ట్యాంకర్ (ఓడ)

From tewiki
Jump to navigation Jump to search
వ్యాపారాత్మక ముడి చమురు సూపర్‍ట్యాంకర్ అబ్‍కైక్.

ట్యాంకర్ (లేదా ట్యాంక్ షిప్ లేదా ట్యాంక్‍షిప్ ) అనేది ద్రవాలను పెద్దమొత్తంలో రవాణా చేసేందుకు నిర్మితమైన ఓడ. ట్యాంక్‍షిప్ యొక్క ప్రధాన రకాలు చమురు ట్యాంకర్, రసాయనిక ట్యాంకర్, మరియు ద్రవీకృత సహజ వాయు వాహకం.

నేపథ్యం

ట్యాంకర్లు చిన్న ఓడరేవులు మరియు తీర ప్రాంతాలకు సేవలు అందించే ఓడలతో కూడిన కొన్ని వందల టన్నుల సామర్థ్యం కలిగిన పరిమాణం నుండి, దీర్ఘ-పరిధి రవాణాకు ఉపయోగించే ఎన్నో వందల వేల టన్నుల సామర్థ్యం కలిగిన వాటి వరకూ ఉంటాయి. మహాసముద్రంలో లేదా సముద్రాలలో ప్రయాణం చేసే ట్యాంకర్లు మాత్రమే కాకుండా, ఎన్నో ప్రత్యేకమైన దేశీయ-జలమార్గాలలో కొన్ని వేల టన్నుల వరకూ సగటు సరుకు సామర్థ్యం కలిగి, నదులు మరియు కాలువలలో ప్రయాణించే ట్యాంకర్లు కూడా ఉన్నాయి. ట్యాంకర్లు విస్తారమైన పరిధి కలిగిన ఉత్పత్తులను రవాణా చేస్తాయి, అవి:

ట్యాంకర్లు అనే భావన, 19వ శతాబ్దం చివరి సంవత్సరాలలో ప్రారంభం కావడం వలన, సాపేక్షంగా ఆధునికమైనది. ఇంతకూ మునుపు, పెద్దమొత్తంలో ద్రవాలు రవాణా చేయడం అనే ఆలోచనకు సాంకేతికత సహకారం ఉండేది కాదు. మార్కెట్ సైతం పెద్దమొత్తంలో సరకు రవాణా లేదా అమ్మకం వైపు దృష్టి సారించలేదు, కాబట్టి చాలావరకూ ఓడలు విస్తారమైన పరిధి కలిగిన వివిధ ఉత్పత్తులను వివిధ నిల్వలలో రవాణా చేసి, నిర్దిష్ట మార్గాలకు వెలుపల వ్యాపారం చేసేవి. ద్రవాలను సామాన్యంగా పేటికలలో నింపేవారు—కాబట్టి "టన్నేజ్ (పరిమాణం)", ఇది రవాణా చేయగల మధ్యపు (పేటికలు) టన్ (252 గాలన్ల పేటిక)లను సూచిస్తుంది. చివరికి నావికుల జీవనానికి అత్యవసరమైన త్రాగు నీరు సైతం పేటికల్లో నింపబడేది. మునుపటి ఓడలలో పెద్దమొత్తంలో ద్రవాలు రవాణా చేయడంలో ఎన్నో సమస్యలు ఉండేవి:

