డర్బన్

From tewiki
Jump to navigation Jump to search
Durban
City
Durban Skyline
Durban Skyline
Countryదక్షిణ ఆఫ్రికా South Africa
ProvinceKwaZulu-Natal
Metropolitan municipalityeThekwini
Established1835
ప్రభుత్వం
 • MayorObed Mlaba (ANC)
విస్తీర్ణం
 • మొత్తం[.89 (884.90 sq mi)
జనాభా
(2007)[2]
 • మొత్తం34,68,086
 • సాంద్రత1,513/km2 (3/sq mi)
కాలమానంUTC+2 (South Africa Standard Time)
పిన్‌కోడ్
4001
ప్రాంతీయ ఫోన్ కోడ్031
జాలస్థలిwww.durban.gov.za

ఎతేక్విని మహానగర పుర పాలక సంస్థలో భాగంగా ఉన్న డర్బన్ (మూస:Lang-zu, ఇతేకులో 'అఖాతం' అని అర్ధం) దక్షిణ ఆఫ్రికాలోని రాష్ట్రమైన క్వాజులు-నాటాల్లో అతి పెద్ద నగరం మరియు దేశంలో మూడవ పెద్ద నగరం. దక్షిణ ఆఫ్రికాలో రద్దీగా ఉండే నౌకాశ్రయంగా డర్బన్ ప్రసిద్ధి చెందింది మరియు నగరం యొక్క వెచ్చని ఉప ఆయనరేఖా శీతోష్ణస్థితి ఇంకా విస్తారమైన సముద్రతీరాల కారణంగా ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా పేరు పొందింది. 2007 కమ్యూనిటీ సర్వే ప్రకారం, డర్బన్ యొక్క జనాభా 3.5 మిలియన్లుగా ఉండి,[2] డర్బన్ ను ఆఫ్రికాఖండం యొక్క తూర్పు తీరంలో అతిపెద్ద నగరంగా మార్చింది. ఇతర దక్షిణ ఆఫ్రికా నగరాలతో పోల్చినపుడు దీని భూభాగం మూస:Km2 to sq mi ఎక్కువగా ఉండి, జనసాంద్రత కొంత తక్కువగా ఉండే విధంగా చేస్తోందిమూస:PD km2 to sq mi.[1]

Contents

చరిత్ర

డ్రాకెన్స్ బర్గ్ గుహలలో కనుగొన్న రాతి కళ యొక్క కార్బన్ డేటింగ్ ప్రకారం డర్బన్ ప్రాంత మొదటి నివాసితులుగా తెలిసినవారు సుమారు క్రీస్తుపూర్వం100,000 ప్రాంతంలో ఉత్తరం నుండి వచ్చారు, ఈ ప్రజలు క్వాజులు-నాటాల్ యొక్క మధ్య మైదానాలలో చివరి సహస్రాబ్దం యొక్క మధ్య భాగంలో ఉత్తరం నుండి వచ్చిన బంటు ప్రజల విస్తరణ జరిగేవరకు నివసించారు.

ఐరోపా నుండి భారతదేశానికి మార్గాన్ని వెదకుతున్నపుడు, 1497లో క్రిస్మస్ అల వద్ద క్వాజులు-నాటాల్ కు సమాంతరంగా ప్రయాణించిన పోర్చుగీస్ అన్వేషకుడైన వాస్కో డ గామా కనుగొనేవరకు ఈ ప్రాంతాన్ని గురించిన లిఖిత చరిత్ర ఏదీ లేకపోవడం వలన, ఈ ప్రారంభ నివాసితుల చరిత్ర గురంచి అంతగా తెలియదు. ఆయన ఈ ప్రదేశానికి "నాటాల్", లేదా పోర్చుగీస్ భాషలో క్రిస్మస్ అని పేరు పెట్టాడు.[3]

మొదట స్థావరం ఏర్పరచుకున్న శ్వేతజాతీయులు

ఆధునిక డర్బన్ నగరం 1824 నుండి ఉంది, ఆ సమయంలో బ్రిటిష్ లెఫ్టినెంట్ F. G. ఫేర్వెల్ నాయకత్వంలో 25 మందితో కూడిన బృందం కేప్ కాలనీ నుండి వచ్చి నేటి ఫేర్వెల్ స్క్వేర్ సమీపంలోని బే అఫ్ నాటాల్ వద్ద ఒక స్థావరాన్ని ఏర్పరుచుకున్నారు. ఫేర్వెల్ తో పాటుగా హెన్రీ ఫ్రాన్సిస్ ఫిన్ (1803–1861) అనే సాహసికుడు కూడా ఉన్నాడు. జులూ కింగ్ షాకకు ఒక యుద్ధంలో కత్తి పోటు వలన అయిన గాయాన్ని నయం చేయడం ద్వారా ఫిన్ ఆయనతో మిత్రత్వాన్ని ఏర్పరచుకున్నాడు. కృతజ్ఞతా సూచనగా, ఆయన ఫిన్ కు ఒక "30-మైళ్ళ పొడవైన సముద్ర తీరాన్ని వంద మైళ్ళ లోతు వరకు" దానం ఇచ్చాడు.[4]

డర్బన్ లోని చారిత్రాత్మక నిర్మాణకళ; డర్బన్ సిటీ హాల్.
1835 జూన్ 23న ఫిన్ ప్రాదేశిక ప్రాంతంలోని 35 మంది శ్వేతజాతి నివాసితుల సమావేశంలో, ఒక ముఖ్య పట్టణాన్ని నిర్మించాలని, మరియు దానికి అప్పటి కేప్ కాలనీ యొక్క పరిపాలకుడైన సర్ బెంజమిన్ డి'అర్బన్ పేరు మీదుగా "డి'అర్బన్" అనే పేరు పెట్టాలని నిర్ణయించారు.[5]

నటాలియా గణతంత్రం

పీటర్మారిట్జ్బర్గ్ వద్ద ముఖ్యపట్టణంతో వూర్ట్రెక్కర్స్ 1838లో రిపబ్లిక్ అఫ్ నటాలియాను స్థాపించారు.

వూర్ట్రెక్కర్స్ ద్వారా జూలు ప్రజలు హింసించబడుతున్నారనే నివేదికలు కేప్ కాలనీకి చేరాయి. బ్రిటిష్ పరిపాలనను పోర్ట్ నాటాల్ లో తిరిగి నెలకొల్పడానికి కేప్ కాలనీ పరిపాలకుడు, కెప్టెన్ చార్లటన్ స్మిత్ నాయకత్వంలో ఒక దళాన్ని పంపాడు. ఈ దళం 1824 మే 4న ఇక్కడకు వచ్చి ఒక కోటను నిర్మించింది, అదే తరువాత ది ఓల్డ్ ఫోర్ట్ అయ్యింది. 23/24 మే 1842 రాత్రి పూట బ్రిటిష్ వారు వూర్ట్రెక్కర్ యొక్క కాన్గెల్ల స్థావరంపై దాడి చేసారు. ఈ దాడి విఫలమైంది మరియు బ్రిటిష్ వారు ఆక్రమణలో ఉన్న వారి స్థావరానికి తిరిగి రావలసివచ్చింది. ఒక స్థానిక వ్యాపారి డిక్ కింగ్ మరియు అతని సేవకుడు న్దొంగేని, ఈ దాడి నుండి తప్పించుకోగలిగి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రాహంస్ టౌన్కు పునర్బలనం పెంచుకోవడానికి వెళ్లారు. ఈ బలగాలు డర్బన్ కు 20 రోజుల తరువాత వచ్చాయి, అప్పటికి వూర్ట్రెక్కర్స్ వెనుకకు వెళ్లి ఆక్రమణను ఎత్తివేశారు.[6]

జులూ జనాభాతో భయంకరమైన పోరాటం డర్బన్ నగరం ఖాళీ కావడానికి దారితీసింది, మరియు చివరికి 1844లో సైనికవత్తిడితో అఫ్రికనర్లు బ్రిటిష్ వారితో కలవడానికి అంగీకరించారు.

