డెంటల్ ఇంప్లాంట్

From tewiki
Jump to navigation Jump to search
స్ట్రౌమ్యాన్-బ్రాండ్ రూట్- సైనస్ ఉపరితలాన్ని ఉద్ధరించేందుకు ఉపయోగించే ఎముక అంటుకట్టుడుతో పాటుగా ఉన్న మ్యాక్సిల్లరీ ఎడమ శాశ్వత మొదటి దవడ ప్రదేశంలో స్థిరపడిన ఎండోసియోస్ దంత ఇంప్లాంట్ నుంచి ఉద్భవించింది.

డెంటల్ ఇంప్లాంట్ అనేది దంత వైద్యశాస్త్రంలో ఉపయోగించే ఒక టైటానియం "మూలం", పాడైన దంతం స్థానంలో దానిని పోలిన దంతాన్ని లేదా దంత సమూహాన్ని పునఃస్థాపించడానికి ఈ డెంటల్ ఇంప్లాంట్ (దంతం స్థానంలో ప్రవేశపెట్టే కృత్రిమ వస్తువు) మద్దతు తీసుకుంటారు.

దాదాపుగా ప్రస్తుతం ఉపయోగించే అన్ని దంత ఇంప్లాంట్‌లు రూట్-ఫామ్ ఎండోసెయస్ ఇంప్లాంట్‌ల రూపంలో ఉంటాయి, అంటే ఇవి చూసేందుకు వాస్తవ దంత మూలాన్ని పోలివుంటాయి (మరియు అందువలన ఇవి మూలం-ఆకృతితో ఉంటాయి), వీటిని ఎముక లోపల ప్రవేశపెడతారు (ఎండోసెయస్‌లో ఎండ్- అనేది "ఇన్" (లోపల) కు గ్రీకు ఉపసర్గను మరియు ఓసెయస్ అనేది "బోన్" (ఎముక) ను సూచిస్తుంది). దవడ ఎముక టైటానియమ్ మూలాన్ని స్వీకరించడంతోపాటు, ఎముకలో విలీనం చేసుకుంటుంది. ఎముకలో ఐక్యం చేసుకోవడం ఈ ఇప్లాంట్ ప్రక్రియలో భాగంగా ఉండడం వల్ల సహజమైన దంతం మాదిరిగా కనిపించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

మూలం-మాదిరిగా ఉండే ఎండోసెయస్ ఇంప్లాంట్‌లు అందుబాటులోకి రాకముందు, బ్లేడ్ ఎండోసెయస్ ఇంప్లాంట్‌లు లేదా సబ్‌పెరియోస్టీల్ ఇంప్లాంట్‌ల లో ఎదో ఒకదానిని ఉపయోగించేవారు, బ్లేడ్ ఎండోసెయస్ ఇంప్లాంట్‌లు ఉపయోగించి ఎముకలో అమర్చే లోహభాగం ఒక చదునైన బ్లేడ్ మాదిరిగా కనిపిస్తుంది, సబ్‌పెరియోస్టీల్ ఇంప్లాంట్‌లను అమర్చేందుకు సిద్ధం చేసిన అమరికను పునఃస్థాపన చేయాల్సిన ప్రదేశంలో ఉంచి, దవడల యొక్క బయటకు కనిపించే ఎముకకు స్క్రూలు (మరమేకులు) తో బిగిస్తారు.

అనేక దంత పునఃస్థాపనలకు మద్దతు ఇచ్చేందుకు దంత ఇంప్లాంట్‌లను ఉపయోగించవచ్చు, వీటిలో క్రౌన్‌లు (పాడైన దంతంపై అమర్చే కృత్రిమ దంతాలు), ఇంప్లాంట్-మద్దతుగల బ్రిడ్జ్‌లు లేదా కట్టుడు పళ్లు తదితర దంత పునఃస్థాపన పద్ధతుల్లో ఇంప్లాంట్‌లను ఉపయోగిస్తారు. ఆర్థోడోంటిక్ (దంత వైద్యశాస్త్రంలో దంతాల అసాధారణతలను నిరోధించే లేదా సరిచేసే విభాగం) దంత కదలిక కోసం ఆధారంగా కూడా వీటిని ఉపయోగించవచ్చు. విలోమ చర్య లేకుండా ఏకదిశాత్మక దంత కదలికకు దంత ఇంప్లాంట్‌ల ఉపయోగం వీలు కల్పిస్తుంది.

చరిత్ర

ఎండోసెయస్ ఇంప్లాంట్‌లను ఉపయోగించిన ఉదాహరణలు మాయా నాగరికత కాలంలో లభ్యమయ్యాయి, (ఎముకలోకి అమర్చిన ఇంప్లాంట్‌లు), ఇంప్లాంట్‌లుగా టైటానియాన్ని ఉపయోగించినట్లు పర్-ఇంగ్వార్ బ్రేనెమార్క్ ముందు, 1,350 సంవత్సరాల పూర్వం ఆధారాలు ఉన్నాయి. హోండరస్‌లో 1931లో మాయా నాగరికతకు చెందిన సమాధి ప్రదేశాలను త్రవ్వినప్పుడు పురావస్తు శాస్త్రవేత్తలు మాయా మూలాలు గల కింది దవడ ఎముకలోకి అమర్చిన ఒక భాగాన్ని గుర్తించారు, ఇది సుమారుగా క్రీస్తుశకం 600 కాలానికి చెందినది. ఈ కింది దవడ ఎముక ఇరవైల్లో వయస్సు ఉన్న ఒక మహిళదిగా భావిస్తున్నారు, ఈ ఎముకలో మూడు దంతాకారపు భాగాలు ఉన్న కవచాన్ని సాకెట్‌లలో ఉంచి మూడు చెడిపోయిన దిగువ కత్తెర పళ్లు స్థానంలో అమర్చారు. ఈ కవచాలను పురాతన ఈజిప్షియన్‌లు పాటించే ఒక పద్ధతిలో భాగంగా, ఆమె మరణించిన తరువాత అమర్చినట్లు నలభై ఏళ్లపాటు పురావస్తు ప్రపంచం పరిగణించింది. అయితే, 1970లో బ్రెజిల్‌కు చెందిన దంత నిపుణుడు, అధ్యాపకుడు అమేడియో బోబ్బియో ఈ దవడ ఎముకపై అధ్యయనం చేశారు, దీనిలో భాగంగా వరుసగా రేడియోగ్రాఫ్‌లు (ఎక్స్‌రేచిత్రణలు) తీశారు. ఇంప్లాంట్‌లలో రెండింటి చుట్టూ ఉన్న కుదించిన దంత నిర్మాణాన్ని గుర్తించారు, తద్వారా ఈ ఇంప్లాంట్‌లను ఆమె జీవించివున్నప్పుడే అమర్చినట్లు నిర్ధారించారు.

1950వ దశకంలో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పరిశోధనలో జీవించివున్న జీవుల్లో రక్త ప్రసరణను అధ్యయనం చేశారు. కుందేళ్ల యొక్క చెవుల్లోని మృదు కణజాలంలోకి ఒక టైటానియం గదిని ప్రవేశపెట్టడం ద్వారా ఒక పద్ధతిని కనిపెట్టారు. 1952లో స్వీడన్‌కు చెందిన ఎముక సంబంధ శస్త్రచికిత్సల నిపుణుడు పిఐ బ్రేనెమార్క్ ఎముకల గాయాలను నయం చేయడం మరియు ఎముకల పునఃసృష్టి చేయడంపై ఉన్న ఆసక్తితో కుందేలు తొడ ఎముకలో కేంబ్రిడ్జ్ కనిపెట్టిన రాబిడ్ చెవి గది పరిశోధనను అమలు చేశారు. అధ్యయనం సాగిన కొన్ని నెలల తరువాత ఆయన కుందేళ్ల నుంచి ఈ వ్యయభరితమైన గదులను తిరిగి సేకరించేందుకు ప్రయత్నించారు, ఈ పరిశోధన ద్వారా ఆయన వీటిని వేరు చేయడం సాధ్యపడదనే విషయాన్ని గుర్తించడం జరిగింది. పెర్ బ్రేనెమార్క్ టైటానియంతో ఎముక అతి దగ్గర ప్రదేశం వరకు పెరిగిందని గుర్తించారు, ఇది లోహానికి సమర్థవంతంగా అనుగుణ్యతను ప్రదర్శించినట్లు కనిపెట్టారు. బ్రేనెమార్క్ ఈ పరిణామంపై అనేక ఇతర పరిశోధనలు నిర్వహించారు, జంతువులు మరియు మానవులపై ఈసారి ఆయన పరిశోధనలు జరిపారు, ఈ పరిశోధనలన్నింటితో ఆయన టైటానియం యొక్క అనుగుణ్యతను నిర్ధారించారు.

ఇదిలా ఉంటే స్టెఫానో మెల్చియాడ్ ట్రామోంటే అనే పేరుగల ఒక ఇటాలియన్ వైద్యుడు దంత పునరుద్ధరణలకు టైటానియం ఉపయోగకరంగా ఉంటుందని ప్రతిపాదించారు, తన సొంత దంత చికిత్స కోసం ఆయన ఒక టైటానియం మరమేకును ఉపయోగించారు, తన వైద్యశాలలో 1959లో పలువురు ఇతర రోగులకు కూడా వీటిని ఉపయోగించడం ప్రారంభించారు. మానవులపై ఆయన వైద్య అధ్యయనాల్లో సాధించిన మంచి ఫలితాలను 1966లో ప్రచురించారు.[1]

మొదటి ప్రయత్నాన్ని మోకాలు మరియు తొడ శస్త్రచికిత్సపై కేంద్రీకరించి చేయాలని బ్రేనెమార్క్ మొదట పరిగణించినప్పటికీ, చివరకు నిరంతర వైద్య పరిశీలనలకు నోరు అనువైన ప్రదేశంగా గుర్తించారు, విస్తృత అధ్యయనం కోసం సామాన్య ప్రజల్లో ఎడెన్‌తులిజం ఎక్కువగా ఉండటం వలన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎముకతో టైటానియం యొక్క వైద్యపరమైన అనుగుణ్యతను ఓసెయోఇంటిగ్రేషన్‌గా పిలిచారు. తరువాత స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్ విశ్వవిద్యాలయం శరీర నిర్మాణ శాస్త్రంలో అధ్యాపకుడిగా మారిన బ్రేనెమార్క్ 1965లో స్వచ్ఛంగా ప్రయోగం కోసం ముందుకొచ్చిన స్వీడన్ పౌరుడు గోస్టా లార్సన్‌కు మొదటి టైటానియం దంత ఇంప్లాంట్‌‍ను అమర్చారు.

