జ్యోతివర్మ

From tewiki
Jump to navigation Jump to search
జ్యోతివర్మ
దస్త్రం:JyothiVarma.jpg
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తిడబ్బింగ్ కళాకారిణి
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం
తల్లిదండ్రులుదిలీప్‌వర్మ, శారదా మహేశ్వరి
బంధువులుకిషోర్‌ (భర్త)

జ్యోతివర్మ తెలుగు చలనచిత్ర, టెలివిజన్ డబ్బింగ్ కళాకారిణి. నచ్చావులే సినిమాలో కథానాయిక స్నేహితురాలు పాత్రకు తొలిసారిగా డబ్బింగ్‌ జ్యోతివర్మ, రంగస్థలం సినిమాలో సమంత పాత్రకు డబ్బింగ్ చెప్పడం ద్వారా గుర్తింపు పొందింది.[1][2]

జననం

జ్యోతివర్మ పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో జన్మించింది. ఈవిడ తల్లిదండ్రలు దిలీప్‌వర్మ, శారదా మహేశ్వరి. హైదరాబాదులో ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేసింది.

సినిమారంగ ప్రస్థానం

తన నాన్న ప్రెండ్, కాస్ట్యూమ్‌ డిజైనర్ఐన జగదీశ్వర్‌ సలహాతో డబ్బింగ్‌ ఆర్టిస్టు ప్రయత్నాలు సాగించింది. తనకు మొదట బృందంలోని సభ్యులకు డబ్బింగ్‌ చెప్పే అవకాశంరావడంతో సూపర్‌, తులసి, సైనికుడు మొదలైన సినిమాలలో బృందంలోని సభ్యులకు డబ్బింగ్‌ చెప్పింది. తరువాత చిన్నచిన్న సన్నివేశాల్లోని పాత్రధారులకు చెప్పడం ప్రారంభించి, స్టాలిన్‌, లక్ష్మీకల్యాణం, అన్నవరం వంటి సినిమాల్లో బిట్స్ చెప్పింది.

నచ్చావులే చిత్రంలో హీరోయిన్‌ స్నేహితురాలికి డబ్బింగ్ చెప్పడంతో బిజీగా మరి, క్రమంగా హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పే స్థాయికీ చేరుకొని, ఇప్పటివరకు దాదాపు 25 చిత్రాల హీరోయిన్స్ కు డబ్బింగ్ చెప్పింది. 2018లో వచ్చిన రంగస్థలం సినిమా జ్యోతివర్మకు మంచి పేరు తీసుకువచ్చింది.

చిత్రాలు

సంవత్సరం చిత్రం పేరు నటి పేరు ఇతర వివరాలు
2008 నచ్చావులే హీరోయిన్ ఫ్రెండ్
2010 వేదం అనుష్క సూపర్‌ హిట్‌ మూవీస్‌ అవార్డు
2012 రెబల్‌ దీక్షా సేథ్
2013 వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రకుల్ ప్రీత్ సింగ్
2015 జేమ్స్‌బాండ్‌ సాక్షి చౌదరి
2015 కంచె ప్రజ్ఞా జైస్వాల్‌
2016 నాయకి త్రిష
2017 రారండోయ్ వేడుక చూద్దాం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌
2017 రాజు గారి గది 2 సీరత్‌ కపూర్, అభినయ
2018 రంగస్థలం సమంత

ధారావాహికలు

ఈటీవీ, జెమినీ, జీతెలుగులలో ప్రసారమయిన అనేక సీరియల్స్ లోని నాయిక, ప్రతినాయిక పాత్రలకు డబ్బింగ్ చెప్పడమేకాకుండా 2011లో పసుపుకుంకుమ సీరియల్‌కి నంది అవార్డు కూడా అందుకుంది

ధారావాహిక పేరు ఛానల్ పేరు నటి పేరు ఇతర వివరాలు
ఆడదే ఆధారం ఈటీవి
తూర్పు వెళ్లేరైలు ఈటీవి
దేవత జెమినీ టీవీ
కొత్తబంగారం జెమినీ టీవీ
కల్యాణ తిలకం జెమినీ టీవీ
పసుపు కుంకుమ జీ తెలుగు నంది అవార్డు

మూలాలు

  1. వెబ్ ఆర్కైవ్, సాక్షి, సినిమా (9 April 2018). "లచ్మికి గొంతిచ్చిన అమ్మాయి". వైజయంతి. Retrieved 9 April 2018.
  2. వెబ్ ఆర్కైవ్, ఈనాడు వసుంధర, యువ హవా. "తెరవెనక... నేనే రామలక్ష్మిని!". స్వాతి కొరపాటి. Retrieved 9 April 2018.