టైమ్ (పత్రిక)

From tewiki
Jump to navigation Jump to search
Time
Time Magazine logo.svg
Managing EditorRichard Stengel
వర్గాలుNewsmagazine
తరచుదనంWeekly
ముద్రించిన కాపీలు3,360,135
మొదటి సంచికMarch 3, 1923
సంస్థTime Inc. (Time Warner)
కేంద్రస్థానంNew York City
భాషEnglish
వెబ్సైటుwww.time.com
ISSN0040-781X

టైమ్'' (వ్యాపారచిహ్నం పెద్ద అక్షరాల్లో TIME ) అనేది ఒక అమెరికన్ వార్తా పత్రిక. ఒక యూరోపియన్ ప్రచురణ (మునుపు టైమ్ అట్లాంటిక్‌ గా పిలువబడిన) టైమ్ యూరోప్ ) లండన్ నుండి వెలువడుతుంది. టైమ్ యూరోప్ 2003 నుండి మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికాలలో వార్తలను సేకరిస్తుంది. ఒక ఆసియన్ ప్రచురణ (టైమ్ ఆసియా ) హాంగ్ కాంగ్‌లో స్థావరం కలిగి ఉంది. 2009 సమయానికి, టైమ్ కెనడియన్ ప్రకటనా ప్రచురణను నిలిపివేసింది.[1] ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు పసిఫిక్ ద్వీపాల వార్తలను సేకరించే సౌత్ పసిఫిక్ ప్రచురణ యొక్క స్థావరం సిడ్నీలో ఉంది.

టైమ్ ప్రపంచంలో అతిపెద్ద వార్తా వారపత్రిక, మరియు స్థానికంగా 20 మిలియన్ మంది పాఠకులను మరియు ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్ మందిని కలిగి ఉంది.[2] దీని న్యూస్‍స్టాండ్ అమ్మకాలు వారానికి 79 వేల ప్రతులకు కొద్దిగా మించే స్థాయికి పడిపోయాయి.

మధ్య-2006 సమయానికి, దీని నిర్వహణ సంపాదకుడు రిచర్డ్ స్టెంగెల్.

చరిత్ర

మార్చ్ 3, 1923 నాడు మొట్టమొదటి ముఖచిత్రంపై స్పీకర్ జోసెఫ్ G. కానన్ చిత్రం కలిగిన టైమ్ పత్రిక యొక్క ప్రారంభ సంచిక.

1923లో బ్రిటన్ హాడెన్ మరియు హెన్రీ లూస్ కలిసి టైమ్ పత్రికను ప్రారంభించారు, ఇది సంయుక్త రాష్ట్రాలలో మొట్టమొదటి వార్తా వార పత్రిక.[3] వీరు ఇరువురూ మునుపు యేల్ డైలీ న్యూస్ యొక్క అధ్యక్షుడు మరియు నిర్వహణా సంపాదకుడుగా కలిసి పనిచేశారు మరియు ఈ పత్రికకు ఫాక్ట్స్ అని పేరు పెట్టాలనుకున్నారు.[4] హాడెన్ ఒక నిర్లక్ష్య స్వభావం కలిగినవ్యక్తి, ఇతడు లూస్‍ను సరదాగా ఏడిపించేవాడు మరియు టైమ్ అనే పేరు ప్రముఖంగా కానీ తమాషాగా ఉంటుందని భావించాడు. దాని ఫలితమే దీని స్వరకల్పన, దీనిని ఒక గంభీరమైన వార్తలకు మరీ తేలికైనదిగా మరియు ప్రసిద్ధ వ్యక్తులు (రాజకీయవేత్తలతో సహా), ఎంటర్‍టైన్‍మెంట్ పరిశ్రమ, మరియు పాప్ సంస్కృతి గురించిన విశదమైన వార్తల సేకరణకు మరింత అనుకూలంగా ఉంటుందని చాలామంది ప్రజలు ఇప్పటికీ విమర్శిస్తూ ఉంటారు. ఇది వార్తలను వ్యక్తుల ద్వారా చెప్పడాన్ని ప్రారంభించింది, మరియు ఎన్నో దశాబ్దాల పాటు ఈ పత్రిక యొక్క ముఖచిత్రంపై ఒక్క వ్యక్తి చిత్రాన్ని ప్రచురించేవారు. టైమ్ యొక్క మొట్టమొదటి సంచిక 1923 మార్చి 3 నాడు ప్రచురింప బడింది, దీని ముఖచిత్రంపై పదవీవిరమణ పొందిన సంయుక్త రాష్ట్రాల ప్రతినిధుల సభ యొక్క స్పీకర్ జోసెఫ్ G. కానన్ చిత్రం ముద్రించబడింది; సంచిక సం. 1 నుండి అసలులోని అన్ని శీర్షికలు మరియు ప్రకటనలతో కూడిన నకలుప్రతి, పత్రిక యొక్క 15వ వార్షికోత్సవం సందర్భంగా 1938 ఫిబ్రవరి 28 సంచికతో జ్ఞాపకార్థం అందించబడింది.[5] 1929లో హాడెన్ మరణంతో, లూస్ టైమ్ యొక్క ప్రధాన వ్యక్తిగా మరియు 20వ-శతాబ్దపు మీడియాలో ప్రధాన వ్యక్తిగా మారాడు. రాబర్ట్ ఎల్సన్ వ్రాసిన టైమ్ ఇంక్.: ది ఇంటిమేట్ హిస్టరీ అఫ్ ఎ పబ్లిషింగ్ ఎంటర్ప్రైజ్ 1972–2004అభిప్రాయం ప్రకారం , "రాయ్ ఎడ్వర్డ్ లార్సెన్ […] టైమ్ ఇంక్. అభివృద్ధిలో కేవలం లూస్ తరువాతి పాత్రను పోషించాల్సి ఉండింది" అతడి పుస్తకం, ది మార్చ్ అఫ్ టైమ్, 1935–1951లో, రేమాండ్ ఫీల్డింగ్ సైతం లార్సెన్ "నిజానికి సరఫరా మేనేజర్ తరువాత టైమ్ యొక్క జనరల్ మేనేజర్, అటుపై లైఫ్ ప్రచురణకర్త, ఎన్నో సంవత్సరాలుగా టైమ్, ఇంక్. యొక్క ప్రెసిడెంట్, మరియు ఈ కార్పొరేషన్ యొక్క సుదీర్ఘ చరిత్రలో లూస్ తరువాత అత్యంత ప్రభావవంతమైన మరియు ప్రముఖ వ్యక్తి" అని వ్రాసాడు.