బ్రిటిష్ వలస పాలన

వర్ణవివక్ష సమయంలో చిహ్నం

ఈ ప్రాంతం కొరకు ఒక బ్రిటిష్ పరిపాలకుడు నియమించబడ్డాడు మరియు అనేక మంది ఐరోపా మరియు కేప్ కాలనీ నుండి వలస వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు. 1860లలో బ్రిటిష్ వారు పంచదార పరిశ్రమను స్థాపించారు. జూలు కార్మికులను వారి తోటలలో పనిచేయించడంలో తోటల యజమానులు కష్టకాలాన్ని ఎదుర్కున్నారు అందువలన బ్రిటిష్ వారు భారతదేశం నుండి ఐదు-సంవత్సరాల ఒప్పందాలపై వేల మంది ఒప్పంద కార్మికులను తీసుకువచ్చారు. భారతదేశ శ్రామికుల దిగుమతి కారణంగా, డర్బన్ దక్షిణ ఆఫ్రికాలో అతి పెద్ద ఆసియా సమాజంగా మారింది.

డర్బన్ యొక్క చారిత్రాత్మిక రాజచిహ్నములు

1854లో డర్బన్ యొక్క పరిపాలనా విభాగం ప్రకటించబడినప్పుడు, అధికారిక పత్రాల కొరకు కౌన్సిల్ ఒక ముద్రను పొందవలసి వచ్చింది. ఈ ముద్ర 1855లో ప్రవేశపెట్టబడింది మరియు 1882లో మార్చబడింది. ఈ కొత్త ముద్ర శిరస్త్రాణము లేని సైనికుల కోటును లేదా సర్ బెంజమిన్ డి’అర్బన్ మరియు సర్ బెంజమిన్ పైన్ ల సైనిక కోటులు కలిసిన ఉత్తరీయాన్ని కలిగి ఉంది. 1906లో కాలేజ్ అఫ్ అర్మ్స్లో ఈ సైనిక కోటును నమోదు చేయవలసినదిగా దరఖాస్తు చేయబడింది, కానీ ఈ రూపకల్పన డి’అర్బన్ మరియు పైన్ భార్యాభర్తలని సూచిస్తోందనే సాకుతో ఈ దరఖాస్తు తిరస్కరించబడింది. ఏదికాకున్నా, 1912 ప్రాంతంలో ఈ సైనిక కోటు కౌన్సిల్ యొక్క పత్రాలపై కనిపించింది. తరువాత సంవత్సరంలో, ఒక శిరస్త్రాణము మరియు ఉత్తరీయం కౌన్సిల్ యొక్క పత్రాలకు కలుపబడ్డాయి మరియు నూతన నగరచిహ్నం 1936లో తయారు చేయబడింది.

సైనికుల డాలు సౌత్ ఆఫ్రికన్ బ్యూరో అఫ్ హెరాల్డ్రీ వద్ద నమోదు చేయబడి 1979 ఫిబ్రవరి 09న డర్బన్ కు జారీచేయబడింది. 2000లో దక్షిణ ఆఫ్రికా స్థానిక ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణ వలన సైనిక దళాల కోటు నిరుపయోగంగా మారింది. 1995 నుండి చిహ్నం ఉపయోగంలో లేకుండా పోయింది.[7][8]

ప్రస్తుత డర్బన్

ప్రస్తుతం, డర్బన్ ఆఫ్రికాలో అత్యంత రద్దీ గల కంటైనర్ నౌకాశ్రయంగా,[citation needed] మరియు ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. 1970లో పర్యాటకులను స్వాగతించే కేంద్రంగా అభివృద్ధి చేయబడిన గోల్డెన్ మెయిల్, మరియు డర్బన్ మొత్తం, తగినన్ని పర్యాటక ఆకర్షణలను, ప్రత్యేకించి జోహాన్స్బర్గ్ నుండి సెలవుపై వచ్చే వారికొరకు కలిగి ఉంది. అంతర్జాతీయ సెలవు విడిదిగా తనకు పూర్వం ఉన్న ప్రాముఖ్యతను ఇది 1990లలో కేప్ టౌన్కు వదులుకుంది, కానీ దేశీయ పర్యాటకులలో ప్రముఖంగానే నిలిచి ఉంది. జాతీయ పార్కులకు మరియు జులులాండ్ మరియు డ్రాకెన్స్బర్గ్ లోని చారిత్రాత్మక ప్రదేశాలకు ఈ నగరం ప్రవేశ మార్గంగా కూడా ఉంది.

ప్రభుత్వం మరియు రాజకీయాలు

ఎతేక్విని యొక్క మేయర్ ఐదు సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతాడు. 1996 నుండి ఒబెద్ మలబ మేయర్ గా ఉన్నాడు, ఈయన 2006లో ఈ పదవికి మూడవసారి తిరిగి ఎన్నుకోబడ్డాడు.

గుడిసెలలో నివాసం ఉండే వారిని చట్ట ప్రకారం వారికి హక్కు ఉన్న కవాతుకు అనుమతించడంలో మునిసిపాలిటీతో సమస్యలు ఉన్నాయని ఫ్రీడం అఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్స్టిట్యూట్ నివేదించింది.[9]

భూగోళ శాస్త్రం మరియు వాతావరణం

Durban
Climate chart (explanation)
ఫిమామేజూజుసెడి
 
 
134
 
28
21
 
 
113
 
28
21
 
 
120
 
28
20
 
 
73
 
26
17
 
 
59
 
25
14
 
 
28
 
23
11
 
 
39
 
23
11
 
 
62
 
23
13
 
 
73
 
23
15
 
 
98
 
24
17
 
 
108
 
25
18
 
 
102
 
27
20
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: SAWS[10]

