"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

జెల్లీఫిష్

From tewiki
Jump to navigation Jump to search

Jellyfish
Chrysaora quinquecirrha.JPG
Chrysaora fuscescens
Scientific classification
Kingdom:
Phylum:
Subphylum:
Medusozoa

Petersen, 1979
Classes

మూస:Taxonbar/candidate

జేల్లిఫీష్ (జేల్లీస్ లేదా సి జెల్లీ లేదా మేడుసోజోవా )అనేవి ఫైలం సిన్డేరియా వర్గానికి చెందిన జలచరాలు. జెల్లీఫిష్ పలు విభిన్నమైన సిన్దేరియాన్ తరగతులకు చెందిన జీవ శాస్త్రాలను సూచిస్తుంది.వీటిలో కొన్ని ;సైఫోజోవా (200 పైగా జాతులు),స్టరోజోవ (50 పైగా జాతులు),క్యూబోజోవా (సుమారు 20 జాతులు) మరియు హైడ్రోజోవా (దాదాపు 1000 - 1500 జెల్లీఫిష్ గా రూపాంతరం చెందేవి మరియు చెందనివి)[1][2] ఈ వర్గాలలో గల జెల్లీ ఫిష్ వరుసగా సైఫోమెడూసా, స్తారోమేదూసా, క్యూబోమేదూసా, మరియు హైద్రోమేడూసాగా పిలువబడుతుంది. జెల్లీఫిష్ లు అన్నీ మేడుజోవా ఉప-ప్హిలం చెందినవే. మెడూసా అనేది జేల్లీఫీష్ కు మరో పేరు. ఈ పదాన్ని జెల్లీ-ఫిష్ జీవనచక్రంలో ప్రౌఢ దశను సూచిస్తుంది.

జెల్లీ ఫిష్ ప్రతి మహా సముద్రంలోనూ మరియు సముద్రపు లోతు/ ఉపరితలంలోను కనిపిస్తుంటాయి. కొన్ని హైడ్రోజోవాకు చెందిన జెల్లీఫిష్ లు లేదా హైద్రోమేదూసా మంచి నీటిలో కూడా కనబడుతుంటాయి. మంచి నీటిలో కనిపించే జెల్లీ ఫిష్ ఒక అంగుళం (25mm) వ్యాసార్ధం కలిగి, రంగులేని మరియు ముళ్ళు లేనివిగా వుంటాయి. బాగా ప్రాచుర్యం పొందిన జేల్లీఫీష్ అరేలియా సైఫోమెడూసా కు చేదినవి పెద్దవిగానూ,తరచూ రంగులలో కనబడే ఈ జేల్లీఫీష్ సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా తీర ప్రాంతాలలో కనబడుతుంది.

వివరంగా చెప్పుకోవాలంటే జెల్లీ ఫిష్ సాధారణంగా ఫైలం క్లేనోఫోరా జాతులకు చెందినదిగా భావించబడినది. సిన్దేరియాన్ జేల్లీఫీష్ పూర్తిగా సంభందిచకపోయినా ,క్తెనోఫోరేస్ లు కూడా నిలువుగా ఈదగల మాంసాహారి. పారదర్సాకంగా కనిపించే ఈ చేప ప్రపంచ మహా సముద్రాల లోతుల్లో సంచరిస్తుంటుంది.

లయన్స్ మనే జెల్లీఫిష్‌లు అతి పెద్ద జెల్లీ ఫిష్, చెప్పాలంటే ప్రపంచం లోకెల్లా[3][4][5] అతి పెద్ద జంతువు.

పరిభాష

జేల్లీఫీష్ వాస్తవానికి చేప కాదు .జేల్లీఫీష్ అనే పదం తప్పుగా ఆపాదించబడిన పేరు.అమెరికాలోని చేపల పెంపక కేంద్రాల వారు తరచుగా జేల్లీస్ పదాన్ని లేదా సముద్ర జేల్లీస్ వాడడంతో వీటికి [6] ఈ పేరు వచ్చినది. ఉపయోగకరంగాను, అందంగాను ప్రాముఖ్యకరంగానూ కనపడే జేల్లీస్ పేరు కన్నా, ఒక దశాబ్ద[7] కాలం కన్నా ఎక్కువ కాలంగా తరచూ ఉపయోగిస్తున్న జేల్లీఫీష్ పేరునే కొందరు కోరుకుంటున్నారు. జెల్లీఫిష్ అనే పేరు వివిధ,విభిన్న రకాల సిన్ద్దేరియన్స్ ను తెలియజెప్పేందుకు ఉపయోగించబడుతున్నది. దీని శరీర నిర్మాణం ఒక గొడుగు లాగ కనిపిస్తుంది.సైఫోజోయన్స్,స్తారోజోయన్స్ (స్తల్కేడ్ జెల్లీ ఫిష్), హైద్రోజోయన్స్ మరియు క్యూబోజోయన్స్ (బాక్స్ జేల్లీఫీష్) కూడా ఇలాగే ఉంటాయి. కొన్ని ఆచ్చు పుస్తకాలలో మరియు వెబ్సైట్లలో సైఫోజోయన్స్ ను 'నిజమైన జేల్లీఫీష్'[8][9] అని పేర్కొన్నాయి.

విస్తృతమైన ఉపయోగంలో భాగంగా కొంత మంది శాస్త్రవేత్తలు అప్పుడప్పుడూ క్తెనోఫోర (దువ్వెన ఆకారపు జేల్లీస్) జాతులను కూడా [10] జేల్లీఫీష్ ఉదహరించేటప్పుడు పేర్కొంటారు. కొందరు ఇతర శాస్త్రవేత్తలు అన్నివిధాల కలిసివచ్చే 'జిలాటినస్ జూప్లన్క్తాన్ ' ఉపయోగించడాన్ని కోరుకుంటున్నారు.నీటిలో తిరుగాడే సున్నితమైన శరీరాకృతి గల జలచరాలను[11] ఉదహరించేతప్పుడు ఈ పేరునే వాడుతుంటారు.

ఒక జేల్లీఫీష్ సమూహాన్ని బ్లూం లేదా స్వార్మ్[12] అని పిలువబడుతున్నది. సాధారణంగా తక్కువ వైశాల్యంలో ఎక్కువగా గుమికూడీ ఉండే జేల్లీఫీష్ సముదాయాన్ని'బ్లూం' అని అంటారు. దీనికి ఒక కాల పరమాణం,ఋతువుల వారీగా పెరుగదల పేర్కొనేటప్పుడు,లేదా ఊహించిన[13] దానికన్నా ఎక్కువగా ఉన్నపుడు, ఈ పదాన్ని ఉపయోగిస్తారు. జేల్లీఫీష్ సహజంగానూ తమ జీవన చక్రపు దశల వారీగా 'మెరుపులీనుతూ' కనబడుతూ,తక్కువ నీరుగల ప్రాంతంలో దట్టంగా ఉత్పత్తి అవుతాయి, ముఖ్యంగా వర్షాకాలంలో సూర్యరశ్మి పెరిగినపుడు మరియు పాచి పట్టడం పెరిగినపుడు వీటి ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి ఇవి ఆకస్మాతుగాను మరియు ఎక్కువ సంఖ్యలోను, పర్యావరణ సమతుల్యం[14] ఉన్నపుడు కనిపిస్తుంటాయి. 'స్వార్మ్;అంటే కలిసి ఉండేందుకు ఒక విధమైన చురుకైన సామర్ధ్యం. అరేలియా, ది మూన్ జెల్లీ,లాంటివి ఈ విధంగా అగుపించును[15].

జేల్లీఫీష్ కు తమ రెండవ జీవనచక్రం దశ ఉంటుంది. దీనినే పాలిప్ దశ అంటారు. ఒకే పాలిప్స్ ఒకే ఫలదీకరణ పొందిన గ్రుడ్డు నుండి వెలువడుతున్నపుడు మల్టిపుల్-పాలిప్-క్లస్టర్ గా వృద్ది చెందుతాయి.ఇవి ఒకదానికొకటి స్తోలన్స్ అనే పదార్ధంతో కలుపబడిన వీటిని కలోనియల్ అని పిలువబడును., కొన్ని పాలిప్స్ కనవ్రుద్ది చెందలేవు మరియు వీటిని 'ఏకాకి'జాతులనీ[16] అంటారు,

శరీరనిర్మాణ శాస్త్రం

దస్త్రం:Cross section Olindias formosa en.svg
జెల్లీఫిష్ ఒలిండియాస్ ఫార్మోస యొక్క అడ్డు కోత, మేడుస దశలో ఉన్న జెల్లీఫిష్ యొక్క శరీర నిర్మాణాన్ని వర్ణిస్తుంది.

