"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

టీ. చల్లపల్లి

From tewiki
Jump to navigation Jump to search
టీ. చల్లపల్లి
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/ఆంధ్ర ప్రదేశ్" does not exist.

అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°34′00″N 82°06′00″E / 16.5667°N 82.1000°E / 16.5667; 82.1000
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం ఉప్పలగుప్తం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం {{#property:P1082}}
 - పురుషులు 4,620
 - స్త్రీలు 4,671
 - గృహాల సంఖ్య 2,501
పిన్ కోడ్ 533213
ఎస్.టి.డి కోడ్

టీ. చల్లపల్లి లేదా ఠానా చల్లపల్లి తూర్పు గోదావరి జిల్లా, ఉప్పలగుప్తం మండలానికి చెందిన [[గ్రామం.[1].]]. పిన్ కోడ్ నం. 533 213., ఎస్.టి.డి.కోడ్ = 08856.

.ఇది మండల కేంద్రమైన ఉప్పలగుప్తం నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అమలాపురం నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2501 ఇళ్లతో, 9291 జనాభాతో 2177 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4620, ఆడవారి సంఖ్య 4671. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3934 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 54. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587903[2].పిన్ కోడ్: 533213.

గ్రామ స్వరూపం

యీ గ్రామం అమలాపురం తాలూకాలో అమలాపురంకు 12 కిలోమీటర్లు దూరంలో సముద్ర తీరంన ఉంది. ఉప్పలగుప్తం మండలానికి చెందిన గ్రామం. పూర్వము చాళుక్య వంశీయులగు శ్రీ పోలిశెట్టి వారి కుటుంబీకులు అయ్యావళి ముఖ్యులై దరిమిలాను ద్రాక్షారామంలో వర్తకవాణిజ్యాల యందు విఖ్యాతులై దరిమిలాను 16 శతాబ్దమునుండి బోడసకుర్రు పరగణాలోని యీ గ్రామంలో గోలుకొండ సుల్తానుల తరపున ఠాణా నిర్వహించి స్థిరపడినారు. అందుచేత యీ గ్రామాన్ని "ఠానా చల్లపల్లి", "టీ.చల్లపల్లి" అని పిలిచేవారు. తరువాత యీ గ్రామం శ్రీ పిఠాపురం మహారాజు గారికి చెందిన పలివెల ఠాణాలో వుండేది.

మొత్తం గ్రామ జనాభా 9000 మందిపైనే. ఓటర్లు 5000 మంది పైబడి ఉన్నారు. గ్రామంలో కాపులు, బ్రాహ్మణులు, అగ్నికుల క్షత్రియులు, మాలలు, మాదిగలు ప్రధాన కులాలు. బ్రాహ్మణులలో తిరువూరి, మాఛిరాజు, అంబరుఖానా మొదలగు ఇంటిపేర్లు వారు, తెలగా కాపులలో పోలిశెట్టి, దంగేటి, యెరుబండి, గొలకోటి, సుంకర, కుంపట్ల, భోగిశెట్టి, సలాది, ఆకుల మొదలగు కుటుంబాలవారు గ్రామంలో ప్రధానంగా గలరు.

వ్యవసాయం, నీటి వనరులు

గ్రామ మొత్తం ఆయకట్టు 4600 యకరాలు. ప్రధాన పంటలు వరిసాగు, చేపలు రొయ్యలు సాగు. వరిలో ఖరీఫ్, రబీ అని రెండు పంటలూ వేస్తారు. వేసవికాలంలో కొంతమంది మినుములు, పెసలు వంటి అపరాలు, జనుము, జీలుగ వంటి పశుగ్రాసం కూడా వేస్తారు.