వారు ధనవంతులైన యేల్ పూర్వవిద్యార్థులైన హెన్రీ P. డేవిసన్, J.P. మోర్గాన్ & కో. భాగస్వామి, ప్రచార కర్త మార్టిన్ ఎగన్ మరియు J.P. మోర్గాన్ & కో. బ్యాంకర్ ద్వైట్ మారో నుండి US$100,000 సేకరించే సమయంలోనే, హెన్రీ లూస్ మరియు బ్రిటన్ హాడెన్ 1922లో లార్సెన్‍ను ఉద్యోగం లోనికి తీసుకున్నారు – ఇందులో లూస్ మరియు హాడెన్ ఇరువురూ యేల్ పట్టభద్రులు కాగా లార్సెన్ మాత్రం హార్వర్డ్ పట్టభద్రుడు. 1929లో హాడెన్ మరణించాక, లార్సెన్ టైమ్ ఇంక్. యొక్క 550 షేర్లను కొనుగోలు చేశాడు, ఇందుకోసం న్యూ ఇంగ్లాండ్లోని B.F. కీత్ ధియేటర్ శ్రేణి యొక్క అధ్యక్షుడైన తన తండ్రి నుండి వారసత్వంగా లభించిన RKO వాటాను అమ్మడం ద్వారా లభించిన నగదు ఉపయోగించాడు. కానీ, బ్రిటన్ హాడెన్ మరణం తరువాత, టైమ్ ఇంక్. యొక్క అతిపెద్ద వాటాదారు ఈ మీడియా సంస్థను నియంతలా పాలించిన హెన్రీ లూస్, "టైమ్ ఇంక్.: ది ఇంటిమేట్ హిస్టరీ అఫ్ ఎ పబ్లిషింగ్ ఎంటర్ప్రైజ్ 1923–1941" ప్రకారం "ఇతడికి కుడిభుజం లార్సెన్," టైమ్ ఇంక్. యొక్క రెండవ-అతిపెద్ద వాటాదారు. 1929లో, రాయ్ లార్సెన్ టైమ్ ఇంక్. సంచాలకుడు మరియు టైమ్ ఇంక్. వైస్-ప్రెసిడెంట్‍గా కూడా నియమితుడయ్యాడు. టైమ్ మరియు ఫార్చ్యూన్ రెండింటిపై, రెండు డైరెక్టరేట్లు మరియు వాటాల షేర్లు కలిగి, J.P. మోర్గాన్ కొంత నియంత్రణను ఉంచుకున్నాడు. ఇతర వాతాదార్లు బ్రౌన్ బ్రదర్స్ W. A. హర్రిమన్ & కో., మరియు ది న్యూ యార్క్ ట్రస్ట్ కంపెనీ (స్టాండర్డ్ ఆయిల్).