జెల్లీ ఫిష్ కు ప్రత్యేకమైన జీర్ణక్రియ,మొప్పల ద్వారా స్వాసించుట కేంద్ర నాడీ విధానము,,శ్వాసక్రియ ప్రసరణ క్రియలు ఉండవు. జీర్ణాశాయం లోని చర్మపు పొర ద్వారా జీర్ణక్రియ జరుగుతుంది. ఈ పొర పోషకాలను పీల్చుకుంటుంది. వీటికి శ్వాసించే ప్రక్రియ అవసరం లేదు. ఎందుకంటే వీటి చర్మము చాలా పలుచగా ఉండుట చేత నిశ్వాసం ద్వారా ప్రాణవాయువు నింపబడుతుంది. వీటి చలనానికి పరిమితమైన కట్టడి ఉంటుంది. సమతౌల్యంగా ఉండే వీటి ఎముకల సమూహంను కుచించడం ద్వారా కలిగే వత్తిడితో గంట ఆకృతిలో ఉండే వీటి శరీరానికి ముందుకు చలనం కలుగుతుంది. కొన్ని జాతులు ఎక్కువ సమయం చురుకుగా ఈదుతుంటాయి. మరి కొన్ని ఎక్కువ సమయం[ఉల్లేఖన అవసరం] సాధారణంగా ఉండిపోతాయి. జెల్లీ ఫిష్ లలో ఎక్కువ భాగం నీటితో కూడినవే. గొడుగు ఆకారంలో ఉండే వీటి శరీరం జిగటగా ఉంటుంది. ది జెల్లీ - అంటే మేసోగ్లియా, రెండు పొరల ఎప్తీలియాల్ కణజాలంతో చుట్టి ఉంటుంది. ఈ కణజాలమే గౌడుగు ఆకారంగాను మరియు గంట క్రింద భాగం గల శరీరంలా కనపడుతుంది.

జెల్లీ ఫిష్ కు మెదడు గాని కేంద్ర నాడీమండలం గాని ఉండవు. కాని వదులుగా ఉండే నరాల కలయికలు చర్మపు పై పొరలలో ఉంటాయి. వీటినే 'నరాల వల' అని అంటారు. జెల్లీ ఫిష్ అనేక ఉపద్రవాలతో పాటు ఇతర జంతువుల స్పర్శను కూడా ఈ నరాల వల ద్వారా పసికడుతుంది. ఆ తర్వాత ఈ సంకేతాలను నరాల వల ద్వారా మరియు వలయాకారపు నరమునకు, జేల్లీఫీష్ శరీరం అంచున ఉండే ర్హోపలియాల్ లప్పేట్ ద్వారా ఇతర నరాలకు పంపబడును. కొన్ని జేల్లీఫీష్ లు చిన్న కళ్ళు కలిగి,వెలుతురుని గుర్తించగల అవయవాలను కలిగి ఉంటాయి. ఇవి రూపాలను పసిగట్టలేవు గాని, వెలుతురును గుర్తిస్తాయి. పై నుండి కింది వరకు నీటి ఉపరితలం పై ప్రకాశించే సూర్య కాంతికి ప్రతిస్పందిస్తూ ఉంటాయి. ఇవి సాధారణంగా రంగు గల చిన్న కళ్ళు కవి. వీటిలో కొన్నింటికి (అన్నింటికీ కాదు) కణజాలం రంగు కలిగి ఉంటుంది.

జెల్లీ ఫిష్ సమూహాలు

నల్లని నేపథ్యంలో వెలుగులు విరజిమ్ముతున్న మూన్ జెల్లీ యొక్క ఛాయాచిత్రం జెల్లీ తన శరీరంలో దాదాపుగా 2/3 శాతానికి విస్తరిస్తున్న ఘన తెలుపు పదార్ధాన్ని కలిగి ఉంది.
Aurelia sp., occurs in large quantities in most of the world's coastal waters. Members of this genus are nearly identical to each other.

సముద్రంలో జెల్లీ ఫిష్ సమూహాలు ఋతువుల వారీగా కనపడుతుంటాయి. లభ్యమయ్యే ఆహారానికి, పెరుగుతున్న ఉష్నోగ్రతలకు మరియు సూర్యరశ్మికి ప్రతిస్పందనలు చూపుతాయి. సముద్రపు వేడిమి జెల్లీ ఫిష్ లను స్వార్మ్స్ లేదా బ్లూమ్స్ గా వందల లేదా వేల సంఖ్యలో సమీకరించబడతాయి. దీనితో పాటు, కొన్ని సమయాలలో సముద్రపు వేడిమికి అనుసరించి బ్లూమ్స్ అసాధారణంగా అత్యధిక సంఖ్యలో కొన్ని సంవత్సరాలలో పెరిగిపోతుంటాయి. బ్లూం ఏర్పడటం అనేది క్లిష్ట విధానము. ఇది సముద్రపు వేడిమి, పోషకాలు,ఉష్ణోగ్రతలు,ఆహార లభ్యత మరియు ప్రాణ వాయువు కేంద్రీకరణల మీద ఆధారపడి ఉంటుంది. జెల్లీ ఫిష్ ప్రాణ వాయువు తక్కువగా గల నీటిలో పోటీదారు జాతులకన్న బాగా జీవించగలవు. అంతే గాక పాచి పట్టిన ప్రదేశంలో పోటీ లేకుండా జీవించగలవు. జెల్లీ ఫిష్ ఉప్పు నీటిలో కూడా సౌకర్యాన్ని పొందగలవు. ఎందుకంటే ఉప్పు నీటిలో ఎక్కువ ఇయోదిన్ ఉంటుంది. తద్వారా పాలిప్స్ జెల్లీ ఫిష్ గా మారేందుకు వీలవుతుంది. వాతావరణ మార్పుల వలన పెరిగే సముద్ర ఉష్ణోగ్రతలు కూడా జెల్లీ ఫిష్ బ్లూంకు దోహద పడుతాయి. ఎందుకంటే జెల్లీ ఫిష్ లోని కొన్ని జాతులు వెచ్చని నీటిలో[17] కూడా బాగా బతకగలవు. జెల్లీ ఫిష్ లు ఉండే బ్లూమ్స్ లలో గణనీయమైన సంఖ్యలో దాదాపు 100000 సంఖ్య వరకు ఉంటాయి.

ప్రజల 'అభిప్రాయాలతో' బాటు ప్రపంచంలో కెల్లా మార్పులు చోటు చేసుకున్న జెల్లీ ఫిష్ సంబంధించిన మొత్తపు సంఖ్య పరమైన వివరాలు చాలా తక్కువ. శాస్త్ర వేత్తల వద్ద జెల్లీ ఫిష్ సంఖ్య[14] సంబంధించిన ప్రస్తుత లేదా చారిత్రిక వివరాలు శాస్త్రవేత్తల వద్ద చాలా తక్కువగా ఉన్నాయి. ఇటీవల జెల్లీ ఫిష్ సంఖ్యలోని పెరుగుదల ఊహాగానాలు ఆధారపూరితమైనవి కావు.

విశ్వవ్యాప్తంగా జెల్లీ ఫిష్ బ్లూం లలో సంఖ్య పెరుగుదల ప్రజా స్పందన అనుసరించి ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో జేల్లీఫీష్ ప్రస్తుతం ఎక్కువ చేపల మయమైన ఇతర జలచరాలు కలిగించే పర్యావరణ కాలుష్యాలను నివారిస్తున్నట్లు ఒక భావన ఉంది. కానీ ఈ అభిప్రాయానికి ధ్రువీకరించే వివరాలు[14] అందుబాటులో లేవు. జేల్లీఫీష్ పరిశోధకుడు అయిన మార్ష్ యంగ్ బ్లూత్ వివరించిన ప్రకారం, జేల్లీఫీష్ చిన్న పెద్ద చేపలను ఆహారంగా తీసుకుంటుంది, కాబట్టి సమీకరణలో చేపలను గనుక తీసివేసినట్లయితే, జెల్లీ ఫిష్ ప్రవేశం[18] జరుగుతుంది.