డర్బన్, వెచ్చని తడి వేసవులు మరియు తక్కువ తేమ కలిగిన, మంచు లేని శీతాకాలాలతో ఉపఆయనరేఖా శీతోష్ణస్థితిని కలిగి ఉంటుంది. ఏదేమైనా, ఎత్తులలో ఉండే అధిక భేదాల వలన, కొన్ని పశ్చిమ శివారు ప్రాంతాలు కొంత చల్లని శీతాకాలాన్ని కలిగి ఉంటాయి. డర్బన్ 1,009 milliమీటర్లు (39.7 అం.) సాంవత్సరిక వర్షపాతాన్ని కలిగి ఉంది సగటు సాంవత్సరిక ఉష్ణోగ్రత 21 °C (70 °F), పగటి ఉష్ణోగ్రత జనవరి నుండి మార్చి వరకు గరిష్ఠంగా 28 °C (82 °F) ఉంది మరియు కనిష్ఠ ఉష్ణోగ్రత21 °C (70 °F), దినసరి గరిష్ఠ ఉష్ణోగ్రతలు జూన్ నుండి ఆగస్టు వరకు బాగా పడిపోతాయి మరియు23 °C (73 °F) కనిష్ఠ ఉష్ణోగ్రత11 °C (52 °F). డర్బన్ లో వేసవికాలంలో సూర్యోదయం 04h45 *(04h15) మరియు సూర్యాస్తమయం 19h00 *(19h30) వద్ద ఉంటుంది మరియు శీతాకాలంలో సూర్యోదయం 06h30 *(06h10)కు మరియు అస్తమయం 17h20 *(17h00)కు అవుతుంది. (* = సూర్యోదయం మరియు సూర్యాస్తమయం)

పట్టణప్రాంతం స్థలాకృతి కొండలతో నిండి ఉండి, కేంద్ర వ్యాపార జిల్లా మరియు నౌకాశ్రయం యొక్క పరిసర ప్రాంతాలలో మాత్రమే కొన్ని మైదాన ప్రాంతాలను కలిగి ఉంది. పశ్చిమ శివారు ప్రాంతాలకు ప్రక్కన ఉన్న హిల్ క్రెస్ట్ మరియు క్లూఫ్ సముద్ర-మట్టం కంటే ఎత్తుగా ఉండి, బోతా'స్ హిల్ సమాజ ప్రాతంలో, 850 మీటర్లు (2,789 అ.) వరకు ఉంటుంది. పట్టణ ప్రాంతంలో అనేక సన్నటి త్రోవలు మరియు కనుమలు ఉన్నాయి. అక్కడ దాదాపు నిజమైన తీరమైదానం లేదు.

Durban-వాతావరణం
నెల జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు సంవత్సరం
Source: South African Weather Service (Note: These climate records are for the period 1961–1990.) [10]

జనాభా సంఖ్య

ఎతేక్విని మహానగర ప్రాంతంలో జనసాంద్రత [33]
ఎతేక్విని మహానగర ప్రాంతంలో స్వదేశీ భాషల భౌగోళిక పంపిణీ[34][35]

ఆర్థిక వ్యవస్థ

డర్బన్ మెట్రోపాలిటన్ ఏరియా (DMA) బలమైన తయారీ, పర్యాటక, రవాణా, ఆర్థిక మరియు ప్రభుత్వ రంగాలతో పెద్దదైన మరియు విభిన్నమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. దాని తీరప్రాంతం మరియు నౌకాశ్రయం దక్షిణ ఆఫ్రికాలోని అనేక ఇతర కేంద్రాల కంటే ఎగుమతి-సంబంధిత పరిశ్రమ కొరకు పోల్చదగిన ప్రయోజనాన్ని కలిగి ఉంది. డర్బన్ యొక్క మితమైన శీతోష్ణస్థితి, వెచ్చని సముద్ర ప్రవాహం మరియు సాంస్కృతిక వైవిధ్యం కలిగిన ప్రజలు కూడా ఈ ప్రాంతంలో పర్యాటకరంగానికి ఒక ఆకర్షణని కలిగిస్తున్నాయి.

ఏదేమైనా, గత 20 సంవత్సరాలలో ఇక్కడ DMA యొక్క సాంప్రదాయ విభాగం ఉద్యోగాల సంఖ్యలో చాలా తక్కువ అభివృద్ధిని మాత్రమే సాధించింది. ప్రభుత్వం తరువాత అధిక సంఖ్యలో ఉద్యోగాలను కల్పించే ఉత్పత్తి రంగం, సంస్థల పునర్నిర్మాణం జరిగి అధిక మూలధన తీవ్రత కలిగినవాటిగా మారడం వలన ఉద్యోగాలను తొలగిస్తోంది. అధిక నేరాల రేటు, పర్యాటకరంగం మరియు అనేక ఇతర రంగాల అభివృద్ధికి ఆటంకంగా మారింది. సాహసోపేత మరియు అభివృద్ధి చెందుతున్న చిన్న మరియు సూక్ష్మ వ్యాపారరంగం పెరుగుతున్నప్పటికీ, DMA అత్యధిక నిరుద్యోగితా రేటును కలిగి ఉంది, నగరంలోని కొన్ని ప్రాంతాలలో ఇది 30%నికి పైన ఉంది. పూర్వ పట్టణప్రాంత ప్రదేశాలలో ఇప్పటికీ ఇంకా కొన్ని ఆర్థిక అవకాశాలు ఉన్నాయి.

డర్బన్ యొక్క స్కైలైన్.

నేరాలు మరియు మలినాల కారణంగా కేంద్ర పట్టణ ప్రాంత జిల్లా ఆర్థికపరమైన తరుగుదలను అనుభవించింది. నగరానికి ఉత్తరంగా ఉన్న ఉమ్హ్లంగా ప్రాంతంలో అనేక సంస్థలు ప్రబలమైన వికేంద్రీకరణ కారణంగా పునఃస్థాపించబడ్డాయి. గేట్ వే థియేటర్ అఫ్ షాపింగ్ సమీపంలో ఈప్రాంతం నూతన కేంద్ర వ్యాపార జిల్లాగా మారింది. ఇటీవలి కాలంలో నగరంలోకి తిరిగి వ్యాపారాన్ని ఆకర్షించడానికి ప్రయత్నాలు జరిగాయి, డౌన్ టౌన్ కు ఆగ్నేయంగా నూతన యుషక మరైన్ వరల్డ్ అనేక నూతన నివాస ప్రాంతాలు మరియు ఆరామ ప్రాంతాల అభివృద్ధితో ఒక నూతన పాయింట్ అభివృద్ధి చేయబడింది. వ్యాపార జిల్లాను శుభ్రం చేయడానికి నగరం యొక్క ప్రయత్నాలు, పాయింట్ లో నూతన అభివృద్ధి మరియు CBD కి ఉత్తరంగా ఉన్న 2010 FIFA వరల్డ్ కప్ స్టేడియం(మోసెస్ మబిదా స్టేడియం) ఆర్థిక ప్రగతికి సహాయం చేస్తాయని ఆశించబడింది.

ఈ ప్రాంతానికి డర్బన్ యొక్క ఆర్ధిక సహాయం

డర్బన్ మెట్రోపాలిటన్ ఏరియా క్వాజులు-నాటాల్ యొక్క ప్రధాన ఆర్థిక చోదక శక్తి, ఆ ప్రదేశం యొక్క ఉత్పత్తి, ఉద్యోగిత మరియు అదాయాలలో సగానికి పైగా దీని నుండే వస్తుంది. దేశ స్థాయిలో, గౌతెంగ్ తరువాత డర్బన్ రెండవ ప్రముఖ ఆర్థిక మిశ్రమం, ఇది దేశీయ ఉత్పత్తిలో 15%, గృహ ఆదాయంలో 14% మరియు దేశీయ ఉద్యోగితలో 11% లను కలిగి ఉంది. ప్రాంతీయ అభివృద్ధి కారిడార్లు(నడవాలు) డర్బన్ ను ఉత్తరాన రిచర్డ్స్ బే మరియు మపుటోతో, మరియు పశ్చిమ దిక్కున పీటర్మారిట్జ్బర్గ్ మరియు జోహన్స్బర్గ్ లతో కలుపుతున్నాయి.