కర్టిస్ ప్రెన్డర్గాస్ట్ వ్రాసిన ది వరల్డ్ అఫ్ టైమ్ ఇంక్: ది ఇంటిమేట్ హిస్టరీ అఫ్ ఎ చేంజింగ్ ఎంటర్ప్రైజ్ 1960–1989 ప్రకారం, 1967లో హెన్రీ లూస్ మరణించే సమయానికి, లూస్ అధీనంలో ఉన్న టైమ్ ఇంక్. వాటా విలువ సుమారు US$109 మిలియన్ మరియు అతడికి US$2.4 మిలియన్ పైగా వార్షిక లాభాంశం అందించేది. 1960లలో లార్సెన్ కుటుంబం యొక్క టైమ్ ఇంక్. వాటా విలువ ప్రస్తుతం సుమారు $80 మిలియన్ ఉండేది మరియు రాయ్ లార్సెన్ టైమ్ ఇంక్. సంచాలకుడు మరియు దాని ఎగ్జిక్యూటివ్ కమిటీకి అధ్యక్షుడు, అంతకు మునుపు 1979 మధ్య వరకూ అతడు టైమ్ ఇంక్. బోర్డ్ యొక్క ఉపాధ్యక్షుడిగా కొనసాగాడు ది న్యూ యార్క్ టైమ్స్ యొక్క సెప్టెంబర్ 10, 1979 నాటి సంచిక ప్రకారం, "సంస్థ చరిత్రలో అందులోని 65 ఏళ్ళకు నిర్బంధ పదవీ విరమణ విధానం నుండి మినహాయింపు పొందిన ఏకైక ఉద్యోగి మిస్టర్ లార్సెన్."

టైమ్ పత్రిక మార్చ్ 1923 నుండి వారం వారం సంచికలను వెలువరించడం ప్రారంభించాక, రాయ్ లార్సెన్ దాని సరఫరాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న U.S. రేడియో మరియు మూవీ ధియేటర్ల సాయంతో పెంచగలిగాడు. అది తరచూ "టైమ్" పత్రిక మరియు U.S. రాజకీయ మరియు కార్పోరేట్ విషయాలను ప్రచారం చేసేది. ది మార్చి అఫ్ టైమ్ ప్రకారం, 1924 సమయానికే, లార్సెన్ 1925. వరకూ కొనసాగిన 15-నిముషాల పాప్ క్వశ్చన్ శీర్షిక కలిగిన క్విజ్ కార్యక్రమంతో టైమ్ పత్రికను శైశవ రేడియో వ్యాపారానికి తీసుకువచ్చాడు." అదే పుస్తకం ప్రకారం, తరువాత "1928లో […] లార్సెన్ ప్రతి వారం టైమ్ పత్రిక యొక్క ప్రస్తుత సంచికల నుండి తీసుకోబడిన 10-నిముషాల కార్యక్రమ దారావాహికాలను ప్రసారం చేసే ప్రయత్నం చేశాడు […] దీనిని వాస్తవానికి సంయుక్త రాష్ట్రాలలో మొత్తం 33 స్టేషన్లలో ప్రసారం చేయడం జరిగింది."

ఆ తరువాత లార్సెన్ మార్చ్ 6, 1931 నుండి ప్రారంభమైన CBS పై ప్రసారమయ్యే 30-నిముషాల రేడియో కార్యక్రమం ది మార్చి అఫ్ టైం కు శ్రీకారం చుట్టాడు. టైమ్ ఇంక్.: ది ఇంటిమేట్ హిస్టరీ అఫ్ ఎ పబ్లిషింగ్ ఎంటర్ప్రైజ్ 1923–1941 ప్రకారం, ప్రతివారం ఈ కార్యక్రమం ఆ వారపు వార్తలను శ్రోతల కోసం నాటకీయంగా ప్రసారం చేసేది, దీంతో టైమ్ పత్రిక "అంతకు మునుపు దాని ఉనికి గురించి తెలియని ఎందరో మిలియన్ల మంది దృష్టికి" తేబడింది, తద్వారా 1930లలో ఈ పత్రిక సరఫరా పెరిగింది. 1931 మరియు 1937 మధ్య, లార్సెన్ యొక్క ది మార్చి అఫ్ టైమ్ రేడియో కార్యక్రమం CBS రేడియోలో ప్రసారమయ్యేది, 1937 మరియు 1945 మధ్య NBC రేడియోలో ప్రసారమయ్యేది – దీనికి మినహాయింపు కేవలం 1939 నుండి 1941 వరకూ వ్యవధిలో ఇది ప్రసారం కాలేదు. పీపుల్ పత్రిక టైమ్ యొక్క పీపుల్ పేజిపై ఆధారపడింది.