కొన్ని జెల్లీ ఫిష్ సంఖ్య దశాబ్దాలుగా 'దండెత్తే' జాతులు పెరుగుతున్న సూచనలు స్పష్టం తెలుస్తుంది. ఈ జాతులు ముఖ్యంగా ఇతర ఆవాసాలైన నల్ల సముద్రం, క్యాస్పియన్ సముద్రం, ఈజిప్ట్ మరియు ఇజ్రాయిల్ లోని తూర్పు మధ్యధరా సముద్రపు తీరం, మరియు గల్ఫ్ అఫ్ మెక్సికో[ఉల్లేఖన అవసరం]లోని అమెరికన్ తీరప్రాంతం నుండి వచ్చినవి ఉదహరించుకోవచ్చు. ఈ దండెత్తే జాతులు వేగంగా విస్తరిస్తాయి. ఎందుకంటే వీటి పెరుగుదల నివారించగల, కొల్లగొట్టే సహజ జాతులు వీటిలో ఏవీ లేవు. ఆ విధమైన బ్లూంలు చేపలు అధికమవడం లేదా ఇతర పర్యావరణ సమస్యలను ప్రతిబింబింపవలసిన అవసరం లేదు.

అధికమైన పోషకాలు, వ్యవసాయ వ్యర్ధాలను రాబోయే జేల్లీఫీష్ ల పెరుగుదల కారకాలుగా అనుకోవచ్చు. 'పర్యావరణ విధానాలలో అత్యధికమైన స్థాయిలలో పోషకాలు ఉండడంతో, ఇంద్రియ ప్రాణులకు ఇది ఆహారం కాగా, ఈ ఇంద్రియ ప్రాణులు జెల్లీ ఫిష్ కు ఆహారమౌతాయి' అని అలబామాలోని డాల్ఫిన్ ఐలాండ్ సి ల్యాబ్‌కు చెందిన మొంటి గ్రహం అంటాడు. కలుష్యవంతమైన నీళ్ళలో, తక్కువ ప్రాణవాయువు ఉంటుంది. అందుచేత సాధారణ చేపలు నివసించే వాటి కంటే తక్కువ ప్రాణ వాయువు కల నీరు జెల్లీ ఫిష్ పెరుగుదలకు అనుకూలవంతంగా ఉంటుంది. జేల్లీఫీష్ వృద్ది చెందటం అంటే, పర్యావరణ విధానం[18]లో ఏదో మార్పు రాబోతున్నట్లు భావించవచ్చు.

నమీబియన్ తీరం లోని అధికంగా చేపలు వృద్ది చేందిన ప్రాంతంలో సముద్ర జీవన సరళిని తరచి చూస్తె, జెల్లీ ఫిష్ ల సంఖ్య చేపల సంఖ్య కంటే అధిగమించినట్లు తెలిస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా నిరవధికంగా చేపలు పట్టడం కూడా ఇందుకు ఒక కారణం.

మెక్సికో లోని ఉత్తర గల్ఫ్‌లో జేల్లీఫీష్ బాధిత ప్రాంతాల గురించి గ్రహం ఇలా చెప్పాడు,"మూన్ జెల్లీలు విడుదల చేసిన ఒక విధమైన జిగురు లాంటి వల గల్ఫ్[18] ప్రాంతమంతటా ఈ చివర నుండి ఆ చివరి వరకు వ్యాపించింది.

హానికరమైన ప్రభావాలు

జెల్లీ ఫిష్ బ్లూంలు మానవాళికి సమస్యలు తెచ్చి పెడతాయి. ఇవి మనుషులను కుట్టడం వలన (కొన్ని సార్లు ప్రాణాంతకం కావచ్చు) అందువలన తీర ప్రాంతాలలో సందర్శకుల సంఖ్య తగ్గిపోవడం జరుగుతుంది.

చేపల వలలను నాశనం చేయడం, పట్టుకున్న చేపను విషవంతం చేయడం లేదా నలిపివేయడం మరియు చేపల గ్రుడ్లను మరియు చిన్న చేపలను[19] స్వాహ చేయడం మరొక హానికరమైన ప్రభావం.

ఆటంకపరచడం అనేది కూడా ఎన్నో సమస్యలను కలుగజేస్తుంది. న్యూక్లియర్ పవర్ ప్లాన్టులను మరియు నిర్లవనీకరణ ప్లాన్టులను ఆపుట,[19] ఓడల ఇంజన్లకు ఆటంకము కలుగజేయుట, మరియు పడవలను నోమురా జెల్లె ఫిష్‌లు తలక్రిందులు చేస్తాయి.

జీవిత చక్రం

ఏడు జెల్లీ స్పీషీస్ యొక్క రెండు జీవ దశల వర్ణన
The developmental stages of scyphozoan jellyfish's life cycle

జెల్లీ ఫిష్ వాటి జీవిత చరిత్రలో రెండు విభిన్న జీవిత చరిత్ర (శరీర నిర్మాణము)దశలను పొందుతుంది. మొదటి దశను పాలిపాయిడ్ దశ అంటారు. ఈ దశలో ఈ జంతువు చిన్న హైడ్రా లాగా, పోషణకు చిన్న టెన్టకిల్స్ ను కలిగి ఉంటాయి. ఈ పాలిప్ ససిలీ కావచ్చు. ఇవి తేలేదు వస్తువులు లేదా పడవ అడుగు భాగంలో లేదా బాగా తేలియాడుతున్న లేదా చెట్లకు ఆనుకొని ఉన్న [20] పాచిలో లేదా అరుదుగా,[21] చేపలు లేదా ఇతర వెన్నెముక గల ప్రాణుల పై జీవిస్తుంటాయి. పాలిప్స్ సాధారణంగా ఒక నోరు కలిగి, దాని చుట్టూ పై వైపుగా గల టెన్టకిల్స్ పైన చూపిన పాఠంలో లాగా, అన్తోజోవన్ పాలిప్స్ వలె (సి అనేమోన్స్ మరియు కోరల్స్) మరియు ఫైలం సిండారియాలాగా కనిపిస్తాయి. కొన్ని పాలిప్స్ ఒంటరి గాను లేదా సమూహాలుగాను మరియు వివిధ పద్ధతుల ద్వారా అలైన్గికంగాను ఉంటాయి. తద్వారా మరెన్నో పాలిప్స్ తయారవుతాయి. వీటిలో అనేకం అతి చిన్నవిగా మిల్లీ మీటర్ స్థాయిలో ఉంటాయి.

రెండవ దశలో చిన్న పాలిప్‌లు అలింగికంగా జెల్లీ ఫిష్ ను ఉత్పత్తి చేస్తాయి.ఇళ్ళ ఉత్పత్తి చేయబడిన ప్రతి దానిని మేడూసా అని పిలువబడుతుంది. చిన్న జెల్లీ ఫిష్ లు (సాధారణంగా ఒక మిల్లీమీటరు లేదా రెండు మిల్లీమీటరు) పాలిప్ నుండి ఈడుకొని పోయి ఆ తర్వాత పాచి[ఉల్లేఖన అవసరం] మీద ఆధారపడి పెరుగుతాయి. మేడూసాలు నిటారుగా అవయవములు కలిగి ఉంటుంది. గొడుగు ఆకృతిలో శరీరంతో ఉండడాన్ని బెల్ అంటారు. సాధారణంగా వరుసగా గుత్తిలా బెల్ చుట్టూ పోడుకోచ్చినట్లు ఉండే టెన్టకిల్స్ తో సరఫరా చెయ్యబడతాయి. కొన్ని జెల్లీ ఫిష్ జాతులకు జీవిత చక్రంలో పాలిప్ దశ ఉండదు, కానీ జెల్లీ ఫిష్ దశ నుండి తర్వాతి తరం జెల్లీ ఫిష్ దశకు గ్రుడ్ల ఫలదీకరణం ద్వారా నేరుగా అభివృద్ధి చెందుతాయి.