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో స్టీవెన్స్ మరియు అలెగ్జాండర్ సమకాలీన స్వతంత్ర పరిశోధనను నిర్వహించారు, ఈ పరిశోధన చివరకు దంత ఇంప్లాంట్‌ల కోసం టైటానియాన్ని ఉపయోగించేందుకు సంబంధించి 1969లో ఒక US మేధోసంపత్తి హక్కు పొందేందుకు దారితీసింది.[2]

తరువాత పద్నాలుగు సంవత్సరాలపాటు బ్రేనెమార్క్ దంత ఇంప్లాంటాలజీలో టైటానియం ఉపయోగంపై అనేక పరిశోధక పత్రాలు ప్రచురించారు, 1978లో ఆయన స్వీడన్ రక్షణ రంగ సంస్థ బోఫర్స్ ABతో ఒక వ్యాపార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు, తన దంత ఇంప్లాంట్‌లను అభివృద్ధి చేసి, వాటితో వ్యాపారం చేసేందుకు ఆయన ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. బోఫోర్స్ (తరువాత ఇది నోబెల్ ఇండస్ట్రీస్‌గా మారింది) మాతృసంస్థగా నోబెల్‌ఫార్మా AB (తరువాత దీని పేరును నోబెల్ బయోకేర్‌గా మార్చారు) అనే కంపెనీని 1981లో ఏర్పాటు చేశారు, డెంటల్ ఇంప్లాంటాలజీపై దృష్టి పెట్టేందుకు దీనిని స్థాపించారు. ఈ రోజు వరకు 7 మిలియన్లకుపైగా బ్రేనెమార్క్ వ్యవస్థ ఇంప్లాంట్‌లను అమర్చడం జరిగింది, ఇతర కంపెనీలు వందలాది దంత ఇంప్లాంట్‌లను తయారు చేశాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎక్కువ భాగం దంత ఇంప్లాంట్‌లు చిన్న మరమేకుల ఆకారంలో ఉంటాయి, ఇవి శంకు ఆకారంలో లేదా సమాంతరంగా ఉంటాయి. గుంట గోడ యొక్క ఎముక నుంచి వేరు చేసి దంతాన్ని తొలగించే సమయంలోనే వీటిని అమరుస్తారు మరియు కొన్నిసార్లు గుంట యొక్క అంచు వెలుపల ఎముకతో కూడా వీటిని అమర్చడం జరుగుతుంది. నయమైన తరువాత ఎముకలోకి అమర్చే ఇంప్లాంట్‌ల కంటే దంతాన్ని పీకిన గుంటలోకి నేరుగా ఇంప్లాంట్‌లను అమర్చడం బాగా విజయవంతమైన ప్రక్రియగా ప్రస్తుత ఆధారాలు సూచిస్తున్నాయి.[3] తాజాగా దంతాలు తొలగించిన గుంటల్లోకి దంత ఇంప్లాంట్‌లను తక్షణమే అమర్చడానికి సంబంధించిన ప్రక్రియ యొక్క విజయవంతమయ్యే రేటు మరియు ఎక్స్‌రే చిత్రణ ఫలితాలు (ఒకే సమయంలో అమర్చే తాత్కాలిక క్రౌన్‌లు కొంతకాలం తరువాత అమర్చే (కొన్ని వారాలు లేదా నెలల తరువాత అమర్చే క్రౌన్‌లు) ఇంప్లాంట్‌ల ఫలితాలకు సమానంగా ఉన్నట్లు తెలుస్తోంది.[4]

దంత ఇంప్లాంట్‌ల తయారీలో జిర్కోనియా (ZrO2) వంటి పింగాణీ పదార్థాలను ఉపయోగించడంపై దంత ఇంప్లాంటాలజీలో ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. జిర్కోనియా అనేది జిర్కోనియం యొక్క డైయాక్సైడ్, జిర్కోనియం అనే లోహం ఆవర్తన పట్టికలో టైటానియానికి దగ్గరిలో ఉంటుంది, దాదాపుగా ఈ రెండింటికీ ఒకేరకమైన జీవఅనుగుణ్యత లక్షణాలు ఉంటాయి.[5] సాధారణంగా టైటానియం ఇంప్లాంట్‌ల ఆకారంలోనే ఉన్నప్పటికీ, జిర్కోనియా వలన ఒక అదనపు ప్రయోజనం ఉంది, దీనితో తయారు చేసిన ఇంప్లాంట్‌లు మెరిసే పళ్ల రంగులోనే ఉండి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి, దీనిని అనేక సంవత్సరాలుగా ఎముకసంబంధ శస్త్రచికిత్సలో విజయవంతంగా ఉపయోగించడం జరుగుతుంది.[6] ఒక భాగం ZrO2 ఇంప్లాంట్‌లు రోజువారీ వినియోగం కోసం సిఫార్సు చేసే ముందు దీర్ఘకాల-వైద్య చరిత్ర సమాచారం అవసరమవుతుంది.[7]

రూపకల్పన

టైటానియం స్క్రూతో (మరమేకు) ఉన్న ఒక విలక్షణ ఇంప్లాంట్ (ఒక దంత మూలాన్ని పోలివుంటుంది) గరుకైన లేదా మృదువైన ఉపరితలాన్ని కలిగివుంటుంది. ఎక్కువ భాగం దంత ఇంప్లాంట్‌లు వ్యాపారం కోసం అందుబాటులో ఉండే స్వచ్ఛమైన టైటానియంతో తయారు చేస్తారు, కర్బనం మరియు ఇనుము పరిమాణం ఆధారంగా ఇది 4 గ్రేడ్‌లలో దొరుకుతుంది.[8] ఇటీవల 5 గ్రేడ్ టైటానియం వినియోగం పెరుగుతోంది. గ్రేడ్ 5 టైటానియం, టైటానియం 6AL-4V (టైటానియం మిత్రధాతువులో 6% అల్యూమినియం మరియు 4% వెనాడియం మిశ్రధాతువు ఉంటాయి) వ్యాపారపరంగా విజయవంతమైన స్వచ్ఛమైన టైటానియం మాదిరిగానే ఒకరకమైన ఓసెయోఇంటిగ్రేషన్ ఫలితాలు అందిస్తుందని భావిస్తున్నారు. Ti-6Al-4V మిశ్రధాతువుకు మెరుగైన తన్యత సామర్థ్యం మరియు పగులు నిరోధకత ఉంటాయి. ప్రస్తుతం ఎక్కువ భాగం ఇంప్లాంట్‌లను స్వచ్ఛమైన టైటానియం (గ్రేడ్ 1 నుంచ 4 వరకు) తో తయారు చేస్తున్నారు, అయితే కొన్ని ఇంప్లాంట్ వ్యవస్థలను (ఎండోపోర్ మరియు నానోటైట్) Ti-6Al-4V మిశ్రధాతువుతో తయారు చేస్తున్నారు.[9] ఉపరితల ప్రదేశాన్ని మరియు ఇంప్లాంట్ యొక్క విలీన సామర్థ్యాన్ని పెంచేందుకు ప్లాస్మా స్ప్రేయింగ్, ఎనడైజింగ్, [10] ఎట్చింగ్ లేదా శాండ్‌బ్లాస్టింగ్ ద్వారా ఇంప్లాంట్ ఉపరితలాలకు సర్దుబాట్లు చేస్తున్నారు.

శిక్షణ

దంత ఇంప్లాంట్‌ల కోసం ADA ద్వారా గుర్తించబడిన ఎటువంటి ప్రత్యేక విభాగం లేదు. సాధారణ మత్తు సాధనాలు, నోటి భాగానికి మత్తు ఇచ్చే పద్ధతి, నైట్రస్ ఆక్సైడ్‌తో మత్తు ఇవ్వడం, సిరలకు మత్తు ఇవ్వడం లేదా స్థానిక మత్తు ఇచ్చే పద్ధతులను ఉపయోగించడం ద్వారా రోగికి ఇంప్లాంట్ శస్త్రచికిత్స నిర్వహిస్తారు, సాధారణ వైద్య నిపుణులు, నోటిసంబంధ శస్త్రచికిత్సలు చేసే వైద్యులు, దంతరోగ నిపుణులు మరియు దంతసంబంధ చికిత్సలు చేసే ఇతర వైద్యుల వంటి శిక్షణ పొందిన మరియు ధ్రువీకృత వైద్య నిపుణులు ఈ చికిత్సలు నిర్వహిస్తారు.

ఇంప్లాంట్ చికిత్స చేసే దంతవైద్యులకు సంబంధించిన చట్టబద్ధమైన శిక్షణ అవసరాలు దేశాన్నిబట్టి మారుతుంటాయి. UK ఇంప్లాంట్ దంతవైద్య విభాగాన్ని జనరల్ డెంటల్ కౌన్సిల్ ఒక పోస్ట్‌గ్రాడ్యుయేట్ డెంటిస్ట్రీ విభాగంగా పరిగణిస్తుంది. విశ్వవిద్యాలయ దంతవైద్య డిగ్రీ కోర్సులో దీనికి సంబంధించి ఎక్కువగా పాఠ్యాంశాలు ఉండవు, దంత ఇంప్లాంటాలజీలో శిక్షణ పొందాలనుకునే దంతవైద్యులు అదనంగా పోస్ట్‌గ్రాడ్యుయేట్ శిక్షణలో పాల్గొనాల్సి ఉంటుంది. జనరల్ డెంటల్ కౌన్సిల్ ఒక దంతవైద్యుడు సాధారణ దంత వైద్య సాధనలో దంత ఇంప్లాంట్‌లను ఉపయోగించేందుకు ఉద్దేశించిన శిక్షణలో కఠినమైన మార్గదర్శకాలను ఏర్పాటు చేసింది.[11] UK దంతవైద్యులు రోగులకు దంత ఇంప్లాంట్‌లకు సంబంధించిన చికిత్స చేయడానికి ముందు వారు సమర్థతను అంచానా వేసే పోస్ట్‌గ్రాడ్యుయేట్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది.

గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్థాయిల్లో డిగ్రీ పొందిన దంతవైద్యులకు శస్త్రచికిత్స ద్వారా ఇంప్లాంట్‌లు అమర్చేందుకు ఉద్దేశించిన శిక్షణ ఇవ్వడం దేశాన్నిబట్టి మారుతుంటుంది, [12][13][14], అయితే అధికారిక శిక్షణ లేకపోవడం వలన అధిక సమస్యాత్మక పరిస్థితులకు దారితీస్తుంది.[15]

శస్త్రచికిత్సా పద్ధతి

శస్త్రచికిత్స ప్రణాళిక

శస్త్రచికిత్సకు సిద్ధమైన పక్షంలో పాడైన దంతమూల నాడి లేదా రంధ్రం లాంటి ముఖ్యమైన నిర్మాణాలు, మరియు ముందస్తుగా ఊహించిన విధంగానే తుదిరూపం రావడంలో భాగంగా ఇంప్లాంట్‌లు సరైన విధంగా అమరేందుకు ఎముక యొక్క రూపం మరియు పరిమాణాల వంటి ముఖ్యమైన నిర్మాణాలను ముందస్తుగానే గుర్తించేందుకు జాగ్రత్తతో కూడిన మరియు వివరణాత్మక ప్రణాళిక అవసరమవుతుంది. అందుకే తరచూ శస్త్రచికిత్సకు ముందుగా ఆర్థోపాంటమోగ్రాఫ్‌‍లు లేదా పెరియాపికల్స్ లాంటి ద్వి-మితియ రేడియోగ్రాఫ్‌ల వంటివాటిని తీస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో CT స్కాన్ లాంటి వాటిని కూడా ఇందుకు ఉపయోగిస్తారు. మరోవైపు కేసు ప్రణాళికలో భాగంగా ప్రత్యేకమైన 3D CAD/CAM కంప్యూటర్ ప్రోగ్రాం లాంటి వాటిని కూడా ఉపయోగించే అవకాశముంది.

CT-మార్గదర్శకం లేదా మ్యానువల్ ద్వారా కొన్ని సందర్భాల్లో ఇంప్లాంట్ల కూర్పును సులభతరం చేయడం కోసం 'స్టెంట్' సైతం ఉపయోగించే అవకాశముంది. శస్త్రచికిత్స స్టెంట్ అనేది ఆక్రిలిక్‌తో రూపొందిన ఒక పల్చని పొర, ఇంప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిన ప్రదేశం యొక్క స్థానం మరియు కోణాన్ని ప్రదర్శించడం కోసం ముందస్తు డ్రిల్లింగ్ రంధ్రాలతో పాటుగా దంతం, ఎముక ఉపరితలం లేదా మరియు శ్లేష్మపు పొర (అన్ని దంతాలు లేని పక్షంలో) మీద దీన్ని అమర్చుతారు. CT స్కాన్ సాయంతో రూపొందించిన కంప్యూటరీకరించిన ప్రణాళికను అనుసరించి శస్త్రచికిత్స స్టెంట్ అనేది స్టెరియోలిథోగ్రఫీ ఉపయోగించి తయారు చేయవచ్చు. సాధారణంగా ఆమోదించే విధానాలతో పోలిస్తే, CT మార్గదర్శక శస్త్రచికిత్స అనేది ఖర్చును రెండింతలుగా మార్చవచ్చు.

ప్రాథమిక పద్ధతి

ఓసియోఇంటిగ్రేటెడ్ ఇంప్లాంట్‌ను అమర్చే క్రమంలో ప్రాథమికంగానే అత్యధిక నియంత్రిత వేగంతో చేతితో ఉపయోగించే ఓస్టియోటోమెస్ లేదా సున్నితమైన డ్రిల్‌లను ఉపయోగించడం ద్వారా ఎముకలోకి చొచ్చుకుపోవాల్సి ఉంటుంది[16], ఎముక మండిపోవడం లేదా ఒత్తిడి కారణంగా కణనాశనం జరగడం లాంటి వాటిని నివారించేందుకు ఇలా చేయాల్సి ఉంటుంది. ఇంప్లాంట్ యొక్క ఉపరితలం (ఓసియోఇంటిగ్రేషన్) పై ఎముక పెరగడం కోసం కొంత నిర్థిష్ట కాలంపాటు దాన్ని అలాగే వదలి వేసిన తర్వాత, ఇంప్లాంట్‌పై క్రౌన్ లేదా క్రౌన్‌లను తొడగడం జరుగుతుంది. ఒక ఇంప్లాంట్‌ను అమర్చడానికి ఎంత సమయం అవసరమవుతుందనే విషయం ప్రత్యేకించి వైద్యుని అనుభవం, ఎముక నాణ్యత మరియు పరిమాణం మరియు వ్యక్తిగత పరిస్థితికి సంబంధించిన క్లిష్టత లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

వివరణాత్మక పద్ధతి

బోసి (పూర్తిగా దంతాలు లేని) దవడ ప్రదేశాల్లో గ్రహీత ఎముకలోకి ఒక మార్గదర్శక రంధ్రం చేయబడుతుంది, ముఖ్యమైన నిర్మాణాల (ప్రత్యేకించి కింది దవడలోని పాడైన దంతమూల నాడి లేదా IAN మరియు కింది దవడలో ఉండే మెంటల్ ఫోరామెన్) ను తప్పించడానికి జాగ్రత్త తీసుకోవాలి. దవడ ఎముకలోకి రంధ్రం చేసే విషయంలో సాధారణంగా అనేక ప్రత్యేకమైన దశలు చోటు చేసుకుంటాయి. విశాలమైన డ్రిల్‌ (ఇంప్లాంట్ వ్యాసం మరియు పొడవులపై ఆధారపడి ప్రత్యేకించి మూడు నుంచి ఏడు దశల్లో విజయవంతంగా రంధ్రం చేయడం జరుగుతుంది) లను క్రమంగా ఉపయోగించడం ద్వారా మార్గదర్శక రంధ్రాన్ని విస్తరిస్తారు. అదేసమయంలో ఎక్కువ వేడి కారణంగా ఆస్టియోబ్లాస్ట్ లేదా ఎముక కణాలు దెబ్బతినకుండా జాగ్రత్త తీసుకోవాలి. చల్లటి సెలైన్ లేదా నీరు చల్లడం ద్వారా ఎముక ఉష్ణోగ్రతను 47 డిగ్రీల సెల్సియస్ (సరాసరిగా 117 డిగ్రీల ఫారన్‌హీట్) వద్ద ఉంచడం జరుగుతుంది. ఇంప్లాంట్ మరమేకు అనేది స్వీయ-పట్టు కలిగిన మర కావచ్చు, అలాగే అది సరైన పురిశక్తితో నిర్ణీత స్థానంలో బిగించబడడం వల్ల ఎముక చుట్టూ ఉండే ప్రదేశంలో ఎలాంటి వత్తిడి చోటు చేసుకోదు (ఒత్తిడి ఎక్కువైన పక్షంలో ఎముక మృతి చెందుతుంది, ఇటువంటి పరిస్థితిని ఓస్టియోనేక్రోసిస్ అని పిలుస్తారు, ఈ రకమైన పరిస్థితి అనేది దవడ ఎముకతో పూర్తిగా కలిసిపోవడం లేదా బంధం ఏర్పడేందుకు దారితీయడం ద్వారా ఇంప్లాంట్ విఫలమయ్యేందుకు దారితీస్తుంది. అనేక రకాల ఇంప్లాంట్ వ్యవస్థల్లో, డ్రిల్ టిప్ ఆకారం కారణంగా ఓస్టియోటోమీ లేదా డ్రిల్ చేసిన రంధ్రం అనేది ఇంప్లాంట్ నాటుకునే ప్రదేశం కంటే 1mm లోతు వరకు చోటు చేసుకుంటుంది. ముఖ్యమైన నిర్మాణాలకు సమీపంలో రంధ్రం చేస్తున్న సమయంలో శస్త్రచికిత్స చేసే వైద్యులు అదనపు పొడవును సైతం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

శస్త్రచికిత్స కోతలు

సంప్రదాయం ప్రకారం, ఇంప్లాంట్‌ను ఎక్కడైతే స్థిరీకరిస్తారో ఆ ప్రదేశంలోని పైభాగంలో కోత పెట్టడం జరుగుతుంది. దీన్ని 'ఫ్లాప్' అని పిలుస్తారు. అయితే కొన్ని వ్యవస్థల్లో ఇంప్లాట్‌ను ఏర్పాటు చేసే ప్రదేశం నుంచి కొంతభాగం శ్లేష పొరని రంధ్రం చేసి తీసేయడం ద్వారా 'ఫ్లాప్‌రహిత' శస్త్రచికిత్సకు అవకాశం లభిస్తుంది. 'ఫ్లాప్‌రహిత' శస్త్రచికిత్సకు సంబంధించిన అనుకూల సిద్ధాంతాల ప్రకారం, కోలుకునే సమయాన్ని తగ్గించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని చెబుతున్నప్పటికీ, ప్రతికూల వాదనల ప్రకారం ఈ విధానంలో ఎముక అంచు కనిపించకపోవడం వల్ల శస్త్రచికిత్సకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశముంది.[17][18] ఎముక కనిపించకపోవడమనే ఈ రకమైన సమస్యల కారణంగా, తరచూ శస్త్రచికిత్సకు ముందు నిర్వహించే CT స్కాన్ యొక్క కంప్యూటరీకరించిన 3D ప్రణాళికను అనుసరించే శస్త్రచికిత్స మార్గదర్శక నిర్మాణాన్ని ఉపయోగించడం ద్వారా ఫ్లాప్‌రహిత శస్త్రచికిత్సను నిర్వహించడం జరుగుతుంది.