సాంప్రదాయేతర రంగం

సాంప్రదాయేతర గృహాలకు ఈ నగర ప్రతిస్పందన మిశ్రమంగా ఉంది. ఈ నగరం రెండు వున పురస్కారాలను గెలుచుకుంది [11][12] కానీ గుడిసెలలో నివసించే వారితో దాని వ్యవహారం యునైటెడ్ నేషన్స్కు చెందినా సెంటర్ ఆన్ హౌసింగ్ రైట్స్ అండ్ ఎవిక్షన్స్ యొక్క నివేదికలో తీవ్రంగా విమర్శించబడింది.[13] వీధి వర్తకులు[14] మరియు వీధి బాలలతో కూడా ఈ నగరం యొక్క వ్యవహారం విమర్శించబడింది.[15]

పర్యాటకరంగం

సమాచారాలు మరియు మాధ్యమం

రెండు పెద్ద ఆంగ్ల-భాషా వార్తాపత్రికలు డర్బన్ నుండి ప్రచురించబడుతున్నాయి, ఈ రెండూ ఇండిపెండెంట్ న్యూస్ పేపర్స్ లోని భాగాలు, ఈ జాతీయ సమూహం మాధ్యమ వ్యాపారవేత్త టోనీ ఓ'రేల్లీ యాజమాన్యంలో ఉంది. ఇవి ఉదయపు సంకలనం ది మెర్క్యురీ మరియు మధ్యాహ్నపు పత్రిక డైలీ న్యూస్. దక్షిణ ఆఫ్రికాలోని అధిక వార్తా మాధ్యమాలవలె, ఇటీవలి సంవత్సరాలలో వాటి పంపిణీ తగ్గిపోతోంది. ముఖ్యమైన జులు భాషా పత్రికలలో "ఇసోలేజ్వే" ( ఇండిపెండెంట్ న్యూస్ పేపర్స్), "వుమ్ ఆఫ్రికా" మరియు "ఇలంగ" ఉన్నాయి, చివరి పత్రిక IFPతో రాజకీయ సంబంధాలను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇండిపెండెంట్ న్యూస్ పేపర్స్ భారతీయ సమాజం కొరకు "పోస్ట్" అనే వార్తాపత్రికను ప్రచురిస్తుంది. "ఇండిపెండెంట్ ఆన్ సాటర్డే" వలె ఒక జాతీయ ఆదివారపు పత్రిక, "సండే ట్రిబ్యూన్" కూడా ఇండిపెండెంట్ న్యూస్ పేపర్స్ చే ప్రచురించబడుతుంది.

అనేక రకాల ఉచిత పరిసర వార వార్తాపత్రికలు కాక్స్టన్ గ్రూప్ చే ప్రచురింపబడుతున్నాయి, మరియు అనేక "సంఘ" వార్తాపత్రికలు కూడా ఉన్నాయి, వీటిలో కొన్ని స్వల్పకాలం మాత్రమే మనుగడలో ఉండగా మరికొన్ని స్థిరంగా కొనసాగుతున్నాయి. నార్త్ కోస్ట్ రోడ్, డర్బన్ లో ఉన్న ది టాబ్లాయిడ్ న్యూస్ పేపర్ సంస్థ కూడా సంఘ వార్తాపత్రికలను ప్రచురిస్తుంది.వీరు పది వార్తాపత్రికలను ప్రచురిస్తుండగా, వీటిలో మూడు ఇసిజులు భాషలో ఉన్నాయి. ఒక భూతద్దం వలె సంఘ విషయాలను తవ్వితీసి మరియు బహిర్గతం చేసే సంఘ వార్తాపత్రికలు ప్రత్యేక ప్రాంతాలు లేదా విభాగాల లక్ష్యంతో పనిచేస్తాయి. ఈ పత్రికలు పూర్తిగా ప్రకటనల ఆదాయంపై ఆధారపడతాయి మరియు జాతి లేదా సంపదతో సంబంధం లేకుండా ప్రతి ఇంటికీ పంపిణీ చేయబడతాయి. ఇతర పెద్ద జాతీయ వార్తాపత్రికలలో చేరేముందు అనేక మంది విలేఖరులు ఈ పత్రికలలో అనుభవం గడిస్తారు.

ఒక పెద్ద నగర ప్రారంభ పత్రిక ఎజాసేగాగాసిని మెట్రో గజెట్ ([1]). ఇది ఎతేక్విని మునిసిపాలిటి యొక్క అధికారిక వార్తాపత్రిక, దీని ద్వారా పన్ను చెల్లింపుదారులు మరియు నివాసితులు ఎతేక్విని మునిసిపాలిటి యొక్క ప్రాజెక్ట్ లు, కార్యకలాపాలు మరియు చర్యల గురించి తెలియచేయబాడతారు. ఇది పాఠకుల అభిప్రాయాలకు వేదికగా కూడా ఉంటుంది. పక్షానికి ఒకసారి ప్రచురించబడే ఈ పత్రిక, ఆంగ్లం మరియు జులు భాషలలో 400 000 కాపీలతో శుక్రవారం ఉదయం విడుదల అవుతుంది. మునిసిపాలిటీ’స్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ అంతర్గత ఉత్పత్తిగా ఈ ప్రచురణ ఉంటుంది.

SA మాధ్యమ అధిపతి కగిసో మీడియా యాజమాన్యంలో ఒక పెద్ద రేడియో కేంద్రం, ఈస్ట్ కోస్ట్ రేడియో ([2]), డర్బన్ శివార్ల నుండి ప్రసారమవుతుంది. జాతీయ ప్రసారసంస్థ అయిన SABC, డర్బన్ లో ప్రాంతీయ కార్యాలయాలను కలిగి రెండు ప్రధాన స్టేషన్లను ఇక్కడ నిర్వహిస్తుంది, అవి, 5 మిలియన్లకు పైన జాతీయ స్థాయి శ్రోతలను కలిగిన జులు భాషలోని "ఉఖోజి FM", మరియు "భారతీయ" శ్రోతలకు ఉద్దేశింపబడిన రేడియో లోటస్. వార్తా అనుసంధానాలు మరియు క్రీడా ప్రసారాల కొరకు TV వలెనె ఇతర SABC జాతీయ స్టేషన్లు ఇక్కడ చిన్న ప్రాంతీయ కార్యాలయాలను కలిగి ఉన్నాయి. ప్రసార అనుమతుల జారీలో జాతీయస్థాయిలో బాధ్యత కలిగిన సంస్థ అయిన ICASA యొక్క అనుమతి పొందిన అనేక చిన్న స్వతంత్ర రేడియో స్టేషన్లు కూడా ఇక్కడ ఉన్నాయి.