 • పేటికలు: కలపతో తయారు చేసిన ఓడలలోని పేటికలకు నీరు, చమురు లేదా గాలి చొరని సామర్థ్యం ఉండేది, కాదు, దీంతో అందులోని సరుకైన ద్రవం చెడిపోవడం లేదా కారడం నివారించడం కష్టమయ్యేది. ఇనుము మరియు స్టీల్ స్వరూపాల అభివృద్ధితో ఈ సమస్య పరిష్కారమైంది.
 • నింపడం మరియు తొలగించడం: పెద్దమొత్తంలో ద్రవాలు పంప్ చేయవలసి ఉంటుంది - ట్యాంకర్ అభివృద్ధిలో మెరుగైన పంపులు మరియు పైపింగ్ వ్యవస్థలు అభివృద్ధి చేయడం ఎంతో ముఖ్యం. ప్రారంభంలో పంపింగ్ వ్యవస్థలలో ఆవిరి ఇంజన్లను ప్రధాన పాత్ర పోషించేందుకు అభివృద్ధి చేయడం జరిగింది. నిర్దిష్టమైన సరకు లావాదేవీ సౌకర్యాలు మరియు అటువంటి పరిమాణంలో సరకును అందుకునే మార్కెట్ సైతం ప్రస్తుతం తీరాన అవసరమయ్యాయి. పేటికలను సాధారణ క్రేన్లు ఉపయోగించి దించడం జరిగేది, మరియు పేటికల అనుపయుక్త స్వభావం వలన, ద్రవ పరిమాణం ఎల్లప్పుడూ కొద్దిగా తక్కువగానే ఉండేది - కాబట్టి మార్కెట్ మరింత స్థిరంగా ఉండేది.
 • విస్తార ఉపరితల ప్రభావం: ఒక ఓడలోని ద్రవం యొక్క భారీ ఉపరితల విస్తీర్ణం సదరు ఓడ స్థిరత్వంపై ప్రభావం చూపుతుంది. చూడండి నౌకా నిర్మాణశాస్త్రం. పేటికలలోని ద్రవాలు సమస్యను సృష్టించేవి కావు, కానీ ఓడ యొక్క దూలంపై ఉంచిన ఒక్క ట్యాంక్ సైతం స్థిరత సమస్యను కలిగించవచ్చు. ట్యాంకుల విస్తారమైన ఉపవిభజన ఈ సమస్యను పరిష్కరించింది.

చివరికి, చమురు సంస్థలు వారి ముడిచమురు ఉత్పత్తులను వినియోగదారులకు రవాణా చేసేందుకు చవకైన మార్గాలను అన్వేషించడంతో, ట్యాంకర్ అనేది చమురు పరిశ్రమలో ప్రారంభమైంది. చమురు ట్యాంకర్ ఆవిర్భవించింది. నేడు, చాలావరకూ పెద్దమొత్తంలో ద్రవాలు రవాణా చేయడం అనేది చవకగా మారింది, మరియు ప్రతి ఉత్పత్తికీ నిర్దిష్టమైన కేంద్రాలు ఉన్నాయి. ఉత్పత్తిని చిన్న వినియోగదారులకు అందించేందుకు చిన్న పరిమాణాలలో విభజించే వరకూ నిల్వ చేసేందుకు తీరంలో భారీ నిల్వ ట్యాంకులు ఉపయోగిస్తారు.

డబ్లిన్లోని గిన్నిస్ బ్రూయరీ సంస్థ సైతం UKకు ప్రసిద్ధ స్టౌట్ (ఒక రకం మద్యం) ఎగుమతి చేయడానికి ఒక ట్యాంకర్ దళం కలిగి ఉండేది.

వివిధ ఉత్పత్తులకు వివిధ రకాల వ్యవహారం మరియు రవాణా అవసరమవుతాయి. కాబట్టి "రసాయన ట్యాంకర్లు" మరియు "చమురు ట్యాంకర్లు" వంటి ప్రత్యేక రకం ట్యాంకర్లు నిర్మించడం జరిగింది. సామాన్యంగా "LNG వాహకాలు"గా పిలువబడేవి ద్రవీకృత సహజ వాయువును రవాణా చేసేందుకు తయారుచేసిన సాపేక్షంగా అరుదైన ట్యాంకర్.

చమురు ట్యాంకర్లలో సూపర్‌ట్యాంకర్లు అనేవి మధ్య ప్రాచ్యం నుండి ఆఫ్రికా శృంగం చుట్టూ చమురు రవాణా చేయడానికి తయారు చేయబడ్డాయి. 2010లో తుక్కుగా మార్చిన సూపర్‌ట్యాంకర్ సీవైజ్ జయింట్, 458 మీటర్ల (1504 అడుగులు) పొడవైనది మరియు 69 మీ (226 అ) వెడల్పైనది.

పైప్‍లైన్ రవాణా మరియు రైల్‌తో పాటుగా సూపర్‌ట్యాంకర్లు, భారీ పరిమాణంలో చమురు రవాణా చేయడానికి ఎంచుకునే మూడు ప్రధాన పద్ధతులలో ఒకటిగా ఉన్నాయి. కఠిన నియంత్రణలు ఉన్నప్పటికీ, ట్యాంకర్లు చమురు స్రావణం కలిగించడం ఫలితంగా పర్యావరణ వైఫల్యాలకు కారణమయ్యాయి. తీరప్రాంత దుర్ఘటనల ఉదాహరణలకు చూడండి ఎక్సాన్ వాల్డెజ్ , బ్రయెర్ , ప్రేస్టిజ్ చమురు స్రావణం , టోరీ కాన్యన్ , మరియు ఎరికా .