జెల్లీ ఫిష్ లు బహులింగాలు. అంటీ సాధారణంగా మగవి లేదా ఆడవి (అరుదుగా హీర్మాఫ్రాడిటిక్ జాతులు కూడా కనుగోనబద్దాయ్) చాలా సందర్భాలలో, రెండూ ఇంద్రియాన్ని మరియు గ్రుడ్లను చుట్టుపక్కల గల నీటిలోకి విడుదల చేస్తాయి. ఇక్కడీ (రక్షణలేని)గ్రుడ్లు ఫలదీకరణ పొంది సరికొత్త ప్రాణులుగా రూపాంతరం చెందుతాయి. కొన్ని జాతులలో, ఈ ఇంద్రియం ఆడ వాటి నోటిలోకి ఈదుకుంటూ వెళ్లి శరీరంలో గల గ్రుడ్లు ఫలదీకరణ పొంది అక్కడే అభువృద్ది ప్రారంభదశలో అడుగిడుతాయి. మూన్ జేల్లీస్ లో ఓరల్ ఆర్మ్స్ లో పెట్టబడిన గ్రుడ్లకు, ఈ ఓరల్ ఆర్మ్స్ లార్వాలుగా రూపాంతరం చెందేందుకు పొదగబడే ఒక తాత్కాలిక గూడు లాగా ఉపయోగపడుతుంది.

ఫలదీకరణ తర్వాత మరియు తొలిదశ పెరుగదల ప్రారంభమై,'ప్లానుల ' అనే లార్వాలు వృద్ది చెందుతాయి. పలనుల అనగా సీలియాతో కప్పబడిన ఒక చిన్న లార్వా. ఈ లార్వా ఒక స్థిరమైన ఉపరితలాన్ని అంటుకుని ఆ తర్వాత పాలిప్ గా వృద్ది చెందుతుంది. పాలిప్ ఒక కప్పు ఆకారాన్ని పోలి ఉంటుంది మరియు నోటి చుట్టూతా టెన్టకిల్స్ కలిగి ఉండి, ఒక చిన్న సముద్రపు మొక్క[ఉల్లేఖన అవసరం]ను పోలి ఉంటుంది. కొంత పెరుగుదల తర్వాత, ఈ పాలిప్ మొగ్గ తొడిగి అలైంగిక పునరుత్పత్తి ప్రారంభిస్తుంది. సైఫోజోవ అనే ఈ దశ సేగ్మేన్టింగ్ పాలిప్ లేదా సైఫిస్తోమ అని పిలువబడుతుంది. కొత్త సైఫిస్తోమాలు మొగ్గ తొడగడం ద్వారా లేదా కొత్తగా ఉత్పత్తి అవుతాయి. ఇవి పరిపక్వం చెందని ఈ జేల్లీస్ ఎఫయరా గా మారవచ్చు. కొన్ని జెల్లీ ఫిష్ ల జాతులు సరికొత్త మేడూసాలను నేరుగా మొగ్గ తొడగడం ద్వారా మెడూసన్ దశ నుండి ఉత్పత్తిని ప్రారంభించగలవు. జాతుల ననుసరించి మొగ్గ తొడిగే ప్రాంతాలు టెన్టకిల్ బల్బుల నుండి, ది మనుబ్రియం (నోటి పై గల)లేదా హైడ్రోమేడూసాల గోనాడ్స్ గా మారుతుంటాయి. కొన్ని హైడ్రోమేడూసాలు విచ్ఛిత్తి (సగంగా విడిపోవడం)[20] ద్వారా పునరుత్పత్తి పొందుతాయి.

జెల్లె ఫిష్ ల ఇతర జాతులు సాధారణంగాను మరియు ప్రముఖంగా వినిపించే జెల్లీ ఫిష్ విధ్వంసకాలు. ఇందులో కొన్ని జేల్లీస్ లో ప్రత్యేకమైనవి. ఇతర విధ్వంసకాలలో ట్యున, షార్క్ స్వోర్డ్ ఫిష్, సముద్ర తాబేళ్లు, మరియు కనీసం పసిఫిక్ సల్మాన్ నుండి ఒక జాతి ఉంటుంది. సముద్ర పక్షులు కొన్ని సమయాలలో జెల్లె ఫిష్ గంటల నుండి సిమ్బయాసి క్రస్తేషియన్స్ ను సముద్రపు ఉపరితలం నుండి తీసికుని వెళ్తుంటాయి. తప్పనిసరిగా పోషణకు గాను యమ్ఫోపాడ్స్ లేదా చిన్న ఎంట్రకాయలు మరియు పుట్టగొడుగుల మీద ఆధారపడి ఉంటాయి.

జెల్లీ ఫిష్ ల జీవిత కాలం విభిన్నంగా, కొన్ని గంటలు నుండి (కొన్ని చిన్న హైడ్రో మేడూసాల విషయంలో మాత్రం) కొన్ని నెలల వరకు మాత్రమే ఉంటుంది. జీవితకాలం మరియు పరిమాణం జాతుల బట్టి మారుతుంటుంది. ఒక అసాధారణమైన జాతి దాదాపు 30 సంవత్సరాల పాటు జీవిస్తుందని తెలియవచ్చింది. మరో జాతిడైన జెల్లీ ఫిష్ తమ్ప్తోప్సిస్ దోహ్మీ అనే టి.న్యూట్రికుల మరణం లేనిది. ఎందుకంటే మేడూసా మరియు పలిప్ గా మారగల సత్తా ఉండడం మూలాన,[22] చావు నుండి తప్పించుకుంటూ ఉన్నది. అత్యధికంగా తీర ప్రాంతపు జెల్లీ ఫిష్ 2 నుండి 5 నెలల వరకు జీవిస్తుంది. ఈ సమయంలో ఒక మిల్లీ మీటరు నుండి రెండు లేదా ఎక్కువ సెంటి మీటర్ల వ్యాసార్ధం వరకు పెరుగుతాయి. ఇవి నిరవధికంగా ఆహారం తీసుకుని, స్థిరంగాను వేగంగాను సైసవ దశకు చేరుకుంటాయి. సైసవ దశకు చేరుకున్న తర్వాత, కావలసిన ఆహారం ఉన్నట్లయితే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. ఎక్కువ జాతులలో, గ్రుడ్లు పెట్టడం అనేది వెలుతురు ద్వారా కట్టడి చేయబడుతుంది. అందుచే గ్రుడ్లుపెట్టి పొదగడమనే ప్రక్రియ ఒకే రోజు జరుగుతుంటుంది. తరచూ సూర్యోదయం నుండి సూర్యాస్తమం[23] లోపు ఈ ప్రక్రియ జరుగుతుంది.

మానవ జీవితంలో ప్రాముఖ్యత

వంటలలో ఉపయోగాలు

పూర్తీ జెల్లీ ఫిష్ యొక్క ఛాయాచిత్రం
Cannonball jellyfish, Stomolophus meleagris, are harvested for culinary purposes

రైజోస్తోమా ఆర్డర్ జాతికి చెందిన సైఫోజోవన్ జెల్లె ఫిష్ మాత్రం ఆహారం కోసం కోతకు గురి చేయబడుతుంది. దాదాపు 85 జాతులలోని 12 జాతుల జెల్లె ఫిష్ లు కోత వేయబడి అంతర్ జాతీయ మార్కెట్లలో అమ్ముడుపోతుంటుంది. ఈ కోత ఎక్కుగాగా దక్షిణ తూర్పు ఆసియా[24] లో జరుగుతుంది. ముఖ్యంగా ర్హోపిలేమాఎస్కులేంటం అని చైనాలో పిలువబడే రైజోస్తోమేస్(చైనా పేరు海蜇 హీజీ , దాని అర్ధం సముద్రపు కొండి) మరియు స్తోమోలోఫాస్ మేలజిన్స్ (క్యానన్ బాల్ జెల్లీ ఫిష్ )యునైటెడ్ స్టేట్స్ లో ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే అవి పెద్దవిగాను మరియు గట్టిగా ఉండటంతో బాటు వాటిలో గల టాక్సిన్లు మనుషులకు[25] హాని కలుగజేయవు.