క్రీడా జట్లు మరియు క్రీడా ప్రాంగణాలు

సమీప సాన్నిహిత్యం ఉన్న రెండు రగ్బీ సమాఖ్య జట్లకు డర్బన్ స్థావరంగా ఉంది, అవి, దేశీయ కర్రీ కప్ పోటీలో పాల్గొనే నాటల్ షార్క్స్, మరియు అంతర్జాతీయ సూపర్ 14 పోటీలో పాల్గొనే షార్క్స్. రెండు జట్లూ 56,000 సామర్థ్యం కలిగిన కింగ్స్ పార్క్ స్టేడియంలో ఆడతాయి - ప్రాయోజిత కారణాల వలన ఇది ప్రస్తుతం ABSA స్టేడియంగా కూడా పిలువబడుతోంది.

ఈ నగరం ప్రీమియర్ సాకర్ లీగ్ లోని మూడు క్లబ్బులు —అమజులు, థన్డా రాయల్ జులు మరియు గోల్డెన్ యారోస్కు కూడా స్థావరంగా ఉంది. అమజులు వారి ఆటలలో ఎక్కువ భాగాన్ని వారి స్వంత ప్రిన్సెస్ మగోగో స్టేడియంలో ఆడతారు, కానీ ముఖ్యమైన క్రీడలను ABSA స్టేడియంలో ఆడతారు. అదే విధంగా, గోల్డెన్ యారోస్ కి ఉమ్లజి పరిసరాలలో వారి స్వంత కింగ్ జ్వేలితిని స్టేడియం ఉంది, కానీ వారి ప్రధానమైన ఆటలలో ఎక్కువభాగం ABSA స్టేడియంలో ఆడతారు. డర్బన్ నాల్గవ జట్టు మానింగ్ రేంజర్స్కి స్థావరంగా ఉండేది, వీరు లీగ్ విజేతలుగా ఉండటంతో పాటు అనేక గౌరవాలు పొందారు.

2009 నాటి సహారా స్టేడియం కింగ్స్ మీడ్, డర్బన్

ప్రాదేశిక క్రికెట్ జట్టు అయిన డాల్ఫిన్స్ కి కూడా డర్బన్ అతిధేయిగా ఉంది. షాన్ పొల్లాక్, లాన్స్ క్లూస్నర్ మరియు బారీ రిచర్డ్స్ అందరూ డాల్ఫిన్స్ నుండి వచ్చినవారే (అయితే ఇది ప్రారంభంలో నాటల్ గా పిలువబడేది). డర్బన్ లో సహారా స్టేడియం కింగ్స్ మీడ్లో క్రికెట్ ఆడతారు.

ఇది భారీ విజయాన్ని పొందిన 2003 ICC క్రికెట్ వరల్డ్ కప్ అతిధేయ నగరాలలో ఒకటిగా ఉండి, ఆతిధ్యం ఇచ్చింది. తరువాత అది 2007లో ICC వరల్డ్ ట్వెంటీ20 ప్రారంభ సీజన్ కి ఆతిధ్యం ఇచ్చింది. 2009 IPL దక్షిణ ఆఫ్రికాలో ఆడబడింది మరియు సహజంగానే, డర్బన్ ఒక వేదికగా ఎంపిక చేయబడింది. ఇది సెప్టెంబరు 2010లో జరుగనున్న 2010 ఛాంపియన్స్ లీగ్ ట్వెంటీ20కి కూడా ఆతిధ్యం ఇవ్వనుంది.

డర్బన్ 2010 ఫిఫా వరల్డ్ కప్కి కూడా ఒక అతిధేయ నగరంగా ఉంది మరియు వీధి మార్గంపై నడుపబడే A1GP మోటర్ రేస్ కి కూడా ఇది అతిధేయిగా ఉంది. డర్బన్, 2018 కామన్వెల్త్ క్రీడలు మరియు 2020 సమ్మర్ ఒలింపిక్స్ నిర్వహణకు పోటీ చేస్తుందనే పుకార్లు కూడా వ్యాపించాయి.[16]

ప్రతి సంవత్సరం దేశంలోని ముఖ్యమైన గుర్రపు పందాల పోటీ అయిన జూలై హండీకాప్, మరియు దక్షిణ ఆఫ్రికాలోని ముఖ్యమైన నిలిచి ఉండే పోటీ అయిన గోల్డ్ కప్ లను నిర్వహించే ఒక పెద్ద థొరౌబ్రెడ్ గుర్రపు పందాల కేంద్రం గ్రేవిల్లె రేస్ కోర్స్కి ఈ నగరం స్థావరంగా ఉంది. నగర కేంద్రానికి దక్షిణాన డర్బన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే క్లైర్ వుడ్ వద్ద మరొక పూర్తిస్థాయి రేస్ కోర్స్ ఉంది.

ఒక వృత్తిపరమైన టెన్నిస్ వేదిక ది బెరియ సమీపంలోని వెస్ట్ రిడ్జ్ పార్క్ వద్ద ఉంది, మరియు ఒలింపిక్-ప్రమాణాలు కలిగిన ఒక ఈత కొలను కింగ్స్ పార్క్ స్పోర్టింగ్ ప్రేసింక్ట్ వద్ద ఉంది. ఈ వేదికలతోపాటు, డర్బన్, వాటర్ పోలో, హాకీ, మరియు ఇతర క్రీడలకు కూడా సదుపాయాలను కలిగి ఉంది, Mr ప్రైస్ ప్రో (పూర్వం గన్స్టన్ 500గా పిలువబడేది) సర్ఫింగ్ పోటీ మరియు సంబంధిత ఓషన్ యాక్షన్ సంబరాల వంటి అనేక జల క్రీడా పోటీలకు అతిధేయిగా ఉన్న సముద్ర తీరం ముఖ్యంగా పేర్కొనదగినది. స్థానిక సముద్ర తీరాలలో బీచ్ వాలీబాల్ ఎప్పుడూ ఆడబడుతుంది మరియు పవర్ బోట్ పోటీలను హార్బర్లో నిర్వహిస్తారు. డర్బన్ మరియు పరిసర ప్రాంతాలు వృత్తిపరమైన మరియు వర్ధమాన గోల్ఫ్ క్రీడాకారులచే సంరక్షించబడతాయి, CBDకి సమీపంలో ఉన్న డర్బన్ కంట్రీ క్లబ్ ప్రత్యేక ప్రసిద్ధి చెందింది.

రవాణా

వాయు రవాణా

డర్బన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్

కింగ్ షాక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ జాతీయ మరియు అంతర్జాతీయ విమానాలకు సేవలందిస్తుంది, ఇక్కడనుండి దుబాయ్, స్వాజి లాండ్, మొజాంబిక్, మరియు మారిషస్ లకు క్రమబద్ధమైన సర్వీసులు ఉంటాయి. ఇటీవలే ప్రారంభించబడిన ఈ విమానాశ్రయం, డర్బన్ ఇంటర్నేషనల్ స్థానంలో కార్యకలాపాలను నిర్వహిస్తుంది, ఇది 2005లో నాలుగు మిలియన్ల మంది ప్రయాణికులకు సౌకర్యాలను కలిగించింది, ఈ సంఖ్య 2004 కంటే 15 శాతం ఎక్కువ. కింగ్ షాక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్గా పిలువబడే ఈ నూతన విమానాశ్రయం, సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్కి ఉత్తరంగా లా మెర్సీ వద్ద 36 kilometres (22 mi) నిర్మించబడింది. 2010 మే 1 నుండి డర్బన్ ఇంటర్నేషనల్ నుండి అన్ని కార్యకలాపాలు కింగ్ షాక ఇంటర్నేషనల్ కి బదిలీ చేయబడ్డాయి; సింగపూర్, లండన్ మరియు ఆస్ట్రేలియాలకు విమానాలు నడిపే ప్రణాళికలు ఉన్నాయి.

