టి.ఇందిరా చిరంజీవి

From tewiki
Jump to navigation Jump to search

త్రిపురారిభట్ల ఇందిరా చిరంజీవి ప్రముఖ తెలుగు రచయిత్రి.

జీవిత విశేషాలు

ఈమె ప్రముఖ సాహితీవేత్త త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి కోడలు. ఆమె అసలు పేరు ఇందిరాదేవి అయితే ఇందిరా చిరంజీవి అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందారు. వందకుపైగా కథలతోపాటు కథానికలు, వ్యాసాలు, నాటికలు, గేయాలు, కవితలు రాశారు. పలు అంశాలపై రేడియో ప్రసంగాలూ చేశారు. 'నీవు నీవుగానే ఉండు' కథానికల సంపుటికి 1995లో డాక్టర్‌ సి.నారాయణరెడ్డి నుండి సినీ కళాసాహిత్య అవార్డును అందుకున్నారు. కొంతకాలంపాటు 'కరుణశ్రీ' పత్రిక గౌరవ సంపాదకులుగా వ్యవహరించారు. కవితాగానం, కవితావనం, పుష్యరాగాలు వీరి రచనల్లో కొన్ని. ఎన్నో అవార్డులు, రివార్డులతో పాటు 2008లో తెలుగు విశ్వ విద్యాలయ ధర్మనిధి పురస్కారం, జీవనసాఫల్య పురస్కారాలను అందుకున్నారు. సందర్శించి నివాళులర్పించారు. ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.

మరణం

గుంటూరు జిల్లా తెనాలి రామలింగేశ్వరపేటకు చెందిన ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె ఫిబ్రవరి 6 2016 న మరణించారు.[1]

మూలాలు

ఇతర లింకులు