ప్లేట్ పై బంగారు రంగు గీతాలు ఉన్న జెల్లీ ఫిష్ యొక్క ఛాయాచిత్రం
Jellyfish strips in soy sauce, sesame oil, and chili sauce

జెల్లీ ఫిష్ మాస్టర్లు అనుసరించే సంప్రదాయ తయారీ విధానాలు, 20 నుండి 40 రోజుల బహుళ దశల వారీగా అనుసరించబడుతుంది. జెల్లె ఫిష్ లో గోనడ్స్ మరియు మ్యూకస్ పొరలను వేరు చేసిన తర్వాత అమ్బరెల్ల మరియు ఓరల్ ఆర్మ్స్ లను సాధారణ ఉప్పు మరియు పటికలతో సుద్ది చేయబడి, గట్టిగా వత్తి పెట్టబడును[25]. వీటిని పక్వం చేయడం అంటే, నీటిని వేరుచేయడం, వాసనలు రాకుండా చేయడం, బూజు పట్టకుండా ఉండేటట్లు చేయడం మరియు జెల్లె ఫిష్ ను పులుపుగాను, కర కర మంటూ పెళుసుగా ఉండే విధమైన రూపానికి[25] తేవడం అన్న మాట. ఈ విధంగా పక్వం చేయబడిన జెల్లె ఫిష్ 7% నుండి 10 శాతం వరకు వాటి బరువును కోల్పోవు మరియు పక్వం చేయబడి వస్తువు రమారమి 94 శాతం నీరు మరియు 6 శాతం మాంసకృత్తులు[25] కలిగి ఉంటాయి. తాజాగా పక్వం చేయబడిన జెల్లె ఫిష్ తెల్లగాను, క్రీము రంగులో ఉంటుంది. ఎక్కువ కాలం నిలువ చేసినచో పసుపు లేదా బ్రౌన్ రంగులోకి మారుతుంది.

ఈ విధంగా పక్వం చేయబడిన జెల్లె ఫిష్ లను నీటిలో ఒక రాత్రి పాటు నానవేయడం ద్వారా ఉప్పును వేరు చేసి ఆ తర్వాత వండి లేదా పచ్చిగానే చైనాలో తింటారు. వీటిని ముక్కలు చేసి, నూనె పూసి, సోయా సాస్, వెనిగర్ మరియు చక్కేర లేదా ఉప్పు కలిపిన కూరగాయలతో[25] వడ్డించబడుతుంది. జపాన్ లో సుద్ది చేయబడిన జెల్లి ఫిష్ ను గిలకొట్టి, ముక్కలు చేసి మరియు వెనిగర్ తో కలిపి ఆకలి పెంచే దినుసు[25][26] గా వడ్డించబడును. ఉప్పులేని, తినుటకు సిద్దంగా గల ఈ ఉత్పత్తులు కూడా లభిస్తాయి[25].

చేపల పెంపక కేంద్రాలు అమెరికన్ క్యానన్ బాల్ జెల్లీ ఫిష్ స్టోమోలోఫస్ మీలియాజిన్స్ ను, అమెరికాలోని దక్షిణ అట్లాంటిక్ తీరం వెంబడి, మరియు గల్ఫ్ అఫ్ మెక్సికోలలో ఆసియా[25] కు ఎగుమతి చేయడానికి పెంచడం ప్రారంభించినవి.

జీవసాంకేతికశాస్త్రంలో

సముద్రంలో ఉన్న జీవం కలిగిన జెల్లీ యొక్క ఛాయాచిత్రం
The hydromedusa Aequorea victoria

1961లో ప్రిన్-స్టన్ విశ్వవిద్యాలయంకు చెందిన ఒసము శిమొమురా గ్రీన్ ఫ్లోరసేంట్ ప్రోటీన్ (GFP ) మరియు అయికురిన్ అనే మరొక బయోల్యూమినేసేంట్ ప్రోటీన్ ను పెద్ద సంఖ్యలో మరియు అధికంగా ఉన్న హైద్రోమేడూసా అయికోరియ విక్టోరియా నుండి తీయగలిగాడు. జెల్లీ ఫిష్ జాతులచే బయోల్యూమినిసేన్సు కారణమైన ఫోటోప్రోటీన్స్ గురించి అధ్యనం జరుగుతున్నపుడు దీనిని కనుగొనగలిగారు. మూడు దశాబ్దాల తర్వాత వుడ్స్ హోల్ ఒషనోగ్రఫిక్ ఇన్స్టిట్యూషన్ కు చెందిన డగ్లాస్ ప్రషర్ అనే పోస్ట్ డాక్తరల్ శాస్త్రవేత్త పరిశోధించి GFP జన్యువును సృష్టించగలిగాడు. ఆ తర్వాత కొలంబియా యూనివర్సిటీకి చెందిన మార్టిన్ చాఫ్లీ GFP ని జన్యువుల యొక్క ఫ్లూససేంట్ మార్కెర్ కణాలలో లేదా కణజాలంలో ఎలా ప్రవేశపెట్టాలి అన్న విషయాన్ని వివరించగలిగాడు. యూనివెర్సిటీ అఫ్ కొలంబియాకు చెందిన రోగర్ ట్సీన్, సాన్ డియాగోలు ఆ తర్వాత ఫ్లోరెసెంట్ రంగులను మార్కర్లుగా ఉపయోగించేందుకు రసాయనికంగా GFP సృష్టించగలిగాడు. 2008 సంవత్సరంలో శిమొమురా, చాల్ఫీ మరియు ట్సీన్ లు GFP పరంగా వారి పనికి గాను రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించినది.

ఏ కణాలు లేదా కణజాలాలు పేర్కొన్న జన్యువులను తెలియజేస్తాయో అని తెలుసుకునేందుకు ,మనిషిచే సృష్టించబడిన ఈ GFP ని తరచుగా ఒక ఫ్లోరసేంట్ ట్యాగ్ వలె ఉపయోగించబడుతున్నది. ది జనేటిక్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనేది, జన్యువుల పట్ల శ్రద్ద , GFP జీన్ ను ఉత్తేజపరుస్తుంది. ఉత్తెజపరచబడిన DNA ఆ తర్వాత ఒక కణంలో ప్రవేశపేట్టబడి, ఒక కణ వరుసను లేదా (IVF ప్రక్రియ ద్వారా) పూర్తి జన్యువు కలిగిన జంతువును ఉత్పత్తి చేయబడుతుంది. కణంలో లేదా జంతువులో కృత్రిమమైన జన్యువు, అదే కణజాలంగా మరియు అదే సమయంలో సాధారణ జన్యువుగా మారుతుంది. కానీ సాధారణ ప్రోటీన్ ను తయారయ్యేందుకు బదులుగా, జీన్ GFPని తయారు చేయబడుతుంది. ఏ కణజాలం పేర్కొన్న ప్రోటీన్ ను తెలియజేస్తుందో -లేదా అభివృద్ధి ఏ దశలో ఉన్నదో, అనే విషయాన్ని జంతువు మీద కణం మీద వెలుగును ప్రసరింపజేసి ఫ్లూరేసేన్స్ ను గమనించవచ్చు. జీన్ ఎక్కడ వేలిబుచ్చబడినదో అనే విషయాన్ని ఫ్లూరేసేన్స్ తెలియజేస్తుంది[27].

జెల్లీ ఫిష్ ను మృదులాస్థి కోసం కూడా కోత చేయబడుతుంది. ఈ మృదులాస్థి కీళ్ళ నిప్పుల చికిత్స లాంటి ఎన్నో విధాలుగా ఉపయోగించబడుతుంది.

నిర్బంధంలో

క్రిందికి ఈదుతున్న జెల్లీల యొక్క ఛాయాచిత్రం
A group of Pacific sea nettle jellyfish, Chrysaora fuscescens, in an aquarium exhibit

పలు దేశాలలో జెల్లీ ఫిష్ ను జలచరసయాలలో ప్రదర్శనకు ఉంచబడుతున్నది. తరచూ ట్యాంక్ వెనుక వైపు నీలం రంగు కలిగి, అందులోని జలచరములు ప్రక్కన గల లైట్ల ద్వారా మిల ఇలా మెరుస్తూ ఉంటాయి. తద్వారా జలచరాలకు, వెనుక నీలం బ్యాక్ గ్రౌండ్ కు తేడా తెలిసిపోతుంటుంది. సహజ సిద్ద పరిస్థితుల్లో పలు జేల్లీస్ అసలు కనబడనంత పారదర్సకంగా ఉంటాయి.

పూర్తీగా మూసి వేయబడిన పర్తిశితి జెల్లె ఫిష్ లకు అనుకూలం కాదు. ఒక చోటి నుండి మరో చోటికి కదలడానికి వేడిమి మీద ఇవి ఆధారపడతాయి. ప్రావీన్యవంతమైన ప్రదర్శనల్లో క్లుప్తంగా నీటి పారుదల చోటుచేసుకుంటుంది. మూలల్లో జలచరాలు పట్టుబడి పోవడాన్ని నివారించేందుకు విభిన్నంగా గుండ్రని ట్యాంకులలో నీటి పారుదల ఉంటుంది. ఈ విషయంలో,ది మాన్టేరేరి బే అక్వేరియం వారు ఆధునీకరించబడిన క్రీసిల్ జర్మన్ లో 'స్పిన్నింగ్ టాప్) విధానాన్ని అమలుచేస్తారు. ఇళ్లలోని అక్వరియంలలో జెల్లె ఫిష్ ప్రాచుర్యం పొందుతున్నది. జెల్లీ ఫిష్ అక్వేరియాలు మరియు జెల్లె ఫిష్ లను ఇప్పుడు ఆన్ లైన్ [28][29]లో కొనుటకు వీలవుతుంది. స్వంత ప్రయోజనార్ధం[30] ఒకే జెల్లీ ఫిష్ అక్వేరియాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా ఇప్పుడు వీలవుతుంది.