2010 FIFA వరల్డ్ కప్ సమయంలో డర్బన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సౌత్ ఆఫ్రికన్ డిఫెన్స్ ఫోర్స్ చే ఉపయోగించబడుతుంది.

ఈ విమానాశ్రయం క్వాజులు-నటాల్ మరియు డ్రాకెన్స్ బర్గ్ ప్రాయానికులకు ప్రధాన మార్గంగా సేవలను అందిస్తుంది.

సముద్ర రవాణా

డర్బన్ నౌకాశ్రయం

డర్బన్ ఒక నౌకాశ్రయ నగరంగా దీర్ఘకాలంగా వాడుకలో ఉంది. గతంలో నాటల్ నౌకాశ్రయంగా పిలువబడిన డర్బన్ నౌకాశ్రయం, పోర్ట్ ఎలిజబెత్ మరియు మపుటోల మధ్య ఉన్న కొన్ని సహజ నౌకాశ్రయాలలో ఒకటి, సముద్రం అల్లకల్లోలంగా ఉండడానికి కారణమయ్యే ప్రత్యేక వాతావరణ పరిస్థితుల ప్రారంభ స్థానంలో ఇది ఉంది. 1840లలో ఈ నౌకాశ్రయం ప్రారంభించబడినప్పుడు ఈ రెండు కారణాలు డర్బన్ ను అత్యంత రద్దీగా ఉండే పోర్ట్ అఫ్ కాల్గా రూపొందించాయి. డర్బన్ నౌకాశ్రయం దక్షిణ ఆఫ్రికాలో అత్యంత రద్దీగా ఉండే నౌకాశ్రయంగా ఉండటంతో పాటుగా దక్షిణార్ధ గోళంలో మూడవ అతి పెద్ద కంటైనర్ నౌకాశ్రయంగా కూడా ఉంది.

దక్షిణ ఆఫ్రికా యొక్క పారిశ్రామిక మరియు గనుల ముఖ్య పట్టణమైన జోహాన్స్బర్గ్ ఏ విధమైన జల రవాణాకు సమీపంలో లేనందువలన, ఆధునిక డర్బన్ నౌకాశ్రయం జోహాన్స్బర్గ్ పరిసరాలలో పెరిగింది. ఆ విధంగా, జోహన్స్బర్గ్ నుండి దక్షిణ ఆఫ్రికా వెలుపలికి ఓడల ద్వారా పంపవలసిన ఉత్పత్తులు ట్రక్లు లేదా రైళ్ళ ద్వారా డర్బన్ కు రవాణా చేయబడతాయి. పౌర యుద్ధం మరియు దక్షిణ ఆఫ్రికా ఉత్పత్తులకు వ్యతిరేకంగా నిషేధం వలన మపుటో నౌకాశ్రయం 1990ల ప్రారంభం వరకూ రవాణాకు లభ్యం కాలేదు. ప్రస్తుతం నౌకా వ్యాపారం కొరకు డర్బన్ మరియు మపుటోల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది.

2002లో దాని స్థాయి తగ్గించబడేవరకు పూర్తి స్థాయి నౌకాదళ స్థావరంగా ఉన్న సాలిస్బరీ ఐలాండ్, ప్రస్తుతం ప్రధాన భూభాగానికి అనుసంధానంగా డర్బన్ నౌకాశ్రయ భాగంగా ఉంది. ఇది ప్రస్తుతం ఒక నౌకాదళ కేంద్రాన్ని మరియు ఇతర సైనిక సౌకర్యాలను కలిగి ఉంది. సాలిస్బరీ ఐలాండ్ ను నౌకాశ్రయ సౌకర్యాలలో భాగంగా ఉపయోగించాలనే డిమాండ్ పెరగుతుండడంతో, ఈ స్థావరం యొక్క భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది.

రైలు రవాణా

దక్షిణ ఆఫ్రికా అంతర్గత భాగం నుండి వచ్చే సరుకులకు ఓడల-మార్పిడికి పెద్ద కేంద్రంగా ఉండటం వలన డర్బన్ రైల్వేలతో బాగా కలుపబడి ఉంది. స్పూర్నెట్ యొక్క పాసింజర్ రైలు సేవ అయిన షోషోలోజా మెయిల్, డర్బన్ నుండి రెండు దూరప్రాంత పాసింజర్ రైలు సేవలను నిర్వహిస్తోంది: పీటర్మరిత్జ్ బర్గ్ మీదుగా జోహాన్స్బర్గ్ కి ఒక రోజువారీ రైలు, కింబర్లీ మరియు బ్లోయెంఫోన్టేన్ మీదుగా కేప్ టౌన్ కు మరియు కేప్ టౌన్ నుండి వారానికొకసారి నడిచే రైలు. ఈ రైళ్ళు డర్బన్ రైల్వే కేంద్రం వద్ద ఆగిపోతాయి.

డర్బన్ మరియు పరిసర ప్రాంతాలలో మెట్రోరైల్ ప్రయాణికుల రైలు సేవను నిర్వహిస్తోంది. డర్బన్ స్టేషను నుండి ఉత్తర తీరంలోని స్టాన్గర్ వరకు, దక్షిణ తీరాన కెల్సో, మరియు కాటో రిడ్జ్ ద్వీపం వరకు మెట్రోరైల్ నెట్వర్క్ నడుస్తుంది.

రహదారులు

సెంట్రల్ డర్బన్

దక్షిణ ఆఫ్రికా ఖండానికి ప్రవేశ నౌకాశ్రయంగా ఈ నగరం యొక్క స్థానం దాని చుట్టూ జాతీయ రహదారులు ఏర్పడటానికి దారితీసింది. అటువంటి ఒక రహదారి డర్బన్ నుండి ప్రారంభం అవుతుంది, మరొకటి దాని గుండా వెళుతుంది. డర్బన్ ను ఆర్థిక పృష్టభూమి అయిన గావ్టేంగ్తో కలిపే N3 వెస్ట్రన్ ఫ్రీవే; నగరం యొక్క పశ్చిమం వైపు నుండి వెళుతుంది. N2 ఔటర్ రింగ్ రోడ్ డర్బన్ ను దక్షిణాన ఈస్ట్రన్ కేప్ తో, మరియు ఉత్తరాన మపుమలంగాతో కలుపుతుంది. వెస్ట్రన్ ఫ్రీవే ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉండటానికి కారణం సరుకు విట్ వాటర్స్ రాండ్ నుండి నౌకాశ్రయానికి మరియు వెనుకకు ట్రక్ ద్వారా నౌకాశ్రయానికి ఈ మార్గం ద్వారా రవాణా చేయబడుతుంది.

