"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

టేకుమళ్ళ అచ్యుతరావు

From tewiki
Jump to navigation Jump to search
టేకుమళ్ళ అచ్యుతరావు
జననంటేకుమళ్ళ అచ్యుతరావు
ఏప్రిల్ 18, 1880
విశాఖపట్టణం జిల్లాలోని పోతనవలస
మరణంఫిబ్రవరి 12, 1947
మద్రాసు
ప్రసిద్ధిప్రముఖ విమర్శకులు, పండితులు
పిల్లలుఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
తండ్రిరామయ్య
తల్లివెంకమ్మ

టేకుమళ్ళ అచ్యుతరావు (ఏప్రిల్ 18, 1880 - ఫిబ్రవరి 12, 1947) ప్రముఖ విమర్శకులు, పండితులు.[1]

వీరు విశాఖపట్టణం జిల్లాలోని పోతనవలస గ్రామంలో రామయ్య, వెంకమ్మ దంపతులకు విక్రమ నామ సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజున జన్మించారు. వీరు ఎఫ్.ఎ.ను పర్లాకిమిడి లోను, బి.ఎ.ను విజయనగరంలోను పూర్తిచేశారు. బి.ఎ. పరీక్షలో ఆంగ్లంలో ప్రథముడిగా నెగ్గి మెక్డోనాల్డ్ మెడల్ సాధించారు. తర్వాత రాజమండ్రిలోని ప్రభుత్వ శిక్షణ కళాశాలలోచేరి ఎల్.టి. పరీక్షలో ఉత్తీర్ణులై అక్కడనే ఉపాధ్యాయులుగా పనిచేశారు. వీరు పాఠశాలల అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ పదవిని అలంకరించి క్రమంగా ఉపాధ్యాయ ట్రయినింగ్ కళాశాల హెడ్ మాస్టరు పదవిని పొంది 1934లో పదవీ విరమణ చేసేవరకు ఆ పదవిలోనే ఉన్నారు. వీరు కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఎమ్.ఎ. పూర్తిచేశారు. వీరు 1900లో భమిడిపాటి ద్వారకా విశాలాక్షిని పరిణయమాడారు.

వీరు రచించిన "విజయనగర ఆంధ్ర వాజ్మయ చరిత్ర", కవి జీవిత విశేషాలను, కవికృత కావ్యాల విమర్శలను సమానంగా పర్యాలోకించిన సారస్వ గ్రంథంగా పేరుపొందినది. పింగళి సూరన రచించిన గ్రంథాల గురించి వీరు ఆంగ్లంలో విపులమైన విమర్శను రచించి దానికి "పింగళి సూరనార్యుని జీవితం, కృతులు" అను ఆంగ్ల నామంతో 1941లో ప్రచురించారు.[2] దీనిని పిఠాపురం మహారాజా సూర్యారావు బహదూరు వారికి అంకితమిచ్చారు. వీరు "ఆంధ్ర పదములు - పాటలు", "ఆంధ్ర నాటకాలు - రంగ స్థలాలు" అనే గ్రంథాల్ని కూడా రచించారు.

వీరు 1947 ఫిబ్రవరి 12లో మద్రాసులో పరమపదించారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ప్రముఖ రచయిత టేకుమళ్ళ కామేశ్వరరావు వీరి కుమారుడు.

మూలాలు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).