"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

టెక్కలి

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Tekkali RTC bs stand.jpg
టెక్కలి మండల కేంద్రంలో బస్ స్టేషన్

టెక్కలి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలానికి చెందిన జనగణన పట్టణం.[1] టెక్కలి జిల్లా ప్రధాన పట్టణం శ్రీకాకుళం నండి 50 కి.మి దూరములో ఉత్తరాన ఉంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్.టి.రామారావు ఈ నియోజకవర్గమునుండి పోటీ చేసి గెలిచారు, రాష్ట్ర శాసన సభకి ఎన్నిక అయ్యారు. జిల్లాలో ఉన్న 3 డివిజన్లలో ఇదిఒకటి, ఇది డివిజన్ కేంద్రము, శాసనసభ నియోజకవర్గము 532201

పేరు వెనక చరిత్ర

టెక్కలి ప్రాంతం 1816నుండి 1832 వరకు పర్లాకిమిడిరాజు గణపతి పద్మనాభదేవ్ పాలనలో వుండేది. అతని కుమారులు ఆ రాజ్యాన్ని రెండుగా విభజించి టెక్కలిని గోవిందనాథ్ దేవ్ నంది గాం ను కృష్ణ చంద్ర దేవ్ లు పాలించారు. టెక్కలి పాలకుడు గోవింద నాథ్ దేవ్ తన కుమార్తెకు వివాహము జరిపించి నప్పుడు పశుపు కుంకుమల క్రింద టెక్కలి గ్రామాన్ని దారా దత్తం చేశాడు. టిక్లి అనగా ఒడియాలో పశుపు కుంకుమల బుట్ట అని అర్థం అలా ఆ గ్రామాన్ని టిక్లి అని పిలిచేవారు. కాల క్రమంలో అది టెక్కలి గా రూపాంతరం పొందింది. (తెలుగు వెలుగు అక్టోబర్ 2008/పుట 97)

ప్రముఖులు

మునిసిపాలిటీ

రావివలస, శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలానికి చెందిన గ్రామం.[1]. టెక్కలి పట్టణానికి 5 కి.మి దూరములో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది. ఎండల మల్లన్నగా పేరు పడిన ఇక్కడి దైవం మల్లికార్జునస్వామివారు. ఈ దేవుని దర్శించినవారికి దీర్ఘరోగాలు ముఖ్యముగా చర్మరోగాలు పోయి పూర్తిగా ఆరోగ్యవంతులవుతారని భక్తుల ప్రగాడనమ్మకం. డివిజన్‌, నియోజకవర్గ కేంద్రమైన టెక్కలి మేజర్‌ పంచాయతీ మున్సిపాలిటీ హోదాను సంతరించుకుంది. ప్రతీ డివిజన్‌ కేంద్రాలను మున్సిపాలిటీలుగా మార్చాలన్న ప్రభుత్వ ఆలోచనలకు టెక్కలి అన్ని హంగులను సమకూర్చుకుంది. 1925 అక్టోబరు 25 బలరాందాస్‌ పట్నాయక్‌ ఆధ్వర్యంలో ఆవిర్భ వించిన టెక్కలి మేజర్‌ పంచాయతీ 2001 జనాభా ప్రాతిప దికన 23 వేల 288 మంది ఉన్నారు. అంచెలంచెలుగా ఎదిగిన టెక్కలి మేజర్‌ పంచాయతీలో ప్రస్తుతం 20 వార్డు లుండగా 53 వీధులున్నాయి40వేల జనాభా ఉన్న ప్రాంతాలను మున్సిపాలిటీగా మార్చాలన్న పంచాయతీరాజ్‌ ఆదేశాలున్నప్పటికీ ప్రభుత్వం ఉత్తర్వులను సవరించి 20వేల జనాభాకు సవరించింది. ఈ నేపథ్యంలో టెక్కలి మేజర్‌ పంచాయతీ ఒక్కటిని మున్సిపాలిటీగా మార్చినప్పటికీ ఆశ్చర్యపోనవసరంలేదు. అయితే, ఇది సరికాదని భావించిన యంత్రాంగం పరిసర పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయనుంది. ఇందులో భాగంగా తోలుసురబల్లి, తిర్లంగి, సీతాపురం, తలగాం, రావివలస, బసువాడ, తేలినీలాపురం, అక్కవరం, బొప్పాయిపురం పంచాయతీలను విలీనం చేయనుంది. దీనిద్వారా 40 వేల పైచిలుకు జనాభాతో మున్సిపాలిటీగా అవతరించనుంది. ప్రస్తుతం మేజర్‌ పంచాయతీ ఏటా 55 లక్షల రూపాయలు ఆదాయం సంపాదిస్తున్నప్పటికీ పంచాయతీ అభివృద్ధి వినియోగానికే నిధులు ఖర్చవుతున్నాయి. 2001 జనాభా ప్రకారం 4.04 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న పంచాయతీల్లో 5 వేల 979 కుటుంబాలున్నాయని అంచనా. వీటి ప్రకారం టెక్కలి మున్సిపాలిటీగా మారే అవకాశం ఉంది.

టెక్కలి శాసనసభ నియోజకవర్గము వివరాలు

  • సంఖ్యా పరముగా 3వ శాసనసభ స్థానము.
  • ఎన్.టి.రామారావు పోటీ చేసిన ఘనత ఉంది.

మూలాలు

  1. 1.0 1.1 "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-07-31.

వెలుపలి లంకెలు