1989లో వార్నర్ కమ్యూనికేషన్స్ మరియు టైమ్, ఇంక్. కలయికతో టైమ్ , టైమ్ వార్నర్ యొక్క భాగంగా మారింది. జేసన్ మెక్‍మానస్ 1988లో హెన్రీ గ్రంవల్డ్ తరువాతి ప్రధాన సంపాదకుడిగా పదవీబాధ్యతలు స్వీకరించి మార్పును పర్యవేక్షించాడు, అటుపై ఇతడి నుండి నార్మన్ పెర్స్టైన్ 1995లో పదవీబాధ్యతలు స్వీకరించాడు.

2000 నుండి, ఈ పత్రిక AOL టైమ్ వార్నర్ భాగంగా ఉండేది, తిరిగి 2003లో టైమ్ వార్నర్ పేరిట మారిపోయింది.

2007లో, టైమ్ సోమవారం చందా/న్యూస్‍స్టాండ్ డెలివరీ నుండి శుక్రవారాలు అమ్మకానికి వెళ్ళే కార్యక్రమానికి మారింది, ఇది చందాదారులకు శనివారం అందించబడుతుంది. ఈ పత్రిక వాస్తవానికి 1923లో ప్రారంభమైనపుడు శుక్రవారం ప్రచురితమయ్యేది.

2007 ప్రారంభంలో, "సంపాదక మార్పుల" కారణంగా సంవత్సరం యొక్క మొట్టమొదటి సంచిక సుమారుగా ఒకవారం పాటు ఆలస్యమైంది. ఈ మార్పులలో 49 మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు.[6]

2009లో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా టైమ్ వార్నర్ ప్రచురణల నుండి విషయాలను కలిపి, మైన్ పేరిట వ్యక్తిగత ముద్రణ పత్రికను తీసుకు వస్తున్నట్టూ టైమ్ ప్రకటించింది. ఈ క్రొత్త పత్రికకు అంతగా ఆదరం లభించలేదు, నిజంగా వ్యక్తిగతంగా ఉండడానికి ఇందులో విషయాలు మరీ విస్తృతమైనవిగా ఇది విమర్శలకు గురైంది.[7]

ఈ పత్రిక యొక్క ప్రతి ప్రచురిత శీర్షికనూ ఫార్మాట్ (అందమైన అమరిక) చేయని అక్షరాలతో ఆన్‍లైన్ ఆర్కైవ్‍లో ఉంచుతుంది. ఈ శీర్షికలు విషయసూచికను కలిగి ఉంటాయి మరియు వీటిని ఆప్టికల్ కారెక్టర్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉపయోగించి స్కాన్ చేసిన చిత్రాల నుండి మార్చడం జరిగింది. డిజిటల్ రూపానికి మార్చడంలో అవశేషాలుగా అక్షరాలలో ఇప్పటికీ చిన్న తప్పులు కనిపిస్తూ ఉంటాయి.

న్యాయసంబంధ వివాదం

సెప్టెంబర్ 10, 2007 నాడు, ఇండోనేషియన్ సుప్రీం కోర్ట్ మాజీ ఇండోనేషియన్ రాష్ట్రపతి సుహార్తోకు టైమ్ ఆసియా పత్రిక నుండి నష్టపరిహారం అందించింది, ఇందులో అతడికి పరువునష్టం కొరకు ఒక ట్రిలియన్ రుపయ్యాలు చెల్లించవలసిందిగా ఆదేశించింది. అప్పీల్ కోర్ట్ మరియు సెంట్రల్ జకార్తా డిస్ట్రిక్ట్ కోర్ట్ యొక్క తీర్పును (2000 మరియు 2001లలో ఇవ్వబడినది) ఇక్కడి ఉన్నత న్యాయస్థానం తలక్రిందులు చేసింది. తాను చౌర్యం చేసిన ధనాన్ని విదేశాలకు తరలించినట్టూ ప్రచురించిన 1999 వ్యాసం గురించి US-ఆధారిత టైమ్ పత్రిక నుండి సుహార్తో తన దావాలో US$27 బిలియన్ ($32bn) కోరాడు.[8]

చెలామణి

టైమ్ పత్రిక యొక్క సంవత్సరవారీ ధరచెల్లించిన చెలామణి
సంవత్సరాలు 1997 1998 1999 2000 2001 2002 2003 2004 2005 2006 2007 2008 2009
చెలామణి (మిలియన్లు) 272.2 5-1 5-1 5-1 5-1 5-1 5-1 [4] ^ 3 [4] ^ 3 5-1 3.4 3.4 3.4

2009 ద్వితీయార్థంలో, ఈ పత్రిక తన న్యూస్‍స్టాండ్ అమ్మకాలలో 34.9% క్షీణత చవిచూసింది.[9] 2010 ప్రథమార్థంలో టైమ్ పత్రిక అమ్మకాలలో మరొకమారు కనీసం మూడవ వంతు క్షీణత కనిపించింది. 2010 ద్వితీయార్థంలో టైమ్ పత్రిక న్యూస్‍స్టాండ్ అమ్మకాలు సుమారు 12% క్షీణించి, కేవలం వారానికి 79 వేల కాపీలకు పడిపోయాయి.

