"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

జీడి సొన

From tewiki
Jump to navigation Jump to search

పచ్చిగా ఉన్న కాయ తొడిమను తుంచినపుడు తొడిమ తుంచిన కాయ భాగం నుంచి ఒక రకమైన ద్రవం వస్తుంది. ఈ ద్రవాన్ని జీడి లేక సొన లేక జీడి సొన అని అంటారు.

కాయ రక్షణ కొరకు

పండుగా మారక ముందే కాయలను పక్షులు లేక మనుషులు తినకుండా ఉండటానికి చెట్టు కాయ రక్షణ కొరకు యాసిడ్ వంటి ద్రవాన్ని కాయకు రక్షణ కవచంగా ఉత్పత్తి చేసి కాయ భాగంలో దాచుకుంటుంది. ఈ ద్రవం కొన్ని రకాల క్రిముల నుంచి కాయ చెడి పోకుండా కాపాడుతుంది.

జీడి సొన వలన గాయాలు

కొందరు జీడి సొన వలన గాయాలవుతాయని తెలియని వారు ముఖ్యంగా పిల్లలు పచ్చి మామిడి కాయలను సొన అవుతునప్పటి వాటిని తింటారు. ఈ జీడి సొన అయిన శరీర భాగం లందు ముఖ్యంగా పెదవుల వద్ద పై చర్మం ఊడి పోయి గాయాలవుతాయి.

మార్కెట్ కు తరలించేటప్పుడు

జీడి సొన వలన కాయలపై ముఖ్యంగా మామిడి కాయలపై మరకలు ఏర్పడి కాయలు దెబ్బ తినే సందర్భంలో సొన (రసిక) కాయలపై పడకుండా ఉండేందుకు తొడిమలను అంగుళం పొడవు ఉండేలా కత్తిరించుకోవాలి. అలాగే జీడి సొన కారుతున్నంత సేపు కాయలను బొర్లా ఉంచి తరువాత వాటిని వరుసలలో పేర్చి మార్కెట్ కు తరలించాలి. ఈ విధంగా తొడిమ తోటి కాయలను కోయటం వలన కాయలు ఎక్కువ సమయం నిలువ ఉంటాయి.