డి.వేణుగోపాల్

From tewiki
Jump to navigation Jump to search

డి.వేణుగోపాల్ సుప్రసిద్ధ సినీ నృత్యదర్శకుడు.

వివరాలు

ఇతడి స్వగ్రామం గుంటూరు జిల్లా, రేపల్లె మండలం పూడివాడ గ్రామం. ఇతడు తెలుగు, కన్నడ, తమిళ బెంగాలీ భాషలలో 150 చిత్రాలకు పైగా నృత్య దర్శకత్వం వహించాడు. ఆనాటి అగ్రనటులు ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్‌, రాజకుమార్ (కన్నడ)ల చిత్రాలకు డాన్స్ మాస్టర్‌గా పనిచేసి ఆయా చిత్రాల విజయాలలో భాగం వహించాడు. ఆనాటి మేటి నటీమణులు సావిత్రి, జమున, వహీదా రెహమాన్, వాణిశ్రీ మొదలైనవారు ఇతని వద్ద నృత్యాన్ని అభ్యసించారు. తొలిరోజులలో విజయవాడలో ఎన్.టి.రామారావు, జగ్గయ్య తదితరులు సభ్యులుగా అరుణోదయ సంగీత నాట్యమండలిని స్థాపించాడు. తరువాత చెన్నైలో ఇండియన్ బ్యాలెట్ సెంటర్, నవరస మంజరి మొదలైన సంస్థలను నెలకొల్పాడు. రంగస్థలంపై రిక్షావాలా, శివతాండవం మొదలైన నృత్యరూపకాలను ప్రదర్శించాడు. ఇతడు గొప్ప నృత్యకళాకారుడే కాదు మంచి రచయిత కూడా. జ్ఞాననేత్రం, సృష్టి, నాట్యశాస్త్ర దర్పణం వంటి రచనలు చేశాడు.

నృత్య దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు

తెలుగు సినిమాలు

కన్నడ సినిమాలు[1]

 • అనుగ్రహ
 • అపూర్వ సంగమ
 • ఇదే మహాసుదిన
 • కటారి వీర
 • కవిరత్న కాళిదాస
 • కామన బిల్లు
 • చంద్ర కుమార
 • జాతకరత్న గుండాజోయిస
 • జీవన తరంగ
 • జేను గూడు
 • ధర్మవిజయ
 • నాగార్జున
 • పవిత్ర ప్రేమ
 • భక్త ప్రహ్లాద
 • భాగ్యదేవతె
 • మానవ దానవ
 • మురియదమనె
 • వాత్సల్య
 • లగ్న పత్రికె
 • శివగంగె మహాత్మె
 • సతి సక్కుబాయి
 • సతి సుకన్య
 • స్వర్ణగౌరి
 • హాలు జేను

వధూవరులు

నృత్య దర్శకుడిగా పేరెన్నికగన్న ఇతడు వధూవరులు అనే సినిమాను నిర్మించాడు. ఎన్.డి.విజయబాబు దర్శత్వంలో గిరిబాబు, చంద్రమోహన్, అంజలీదేవి, భారతి, ఎస్.వి.రంగారావు మొదలైనవారు నటించారు. ఈ చిత్రం 1976లో విడుదలైంది.

మరణం

ఇతడు చెన్నైలోని రంగరాజపురం నాగార్జుననగర్‌లోని తన స్వగృహంలో 2016, జూలై 11వ తేదీన మరణించాడు. ఇతడికి భార్య లక్ష్మీకాంతం, కుమారులు చంద్రమోహన్, సాంబశివరావు, కుమార్తె మహేశ్వరి ఉన్నారు[2].

మూలాలు

 1. వెబ్, మాస్టర్. "D Venugopal". చిత్రలోక డాట్ కామ్‌. Movie Buffs and programmers. Retrieved 12 July 2016.
 2. నాగేశ్వరరావు, సాక్షి చెన్నై ప్రతినిధి (12 July 2016). "ప్రముఖ నృత్యదర్శకుడు డి. వేణుగోపాల్ ఇక లేరు". సాక్షి (సంపుటి-9, సంచిక -111). జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. Retrieved 12 July 2016.