స్వస్థత చేకూరే సమయం

ఒక ఇంప్లాంట్ అనేది శరీరంలో ఇమిడేందుకు ఎంత సమయం అవసరమవుతుందనే అంశం అత్యంత చర్చాపూరిత అంశంగా ఉంటోంది.[19] కాబట్టే ఒక ఇంప్లాంట్ దాని స్థానంలో సరిగ్గా అమరి యధాస్థితికి రావడానికి వైద్యులు ఒక్కొక్కరి విషయంలో ఒక్కో రకమైన కాల వ్యవధిని అనుసరిస్తుంటారు. సాధారణంగా, వైద్యులు ఇంప్లాంట్ విషయంలో స్వస్థత చేకూరడానికి 2–6 నెలల కాలం వేచి చూస్తుంటారు, అయితే ప్రాథమిక అధ్యయనాల ప్రకారం, ఇంప్లాట్‌ను త్వరితగతిన నింపడం వల్ల స్వల్ప కాలంలోనూ లేదా దీర్ఘ కాలంలో చోటు చేసుకునే సమస్యలు ఎక్కువయ్యే అవకాశమేదీ ఉండకపోవచ్చు.[20] ఒకవేళ ఇంప్లాట్‌ను త్వరగా నింపేసినట్టైతే, ఇంప్లాంట్ కదలడం వల్ల చివరికి ఆ ప్రయత్నం విఫలం కావచ్చు. అంటుకట్టేందుకు మరియు మరొక కొత్త ఇంప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సరిపడినంత స్వస్థత చేకూరేందుకు దాదాపు పద్దెనిమిది నెలల వరకు పట్టవచ్చు. ఈ కారణంగానే చాలామంది స్వస్థత చేకూరేందుకు అవసరమైన సమయాన్ని పొడిగించేందుకు అయిష్టత వ్యక్తం చేస్తుంటారు.

ఒక-దశ, రెండు-దశల శస్త్రచికిత్స

ఇంప్లాంట్ అనేది శ్లేష్మ పొర ద్వారా వచ్చి స్థిరపడే ఒక 'స్వస్థత చెందిన దన్నుగోడ' లేదా దంత ఇంప్లాంట్ స్థిరపడే ఉపరితలంతో జతపడే ఒక 'కప్పివుంచే మరమేకు' గానూ స్థిరపడవచ్చు. ఒక కప్పివుంచే మరమేకు స్థిరపడే సమయంలో ఇంప్లాంట్‌ను శ్లేష్మపొర కప్పివేస్తుంది, అదేసమయంలో రెండో శస్త్రచికిత్స పూర్తయ్యే సమయానికి స్వస్థత పొందిన దన్నుగోడ చోటు చేసుకోవడం కోసం సదరు ఇంప్లాంట్ అనేది ఎముకతో జతపడుతుంది.

అనుకూలమైన ఎముక అంటుకట్టుడు అనేది చోటు చేసుకున్నప్పుడు లేదా క్రితం సారి చోటు చేసుకున్న కారణాల కోసం శ్లేష్మ పొరపై శస్త్రచికిత్స అవసరమైన పక్షంలో కొన్ని సందర్భాల్లో రెండు-దశల శస్త్రచికిత్స అనేది ఎంచుకోవబడుతుంది. కొన్ని ఇంప్లాంట్లు ఒక ముక్కగా ఉండడం వల్ల స్వస్థత చెందిన దన్నుగోడ అవసరముండదు.

అత్యంత జాగ్రత్తగా ఎంపిక చేసిన కేసుల్లో, ఒక శస్త్రచికిత్సలోనే ఇంప్లాంట్లను ఏర్పాటు చేయడం మరియు వాటిని కృత్రిమ దంతాలతో నింపడం లాంటి అన్ని అంశాలను పూర్తి చేస్తుంటారు, ఈ పద్ధతిని "ఇమ్మిడియేట్ లోడింగ్" అనే పేరుతో సూచిస్తారు. ఈ రకమైన కేసుల్లో ఇంప్లాంట్ ఎముకతో ఏకమవుతున్న సమయంలో నమలడం వల్ల ఏర్పడే ఒత్తిడి అనేది ఇంప్లాంట్‌కు చేరడాన్ని తప్పించడం కోసం తాత్కాలిక కృత్రిమ దందం లేదా క్రౌన్‌ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.

శస్త్రచికిత్స సమయం

దంతాన్ని తొలగించిన తర్వాత దంత ఇంప్లాట్‌లను స్థాపనం చేసేందుకు వివిధ రకాలైన విధానాలున్నాయి. సదరు విధానాలు కింది రూపంలో ఉంటాయి:

 1. దంతాన్ని తొలగించిన వెంటనే ఇంప్లాట్‌ని స్థాపన చేయడం.
 2. దంతాన్ని తొలగించిన వెంటనే ఇంప్లాట్‌ని అమర్చే ప్రక్రియని ఆలస్యం చేయడం (దంతాన్ని తొలగించిన 2 వారాల మొదలు 3 నెలల లోగా ఇంప్లాంట్‌ని ఏర్పాటు చేస్తారు).
 3. ఆలస్యంగా ఇంప్లాట్‌ని స్థాపించడం (దంతాన్ని తొలగించిన 3 నెలలు లేదా అటుపై చాలాకాలం తర్వాత).

దంతాన్ని తొలగించిన తర్వాత ఇంప్లాంట్‌ని ఎప్పుడు స్థాపిస్తారనే అంశంపై ఆధారపడి ఆ రకమైన విధానాన్ని కింది విధాలుగా వర్గీకరించారు:

 1. తక్షణ స్థాపన పద్ధతి.
 2. త్వరిత స్థాపన పద్ధతి (1 వారం మొదలు 12 నెలల్లో).
 3. ఆలస్యంగా స్థాపన (3 నెలల తర్వాత)

తక్షణ స్థాపన

ఎముక రక్షణ కోసం మరియు చికిత్స సమయాన్ని తగ్గించడం కోసం దంతాన్ని తొలగించిన స్థానంలో వెనువెంటనే ఇంప్లాంట్ అమర్చడమనే ప్రక్రియ వేగంగా వృద్ధి చెందుతోన్న సాధారణ వ్యూహంగా ఉంటోంది. దీంతోపాటు, వెనువెంటనే ఇంప్లాంట్ స్థాపన పద్ధతికి సంబంధించిన విజయాల శాతం ప్రస్తుతం ఆమోదిత స్థాయిలో ఉండడం వల్ల తక్షణ ఇంప్లాట్ స్థాపన అనేది అత్యంత సాధారణ అంశంగా మారింది. చికిత్స నెలల కొద్దీ సాగే విధానాన్ని ఇది తగ్గించడంతో పాటు కొన్ని కేసుల్లో దంత ఇంప్లాట్లను అమర్చడం కోసం శస్త్రచికిత్స జరిగిన సయయంలోనే కృత్రిమ దంతాలను ఇంప్లాట్లకు అమర్చడం కూడా జరుగుతోంది.

అనేక రకాల అధ్యయనాలు సూచిస్తున్న ప్రకారం, ఆరోగ్యకరమైన ఎముకతో మరియు దానిచుట్టూ శ్లేష్మ పొరతో ఉన్న ఏకైక మూలం కలిగిన దంతాల ప్రదేశాల్లో ఇంప్లాంట్లను స్థాపిస్తున్న క్రమంలో ఆలస్యం చేసిన పద్ధతులతో పోలిస్తే తక్షణ స్థాపన పద్ధతి బాగుండడంతో పాటు అదనపు సమస్యలేవీ తలెత్తడంలేదు.[21]

CT స్కానింగ్ ఉపయోగం

పాడైన దంతమూల కాలువ, మెంటల్ ఫోరమెన్ మరియు మ్యాక్సిలరీ సైనస్‌లతో సహా ముఖ్యమైన నిర్మాణాలను అత్యంత కచ్చితంగా గుర్తించేందుకు కోన్ బీమ్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ లేదా CBCT (3D ఎక్స్‌రే) అని కూడా పిలిచే కంప్యూటెడ్ టోమోగ్రఫీని ఉపయోగించడం వల్ల చికిత్సకు కూర్చోవాల్సిన సమయం మరియు ఆస్పత్రి దర్శనాల సంఖ్య వంటి అంశాలను తగ్గించేందుకు అవకాశముంటుంది.[22] సంప్రదాయ వైద్యసంబంధిత CT స్కానింగ్‌తో పోల్చితే, కోన్ బీమ్ CT స్కానింగ్ అనేది 2% కంటే తక్కువ రేడియేషన్‌ని వెలువరించడంతో పాటు స్కాన్ చేయాల్సిన ప్రదేశంపై మరింత కచ్చితత్వాన్ని ప్రదర్శిస్తుంది, అంతేకాకుండా రోగి విషయంలో ఇది భద్రమైనదిగానూ ఉంటుంది.[23] శస్త్రచికిత్స చేసే వైద్యుడు ఒక శస్త్రచికిత్స మార్గదర్శకాన్ని తయారు చేసేందుకు CBCT అనుమతించడం వల్ల శస్త్రచికిత్స నిర్వహించే వైద్యుడు అత్యంత కచ్చితత్వంతో నిర్ణీత ప్రదేశంలో ఇంప్లాంట్‌ని స్థాపించేందుకు అవకాశం లభిస్తుంది.[24]

అనుబంధ పద్ధతులు

సైనస్ లిఫ్టింగ్ అనేది ఒక సాధారణ శస్త్రచికిత్స అనుబంధంగా ఉంటోంది. ఈ శస్త్రచికిత్సలో భాగంగా దంతవైద్యుడు లేదా తగినంత శిక్షణ కలిగిన నోటి శస్త్రచికిత్స నిపుణుడు, దంత జీవ కణ శాస్త్ర నిపుణుడు, సాధారణ దంతవైద్యుడు, లేదా ప్రోస్థోడోన్టిస్ట్ లాంటివారు ఎముక మార్పిడి లేదా ఎముక పదార్థం సాయంతో ఇంప్లాంట్‌ను బిగించేందుకు చాలని పరిస్థితిలో ఉన్న కృశించిన జంబికను సైనస్ వరకు మందంగా చేయడం జరుగుతుంది. దీని ఫలితంగా ఇంప్లాట్‌ చేసేందుకు ఎక్కువ మొత్తంలో ఉన్న నాణ్యమైన ఎముక ప్రదేశం అందుబాటులోకి వస్తుంది. సైనస్‌లోకి ఏర్పడిన గుంతలోకి ఇంప్లాంట్‌లను స్థాపించేందుకు ఇష్టపడని వివేకవంతమైన శస్త్రచికిత్స నిపుణులు CBCT ఎక్స్‌రేని ఉపయోగించడం ద్వారా సైనస్ లిఫ్ట్ శస్త్రచికిత్సకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు, దవడ కింద ఎముక యొక్క వెనుక ఇంప్లాంట్‌ల గురించి ముందుగానే చర్చించిన పక్షంలో వారు ఈ విధమైన నిర్ణయానికి వస్తారు.