శైలి

నిర్దిష్ట టైమ్ రచనా శైలిని 1936లో వాల్కాట్ గిబ్స్ ది న్యూ యార్కర్ పత్రికలోని వ్యాసంలో అనుకరించాడు: "వాక్యాలు వెనుకకు నడుస్తాయి, మెదడులో తిరిగేవరకూ[…] ఇదంతా ఎక్కడ అంతమవుతుందో, దేవుడికి తెలుసు!"Empty citation (help) నిరంతరం తల్లక్రిందులుగా ఉండే వాక్యాల ప్రారంభ దినాలు, "పూసలవంటి-కళ్ళ వ్యాపారులు" మరియు "గొప్ప మరియు మంచి స్నేహితులు", వంటివి చాలాకాలం క్రితం అంతరించాయి.

మధ్య-1970లు లేదా సుమారుగా ఆ సమయం వరకూ,[10] టైమ్ ఒక వారం వారం నడిచే విభాగం "లిస్టింగ్స్" పేరిట ప్రచురించేది, ఇందులో ది న్యూ యార్కర్ యొక్క విభాగం "ప్రస్తుత సంఘటనలు" వంటి, అప్పటికి-వర్తమాన ముఖ్య చలనచిత్రాలు, నాటకాలు, సంగీతరూపకాలు, దూరదర్శన్ కార్యక్రమాలు, మరియు అత్యధికంగా అమ్ముడయే సాహిత్యం గురించి చిన్న సారాంశాలు మరియు/లేదా సమీక్షలు ఉండేవి.

1927లో ప్రారంభమైన టైమ్ యొక్క ఎర్ర అంచు సైతం ప్రముఖమైనది, అప్పటి నుండి ఇది కేవలం రెండు సార్లు మార్చబడింది. సంయుక్త రాష్ట్రాలపై సెప్టెంబర్ 11 దాడుల తరువాత వెనువెంటనే ప్రచురితమైన ప్రతికి సంతాప సూచకంగా నల్ల అంచు ముద్రించడం జరిగింది. కానీ, ఈ ప్రతి ఆ సంచలనాత్మక సంఘటన వివరాలకై వెనువెంటనే ప్రత్యేకంగా "అదనపు" ప్రతిగా ముద్రించబడింది; తరువాతి యథాప్రకారం ప్రచురణ ఎర్ర అంచుతో వెలువడింది. చిహ్నంగా మారిన ఎర్ర అంచుకు సియాటిల్ యొక్క ది స్ట్రేంజర్ (వార్తాపత్రిక) 2010లో శ్రద్ధాంజలి లేదా అధిక్షేపణం ప్రచురించింది.[11]

అదనంగా, ఏప్రిల్ 28, 2008 టైమ్ సంచికలో[12] ప్రముఖమైన ఎర్ర అంచు మార్చబడింది: పర్యావరణ సమస్యలకు అంకితమిచ్చిన 2008 భూ దినోత్సవం సంచిక ఆకుపచ్చ అంచుతో వెలువడింది.[13]

2007లో టైమ్ ఈ పత్రికకు వినూత్న శైలిని రూపకల్పన చేసింది. ఇతర మార్పులే కాక, ఈ పత్రిక శీర్షికా కథనాలను పెంచడానికి ఎర్రని ముఖచిత్రపు అంచును తగ్గించడం, కథనాల శీర్షికల పరిమాణాన్ని పెంచడం, శీర్షికా కథనాల సంఖ్యను తగ్గించడం, వ్యాసాల చుట్టూ తెల్లని స్థలం పెంచడం, మరియు రచయితల ఫొటోలతో పాటుగా అభిప్రాయాలనూ ప్రచురించడం వంటివి చోటుచేసుకున్నాయి. ఈ మార్పులు విమర్శలు మరియు ప్రశంసలు రెండింటికీ గురయ్యాయి.[14][15][16]