N3 వెస్ట్రన్ ఫ్రీ వే కేంద్ర వ్యాపార జిల్లా నుండి మొదలై టోల్ గేట్ బ్రిడ్జ్ క్రిందుగా మరియు షేర్వుడ్ మరియు మేవిల్లె పరిసరాల నుండి పడమరకు దారితీస్తుంది. EB క్లోఎట్ ఇంటర్ చేంజ్ (వ్యావహారికంగా స్పఘెట్టి జంక్షన్గా పిలువబడుతుంది) వెస్ట్ విల్లెకు తూర్పు దిక్కున ఉండి, N2 ఔటర్ రింగ్ రోడ్ మరియు వెస్ట్రన్ ఫ్రీవేల మధ్య వాహనాల రవాణాకు అనుమతిస్తుంది.

N2 ఔటర్ రింగ్ రోడ్ నగరాన్ని ఉత్తర మరియు దక్షిణ తీరాలుగా విభజిస్తుంది. ఇది డర్బన్ పై ఆధారపడిన తీర పట్టణాలకు (స్కాట్ బర్గ్ మరియు స్తాన్గర్ వంటివి) మరియు డర్బన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్కు మధ్య ప్రధాన అనుసంధానాన్ని అందిస్తుంది.

నగరానికి ఉత్తర, పశ్చిమ మరియు దక్షిణ ప్రాంతాలలో విస్తరించి ఉన్న పరిసర ప్రాంతాలను కలిపే ఉచిత మార్గవ్యవస్థను మరియు ద్వంద్వ నాళ విస్తరణ పట్టణ మార్గాలను డర్బన్ కలిగి ఉంది. M4 రెండు విభాగాలుగా ఉంటుంది: లియో బోయ్డ్ హైవేగా పిలువబడే ఉత్తర విభాగం, ఒక ప్రత్యామ్నాయ ప్రధాన రహదారిగా బల్లిటో వద్ద ప్రారంభమై అక్కడ N2గా విడిపోతుంది. ఇది ఉత్తర శివార్లైన ఉమ్హ్లంగా మరియు లా లూసియాల నుండి వెళ్లి అక్కడ ద్వంద్వ రవాణామార్గంగా మారుతుంది మరియు CBD యొక్క ఉత్తరపు అంచు వద్ద అంతమవుతుంది. M4 యొక్క దక్షిణ విభాగమైన అల్బెర్టిన సిసులు హైవే, CBD యొక్క దక్షిణపు అంచులో ప్రారంభమై, డర్బన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ద్వారా కలుపుతూ, N2 ఔటర్ రింగ్ రోడ్ లో తిరిగి కలుస్తుంది.

M7 దక్షిణ పారిశ్రామిక ప్రాంతాన్ని N3తో కలుపుతుంది మరియు పైన్టౌన్ నుండి క్వీన్స్బర్గ్ ద్వారా N2తో కలుపుతుంది. M19 ఉత్తర పరిసర ప్రాంతాలను పైన్టౌన్ ద్వారా వెస్ట్ విల్లెతో కలుపుతుంది.

M13 అనేది N3 వెస్ట్రన్ ఫ్రీవేకి(మారియన్ హిల్ వద్ద రుసుము విధించబడుతుంది)ఒక రుసుము లేని ప్రత్యామ్నాయ మార్గం. ఇది గిల్లిట్స్, క్లూఫ్, మరియు వెస్ట్ విల్లెల రవాణాకు ఉపయోగపడుతుంది. ఇది వెస్ట్ విల్లె ప్రాంతంలో జాన్ స్ముట్స్ హైవేగా పిలువబడగా, క్లూఫ్ ప్రాంతంలో ఇది ఆర్థర్ హోప్ వెల్ హైవేగా పేరు పెట్టబడింది.

బస్సులు

రేమంట్ ఆల్టన్ అనే సంస్థ 2003లో డర్బన్ ట్రాన్స్పోర్ట్ ను కొనుగోలు చేసి, నియమిత బస్ సేవలను డర్బన్ పట్టణ ప్రాంతంలో నడిపింది. అయితే, దాని ఉద్యోగుల పారిశ్రామిక చర్య, రహదారులపై నడిచే సామర్థ్యం లేని వాహనాలు మరియు సంస్థ యొక్క హీనమైన ఆర్థికస్థితి వలన రేమంట్ ఆల్టన్ సేవలు మార్చి 2009 నుండి నిలిపి వేయబడ్డాయి.[17] రేమంట్ ఆల్టన్ పనిచేయడం లేదు, కీలక వ్యక్తులను కోల్పోయింది,[18] 56 బస్సులు దహనం చేయబడ్డాయి, మరియు మిగిలిన వాటిలో అనేకం రహదారులపై నడిచే సామర్థ్యం లేకపోవడం వలన స్వాధీనం చేసుకోబడ్డాయి.[citation needed] ఈ కారణంగా డర్బన్ లో ప్రజా రవాణా వ్యవస్థ పనితీరు బాగా దెబ్బతింది.[citation needed]

డర్బన్ పీపుల్ మూవర్ పర్యాటక-కేంద్రీకృత బస్సు సేవ, ఇది కేంద్ర వ్యాపార జిల్లాలో మరియు సముద్రతీరంతో, అనేక పర్యాటక కేంద్రాలను కలుపుతూ మూడు మార్గాలలో ప్రతి 15 నిమిషాలకు బస్సులను నడుపుతుంది.[19]

డర్బన్ నుండి దక్షిణ ఆఫ్రికాలో ఇతర నగరాలకు అనేక సంస్థలు దూరప్రాంత బస్సు సేవలను నడుపుతున్నాయి. డర్బన్ లో బస్సులకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1930ల ప్రారంభం నుండి వీటిలో అధికభాగం భారతీయ యజమానులచే నిర్వహించబడుతున్నాయి. ప్రభుత్వ సహాయం పొందకుండా వ్యక్తిగతంగా నిర్వహింపబడే బస్సులు సమాజాల కొరకు ముందుగానే సేవలను అందిస్తాయి. ఎతేక్విని మునిసిపాలిటీ యొక్క అన్ని ప్రాంతాలలోను బస్సులు తిరిగుతాయి. 2003 నుండి బస్సులు మార్గాల నుండి తీసుకొనబడి టాక్సీ నిర్వాహకులచే ఆ మార్గాలు ఆక్రమించబడ్డాయి. ఇది బస్సుల కార్యకలాపాలను గందరగోళ పరచింది. జీవనాధారం కొరకు బస్సు యజమానులు టాక్సీలను కొనుగోలు చేసి తమ బస్సు పర్మిట్లను ఉపయోగిస్తున్నారు.

టాక్సీలు

డర్బన్ లో రెండు రకాల టాక్సీలు ఉన్నాయి: మీటర్డ్ టాక్సీలు మరియు మినీబస్సు టాక్సీలు. ఇతరనగరాలలో వలె, టాక్సీలు నగరమంతా తిరుగుతూ రుసుము వసూలు చేసుకోవు, ఒక ప్రత్యేక ప్రాంతానికి వెళ్ళటానికి వాటిని పిలువవలసి ఉంటుంది. డర్బన్ మరియు పరిసర ప్రాంతాలకు సేవలను అందించడానికి అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. విమానాశ్రయ బదిలీలకు, ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకు వెళ్ళడానికి మరియు వెనుకకు రావడానికి కూడా ఈ టాక్సీలు పిలువవచ్చు.