ముందు నుంచి వెనుకకు (పెదవి నుంచి నాలుక వరకు) లోతు లేదా మందం; పై నుంచి కింది వరకున్న ఎత్తు; మరియు ఎడమ నుంచి కుడి వెడల్పు ప్రాంతాల్లో చాలినంత జంబిక లేదా దవడ కింది ఎముక లేని కేసుల్లో ఎముక అంటుకట్టడం అవసరమవుతుంది. మూలాన్ని పోలిన ఇంప్లాంట్‌తో సురక్షితమైన కలయిక కోసం మూడు కోణాల్లోనూ చాలినంత ఎముక అవసరం. ఎముక ఎత్తును వృద్ధి చేయడమనేది చాలా కష్టమైన కార్యం అయినప్పటికీ, ఇంప్లాంట్ యొక్క మూలాన్ని పోలిన రూపాన్ని స్థిరంగా నిలిపి ఉంచడం కోసం ప్రత్యేకించి ఇది చాలా ముఖ్యం, సహజసిద్ధమైన దంతాల తరహాలో నమలడమనే యాంత్రిక ఒత్తిడికి మద్దతుగా నిలవడం కోసం కూడా ఇది చాలా ముఖ్యమైన అంశంగా ఉంటుంది.

క్రౌన్ లేదా దంతం అనేది ఎముక పైభాగంలోనే ఉంటుంది కాబట్టి కనీసం ఇంప్లాంట్లనైనా ఎముకలో బాగా లోతుగా ఏర్పాటు చేసేందుకు ఇంప్లాంట్‌లను ఏర్పాటుచేసే శస్త్రచికిత్స నిపుణులు ప్రయత్నిస్తుంటారు. దీనినే క్రౌన్ నుండి మూలానికి 1:1 నిష్పత్తిగా పిలుస్తుంటారు. అనేక కేసుల్లో ఎముక అంటుకట్టడం కోసం అవసరమైన లక్ష్యాన్ని స్థాపించేందుకు ఈ నిష్పత్తి ఉపయోగపడుతుంది. ఒకవేళ 1:1 లేదా అంతకంటే ఎక్కువ నిష్పత్తిని సాధించలేని పక్షంలో ఇంప్లాంట్లను కేవలం తక్కువ లోతులో మాత్రమే ఏర్పాటు చేసేందుకు అవకాశముందని, అందువల్ల దీర్ఘకాలం పాటు అది ఉపయోగకరంగా ఉంటుందనే ఆశలేవీ పెట్టుకోవద్దని సలహా ఇవ్వడం జరుగుతుంది.

ఎముక అంటుకట్టడం/ ఎముక మార్పిడి పద్ధతిని చేపట్టిన సందర్భంలో వివిధ రకాలైన అంటుకట్టుడు పదార్థాలను ఉపయోగించడం జరుగుతుంటుంది. ఇందులో భాగంగా తుంటి (ఇలియాక్ క్రెస్ట్) లేదా దవడ ఎముకలోని కొంతభాగం నుంచి తీసిన రోగి యొక్క సొంత ఎముక (ఆటోగ్రాఫ్ట్) ; మృతదేహాల నుంచి తీసిన ఎముక (అల్లోగ్రాఫ్ట్) ; పశువుల నుంచి తీసిన ఎముక లేదా పగడాల నుంచి తీసి పదార్థం (జెనోగ్రాఫ్ట్) ; లేదా ఎముకను పోలిన పదార్థాల (రీజెనోఫార్మ్ లాంటి పేర్లతో కూడిన కాల్షియం సల్ఫేట్; మరియు హైడ్రాక్సియాపటిట్ లేదా HA లాంటి ఎముక నుంచి తీసిన కాల్షియం సహిత అంశాలు) నుంచి తయారైన కృత్రిమ అంశాలను ఉపయోగించడం జరుగుతుంటుంది. HA అనేది ఎముక మాతృకణం పైకి పెరిగేందుకు ఒక ప్రభావవంతమైన సహజసిద్ధ పదార్థంగా ఉపయోగపడుతుంది. ఎముకను వృద్ధిచేసే లక్షణాలు కలిగిన ఈ రకమైన అనేక పదార్థాల్లో ఒకటైన దీని గురించి ఎముక అధ్యయన బృందాల్లో రసవత్తరమైన చర్చ జరుగుతున్నప్పటికీ, పైన చెప్పిన కారణం వల్లే కొన్ని ఇంప్లాట్లపై HAను పూతగా పూయడం జరుగుతోంది. ప్రత్యామ్నాయంగా ఇంప్లాంట్‌కు మద్దతుగా నిలిచేందుకు ఎముక శాండ్‌విచ్ మాదిరిగా రెండు భాగాల మధ్య స్థిరపడే ఇంప్లాంట్‌తో కలిసి విడిపోవడం మరియు విస్తరించడం జరుగుతుంది. దీన్ని 'రిడ్జ్ స్ప్లిట్' పద్ధతి అంటారు.

ఎముక అంటుకట్టడం అనేది సంరక్షణ యొక్క సొంత ప్రామాణికతను కలిగి ఉంటుంది. విలక్షణమైన పద్ధతిలో, అంటుకట్టే ప్రదేశం వద్ద దవడ ఎముక పూర్తిగా బహిర్గతమయ్యేందుకు జింజివా లేదా పంటి చిగురు యొక్క ఒక అతిపెద్ద దళాన్ని వైద్యుడు సృష్టించడం జరుగుతుంది, ఇందులో భాగంగా మనుగడలో ఉన్న ఎముకలో మరియు దానిపైన ఒకటి లేదా అనేక రకాల బ్లాక్ మరియు పైపొర అంటుకట్టడాలు చోటుచేసుకుంటాయి, దీనితర్వాత ఒక శ్లేష్మపొరను రూపొందించడం జరుగుతుంది, నోటి కుహరంలో ఉండే మైక్రోబయోటా కారణంగా అనవసరమైన ఇన్ఫెక్షన్ చోటు చేసుకోకుండా ఉండేందుకు ఇలా చేస్తారు. అటుపై ఈ శ్లేష్మ పొరను అత్యంత జాగ్రత్తగా ఆ మొత్తం ప్రదేశంపై కప్పడం జరుగుతుంది. చివరగా శరీరం మొత్తానికి సంబంధించిన యాంటీబయాటిక్‌లు మరియు ప్రత్యేకమైన యాంటీబ్యాక్టీరియల్ నోటి శుభ్రత పదార్థాలను కలిపి ఉపయోగించడం ద్వారా అంటుకట్టిన ప్రదేశం స్వస్థతను పొందేందుకు (అనేక నెలల పాటు) అవకాశం ఇవ్వబడుతుంది.

అంటుకట్టిన భాగం వెడల్పు మరియు ఎత్తుల్లో విజయవంతమైన విషయాన్ని నిర్థారించేందుకు వైద్యుడు ఒక కొత్త రేడియోగ్రాఫ్‌ని ఉపయోగించడం జరుగుతుంది, అలాగే స్వస్థతకు సంబంధించి రెండు కోణాల్లో అనుకూలమైన సంకేతాలు కనిపించినట్టైతే, దాన్ని అనుసరించి లోతు అనే మూడో కోణంలో కూడా స్వస్థత చేకూరినట్టుగా అంచనా వేయడం జరుగుతుంది. సాధారణంగా దవడ కింది ఎముకలో ఇంప్లాట్లు వేసేందుకు ప్రణాళికలు వేసుకున్న పక్షంలో మరింత కచ్చితత్వం అవసరమైనట్టైతే, ఈ దశలో 3D లేదా కోన్ బీమ్ రేడియోగ్రాఫ్‌ సాయం తీసుకుంటారు, కచ్చితమైన చికిత్సకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయడంలో భాగంగా ఎముక మరియు నాడుల ప్రదేశం మరియు ముఖ్యమైన నిర్మాణాల యొక్క కచ్చితమైన కొలతలు తీసుకొనేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తారు. మరోవైపు కంప్యూటర్‌ సాయంతో రూపొందించిన ప్లేస్‌మెంట్ మార్గదర్శకాల యొక్క తయారీ కోసం పైన పేర్కొన్న రేడియోగ్రాఫిక్ సమాచారాన్నే నియోగిస్తారు.

సరైన రీతిలో నిర్వహించినట్టైతే, అంటుకట్టిన ఎముక అనేది జీవ సహితమైన నాళ సంబంధిత ఎముకను అభివృద్ధి చేస్తుంది, ఇది చాలావరకు సహజసిద్ధమైన దవడ ఎముక లాగే ఉండడం వల్ల ఇంప్లాంట్ల స్థాపనకు పనికివచ్చే ఒక పునాదిగా ఉపయోగపడుతుంది.

పరిశీలనలు

దంత ఇంప్లాంట్ల కోసం WorkNC డెంటల్ CAD/CAM ఉపయోగించి తయారుచేసిన వారధులు మరియు క్రౌన్స్‌తో పాటుగా ఉన్న క్రోమ్-కోబాల్ట్ డిస్క్

దంత ఇంప్లాంట్ పద్ధతిని అనుసరించడం కోసం దవడలో తగినంత ఎముక ఉండడంతో పాటు సదరు ఎముక ఇంప్లాంట్‌ని పట్టి ఉంచడానికి మరియు మద్దతు ఇచ్చేందుకు అవసరమైనంత బలాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ తగినంత ఎముక లేనట్టైతే, చాలావరకు ముందుగా చర్చించిన ఎముక అంటుకట్టుడు పద్ధతిని జోడించాల్సిన అవసరం కలగవచ్చు. కొన్నిసమయాల్లో ఈ పద్ధతిని ఎముక వర్థనం అని పిలుస్తుంటారు. దీంతోపాటు, ఇంప్లాంట్‌ను బిగించే ప్రదేశానికి సమీపంలో ఉండే సహజమైన దంతాలు మరియు మద్దతుగా నిలిచే కణజాలాలు పూర్తి ఆరోగ్యంగా ఉండాలి.