మానవుల పై విషప్రభావం

అన్నీ జెల్లీ ఫిష్ లు తమ ఆహారాన్ని పొందడానికి, వాటి నేమతోసిస్తులను ఉపయోగిస్తాయి. కుట్టే అంగాలు ప్రత్యేకమైన కణములు ఐన సిండోసైట్స్ లలో నెలకొని ఉంటాయి. ఇవి సిన్దేరియా లక్షణములు. జెల్లీ ఫిష్ టెంటకిల్స్ ను తాకినచో, మిల్లియన్ల కొద్దీ నేమతోసిస్తులను ఉత్తేజపరచి చర్మాన్ని గుచ్చి తద్వారా విషాన్ని[31] లోపలకు పంపుతాయి. ప్రతర్ది లేదా జంతువు తాకితే, నేమతోసిస్తులు వేగవంతమై 2000 వత్తిడితో దాడి చేస్తాయి. నేమతోసిస్తూ లోని ఒక ముళ్ళు దాడికి గురౌతున్న జంతువు శరీరంలో గుచ్చుటతో శత్రువు[32] శరీరంలో విషం ప్రసరిస్తుంది. జెల్లీ ఫిష్ ను తాకుట లేదా తాకబడుట ఏంతో అసౌకర్యంగా ఉంటుంది. కొన్నిసార్లు వైద్య సహాయం కూడా అవసక్రమౌతుంది. కొండితో కుట్టుట వలన భయంకరమైన నొప్పి లేదా మరణం సంభవిస్తుంది. జెల్లె ఫిష్ కొండిల గురించి వివిధ ప్రత్సిపందల దృష్ట్యా, ఒత్తి శరీరంతో జెల్లె ఫిష్ ను తాకడం మంచిది కాదు. తీరంలోని మరియు చనిపోతున్న జెల్లె ఫిష్ కూడా తాకినప్పుడు కుట్టగలదు.

సిఫోజోవన్ కొండిలు తరచూ అసౌకర్యంగా ఉంటాయి. సాధారణంగా ప్రాణాంతకం కాకపోయినా, క్యూబజోవకు చెందిన కొన్ని జాతులు లేదా ది బాక్స్ జెల్లె ఫిష్ లు, ప్రాచుర్యం మరియు ముఖ్యంగా టాక్సిక్ ఇరుకాండ్జీ లాంటివి ప్రాణాంతకము అయినవి. కుట్టడం వాళ్ళ అపస్మారక స్థితి లేదా మరణం సంభవించవచ్చు. కాబట్టి ఈ భారిన పడినవారు వెంటనే నీటిలో నుంచి వైదొలగాలి. విషానికి విరుగుడు ఇవ్వడం వైద్య సహాయంలో ఒక భాగం.

జెల్లీ ఫిష్ లనుండి నిరపాయకరంగా ఉండాలంటే, మూడు పద్ధతులు. సహాయ చర్య అందజేసే వారు గాయపడటం నివారించుట, నేమతోసిస్తులను నిర్వీర్యం చేయుట, మరియు రోగికి అంటుకున్న టెన్టకిల్స్ ను నిర్మూలించుట మొదలగునవి. సహాయ చర్యలు అందించేవారు రఖిత దుస్తులు,ప్యాంటీ హోసే,మరియు శరీరమంతటా స్టింగ్ ప్రూఫ్ దుస్తులు ధరించాలి. నేమతోసిస్తులను నిర్వీర్యం చేయుట లేదా కుట్టే కణాలను నిర్వీర్యం చేయుట అనే చర్యలు మరింత విషాన్ని శరీరంలో పంపకుండా నివారించవచ్చు.

నీటిలో ఉన్న గొడుగు జెల్లీ యొక్క ఛాయాచిత్రం
Like many species of jellyfish, the sting of some species of Mastigias have no discernible effect on humans

వెనిగర్ (3 నుండి 10 శాతం అక్వియాస్ అసిటిక్ యాసిడ్ )బాక్స్ జెల్లె ఫిష్ కాట్ల[33][34] నుండి రక్షిస్తుంది కానీ పోర్చుగీస్ మ్యాన్ ఓ వార్ కుట్ల[33] నుండి కాదు. కంటి మీద లేదా చుట్టూత జెల్లె ఫిష్ కుట్టినప్పుడు, ఒక తువ్వాలుతో వెనిగర్ తో అద్ది కాళ్ళ చుట్టూత తుడవాలి. కానీ కను గ్రుడ్లు తుడవకూడదు. వెనిగర్ లభ్యం కానప్పుడు[33][35], ఉప్పు నీటిని కూడా ఉపయోగించవచ్చు. ఉప్పు నీటిలో జెల్లీ ఫిష్ కుట్టినపుడు, మంచి నీటిని వాడవద్దు. ఎందుకంటీ సాధారణ స్థితిలో మార్పు[36] వలన ఎక్కువ విషం విడుదల చేయబడుతుంది. గాయం పై రుద్దడం మానండి, ఆల్కహాలు ఉపయోగం, స్పిరిట్స్, అమ్మోనియ, లేదా యూరిన్ వలన [37] విషం విడుదలను పెంచుతుంది.

జెల్లీ ప్రాంతాన్ని శుభ్రపరచుట, టెంటకిల్స్ తేమ, నెమటో సిస్తుల ఉదృత[37] తగ్గిస్తుంది. కుట్టుకు గురైన చర్మాన్ని కత్తి అంచుతో, సేఫ్టీ రేజర్ తో క్షవరం చేయడం, లేదా క్రెడిట్ కార్డుతో శుభ్రపరచడం ద్వారా మిగిలిన నేమతోసిస్తులను[38] తీసివేయవచ్చు.

ప్రథమ చికిత్స కన్నా యాంటి హిస్తామిన్లు అయిన,దిఫెంహైద్రమిన్ (బెనడ్రిల్) చర్మపు అసౌకర్యాన్ని (ప్రురిటాస్)[38] కట్టుబడి చేస్తుంది. చర్మం లోని విషాన్ని హరించడానికి వంట సోడా మరియు నీటిని మరియు కుట్టిన[ఉల్లేఖన అవసరం] చోట ఒక గుడ్డను కప్పడానికి ఉపయోగించాలి. వీలయితే ఈ మిశ్రమాన్ని 15 నుండి 20 నిమిషాలకొకసారి పూయండి. ఐస్ లేదా మంచి నీటిని కుట్టిన చోట ఉపయోగించరాదు. ఎందుకంటే ఇవి నేమతో సిస్తులను నిరవధికంగా విషాన్ని[39][40] సరఫరా చేసేందుకు అవకాశమిస్తాయి.

2010లో న్యూ హ్యామ్ప్ షైర్ బీచ్ లో ఒకే ఒక లయన్స్ మేనే జెల్లీ ఫిష్ 125 నుండి 150 మందిని[41][42] కుట్టినది.

మీడియాలో జెల్లీ ఫిష్

జెల్లీ ఫిష్ మరియు దాని ప్రాచుర్యం గురించి కొత్తగా కనుగొన్న విషయం ఏమిటంటే, ఇవి సముద్రాలకు అందచందాలను అందిస్తుందని టెలివిజన్ కార్యక్రమాలు ప్రాచుర్యం చేస్తున్నాయి. 'జెల్లె ఫిష్ దండయాత్ర' అనేది నేషనల్ జియోగ్రాఫికల్ చానెల్ వారి డాక్యుమెంటరి ఎపిసోడ్. ఎక్సప్లోరర్ [43][44]లో ఆస్ట్రేలియా, హవాయి మరియు జపాన్ లోని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు చోటుచేసుకున్నాయి.