సదుపాయాలు

గ్రామంలో ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ పాఠశాలలు గలవు. గ్రామంలో ప్రతీ monday సంత జరుగుతుంది. బ్యాంకింగు సదుపాయాలకోసం "ఇండియన్ బ్యాంకు", బి.యస్.యన్.ఎల్. టెలిఫోన్ ఎక్స్చేంజ్, ఒక సినీమా హాల్ ఉన్నాయి. వైద్య సదుపాయల కోసం RMP డాక్టరు గలడు.

గుళ్ళు గోపురాలు, ఉత్సవాలు

మరిడి మహాలక్ష్మి అమ్మవారు (మరిడమ్మ), మహిషాసుర మర్ధినీ అమ్మవారు (మస్సమ్మ), కనకమహాలక్ష్మి అమ్మవార్లు చల్లపల్లి గ్రామదేవతలుగా పూజలందుకొనుచున్నారు.

గ్రామంలో శ్రీ చోడేశ్వర స్వామి వారు, శ్రీ వేణుగోపాల స్వామి వారు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు, శ్రీ లక్ష్మీగణపతి ఆలయం, శ్రీ కనకదుర్గ, బేతాళుడు, పోతురాజు, శ్రీ సీతారామ స్వామి వార్ల దేవాలయాలు గలవు.

చొల్లంగి అమావాస్యకు, గ్రామానికి 3 కిలోమీటర్లు దూరం లోపు వున్న సముద్రమునకు వెళ్ళి సముద్ర స్నానాలు చేస్తారు.

ఇవి కూడా చూడండి

చల్లపల్లె, అనంతపురం జిల్లా, సోమందేపల్లె మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ : 515 122.,

చల్లపల్లి , కృష్ణా జిల్లా లోని ఒక మండలం. పిన్ కోడ్ నం. 521 125., ఎస్.టి.డి.కోడ్ = 08671.

చల్లపల్లి స్వరూపరాణి , రచయిత్రి:- గుంటూరు జిల్లా, అమృతలూరు మండలం, ప్యాపర్రు గ్రామానికి చెందినవారు.

చల్లపల్లమ్మ పేరుతో గ్రామదేవత

కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలోని వెల్లటూరు గ్రామ పొలిమేరలోని అటవీ ప్రాంతంలో వేంచేసియున్న గ్రామదేవతలు చల్లపల్లిమ్మ తల్లి అమ్మవారు, పోతురాజు, నాగేంద్రస్వామి వార్లకు గ్రామస్థులు, 2014,మార్చి-4న ప్రత్యేక పూజలు చేసి అన్నదాన సంతర్పణ చేశారు. అడవిగట్టు వద్ద చల్లపల్లిమ్మ తల్లి పేరుతో వేంచేసియున్న సత్యాలమ్మ తల్లికి కొన్నేళ్ళుగా చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పూజలు చేస్తున్నారు. [ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,మార్చి-5; 2వపేజీ]

విద్యా సౌకర్యాలు

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 10, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల ఉప్పలగుప్తంలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు అమలాపురంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ అమలాపురంలో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల అమలాపురంలో ఉన్నాయి.

వైద్య సౌకర్యం

ప్రభుత్వ వైద్య సౌకర్యం

టి. చల్లపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

గ్రామంలో7 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, డిగ్రీ లేని డాక్టర్లు ఆరుగురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.

చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

టి. చల్లపల్లిలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి  గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

టి. చల్లపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 571 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 194 హెక్టార్లు
 • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 234 హెక్టార్లు
 • బంజరు భూమి: 37 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 1138 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 59 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1351 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

టి. చల్లపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 1351 హెక్టార్లు

ఉత్పత్తి

టి. చల్లపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

వరి

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 9,291 - పురుషుల సంఖ్య 4,620 - స్త్రీల సంఖ్య 4,671 - గృహాల సంఖ్య 2,501

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9,406.[3] ఇందులో పురుషుల సంఖ్య 4,719, మహిళల సంఖ్య 4,687, గ్రామంలో నివాస గృహాలు 2,207 ఉన్నాయి.

మూలాలు

 1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-10.
 2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-10.