అదేసమయంలో అన్ని కేసుల్లోనూ ఇంప్లాంట్‌పై భవిష్యత్‌లో చోటు చేసుకునే ఒత్తిడిని మదింపు చేయడం లాంటి పునరుద్ధరణ యొక్క తుది పనితీరు అంశాలను జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాలి. నమలడం మరియు అసాధారణ చర్యలు (అసాధారణమైన రీతిలో నమలడం లేదా దంతాలు బిగపట్టడం) ఇంప్లాంట్ ఎముక ఉపరితలం మరియు /లేదా టైటానియం లోహం యొక్క జీవయాంత్రిక క్షయాన్ని ఎక్కువ చేయడం ద్వారా వైఫల్యానికి దారితీస్తుంది. ఇది ఇంప్లాంట్ వైఫల్యం (దెబ్బతినడం) లేదా ఎముక క్షయం, ఎముక చుట్టూ ఉన్న ప్రదేశం యొక్క "ద్రవీభవనం" లేదా విచ్ఛిన్నానికి దారితీస్తుంది.

అందుకే దంతవైద్యుడు రోగి విషయంలో ఏరకమైన కృత్రిమ దంతం తయారు చేయాలనే అంశాన్ని ముందుగానే గుర్తించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని నిర్థారించిన తర్వాత మాత్రమే సంఖ్య, పొడవు, వ్యాసార్థం, మరియు మర పద్ధతి లాంటి ప్రత్యేకమైన ఇంప్లాంట్ అవసరాలను గుర్తించాల్సి ఉంటుంది. ఇంకో విధంగా చెప్పాలంటే, శస్త్రచికిత్సకు ముందుగా సదరు కేసు తప్పనిసరిగా దంత నిర్మాణాన్ని పూర్వస్థితికి తెచ్చే దంతవైద్యుని చేత పూర్తిస్థాయిలో పరిశీలించబడాలి. ఒకవేళ ఎముక పరిమాణం లేదా సాంద్రత సరిపోని పక్షంలో ఎముక అంటుకట్టుడు విధానాన్ని తప్పకుండా మొదటగా పరిశీలనలోకి తీసుకోవాలి. ఇందులో భాగంగా రోగి విషయంలో కలిసి చికిత్స చేయడం కోసం దంత నిర్మాణాన్ని పూర్వస్థాయికి తెచ్చే దంతవైద్యుడు నోటి శస్త్రచికిత్స నిపుణుడు, పెరియోడోన్టిస్ట్, ఎండోడోన్టిస్ట్, లేదా ఇతర శిక్షణ పొందిన సాధారణ దంతవైద్యుని సంప్రదించవచ్చు. సాధారణంగా, ఇంప్లాంట్ శస్త్రచికిత్సకుడి అభ్యర్థన మేరకు రోగి యొక్క దవడ ఎముక మరియు దంతాలకు సంబంధించిన భౌతిక నమూనాలు లేదా ముద్రలనేవి దంత నిర్మాణాన్ని యధాస్థితికి తెచ్చే దంత వైద్యునిచే రూపొందించబడడంతో పాటు చికిత్స ప్రణాళిక కోసం భౌతిక సహాయకారుణులుగానూ ఉపయోగపడుతాయి. ఒకవేళ అవి సరఫరా కాని పక్షంలో, సరైన చికిత్స ప్రణాళికను సాధించడం కోసం ఇంప్లాంట్ శస్త్రచికిత్సకుడు తన స్వంత లేదా కంప్యూటర్ సహాయంతో పనిచేసే టోమోగ్రఫీ లేదా కోన్ బీమ్ CT స్కాన్‌పై ఆధారపడుతాడు.

బేరియంతో నింపిన కృత్రిమ దంతానికి సంబంధించిన తుది రూపం యొక్క ప్రాథమిక రూపంపై ఆధారపడి మిధ్యా ఇంప్లాంట్ శస్త్రచికిత్స స్థాపన జరిపేందుకు CT స్కాన్ సమాచారంపై ఆధారపడిన కంప్యూటర్ సిములేషన్ సాఫ్ట్‌వేర్ అనుమతిస్తుంది. ముఖ్యమైన శారీరక శాస్త్రం, ఎముక నాణ్యత, ఇంప్లాంట్ లక్షణాలు, ఎముక అంటుకట్టుడు ఆవశ్యకత, మరియు చికిత్స కేసు ఒక ఉన్నత స్థాయి అంచనాను సృష్టించడం కోసం ఇంప్లాంట్ ఎముక ఉపరితలం ప్రదేశాన్ని విస్తరించడం లాంటి వాటిని ఇది అంచనా వేస్తుంది. కృత్రిమ దంతం తుది రూపం మరియు సౌందర్యశాస్త్రంపై ఆధారపడి ఇంప్లాంట్ శస్త్రచికిత్సకుడు సరైన విధంగా ఇంప్లాంట్‌ను స్థాపనం చేయడం కోసం కంప్యూటర్ CAD/CAM పరికరాలు లేదా స్టీరియోలిథోగ్రఫీ ఆధారిత మార్గదర్శకాలు రూపొందించబడుతాయి.

చికిత్స ప్రణాళిక సాఫ్ట్‌వేర్ అనేది కంప్యూటర్ తెర సాయంతో రోగికి "ట్రై-ఇన్స్"ను వివరించడం కోసం కూడా ఉపయోగించబడుతుంది. ఎంపికల గురించి రోగికి, శస్త్రచికిత్సకుడికి మధ్య పూర్తిస్థాయి చర్చలు జరుగుతున్న సమయంలో కచ్చితమైన విధంగా రంధ్రాలు చేయడం కోసం కూడా ఇదే సాఫ్ట్‌వేర్ ఉపయోగించడం జరుగుతుంది. చికిత్స ప్రణాళికను నిర్మించడం కోసం ఒక రోగి యొక్క CBCT నుండి స్వీకరించిన డిజిటల్ సమాచారాన్ని 'సింప్లాంట్' (అనుకరణ ఇంప్లాంట్) లేదా 'నోబెల్‌గైడ్' లాంటి ప్రత్యేక రకానికి చెందిన సాఫ్ట్‌వేర్లు ఉపయోగిస్తాయి. వీటన్నింటి తర్వాత నోటి లోపల రంధ్రాలు చేసే మార్గదర్శకాన్ని ఉత్పత్తి చేయడం కోసం ఒక సమాచార సమితిని ఉత్పత్తి చేయడం మరియు పరిశోధనశాలకు పంపడం జరుగుతుంది.[25]

విజయ శాతాలు

దంత ఇంప్లాంట్ విజయం అనేది శస్త్రచికిత్సకుడి నైపుణ్యం, చికిత్స జరిగిన ప్రదేశంలో అందుబాటులో ఉన్న ఎముక నాణ్యత మరియు పరిమాణం, మరియు రోగి యొక్క నోటి పరిశుభ్రత లాంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. సర్వత్రా వ్యాపించిన ఆమోదం ప్రకారం ఇంప్లాంట్ల యొక్క విజయ శాతం పూర్తిగా 95% వరకు ఉంటోంది.[26]

ఇంప్లాంట్ స్థిరత్వం యొక్క సాధన మరియు నిర్వహణ అనేది ఇంప్లాంట్ విజయాన్ని గుర్తించడానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఒక కారకాల్లో ఒకటిగా ఉంటోంది.[27] స్థిరత్వం అనేది ISQ (ఇంప్లాంట్ స్టాబిలిటీ కోషియంట్) విలువపై ఆధారపడి ఉంటుంది. రోగి యొక్క సాధారాణ ఆరోగ్యం మరియు శస్త్రచికిత్స అనంతర సంరక్షణ విషయంలో సమ్మతి లాంటి అంశాలతో పాటు శస్త్రచికిత్స పద్ధతుల వంటివి దంత ఇంప్లాంట్ స్థాపన యొక్క విజయానికి ఉపకరించే ఇతర అంశాలుగా ఉంటాయి.

వైఫల్యం

దంత ఇంప్లాంట్ యొక్క వైఫల్యం అనేది తరచూ అది సరైన విధంగా స్థాపించబడకుండా వైఫల్యం చెందడానికి సంబంధించినదై ఉంటుంది. దంత ఇంప్లాంట్ అనేది దాని స్థానం నుంచి కదలిపోవడం లేదా శస్త్రచికిత్స తర్వాత పెరి-ఇంప్లాంట్ (ఇంప్లాంట్ చుట్టూ ఉండేది) ఎముక మొదటి సంవత్సరం 1.0 mm మేర రెండవ సంవత్సరం 0.2mm మేర క్షయం చెందినట్టైతే దంత ఇంప్లాంట్ అనేది వైఫల్యం చెందినట్టు భావించడం జరుగుతుంది.

దంత క్షయం వల్ల చోటు చేసుకునే సమస్యలకు దంత ఇంప్లాంట్‌లు లొంగనప్పటికీ, వాటివల్ల పెరి-ఇంప్లాంటిటీస్ (ఇంప్లాంట్ చుట్టుపక్కల ఏర్పడే సమస్యలు) పరిస్థితికి దారితీస్తుంది. ఇదొక శ్లేష్మ పొర మరియు/లేదా ఇంప్లాంట్ చుట్టూ ఉండే ఎముక పుండుపడడం లాంటి పరిస్థితికి సంబంధించినది, దీని కారణంగా చివరకు ఇంప్లాంట్ క్షయం చెందే పరిస్థితికి దారితీస్తుంది. దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ల కారణంగా చోటు చేసుకునే ఈ పరిస్థితి సాధారణమే అయినప్పటికీ, ఎల్లప్పుడూ సంభవించేది మాత్రం కాదు. ఎక్కువగా పొగతాగేవారు, మధుమేహంతో బాధపడే రోగులు, నోటి శుభ్రతను బాగా అలక్ష్యం చేసే రోగులు మరియు ఇంప్లాంట్ చుట్టూ ఉండే శ్లేష్మ పొర బాగా పలచగా ఉండడం లాంటి సందర్భాల్లో ఈ పెరి-ఇంప్లాంట్ అనే పరిస్థితి సాధారణంగా చోటు చేసుకోవడం జరుగుతుంది.[28]

అదేసమయంలో పెరి-ఇంప్లాంటిటీస్ కోసం ఉత్తమమైన చికిత్స అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా అందుబాటులో లేదు. ఈ రకమైన పరిస్థితి మరియు దానికి గల కారణాల గురించి ఇప్పటివరకు తక్కువగా మాత్రమే అర్థం చేసుకోవడం జరిగింది.[29]

పొగతాగేవారిలో వైఫల్యం చెందే స్థాయి గణనీయంగా ఉంటుంది. ఈ రకమైన కారణంతో పాటు ఈ చికిత్స ఖర్చుతో కూడుకున్నది కావడం వల్ల చాలా సందర్భాల్లో రోగి పొగతాగడం మానేసిన తర్వాత మాత్రమే ఇంప్లాంట్‌లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అత్యంత అరుదుగా, శస్త్రచికిత్స సమయంలో ఇంప్లాంట్‌ని సరైన స్థానంలో అమర్చకపోవడం లేదా దానిపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడడం అనేది ప్రాథమికంగా ఇంప్లాంట్ వైఫల్యానికి దారితీస్తుంది. శస్త్రచికిత్సకు ముందుగానే పొగతాగడం మరియు స్థానానికి సంబంధించిన సమస్యలను గుర్తించినట్టైతే, సదరు రోగి ఇంప్లాంట్ కంటే వారధి లేదా పాక్షిక కట్టుడు పళ్లను పెట్టించుకోవడం ఒక ఉత్తమమైన మార్గమని వైద్యులు తరచూ సలహా ఇస్తుంటారు.