ట్యాంకర్ సామర్థ్యం

ద్రవ ఇంధనాలకై ఉపయోగించే ట్యాంకర్లు వాటి సామర్థ్యాన్ని అనుసరించి వర్గీకరింపబడతాయి.

1954లో షెల్ ఆయిల్ వివిధ పరిమాణాల ట్యాంకర్లను వర్గీకరించే సగటు భార ధర అంచనా (average freight rate assessment) (AFRA) వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీనిని స్వతంత్ర సాధనంగా రూపొందించేందుకు, లండన్ ట్యాంకర్ బ్రోకర్స్ పానెల్ (LTBP) ను షెల్ సంప్రదించింది. మొదట, వారు ఈ సమూహాలను మూస:DWT కంటే తక్కువైన సాధారణ ప్రయోజన ట్యాంకర్లు; 25,000 మరియు మూస:DWT మధ్యలో మధ్యమ పరిధి ఓడలు, మరియు మూస:DWT కంటే పెద్దవైన అప్పట్లో-అత్యంత భారీవైన భారీ పరిధి ఓడలుగా విభజించారు. ఈ ఓడలు 1970లలో మరింత భారీగా తయారయ్యాయి, దాంతో టన్నులు సుదీర్ఘ టన్నులు అయిన విధంగా ఈ జాబితాను విస్తరించడం జరిగింది:[1]

 • 10,000–మూస:DWT: సాధారణ ప్రయోజన ట్యాంకర్
 • 25,000–మూస:DWT: మధ్యమ పరిధి ట్యాంకర్
 • 45,000–మూస:DWT: భారీ పరిధి 1 (LR1)
 • 80,000–మూస:DWT: భారీ పరిధి 2 (LR2)
 • 160,000–మూస:DWT: అతి భారీ ముడి చమురు వాహకం (Very Large Crude Carrier) (VLCC)
 • 320,000–మూస:DWT: అత్యంత భారీ ముడిచమురు వాహకం (Ultra Large Crude Carrier) (ULCC)
పెట్రోలియం ట్యాంకర్లు
తరగతి పొడవు వెడల్పు ముసాయిదా సామాన్య కనిష్ఠ DWT సామాన్య గరిష్ఠ DWT
సీవేమాక్స్ 226 మీ 24 మీ 7.92 మీ మూస:DWT మూస:DWT
పనామాక్స్ 228.6 మీ 32.3 మీ 12.6 మీ మూస:DWT మూస:DWT
అఫ్రామాక్స్ 253.0 మీ 44.2 మీ 11.6 మీ మూస:DWT మూస:DWT
సూయజ్‍మాక్స్ 16 మీ మూస:DWT మూస:DWT
VLCC (మలక్కామాక్స్) 470 మీ 60 మీ 20 మీ మూస:DWT మూస:DWT
ULCC మూస:DWT మూస:DWT

మూస:DWT నుండి మూస:DWT వరకూ పరిమాణం కలిగిన సుమారు 380 ఓడలు ఉన్నాయి, ఇవి భారీ అయిన VLCCలలో అత్యంత ప్రసిద్ధమైనవి. కేవలం ఏడు ఓడలు మాత్రమే ఇంతకన్నా భారీగా ఉంటాయి, మూస:DWT మరియు మూస:DWT మధ్య పరిమాణంలో సుమారు 90 ఉన్నాయి.[2]