ప్రత్యేక ప్రచురణలు

సంవత్సరపు ప్రసిద్ధ వ్యక్తి

టైమ్ ' యొక్క చరిత్రలో అత్యంత ప్రసిద్ధ శీర్షిక ఎల్లప్పుడూ వార్షిక "సంవత్సరపు ప్రసిద్ధ వ్యక్తి" (మునుపు "సంవత్సరపు ప్రసిద్ధ పురుషుడు") ముఖచిత్ర కథనం, ఇందులో ఆ సంవత్సరపు వార్తలపై అత్యధిక ప్రభావం చూపిన ఒక వ్యక్తి లేదా వ్యక్తుల బృందాన్ని టైమ్ గుర్తిస్తుంది. ఈ శీర్షికకు విరుద్ధంగా, గ్రహీతలు అవశ్యంగా వ్యక్తులు లేదా చివరికి మానవులే కానక్కర్లేదు - ఉదాహరణకు, 1982లో ఈ సంవత్సరపు ప్రసిద్ధ "వ్యక్తి"గా పర్సనల్ కంప్యూటర్ నిలిచింది. దీనిని "సంవత్సరపు యంత్రం"గా గుర్తిచడం జరిగింది (Time.com). 1989లో "అంతరించిపోతున్న భూమి"ని "సంవత్సరపు గ్రహం"గా ఎన్నుకోవడం జరిగింది. 1999లో, ఆల్బర్ట్ ఐన్‍స్టీన్ టైమ్ ద్వారా శతాబ్దపు వ్యక్తిగా ఎన్నుకోబడ్డాడు.

అప్పుడప్పుడూ నియంతలు మరియు యుద్ధపిపాసులుగా పేరొందిన వారిని "సంవత్సరపు ప్రసిద్ధ వ్యక్తులు"గా ఎన్నుకోవడం వలన వివాదాలకు తెరలేచేది. ఈ గుర్తింపు నిజానికి సంవత్సరపు దిశానిర్దేశంపై మంచికో లేదా చెడుకో అత్యంత ప్రభావం చూపిన వ్యక్తి; కాబట్టి ఇది నిర్దిష్టంగా ఒక గౌరవం లేదా బహుమతి కాదు. గతంలో, అడాల్ఫ్ హిట్లర్ మరియు జోసెఫ్ స్టాలిన్ వంటి వ్యక్తులు సైతం సంవత్సరపు ప్రసిద్ధ వ్యక్తులుగా ఎంపికయ్యారు.

2006లో, సంవత్సరపు ప్రసిద్ధ వ్యక్తి "నీవు"గా చెప్పబడింది, ఈ ప్రయత్నం విభిన్న సమీక్షలను ఎదుర్కొంది. కొందరు ఈ భావన సృజనాత్మకంగా ఉందని భావించారు; ఇతరులు వాస్తవమైన సంవత్సరపు ప్రసిద్ధ వ్యక్తిని కోరుకున్నారు. అది తప్పైతే, "మేము దానిని ఒకసారే చేస్తాం" అని, సంపాదకుడు స్టెంగెల్ ఉద్ఘాటించాడు.[17]

2008లో సంవత్సరపు ప్రసిద్ధ వ్యక్తి బారాక్ ఒబామా కాగా, సారా పాలిన్ ద్వితీయ స్థానం సాధించారు. కేవలం గెరాల్డ్ ఫోర్డ్ మినహా, ఫ్రాన్క్లిన్ రూస్వెల్ట్ నుండి ఈ గౌరవం పొందిన U.S. ప్రెసిడెంట్ (లేదా ప్రెసిడెంట్-పోటీదారు)లలో ఒబామా పన్నెండవ వ్యక్తి.

మరీ ఇటీవలే ఎన్నికైన సంవత్సరపు ప్రసిద్ధ వ్యక్తి మార్క్ జుకర్బర్గ్, ఇతడిని డిసెంబర్ 2010లో ఎన్నుకోవడం జరిగింది. టైమ్ యొక్క సంవత్సరపు ప్రసిద్ధ వ్యక్తికై ఆన్‍లైన్ ఎన్నికలో ఇటీవలి విజేత జూలియన్ అస్సాన్జ్.

టైమ్ 100


ఇటీవలి సంవత్సరాలలో టైమ్ సంవత్సరం యొక్క 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల వార్షిక జాబితా తయారుచేస్తోంది. నిజానికి, వారు 20వ శతాబ్దం యొక్క 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా తయారుచేశారు. ఈ సంచికలలో ముఖచిత్రంపై జాబితాలోని వ్యక్తుల చిత్రాలు ఉంటాయి, మరియు జాబితాలోని ప్రతి వ్యక్తి గురించిన 100 వ్యాసాలలో పత్రికలో విశదంగా వివరించబడి ఉంటుంది. కొన్ని సందర్భాలలో, ఇరువురు కలిసి ఒక స్థానాన్ని పంచుకున్నప్పుడు, ఇందులో 100 పైగా వ్యక్తులు కూడా ఉండడం జరిగింది.