పైన పేర్కొన్న సమస్యలు మాత్రమే కాకుండా ఒక్కోసారి స్వంతంత్రమైన సమస్యలు సైతం తలెత్తుతుంటాయి. ఏదేని ఇతర అంశాల వల్ల ఇంప్లాంట్లు దెబ్బతినడం, సాధారణ ఉపయోగానికే బహిర్గతం కావడం లాంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఒకవేళ ఇంప్లాంట్లనేవి సాధారణంగా ఉపయోగించే దంతాలతో భర్తీచేయబడినట్టైతే, అటువంటి సందర్భంలో పైన చెప్పిన విధంగా అవి దెబ్బతినడం, సాధారణ ఉపయోగానికే బహిర్గంత కావడంతో పాటు తర్వాతి సంవత్సారాల్లో అవి విచ్ఛిన్నం కావడం మరియు విరిగిపోవడం లాంటి సమస్యలు చోటు చేసుకోవచ్చు, అయితే ఇది అత్యంత అరుదుగా మాత్రమే చోటు చేసుకునే సమస్యగా ఉంటుంది. ఈ రకమైన సమస్యని వీలైనంత తగ్గించడం కోసం క్రమం తప్పకుండా మీ దంత వైద్యునితో సమీక్ష జరపడం ఒక్కటే మార్గం.

ఎక్కువ భాగం కేసుల్లో ఇంప్లాంట్ అనేది ఎముకలో ఇమడకపోవడం మరియు శరీరం దాన్ని వికర్షించడం వల్ల వైఫల్యం చెందుతుంటుంది, అయితే ఇందుకు గల కారణాలు తెలియవు. మొత్తంమీద 5% కేసుల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంటుంది. ఏదిఏమైనా టైటానియం దంత ఇంప్లాంట్లతో మన ఎముక ఎందుకు చక్కగా కలిసిపోతోంది మరియు దాన్ని ఒక 'బాహ్య వస్తువు'గా భావించి ఎందుకు వికర్షించడం లేదు అనే విషయం నేటికీ మనకు కచ్చితంగా తెలియదు. ఈ విషయమై గత ఐదు దశాబ్దాల్లో అనేక సిద్ధాంతాలు తెరమీదకు వచ్చినా వాటికి రుజువులు మాత్రం లేవు. ఇటీవలి ఒక సిద్ధాంతం పేర్కొంటున్న ప్రకారం, చురుకైన జీవసంబంధిత కణజాలం ప్రతిస్పందన కంటే, ఇంప్లాంట్‌తో ఏకమయ్యే ఎముక యొక్క ప్రతికూల కణజాల స్పందన అనేది లేకపోవడం వల్లే ఈ రకమైన పరిస్థితికి దారితీస్తోంది. మరో రకంగా చెప్పాలంటే, గుర్తించబడని కొన్ని కారణాల వల్ల సాధారణంగా బాహ్య వస్తువులను స్థాపన చేసిన సమయంలో వికర్షణ ప్రదర్శించే శరీరం టైటానియం ఇంప్లాంట్ల విషయంలో అటువంటి వికర్షణ ప్రదర్శించే దిశగా పనిచేయడం లేదు. అదేవిధంగా మరో రుజువులేని ఆధారం ప్రకారం, ఇంప్లాంట్ తిరస్కరణ అనేది ఎటువంటి రోగుల్లో చోటు చేసుకుంటుందంటే, ఎవరి ఎముక కణాజాలం అయితే సహజసిద్ధంగానే 'బాహ్య వస్తువు' విషయంలో ప్రతిస్పందిస్తుందో అదేవిధంగా ఇంప్లాంట్‌ని సైతం తిరస్కరిస్తుంది, ఈ రకమైన పరిస్థితి ఇతర అనేక ఇంప్లాంట్ పదార్థాల విషయంలోనూ చోటు చేసుకుంటుంది.[30]

ప్రతికూల సంకేతాలు

ఇంప్లాంట్ దంతవైద్యం విషయంలో కొన్ని కచ్చితమైన ప్రతికూల సంకేతాలున్నాయి. అయితే, ఇందుకోసం కొన్ని దైహిక, ప్రవర్తన సంబంధమైన మరియు శరీర నిర్మాణ అంశాల వంటివి తప్పకుండా మదింపు చేయాలి.

ప్రత్యేకించి మ్యాన్డిబ్యులర్ (కింది దవడ) ఇంప్లాంట్ల విషయంలో మెంటల్ ఫోరమెన్ (MF) సామీప్యంలో కింది భాగానికి చెందిన సమీప కాలువ లేదా IAC (ఇది కింది భాగంలో ఉండే సామీప్య నరం లేదా IANను మోసుకువెళ్లే న్యూరోవస్కులార్ బండిల్‌‌ కోసం రవాణాకు ఉపకరించే గొట్టం లాగా ప్రవర్తిస్తుంది) గా కూడా పిలవబడే మ్యాన్డిబ్యులర్ కాలువ మీద తప్పనిసరిగా సరిపడినంత దంతమూల ఎముక ఉండాలి.

రంధ్రాలు చేయడం మరియు అందులోని ఇంప్లాంట్ ద్వారా కచ్చితమైన స్థానంలో ఉన్న IAN మరియు MFల్లో వైఫల్యం చోటు చేసుకోవడమనేది శస్త్రచికిత్స పరాభవాన్ని ఆహ్వానిస్తుంది. ఈ రకమైన పరాభవం అనేది నాడికి సంబంధించి తిరిగి బాగుచేయలేనంతటి నష్టాన్ని ఏర్పరచవచ్చు, చిగురు, పెదవి మరియు గడ్డానికి సంబంధించిన పరెస్థీసియా (మొద్దుబారడం) లేదా డైసెస్థీసియా (బాధతో కూడిన మొద్దుబారిన స్థితి) ద్వారా తరచూ ఈ పరిస్థితి అనుభవంలోకి వస్తుంది. ఈ రకమైన పరిస్థితి జీవితాంతం ఉండడంతో పాటు అపస్మారక స్థితిలో చొంగకార్చడం ద్వారా కలిసి కూడా ఉండవచ్చు.

నియంత్రణలో లేని టైప్ II మధుమేహం అనేది ఒక విలక్షణమైన సంబంధిత తిరస్కరణగా ఉంటుంది, పరాధీయ రక్త ప్రసరణ కారణంగా ఏరకమైన శస్త్రచికిత్స విధానంలోనైనా స్వస్థత చేకూరడమనేది ఆలస్యమవుతుంది. అందుబాటులో ఉన్న ఎముక యొక్క పరిమాణం మరియు ఎత్తులతో సహా దైహిక పరిగణనలు సైతం ఈ కోవలోకి వస్తాయి. అందువల్ల విజయవంతమైన ఇంప్లాంట్ స్థాపన కోసం చాలినంత ఎముకను అందుబాటులోకి తేవడం కోసం బ్లాక్ అంటుకట్టుడు లేదా సైనస్ వర్థనంగా సుపరిచితమైన అనుబంధ పద్ధతి తరచూ అవసరమవుతుంది.

ఇంట్రావీనస్ మరియు ఓరల్ బిస్‌ఫాస్ఫోనేట్‌లు (రొమ్ము క్యాన్సర్ మరియు ఆస్టోపోరోసిస్ యొక్క కొన్ని రూపాల్లో వీటిని తీసుకుంటారు) గురించిన సరికొత్త సమాచారం ప్రకారం, వీటి కారణంగా రోగి విషయంలో ఆస్టియోనైక్రోసిస్ అని పిలిచే రుగ్మత చోటు చేసుకోవడం వల్ల స్వస్థత చేకూరేందుకు ఎక్కువ సమయం పట్టడమనే అతి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తుంది. అందుకే ఇంట్రావీనస్ బిస్‌ఫాస్ఫోనేట్‌లు తీసుకునే రోగుల్లో ఇంప్లాంట్లనేవి ప్రత్యేకమైన చికిత్సా విధానాన్ని అనుచితంగా మారుస్తుంది.