Distribution of supertanker sizes.png

ప్రపంచంలోని నౌకాదళాలు

ఫ్లాగ్ స్టేట్స్

2005 నాటికి, యునైటెడ్ స్టేట్స్ మారిటైం అడ్మినిస్ట్రేషన్ యొక్క గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 4,024 ట్యాంకర్లు మూస:DWT లేదా పెద్ద పరిమాణం కలిగినవి ఉన్నాయి.[3] వీటిలో 2,582 రెండు రెట్లు దృఢమైన నిర్మాణం కలిగి ఉన్నాయి. పనామా 592 నమోదైన ఓడలతో ట్యాంకర్లకు సంబంధించి ప్రధాన ఫ్లాగ్ స్టేట్. ఐదు ఇతర ఫ్లాగ్ స్టేట్లలో రెండు వందలకు పైగా నమోదైన ట్యాంకర్లు ఉన్నాయి: లైబీరియా (520), ది మార్షల్ ఐలాండ్స్ (323), గ్రీస్ (233), సింగపూర్ (274) మరియు ది బహామాస్ (215). ఈ ఫ్లాగ్ స్టేట్స్ సైతం నిశ్చలభార పరిమాణసామర్థ్యం నౌకాదళ పరిమాణంలో మొదటి ఆరింట ఉన్నాయి.[3]

అత్యంత భారీ నౌకాదళాలు

గ్రీస్, జపాన్, మరియు సంయుక్త రాష్ట్రాలు ట్యాంకర్ల సంఖ్యలో మొదటి మూడు దేశాలు, ఇవి వరుసగా 733, 394, మరియు 311 ఓడలు కలిగి ఉన్నాయి. ఈ మూడు దేశాలకు కలిపి 1,438 ఓడలు లేదా ప్రపంచ నౌకాదళంలో 36% పైగా ఉన్నాయి.[3]

నిర్మాతలు

ఆసియన్ సంస్థలు ట్యాంకర్ల నిర్మాణంలో ఆధిపత్యంలో ఉన్నాయి. ప్రపంచంలోని 4,024 ట్యాంకర్లలో, 2,822 లేదా 70% పైగా దక్షిణ కొరియా, జపాన్ లేదా చైనాలలో తయారయ్యాయి.[3]

వీటిని కూడా చూడండి

 • హైడ్రోజన్ ట్యాంకర్
 • ట్యాంకర్ల జాబితా

గమనికలు

 1. Evangelista, Joe, Ed. (2002). "Scaling the Tanker Market" (PDF). Surveyor. American Bureau of Shipping (4): 5–11. Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-02-27. Unknown parameter |month= ignored (help)
 2. Auke Visser (22 February 2007). "Tanker list, status 01-01-2007". International Super Tankers. Retrieved 2008-02-27.
 3. 3.0 3.1 3.2 3.3 Office of Data and Economic Analysis (July 2006). "World Merchant Fleet 2001–2005" (.PDF). United States Maritime Administration. Retrieved on 2008-02-27.

సూచికలు

 • Encyclopædia Britannica (1911). "Petroleum". In Chisholm, Hugh (ed.). Encyclopædia Britannica. 21 (Eleventh ed.). Cambridge: Cambridge University Press. pp. 316–322. OCLC 70608430. Retrieved 2008-02-22.
 • Encyclopædia Britannica (1911). "Ship". In Chisholm, Hugh (ed.). Encyclopædia Britannica. 24 (Eleventh ed.). Cambridge: Cambridge University Press. pp. 881–889. OCLC 70608430. Retrieved 2008-02-22.
 • Hayler, William B. (2003). American Merchant Seaman's Manual. Centerville, MD: Cornell Maritime Press. ISBN 0870335499. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 • Central Intelligence Agency. CIA World Factbook 2008. New York: Skyhorse Publishing. ISBN 1602390800. Retrieved 2008-02-27.
 • Turpin, Edward A. (1980). Merchant Marine Officers' Handbook (Fourth ed.). Centreville, MD: Cornell Maritime Press. ISBN 37812421 Check |isbn= value: length (help). Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)

బాహ్య లింకులు

మూస:ModernMerchantShipTypes మూస:Ship measurements

be-x-old:Танкер

en:Tanker (ship) ca:Petrolier cs:Tanker (loď) cy:Tancer olew da:Tankskib de:Tanker eo:Cisternoŝipo fi:Säiliöalus fr:Navire-citerne gl:Petroleiro he:מכלית hr:Tanker id:Kapal tanker it:Petroliera ja:タンカー ko:유조선 lo:ແທັງເກີ lt:Tanklaivis lv:Tankkuģis nl:Tanker nn:Tankskip no:Tankskip pl:Tankowiec pt:Navio-tanque ru:Танкер sh:Tanker sl:Tanker sv:Tankfartyg tr:Tanker uk:Танкер zh:油轮 zh-yue:運油輪