{{0}దిక్సీ ప్క్సర్ అనిమేటెడ్ ఫిలిం ఫైండింగ్ నేమో అనేది జెల్లీ ఫిష్ బ్లూంలో ఈతాడితే, దాని దుష్పరిణామాలు ఎలా ఉంటాయనేది చూపుతుంది.

టేక్సానమిక్ వర్గీకరణ విధివిధానాలు

టేక్సానమిక్ వర్గీకరణ విధివిధానాలు సిన్దోరియా ఇతర ఆర్గానిజాలు ఎల్లపుడు స్థిరంగా ఉన్నాయి. ఈ గ్రూపుల మధ్య సంబంధాని గురించ పరిసొధిన్కెహ్ చాలా మంది శాస్త్రవేత్తలు వీటికి ర్యాంకులను ఇచ్చేందుకు అంగీరరించుట లేదు. వీటి పూర్తీ ర్యాంకులతో నిమిత్తం లేకుండా ఈ వివిధ గ్రూపుల పరంగా ఒక సాధారణ ఒప్పందం ఉంది. ఇక్కడ ఒక స్కీము అందించబడి యున్నది. దీని ప్రకారం మేడూసాలను (జెల్లీ ఫిష్ ) ఉత్పత్తి చేసే అన్నీ గ్రూపులు పలు నిపుణులు అందించిన వివరాల ప్రకారం ఈ స్కీము అందించబడింది.

ఫైలం నిడారియా

సబ్ ఫైలం మేడుసోజోవ
క్లాసు హైడ్రోజోవ [45][46]
సబ్ క్లాసు హైడ్రోఇడోలిన
క్లాసు అంతోమేడుసే (= అంతోఅతెకాట లేదా అతెకాట)
సబ్ఆర్డర్ ఫిలిఫెర - [45] ఫ్యామిలీలు కొరకు చూడుము
సబ్ఆర్డర్ కేపితట - [45] ఫ్యామిలీలు కొరకు చూడుము
క్లాసు లేప్టోమేడుసే (= లేప్టోతెకాట లేదా తెకాట)
సబ్ఆర్డర్ కోనికా - [45] ఫ్యామిలీలు కొరకు చూడుము
సబ్ఆర్డర్ ప్రోబోస్కయిడ - [45] ఫ్యామిలీలు కొరకు చూడుము
ఆర్డర్ సిఫోనోఫోరె
సబ్ఆర్డర్ ఫైసోనేక్టే
ఫ్యామిలీలు: అగల్మటిదే, అపోలేమిదే, ఎరేన్నిడే, ఫోర్స్కలిడే, ఫయ్సోఫోరిదే, పైరోస్తేఫిడే, రోడలిడే
సబ్ఆర్డర్ కాలికఫోరే
ఫ్యామిలీలు: అబిలిడే, క్లాసోఫిడే, డిఫిడే, హిప్పోపోడిదే, ప్రయిడే, స్ఫేరోనేక్టిడే
సబ్ఆర్డర్ సిస్తోనేక్టే
ఫ్యామిలీలు: ఫిసలిడే, రైజోఫిసిడే
సబ్ క్లాసు ట్రకిలిన
ఆర్డర్ లిమ్నోమేడుసే
ఫ్యామిలీలు: ఒలినడిదే, మొనోబ్రకిడే, మైక్రోహైడ్రులిడే, అర్మొర్హైడ్రిడే
ఆర్డర్ ట్రాకిమేడుసే
ఫ్యామిలీలు: గేర్యోనిడే, హలిక్రియాటిదే, పేటసిడే, టైకోగాస్త్రిడే, రోపాలోనెమటిదే
ఆర్డర్ నార్కోమేడుసే
ఫ్యామిలీలు: కునినిదే, సొల్మరిసిడే, అగినిడే, టెట్రాప్లాటిదే
ఆర్డర్ అక్టినులిడే
ఫ్యామిలీలు: హలంమోహైడ్రిడే, ఓటోహైడ్రిడే
క్లాసు స్టౌరోజోవ (= స్టౌరోమేడుసే) [47]
ఆర్డర్ ఎల్యుతేరోకార్పిడ
ఫ్యామిలీలు: లుసుర్నరిడే, కిషినోఎడే, లిపకేడే, క్యోపోడిడే
ఆర్డర్ క్లెస్తోకార్పిడ
ఫ్యామిలీలు: డెపస్త్రిడే, తౌమాతోస్కైఫిడే, క్రాతెరోలోఫినే
క్లాసు కుబోజోవ [48]
ఫ్యామిలీలు: కార్యబ్డేడే, అలటినిడే, తమోయిడే, కైరోడ్రోపిదే, కైరోప్సల్మిడే
క్లాసు స్కైఫోజోవ [48]
ఆర్డర్ కరోనటే
ఫ్యామిలీలు: అతోలిడే, అతోరెలిడే, లినుచిడే, నాసితోయిడే, పారాఫిల్లినిడే, పెరిఫిలిడే
ఆర్డర్ సెమస్తోమే
ఫ్యామిలీలు: క్యనిడే, పెలగిడే, అల్మరిడే
ఆర్డర్ రైజోస్తోమే
ఫ్యామిలీలు: కస్సియోపెడే, కటోస్టైలిదే, సేఫెడే, లిక్నోరిజిడే, లోబొనేమటిదే, మాస్టిగిదే, రైజోస్తోమటిదే, స్తోమోలోఫిడే

