8 | Ketones | 0.25% |
జామ ఆకుల నూనె వినియోగం
పలురకాలలుగా వైద్యంలో ఉపయోగిస్తారు.[5]
- ఏనాల్జేసిక్ (Analgesic)
- యాంటీ బాక్టీరియాల్ (Antibacterial)
- యాంటీ ఫంగల్ (Antifungal)
- యాంటీ ఇన్ప్లమేటరీ (Anti-inflammatory)
- యాంటీ మైక్రో బియాల్ (Antimicrobial)
- యాంటీ ఆక్సిడెంట్ (Antioxidant)
- యాంటీ సెప్టిక్ (Antiseptic)
- యాంటీ స్పాస్మోడిక్ (Antispasmodic)
- యాంటీ వైరల్ (Antiviral)
- ఆస్ట్రీజెంట్Astringent (topical)
ఇవి కూడా చూడండి
మూలాలు
- ↑ "Psidium". Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2009-01-27. Retrieved 2010-03-03.
- ↑ http://www.aromaweb.com/articles/whatare.asp
- ↑ http://www.essentialoils.co.za/essential-oil.htm
- ↑ http://voices.yahoo.com/history-essential-oils-their-medical-847407.html?cat=5
- ↑ 5.0 5.1 5.2 "Guava Leaf Essential Oil". monq.com. https://web.archive.org/save/https://monq.com/eo/essential-oil/guava-leaf/. Retrieved 05-08-2018.
- ↑ "Guava Leaf Essential Oil". stillpointaromatics.com. https://web.archive.org/web/20161229163844/https://www.stillpointaromatics.com/guava-leaf-Psidium-guajava-essential-oil-aromatherapy. Retrieved 05-028-2018.