"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
టి.వి.రాజు
తోటకూర వెంకట రాజు | |
---|---|
200px టి.వి.రాజు | |
జననం | టి.వి.రాజు అక్టోబరు 25 1921 రఘుదేవపురం , రాజమహేంద్రవరం ![]() |
మరణం | 20 ఫిబ్రవరి, 1973 |
మతం | హిందూమతం |
భార్య / భర్త | సావిత్రి |
పిల్లలు | ఇద్దరు; వెంకట సత్య సుర్యనారాయణ (గిటారిస్ట్), సోమరాజు (రాజ్) - సంగీత దర్శకులు) |
తండ్రి | పెద్ద సోమరాజు |
తల్లి | రత్తమ్మ |
తోటకూర వెంకట రాజు (టి.వి.రాజు) (జ: 1921 - మ: ఫిబ్రవరి 20, 1973) తెలుగు-తమిళ సినిమా సంగీత దర్శకుడు. ఈయన కన్నడ సినీ రంగములో కూడా పనిచేశాడు. ఈయన అంజలీదేవి నృత్యప్రదర్శనలకు హార్మోనియం వాయించేవాడు.
తోటకూర వెంకటరాజు రాజమహేంద్రవరం తాలూకా రఘుదేవపురంలో జన్మించాడు. స్వగ్రామంలోనే నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారి వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. మాస్టర్ వెంకటరాజు అన్న పేరుతో రంగస్థల నటునిగా మద్రాసులో స్థిరపడ్డాడు. నటించిన సినిమాలు : పల్లెటూరి పిల్ల (1950)లో గూఢచారిగా, పిచ్చి పుల్లయ్య (1953)లో న్యాయమూర్తిగా, బంగారుపాప (1954)లో డాక్టర్‌గా, పాండురంగ మహాత్మ్యం (1957)లో ‘కృష్ణా ముకుందా మురారి’ అనే పాటలో భక్తునిగా కనిపిస్తారు.
Contents
కుటుంబం
ఈయనకు 33వ యేట సావిత్రితో వివాహం జరిగింది. ఇద్దరు కుమారులు. పెద్దవాడు వెంకట సత్య సూర్యనారాయణ రాజు, ఈయన గిటారిస్ట్. రెండవ కుమారుడు తోటకూర సోమరాజు (రాజ్ గా తెలుగు సినీరంగంలో ప్రసిద్ధి చెందాడు), రాజ్-కోటి ద్వయంలో ఒకడు. కోటి నుండి విడివడి సిసింద్రీ వంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు.
సినీ ప్రస్థానం
1950లో విడుదలైన పల్లెటూరి పిల్ల సినిమాలో సంగీతదర్శకుడు పి.ఆదినారాయణరావుకు సహాయకునిగా పనిచేశాడు. సంగీతదర్శకునిగా వెంకటరాజు తొలి సినిమా 1952లో బి.ఎ.సుబ్బారావు దర్శకత్వం వహించిన టింగురంగ. 70వ దశకపు తొలినాళ్లలో యోగానంద్, వేదాంతం రాఘవయ్య, కమలాకర కామేశ్వరరావు, ఎన్టీయార్, కె.విశ్వనాథ్‌ల సినిమాలకు సంగీతం సమకూర్చాడు. టీవీ రాజు సంగీతదర్శకత్వం వహించిన చిత్రాలలో జయసింహ, పాండురంగ మహత్యం, శ్రీకృష్ణపాండవీయం, గండికోట రహస్యం, మంగమ్మ శఫదం, పిడుగు రాముడు, విచిత్ర కుటుంబం, కథానాయకుడువంటి చిత్రాలున్నాయి.
సినిమాలు
ప్రచురణలు
పురస్కారాలు
విశేషాలు
ఈయన ఒకే ఒక సినిమాను నిర్మాతగా తీసారు. ఒకప్పటి రూమ్ మేట్స్ అయిన ఎన్.టి.ఆర్, ఎస్.వి.ఆర్ తో కలిసి "బాల నాగమ్మ" (1959) సినిమాను నిర్మించారు.
బయటి లింకులు
మూలాలు
Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).