ఈ పత్రిక "ఆల్-టైమ్ 100 బెస్ట్ నావల్స్" మరియు "ఆల్-టైమ్ 100 బెస్ట్ మూవీస్" జాబితాలను 2005లోనూ,[18][19][20] మరియు "ది 100 బెస్ట్ TV షోస్ అఫ్ ఆల్-టైమ్ " జాబితాను 2007లోనూ తయారుచేసింది.[21]

టైమ్ ఫర్ కిడ్స్

యువ విలేఖరులు వ్రాసే టైమ్ ఫర్ కిడ్స్ అనేది ముఖ్యంగా పిల్లల కొరకు ప్రచురితమై, ప్రధానంగా తరగతులలో పంపిణీ అయ్యే టైమ్ యొక్క విభాగ పత్రిక. TFK లో కొన్ని జాతీయ వార్తలు, ఒక " వారపు కార్టూన్", మరియు ప్రసిద్ధ సంస్కృతి గురించి వైవిద్యభరిత వ్యాసాలూ ఉంటాయి. సుమారుగా U.S. పాఠశాల కాలావధి ముగిసే సమయానికి పర్యావరణం గురించి ఒక వార్షిక సంచిక పంపిణీ అవుతుంది. ఈ ప్రచురణ మొదటి నుండి చివరి వరకూ కలిపి పదిహేను పేజీలు దాటదు. ఇది ఎన్నో గ్రంథాలయాలలో ఉపయోగించడం జరుగుతుంది.

సిబ్బంది

సంపాదకులు

 • బ్రిటన్ హాడెన్ (1923–1929)
 • హెన్రీ లూస్ (1929–1949)
 • థామస్ S. మాథ్యూస్ (1949–1953)

నిర్వహణా సంపాదకులు

 • థామస్ S. మాథ్యూస్ (1943–1949)
 • రాయ్ అలెగ్జాండర్ (1949–1960)
 • ఓట్టో ఫ్యూర్బ్రింగర్ (1960–1968)
 • హెన్రీ గ్రంవల్డ్ (1968–1977)
 • రే కేవ్ (1979–1985)
 • జేసన్ మెక్‍మానస్ (1985–1987)
 • హెన్రీ ముల్లర్ (1987–1993)
 • జేమ్స్ R. గైన్స్ (1993–1995)
 • వాల్టర్ ఐజాక్సన్ (1996–2000)
 • జిమ్ కెల్లీ (2001–2006)
 • రిచర్డ్ స్టెంగెల్ (2006–ప్రస్తుతం వరకూ)

ప్రధాన రచయితలు

 • అరవింద్ అడిగ, మూడేళ్ళపాటు టైమ్ పత్రికాప్రతినిదిగా పనిచేశాడు, 2008లో కాల్పనికరచనకు మాన్ బుకర్ ప్రైజ్ విజేత
 • జేమ్స్ ఆగీ, టైమ్ యొక్క పుస్తక మరియు చలనచిత్ర సంపాదకుడు
 • లసంత విక్రెమతుంగే, విలేఖరి
 • మార్గరెట్ కార్ల్సన్, టైమ్ యొక్క మొట్టమొదటి స్త్రీ విలేఖరి
 • విట్టేకర్ చాంబర్స్, 1939 నుండి 1948 వరకూ టైమ్ ఉద్యోగి, చివరికి సీనియర్ సంపాదకుడిగా మరియు హెన్రీ లూస్ యొక్క ప్రత్యేక ప్రాజెక్టుల సంపాదకుడిగా ఎదిగిన వ్యక్తి
 • రిచర్డ్ కార్లిస్, ఈ పత్రికకు 1980 నుండి చలనచిత్ర విమర్శకుడు
 • నాన్సీ గిబ్స్, వ్యాసరచయిత్రి మరియు ప్రధాన-సంపాదకురాలు; 100కు పైగా టైమ్ ముఖచిత్ర కథనాల్ని వ్రాసింది
 • లెవ్ గ్రాస్మన్, బత్షేబ మరియు ఆస్టిన్ యొక్క సోదరుడు, ప్రధానంగా ఈ పత్రికలో పుస్తకాల గురించి వ్రాస్తాడు
 • రాబర్ట్ హగ్స్, టైమ్ యొక్క దీర్ఘ-కాల కళా విమర్శకుడు
 • జో క్లెయిన్, రచయిత (ప్రైమరీ కలర్స్ ) మరియు పత్రికకై "ఇన్ ది ఎరీనా" శీర్షిక వ్రాసే వ్యక్తి
 • ఆండ్రే లాగేర్రే, పారిస్ బ్యూరో చీఫ్ 1948-1956, లండన్ బ్యూరో చీఫ్ 1951-1956, అంతేకాక టైమ్ యొక్క క్రీడావార్తల రచయిత; తరువాత ఎంతో కాలం స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ యొక్క నిర్వహణా సంపాదకుడు
 • నాథనియెల్ లాండే, రచయిత, చిత్రనిర్మాత, మరియు టైమ్ యొక్క మాజీ సృజనాత్మక దర్శకుడు
 • విల్ లాంగ్ జూ. 1936–1968 , టైమ్ లైఫ్ ఇంటర్నేషనల్
 • మైకేల్ షూమన్, ఆసియన్ ఆర్థికశాస్త్రం, రాజనీతి మరియు చరిత్రలో కృషి చేసిన అమెరికన్ రచయిత మరియు విలేఖరి, ప్రస్తుతం హాంగ్ కాంగ్ లోని టైమ్ పత్రిక యొక్క ఆసియా వ్యాపార ప్రతినిధి
 • రాబర్ట్ D. సైమన్ 1950–1987 , టైమ్ లైఫ్ ఇంటర్నేషనల్
 • జోయెల్ స్టెయిన్, 2006 లో టైమ్ పత్రిక యొక్క అత్యంత ప్రభావంతమైన సంచిక తరువాత వెనువెంటనే జోయెల్ 100 వ్రాసిన శీర్షికా రచయిత
 • డేవిడ్ వాన్ డ్రేహ్లే, ప్రస్తుత ప్రధాన-సంపాదకుడు
 • ఫరీద్ జాకారియా, ప్రస్తుత ప్రధాన-సంపాదకుడు

