"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే
డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే | |
---|---|
A Darjeeling Himalayan Railway train on Batasia Loop | |
Locale | పశ్చిమ బెంగాల్, భారత్ |
Terminus | డార్జిలింగ్ |
Commercial operations | |
పేరు | డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే (DHR) |
అసలు గేజ్ | 2 అడుగులు (610 మిమీ) |
Preserved operations | |
నిర్వహించువారు | భారతీయ రైల్వేలు, , డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే సంఘం సహకారంతో |
స్టేషన్లు | 13 (న్యూ జల్పాయ్గురి, సిలిగురి టౌన్, సిలిగురి జంక్షన్, సుక్నా, రోంగ్టాంగ్, తింధరియా, గయబరి, మహానది, కుర్సెయాంగ్, తంగ్, సొనాదా, ఘుమ్, డార్జిలింగ్) |
పొడవు | 78 km (48 mi) between Siliguri and Darjeeling |
Preserved gauge | 2 అడుగులు (610 మిమీ) |
Preservation history |
- దారిమార్పుమూస:డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే
డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే లేదా టాయ్ ట్రైన్ భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో న్యూ జల్పాయ్గురి, డార్జిలింగ్ నగరాల మధ్య నారోగేజ్ మార్గంలో నడిచే రైలు.
నేపధ్యము
కొండ ప్రాంతాల్లో రైల్వే లైన్లకు డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేలైన్ మంచి ఉదాహరణ . ప్రమాదకరమైన, ఎత్త్తెన కొండప్రాంతాల్లో సాఫీగా రైల్లో ప్రయాణించడానికి 1881లోనే డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే గొప్ప సాంకేతిక ప్రయోగం చేసి విజయవంతమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ రైలుకు మంచి గుర్తింపు, ఆదరణ లభించాయి. ఈస్ట్రన్ బెంగాల్ రైల్వే ముందు ఈ రైల్వే నిర్మాణానికి వెనకడుగు వేసినా ఆ సంస్థకు చెందిన ఫ్రాంక్లిన్ ఆసక్తితో రైలు నిర్మాణానికి పూనుకుని పూర్తిచేశారు. ఈ రైల్వే లైను గేజ్ 2 అడుగులు మాత్రమే ఉంటుంది. స్టీమ్ ఇంజన్‌తో నడుస్తుంది. డార్జిలింగ్ పరిసర ప్రాంతాలను కలుపుతూ ఎత్త్తెన పర్వత శ్రేణుల్లో ఏర్పాటు చేసిన ఈ రైల్వే ఎంతో విజయవంతమైంది. 7,407 అడుగుల ఎత్తులోని ఘూమ్ రైల్వే స్టేషను ఈ రైలు చేరుకునే అత్యంత ఎత్త్తెన ప్రదేశం. ఈ రైలును యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. స్థానికులు బొమ్మ రైలు (టాయ్ ట్రైన్) గా పిలుచుకునే ఇందులో ప్రయాణం అద్భుతం. అందమైన పర్వత ప్రాంతం, చల్లని గాలుల మధ్య రైలు ప్రయాణం ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేమని పర్యాటకులు పేర్కొంటారు. న్యూజల్పాయ్ గురి నుంచి డార్జిలింగ్ వరకు సాగే ఈ ప్రయాణం పర్యాటకుల మంచి అనుభూతిని మిగుల్చుతుంది.