జ్ఞానాంబ

From tewiki
Jump to navigation Jump to search

జ్ఞానాంబ తెలుగు రచయిత్రి. ఈమె జన్మస్థలం విజయవాడ.ఇంటిపేరు తెలియదు. ఈమె మే 5 1895 న సుబ్బరాయలు, శేషుమాంబ దంపతులకు జన్మించారు.

జీవిత విశేషాలు

ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ గారి “”ఆంధ్రకవయిత్రులు”” లో ఈ రచయిత్రిగురించి ఇచ్చిన వివరాలు – ఈమెకి తల్లిదండ్రులు కనకదుర్గా వరప్రసాదిని అని పేరు పెట్టేరు. తొమ్మిదేళ్ళ వయసులో తనకు తానై చదువుకుంటానని అడిగితే, తల్లి ఆమెకి విద్య నేర్పేరు. అక్షరాభ్యాసమైన పదునైదు దినములకే ఆమె చక్కగా చదువను, వ్రాయను నేర్చినది. చిన్నతనమునుండి సహజములైన ఏకసంధాగ్రాహిత్వము, ధారణాశక్తి, ప్రకృతిపరిశీలనము, అన్నింటను మించిన పరమేశ్వర భావము నొండొంట తోడుపడి, ఆమెను ఉత్తమకవయిత్రిని జేసినవి. పన్నెండవ యేట శ్రీ సీతారామావధూతగారిని గురువులుగా స్వీకరించి, సంసారజీవనం త్యజించి, సన్యాసం పుచ్చుకున్నారు. గురువు ఆమెపేరు జ్ఞానాంబ అని మార్చేరు. చివరిదినములలో బ్రహ్మమత ప్రవిష్ట అయేరు. [1]

రచనలు

  • దేవుడు (చిన్న గీతమాలిక)
  • విజ్ఞానామృతము
  • కాళీ ప్రసాదిని (శతకము)
  • రంగావధూత
  • సత్ప్రభు శతకము
  • గార్గి

అనువాదాలు

  • మైత్రేయి, ఒకానొక వైదిక కథ. సీతానాధ తత్వభూషణుల ఆంగ్లగ్రంథమునకు జ్ఞానాంబ అనువాదము. 1932.

మూలాలు

  1. [ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ. ఆంధ్రకవయిత్రులు. రెండవ కూర్పు. 1980. పు.126/ ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మగారి వ్యాసం]

ఇతర లింకులు