చిత్రమాలిక

వీటిని కూడా చూడండి

సూచికలు

 1. Marques, A.C. (2004). "Cladistic analysis of Medusozoa and cnidarian evolution". Invertebrate Biology. 123: 23–42. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 2. Kramp, P.L. (1961). "Synopsis of the Medusae of the World". Journal of the Marine Biological Association of the United Kingdom. 40: 1–469.
 3. http://www.redorbit.com/education/reference_library/cnidaria/lions_mane_jellyfish/4326/index.html
 4. http://www.jellyfishfacts.net/mane-jellyfish.htm
 5. http://www.waterford-today.ie/index.php?option=com_content&task=view&id=933&Itemid=10177&ed=68
 6. ఫ్లవర్ హాట్ జెల్లీ , న్యూయార్క్ అక్వేరియం, ఆగష్టు 2009న పునరుద్దరించబడింది.
 7. Kelman, Janet Harvey (1910). The Sea-Shore, Shown to the Children. London: T. C. & E. C. Jack. p. 146. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 8. Klappenbach, Laura. "Ten Facts about Jellyfish". Retrieved 24 January 2010.
 9. "What are some determining characteristics of jellyfish in the class, Scyphozoa?". Retrieved 24 January 2010.
 10. Kaplan, Eugene H.; Kaplan, Susan L.; Peterson, Roger Tory (1999). A Field Guide to Coral Reefs: Caribbean and Florida. Boston : Houghton Mifflin. p. 55. ISBN 0-6180-0211-1. Retrieved 2009-08-31. Unknown parameter |month= ignored (help)
 11. Haddock, S.H.D., and Case, J.F. (April 1999). "Bioluminescence spectra of shallow and deep-sea gelatinous zooplankton: ctenophores, medusae and siphonophores" (PDF). Marine Biology. 133: 571. doi:10.1007/s002270050497. Retrieved 2009-09-09.CS1 maint: multiple names: authors list (link)
 12. "Jellyfish Gone Wild" (Text of Flash). National Science Foundation. 3 March 2009. Retrieved 17 November 2009. In recent years, massive blooms of stinging jellyfish and jellyfish-like creatures have overrun some of the world’s most important fisheries and tourist destinations.... Jellyfish swarms have also damaged fisheries, fish farms, seabed mining operations, desalination plants and large ships.
 13. "Jellyfish Take Over an Over-Fished Area". 21 July 2006. Retrieved 19 November 2009.
 14. 14.0 14.1 14.2 మిల్ల్స్, C.E. 2001. జెల్లీఫిష్ సమూహాలు: మారుతున్న సముద్ర పరిస్థితులకి అనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా జనాభాలు పెరుగుతున్నయా? హైడ్రోబయోలాజియా 451: 55-68. Cite error: Invalid <ref> tag; name "Mills" defined multiple times with different content
 15. Hamner, W. M. (1994). "Sun-compass migration by Aurelia aurita (Scyphozoa): population retention and reproduction in Saanich Inlet, British Columbia". Marine Biology. 119: 347–356. doi:10.1007/BF00347531. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 16. Schuchert, Peter. "The Hydrozoa". Retrieved 24 January 2010.
 17. Shubin, Kristie (10 December 2008). "Anthropogenic Factors Associated with Jellyfish Blooms - Final Draft II". Retrieved 19 November 2009.
 18. 18.0 18.1 18.2 ది వాషింగ్టన్ పోస్ట్, యూరోపియన్ కేతాకియన్ బైక్యాచ్ క్యాంపెయిన్ లో తిరిగి ప్రచురించబడింది, జెల్లీ ఫిష్ “సమూహాలు” రోగకారక సముద్రాలకి చిహ్నం , మే 6, 2002. నవంబర్ 27, 2007న పునరుద్ధరించబడింది.
 19. 19.0 19.1 జెల్లీ ఫిష్ గాన్ విల్ద్ -- టెక్స్ట్ మాత్రమే
 20. 20.0 20.1 Mills, C. E. (1987). "In situ and shipboard studies of living hydromedusae and hydroids: preliminary observations of life-cycle adaptations to the open ocean". Modern Trends in the Systematics, Ecology, and Evolution of Hydroids and Hydromedusae. Oxford: Clarendon Press.
 21. Fewkes, J. Walter (1887). "A hydroid parasitic on a fish". Nature. 36: 604–605. doi:10.1038/036604b0.
 22. పిరానో, S. et al. 1996. జీవిత చక్రాన్ని త్రిప్పి చూపటం : మేదూసే పోలిప్స్ గా మారటం మరియు తర్రితోప్సిస్ న్యూత్రికుల లో కాన విభజన (నిదరియ, హైడ్రోజోవ) బయలాజికల్ బులెటిన్ 190: 302-312.
 23. Mills, Claudia (1983). "Vertical migration and diel activity patterns of hydromedusae: studies in a large tank". Journal of Plankton Research. 5: 619–635. doi:10.1093/plankt/5.5.619.
 24. ఒమోరి, M. మరియు E. నకనో, 2001. ఈశాన్య ఆసియాలో జెల్లీ ఫిష్ ఫిషరీలు హైడ్రోబయోలాజియా 451: 19-26.
 25. 25.0 25.1 25.2 25.3 25.4 25.5 25.6 25.7 Y-H. Peggy Hsieh, Fui-Ming Leong, and Jack Rudloe (2004). "Jellyfish as food". Hydrobiologia. 451 (1–3): 11–17. doi:10.1023/A:1011875720415.CS1 maint: multiple names: authors list (link)
 26. Firth, F.E. (1969). The Encyclopedia of Marine Resources. New York: Van Nostrand Reinhold Co. New York. ISBN 0442223994. Cite has empty unknown parameter: |coauthors= (help)
 27. Pieribone, V. and D.F. Gruber (2006). Aglow in the Dark: The Revolutionary Science of Biofluorescence. Harvard University Press. pp. 288p.
 28. Richtel, Matt (14 March 2009). "How to Avoid Liquefying Your Jellyfish". The New York Times. Retrieved 6 May 2010.
 29. http://www.airtranmagazine.com/features/2009/08/garage-brands
 30. [64] ^ http://www.wikihow.com/Start-a-Jellyfish-Tank
 31. పుర్వేస్ WK, సదవ D, ఒరింస్ GH, హేల్లెర్ HC. 1998. జీవితంజీవశాస్త్రం నాలుగవ భాగం: వైవిద్యం యొక్క ఉద్భవం. ఛాప్టర్ 1.
 32. http://www.jellyfishart.com/kb_results.asp?ID=11
 33. 33.0 33.1 33.2 Fenner P, Williamson J, Burnett J, Rifkin J (1993). "First aid treatment of jellyfish stings in Australia. Response to a newly differentiated species". Med J Aust. 158 (7): 498–501. doi:10.1023/A:1011875720415. PMID 8469205.CS1 maint: multiple names: authors list (link)
 34. Currie B, Ho S, Alderslade P (1993). "Box-jellyfish, Coca-Cola and old wine". Med J Aust. 158 (12): 868. doi:10.1023/A:1011875720415. PMID 8100984.CS1 maint: multiple names: authors list (link)
 35. Yoshimoto C; Leong, Fui-Ming; Rudloe, Jack (2006). "Jellyfish species distinction has treatment implications". Am Fam Physician. 73 (3): 391. doi:10.1023/A:1011875720415. PMID 16477882.
 36. http://www.healthline.com/blogs/outdoor_health/2008/01/meat-tenderizer-for-jellyfish-sting.html
 37. 37.0 37.1 Hartwick R, Callanan V, Williamson J (1980). "Disarming the box-jellyfish: nematocyst inhibition in Chironex fleckeri". Med J Aust. 1 (1): 15–20. doi:10.1023/A:1011875720415. PMID 6102347.CS1 maint: multiple names: authors list (link)
 38. 38.0 38.1 Perkins R, Morgan S (2004). "Poisoning, envenomation, and trauma from marine creatures". Am Fam Physician. 69 (4): 885–90. doi:10.1023/A:1011875720415. PMID 14989575.
 39. http://www.emedicinehealth.com/jellyfish_stings/page4_em.htm
 40. http://www.healthcareask.com/first-aid/first-aid-5-7563.html
 41. Ouch! జెల్లీ ఫిష్ స్టింగ్స్ 150 ఆన్ N.H. బీచ్, బోస్టన్ గ్లోబ్, జూలై 21, 2010
 42. డెత్ డజ్ నాట్ దేటర్ జెల్లీ ఫిష్ స్టింగ్, ది న్యూ యార్క్ టైమ్స్, జూలై 22, 2010
 43. జెల్లీ ఫిష్ ఇన్వేషన్ , యుట్యూబ్, ఫిబ్రవరి 2009న పునరుద్దరించబడింది.
 44. కిల్లర్ జెల్లీ ఫిష్ పాపులేషన్ ఎక్స్పలోషణ్ వార్నింగ్ , ది డైలీ టెలిగ్రాఫ్, 11 ఫిబ్రవరి 2008, ఫిబ్రవరి 2009న పునరుద్దరించబడింది.
 45. 45.0 45.1 45.2 45.3 45.4 Schuchert, Peter. "The Hydrozoa Directory". Retrieved 2008-08-11.
 46. మిల్ల్స్, C.E., D.R. కాల్దేర్, A.C. మర్క్వేస్, A.E. మిగోట్తో, S.H.D. హడ్దోక్, C.W. డున్న్ మరియు P.R. పగ్, 2007. హైద్రాయిడ్స్, హైడ్రోమేడుసే మరియు సైఫోనోపోర్స్ యొక్క సమ్మిళిత జాబితా, పేజీలు 151-168. లైట్ అండ్ స్మిత్స్ మేన్యువల్: ఇంటర్ టైడల్ ఇన్వర్తిబ్రేట్స్ అఫ్ ది సెంట్రల్ కాలిఫోర్నియా కోస్ట్ . నాల్గవ సంచిక (J.T. కార్ల్టన్,సంపాదకుడు). కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం యొక్క ముద్రణ , బెర్కేలే .
 47. Mills, Claudia E. "Stauromedusae: List of all valid species names". Retrieved 2008-08-11.
 48. 48.0 48.1 Dawson, Michael N. "The Scyphozoan". Retrieved 2008-08-11.

బాహ్య లింకులు

ఛాయాచిత్రాలు:

en:Jellyfish ar:قنديل البحر bg:Медуза (животно) bn:জেলিফিশ ca:Medusa cdo:Tá de:Qualle el:Μέδουσα (ζώο) eo:Meduzo es:Medusa (animal) fa:عروس دریایی fi:Meduusat fr:Méduse (animal) ga:Smugairle róin gl:Scyphozoa he:מדוזה hr:Meduze hu:Medúzák ia:Medusa id:Ubur-ubur io:Meduzo is:Marglyttur it:Medusa (zoologia) ja:クラゲ ka:მედუზები ko:해파리 la:Scyphozoa lt:Scifomedūzos ml:കടൽച്ചൊറി ms:Ubur-ubur nl:Kwallen nn:Stormaneter no:Manet nv:Jélii łóóʼ pl:Meduza pt:Medusa (animal) qu:Kachu k'arachiq ro:Acalefe ru:Medusozoa sh:Meduze simple:Jellyfish sk:Medúzovce sr:Медуза sv:Maneter th:แมงกะพรุน tl:Dikya tr:Denizanası uk:Сцифоїдні vi:Sứa vls:Kwalle war:Bantól zh:钵水母纲