వీటిని కూడా చూడండి

 • టైం పత్రిక ముఖ చిత్రంపై వ్యక్తుల జాబితా
 • "ది త్రైవింగ్ కల్ట్ అఫ్ గ్రీడ్ అండ్ పవర్", సైంటాలజీ గురించి రిచర్డ్ బెహర్ 1991 లో వ్రాసిన వ్యాసం, దీనికి గెరాల్డ్ లోయెబ్ అవార్డు లభించింది.

సూచనలు

 1. TIME Canada
 2. http://www.timeవార్నర్.com/corp/newsroom/pr/0,20812,1977391,00.html
 3. "History of TIME". TIME magazine.
 4. "హెన్రీ R. లుసి", in కర్రెంట్ బియోగ్రఫి 1941, పే530
 5. ఇన్స్టంట్ హిస్టరీ: రివ్యు అఫ్ ఫస్ట్ ఇష్యు విత్ కవర్
 6. "Time Inc. Layoffs: Surveying the Wreckage". Gawker. Retrieved డిసెంబరు 15, 2007.
 7. "Time's foray into personal publishing". ఏప్రిల్ 27, 2009. Retrieved డిసెంబరు 15, 2007.
 8. News.com.au, ద్వంసం లో సుహార్తో $128m గెలుపొందారు[dead link]
 9. Clifford, Stephanie (ఫిబ్రవరి 8, 2010). "Magazines' Newsstand Sales Fall 9.1 Percent". The New York Times.
 10. Time http://www.time.com/time/archive. Missing or empty |title= (help)
 11. http://www.thestranger.com/seattle/great-american-novelist/Content?oid=4940853
 12. ఏప్రిల్ 28, 2008 గ్రీన్ బోర్డర్ ఇష్యు
 13. ఆండ్రియా మిత్చేల్ చే MSNBC-TV నివేదిక, ఏప్రిల్ 17, 2008, 1:45PM .
 14. "The Time of Their Lives".
 15. "Does The Redesign of Time Magazine Mean It Has A New Business Model As Well?".
 16. Will, George F. (డిసెంబరు 21, 2006). "Full Esteem Ahead". The Washington Post.
 17. "The Time of Their Lives". Retrieved ఏప్రిల్ 22, 2007.
 18. Corliss, Richard (2005). "All-TIME 100 Movies". Time. Time.com. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 19. "Best Soundtracks". Time. Time.com. 2005.
 20. Corliss, Richard (జూన్ 2, 2005). "That Old Feeling: Secrets of the All-Time 100". Time.com. Archived from the original on సెప్టెంబరు 18, 2012.
 21. Poniewozik, James (2007). "The 100 Best TV Shows of All-TIME". Time. Time.com.

మరింత చదవడానికి

 • Chambers, Whittaker (1952). Witness. New York: Random House. p. 799. ISBN 52-5149 Check |isbn= value: length (help). Check |authorlink= value (help)
 • లున్ద్బెర్గ్, ఫెర్డినాండ్. అమెరికాస్ సిక్స్టి ఫ్యామిలీస్. న్యూయార్క్: వనుగార్డ్ ముద్రణ 1937
 • స్వంబెర్గ్, W. A. లూస్ అండ్ హిస్ ఎంపైర్ . న్యూయార్క్: స్క్రిబ్నర్, 1972
 • విల్నర్, ఇసయ్య. ది మాన్ టైమ్ ఫర్గట్: ఏ టెల్ అఫ్ జీనియస్, బిట్రేయల్, అండ్ ది క్రియేషన్ అఫ్ టైమ్ పత్రిక, హర్పెర్ కొల్లిన్స్, న్యూ యార్క్, 2006

బాహ్య లింకులు

మూస:Time Warner మూస:EnglishCurrentAffairs మూస:50 largest US magazines