వ్యక్తిగతంగా కార్లను పొందలేని అధికభాగం ప్రజానీకానికి రవాణా సాధనం యొక్క ప్రామాణిక రూపంగా మినీ బస్సు టాక్సీలు ఉంటాయి.[20] అవసరమైనవి అయినప్పటికీ, ఈ వాహనాలు సరిగ్గా నిర్వహణ చేయరు మరియు ఇవి తరచూ రోడ్డు మీద నడపడానికి అనర్హమైనవిగా ఉంటాయి. ప్రయాణీకులను ఎక్కించుకోవడానికి ఈ టాక్సీలను తరచుగా నిర్ణయించబడని చోట ఆపడం వలన, వెనుక ఉన్న వాహనాల డ్రైవర్లు సకాలంలో ఆపుకోలేకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి.[21][22] దక్షిణ ఆఫ్రికా యొక్క శ్రామిక వర్గం నుండి రవాణా కొరకు ఉన్న అధిక డిమాండ్ కారణంగా, మినీబస్సు టాక్సీలు తరచూ చట్టపరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోవడంతో, ఈ మినీ బస్సులు ప్రమాదాలకు గురైనపుడు గాయాల రేటు ఎక్కువగా ఉంటుంది. మినీ బస్సుల యాజమాన్యం మరియు నిర్వహణ సాధారణంగా ఒక సమూహంగా ఉంటుంది, మరియు కాలానుగుణంగా నిర్వాహకుల మధ్య హింస ప్రబలుతుంటుంది, ప్రత్యేకించి లాభదాయకమైన టాక్సీ మార్గాలపై ప్రాంతాల వారీ యుద్ధాలు సంభవిస్తుంటాయి.[23]

రిక్షాలు

డర్బన్, నగరమంతా తిరుగుతూ ఉండే జులు రిక్షా లాగే వారికి[24] ప్రసిద్ధి చెందింది. ఈ వర్ణమయమైన వ్యక్తులు వారి పెద్దవైన, కదిలే టోపీలకు మరియు వస్త్రధారణకు ప్రసిద్ధి చెందారు. 1900 ప్రారంభం నుండి వారు రవాణా సాధనంగా ఉన్నప్పటికీ, వారు ఎక్కువగా పర్యాటకులకు సేవలను అందిస్తారు.[citation needed] చూడుము రిక్షా - పర్యాటక ఆకర్షణలు.

ఉపనగరాలు

విద్యా సంస్థలు

ప్రైవేట్ పాఠశాలలు

ప్రభుత్వ పాఠశాలలు

డర్బన్ నగరంలోని యూనివర్సిటీ అఫ్ క్వాజులు-నాటాల్ లోని హోవార్డ్ కాలేజ్ కాంపస్ టవర్

తృతీయ సంస్థలు

అంతర్జాతీయ సంబంధాలు

జంట నగరాలు - సోదరి నగరాలు

డర్బన్ జంట కలిగి ఉన్నవి:[27]

వీటిని కూడా చూడండి

సూచనలు

 1. 1.0 1.1 Municipal Demarcation Board, South Africa Retrieved on 2008-03-23.
 2. 2.0 2.1 Statistics South Africa, Community Survey, 2007, Basic Results Municipalities (pdf-file) Retrieved on 2008-03-23.
 3. Eric A. Walker (1964) [1928]. "Chapter I - The discovery". A History of Southern Africa. London: Longmans.
 4. Eric A. Walker (1964) [1928]. "Chapter VII - The period of change 1823-36". A History of Southern Africa. London: Longmans.
 5. Adrian Koopman. "The Names and the Naming of Durban". Natalia, the Journal of the Natal Society. Archived from the original on 2007-11-03. Retrieved 2008-07-09.
 6. T.V. Bulpin (1977) [1966]. "Chapter XII - Twilight of the Republic". Natal and the Zulu Country. Cape Town: T.V. Bulpin Publications.
 7. Bruce Berry (8 May 2006). "Durban (South Africa)". Retrieved 2010-07-08. |article= ignored (help)
 8. Ralf Hartemink. "Durban". Retrieved 2010-07-08. |article= ignored (help)
 9. "ngopulse". ngopulse. Retrieved 2010-07-02.
 10. 10.0 10.1 "Climate Data for Durban". South African Weather Service. Retrieved 6 March 2010.
 11. "The Vuna Awards". Department of Provincial and Local Government, Republic of South Africa.
 12. "Why eThekwini Municipality won the Vuna Award for best run metropolitan". Ethekwini Municipality Communications Department.
 13. "Cohre". Cohre. Retrieved 2010-07-02.
 14. ఫ్రమ్ బెస్ట్ ప్రాక్టీస్ టు పరియ: ది కేస్ అఫ్ డర్బన్, సౌత్ ఆఫ్రికా బై పాట్ హార్న్, స్ట్రీట్ నెట్[dead link]
 15. 'టిన్ కాన్ టౌన్'లో వరల్డ్ కప్ కు ముందు ఖాళీ చేయించబడిన దక్షిణ ఆఫ్రికన్ల జీవితం, డేవిడ్ స్మిత్, ది గార్డియన్, 1 ఏప్రిల్ 2010
 16. "Durban Welcomes Possible Olympic Bid". Gamesbids.com. Retrieved 2010-07-02.
 17. eThekwini Municipality (2009-03-13). "Notice From Remant Alton — Suspension Of Bus Commuter Service". Retrieved 2009-05-03.
 18. Independent Online. "Chief resigns in face of bus crisis". IOL. Retrieved 2009-05-05.
 19. Durban People Mover. "Durban People Mover ... The future begins here". Retrieved 2009-05-03.
 20. "Transport". CapeTown.org.
 21. "South Africa's minibus wars: uncontrollable law-defying minibuses oust buses and trains from transit". LookSmart. Archived from the original on 2007-12-06.
 22. "Transportation in Developing Countries: Greenhouse Gas Scenarios of south alabama". Pew Center.
 23. "Taxing Alternatives: Poverty Alleviation and the South African Taxi/Minibus Industry". Enterprise Africa! Research Publications. Archived from the original on 2006-08-25.
 24. Ethekwini Municipality Communications Department, edited by Fiona Wayman, Neville Grimmet and Angela Spencer. "Zulu Rickshaws". Durban.gov.za. Retrieved 2010-07-02.CS1 maint: multiple names: authors list (link)
 25. "Isipingo Secondary School". Isipingosecondary.com. Retrieved 2010-07-02.
 26. "Virginia Preparatory School". Virginiaprep.co.za. 1958-01-21. Retrieved 2010-07-02.
 27. "Sister Cities Home Page". ఎతేక్విని ఆన్ లైన్: డర్బన్ నగరం యొక్క అధికారిక వెబ్ సైట్
 28. "Sister Cities of Guangzhou". Guangzhou Foreign Affairs Office. Retrieved 2010-02-10.

బాహ్య లింకులు