ఓరల్ బిస్‌ఫాస్ఫోనేట్ (ఆక్టోనెల్, ఫోసామ్యాక్స్ మరియు బొనీవా లాంటివి) తీసుకునే లక్షల మంది రోగుల విషయంలో కొన్ని సమయాల్లో ఇంప్లాంట్ శస్త్రచికిత్సకు ముందు వాటిని తీసుకోవడం ఆపేయమని సలహా ఇవ్వడంతో పాటు అనేక నెలల తర్వాత వాటిని తిరిగి తీసుకోమని చెప్పడం జరుగుతుంది. అయితే, ప్రస్తుత ఆధారాల ప్రకారం ఈ రకమైన నిబంధన అనేది తప్పనిసరిగా అనుసరించడం లేదు. ఫిబ్రవరి 2008లో వెలువడిన ఓరల్ బిస్‌ఫాస్ఫోనేట్ అధ్యయన నివేదిక అయిన జర్నల్ ఆఫ్ ఓరల్ అండ్ మ్యాక్సిల్లోఫేసియల్ సర్జరీ ప్రకారం, జనవరి 2008 నాటికి 468 ఇంప్లాంట్లు అమర్చిన 115 కేసుల విషయంలో నిర్వహించిన సమీక్ష ప్రకారం, "ఆస్పత్రికి వచ్చిన రోగుల్లో కానీ, ఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా సంప్రదించిన వారిలో గానీ దవడ విషయంలో బిస్‌ఫాస్ఫోనేట్‌తో కలిసిన ఆస్టియోనైక్రోసిస్ లక్షణాలేవీ కనిపించలేదు."[31]

"బిస్‌ఫాస్ఫోనేట్ మెడికేషన్స్ అండ్ యువర్ ఓరల్ హెల్త్"[32] అనే పేరుతో వెలువరించిన ఒక కథనంలో అమెరికన్ డెంటల్ అసోసియేషన్ బిస్‌ఫాస్ఫోనేట్ గురించి చర్చించింది, ఇందులోని పర్యావలోకనంలో భాగంగా "ఓరల్ బిస్‌ఫాస్ఫోనేట్ చికిత్స తీసుకుంటున్న రోగుల్లో BON [బిస్‌ఫాస్ఫోనేట్-కలిసిన దవడ ఎముక యొక్క ఆస్టియోనైక్రోసిస్] వృద్ధి చెందడమనే సమస్య చాలా తక్కువగానే కనిపించింది..." అని ADA తెలిపింది. అలాగే ఓరల్ బిస్‌ఫాస్ఫోనేట్స్ చికిత్సలో ఉన్న రోగులకు సంబంధించిన చికిత్స విషయంలో ADA కౌన్సిల్ ఆన్ సైంటిఫిక్ అఫైర్స్ నియమించి నిపుణుల బృందం సైతం (వైద్యుల కోసం) జారీచేసిన సిఫార్సులు జూన్ 2006లో ప్రచురితమైంది. దీనికి సంబంధించిన పర్యావలోకనాన్ని ada.orgలో చదవచ్చు, అయితే ప్రస్తుతం ఇది ఒక భారీ అధ్యయం ద్వారా వాడుకలోకి వచ్చింది- 700,000 పైగా కేసులను పరిశీలించడం ద్వారా సిద్ధం చేసిన ఈ అధ్యయనాన్ని "బిస్‌ఫాస్ఫోనేట్ యూజ్ అండ్ ది రిస్క్ ఆఫ్ అడ్వెర్స్ జా అవుట్‌కమ్స్" అనే పేరుతో దీన్ని విడుదల చేశారు. 2008 JOMS అధ్యయనం తరహాలోనే ADA అధ్యయనం సైతం ఓరల్ బిస్‌ఫాస్ఫోనేట్ అనేది దంత ఇంప్లాంట్ల విషయంలో అడ్డుగా నిలవదని తెలిపింది.[33]

బ్రుక్సిసమ్ (దంతాలను గట్టిగా బిగించడం లేదా నూరడం) అనేది మరో పరిశీలక అంశం, ఇది చికిత్స యొక్క లక్షణాంశాన్ని తగ్గించి వేస్తుంది. బ్రుక్సిసమ్ సమయంలో చోటుచేసుకునే ఒత్తిడులనేవి ఎముక స్వస్థత పొందుతున్న సమయంలో ఇంప్లాంట్ల విషయంలో హానికరంగా పరిణమిస్తాయి; ఇంప్లాంట్ స్థానం విషయంలో చోటు చేసుకునే సూక్ష్మ కదలికలు ఇంప్లాంట్ వైఫల్యానికి దారితీసే అంశాల పెరుగుదలలో భాగం వహిస్తాయి. బ్రూక్సిసమ్ అనేది గ్రహీతకు ఏర్పాటు చేసిన ఇంప్లాంట్ విషయంలో జీవితాంతం భయపెట్టే ఒక అంశంగా పరిణమిస్తుంది.[34] సహజసిద్ధమైన దంతం అనేది పెరియోడెంటల్ లింగమెంట్ అనే ఒక నిర్మాణాన్ని కలిగి ఉండడం వల్ల దంతం విషయంలో నిలువపుగానూ, అడ్డంగానూ చోటు చేసుకునే కదలికలు మరియు ఘాతం విషయంలో ప్రతిస్పందించడానికి వీలుగా ఉంటుంది. అయితే, సహజసిద్ధమైన దంతాల స్థానాన్ని ఇంప్లాంట్‌తో స్థాన మార్పు చేయడం వల్ల ఈ రకమైన లింగమెంట్ అనేది కోల్పోవడం జరుగుతుంది, అంతేకాకుండా కృత్రిమ దంతం అనేది ఏమాత్రం కదలికకు అవకాశం లేకుండా దవడ ఎముకకు బిగించేయడం జరుగుతుంది. కాబట్టి పల్లు కొరికే అలవాటు ఉన్న వారిలో ఈ రకమైన సమస్యను తగ్గించడం కోసం రాత్రిపూట (NTI పరికరం లాంటి) ఒక నోటి రక్షకాన్ని ఉపయోగించడం మంచిది.

శస్త్రచికిత్స అనంతరం, ఇంప్లాంట్లు వాటి స్థానంలో స్థిరపడిన తర్వాత, భౌతికమైన ప్రతికూల సంకేతాలు ఉన్న పక్షంలో ఇంప్లాంటాలజీ బృందం ద్వారా తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మితిమీరిన లేదా అధికమైన నొప్పి మూడు రోజుల పాటు కొనసాగినట్టైతే అదొక ప్రమాద సంకేతం, అధికమైన రక్తస్రావం సైతం ఇదే రకమైన సంకేతంగా ఉంటుంది. శస్త్రచికిత్స సందర్భంగా ఇచ్చిన మత్తు ప్రభావం తగ్గిన తర్వాత సైతం జింజివా (చిగురు), పెదవి మరియు గడ్డం— లాంటి ప్రదేశాల్లో సాధారణంగా గుర్తించినట్టైతే దాన్ని కూడా మరో ప్రమాదకర సంకేతంగా పరిగణించాలి. పైన చెప్పిన కేసు విషయంలో, స్థిరంగా కొనసాగుతున్న తీవ్రమైన నొప్పి సైతం ఉన్నట్టైతే, ఒకవేళ శస్త్రచికిత్స పద్ధతి IANని దెబ్బతీసిందా అనే విషయాన్ని గుర్తించడం కోసం ప్రామాణిక రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం అవసరమైన సమాచారాన్ని 3D కోన్ బీమ్ ఎక్స్‌రే అందించినప్పటికీ, వివేకం కలిగిన ఇంప్లాంటాలజిస్ట్ ఈ దశకు ముందుగానే నాడి చర్యను పునరుద్ధరించడం కోసం ఇంప్లాంట్‌ని పాక్షికంగా లేదా పూర్తిగా తొలగించడం జరుగుతుంది, ఆలస్యం చేసే కొద్దీ సాధారణంగా ప్రభావం తగ్గిపోవడమే ఇందుకు కారణం. 3D ఎక్స్‌రే చూపించే ఆధారాల మీద ఆధారపడి, రోగి నాడిని మరమత్తు చేయడం కోసం నిపుణుడి వద్దకు తరలించడం జరుగుతుంది. ఏదిఏమైనా అన్ని కేసుల్లోనూ లక్షణాల గుర్తింపులోనూ మరియు చికిత్సలోనూ వేగంగా స్పందించడమనది అత్యంత ఆవశ్యకం.

మార్కెట్

యునైటెడ్ స్టేట్స్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌లలో 'ఇంప్లాంటాలజీ' విషయంలో విశిష్టమైన ప్రత్యేక విభాగాలు లేవు.

ఇంప్లాంట్ చికిత్స చేసే ఏ వైద్యుడైనా శస్త్రచికిత్స చేయడంలో లేదా కృత్రిమ దంతానికి తుదిరూపం తేవడంలో తప్పకుండా తగినంత శిక్షణ పొంది ఉంటాడు. అయితే ఈ విషయంలో చట్టబద్ధమైన శిక్షణ అవసరాలనేవి దేశాల మధ్య విభిన్నంగా ఉంటాయి.

దంత ఇంప్లాంటాలజీలో భాగం వహించే దంత వైద్యుల కోసం 2008లో, UKలోని జనరల్ డెంటల్ కౌన్సిల్‌ (GDC) కచ్చితమైన శిక్షణ అవసరాల[35]ను నిర్థేశించింది. UKలోని ఏ దంతవైద్యుడైనా దంత ఇంప్లాంటాలజీలో శిక్షణ తీసుకోవాలని కోరుకున్న పక్షంలో నియమబద్ధమైన పర్యవేక్షణ కలిగిన శస్త్రచికిత్స శిక్షణ మరియు పర్యవేక్షణలతో పాటుగా GDC ద్వారా ఆమోదం పొందిన వివరణాత్మక థియరీ సిలబస్ కలిగిన విస్తృతమైన అభ్యసన కార్యక్రమం[36]లో భాగం వహించాల్సి ఉంటుంది. ఒక నియత యోగ్యత మదింపులో అర్హత సాధించించిన శిక్షణ సేవలందించేవారి ద్వారా ఆమోదం పొందేవరకు దంతవైద్యులు ఎవరూ కూడా UKలో ఇంప్లాంట్ వైద్యంలో భాగంగా మారేందుకు వీలులేదు. అంతేకాకుండా GDC నిర్థేశకాలను అనుసరించడంలో విఫలమైనట్టైతే, తత్ఫలితంగా సదరు దంతవైద్యుడు డెంటల్ రిజిస్టర్ నుంచి తొలగించబడడంతో పాటు ఇక అప్పటినుంచి అతను UKలో దంతవైద్యం అందే వైద్యుడనే హక్కును సైతం కోల్పోవడం జరుగుతుంది.[37]

వీటిని కూడా చూడండి

 • నోరు మరియు పైదవడ శస్త్రచికిత్స
 • పెరియోడాంటిస్ట్ (దంత వైద్య నిపుణుడు)
 • డెంటల్ ఇంప్లాంటాలజీలో ఎముక అంటుకట్టుడులు
 • దంత వారధి
 • ఓసియోఇంటిగ్రేషన్
 • దంత పర్యాటకం
 • స్వర్ణ దంతాలు
 • అమెరికన్ అసోసియేషన్ అఫ్ ఓరల్ అండ్ మ్యాక్సిల్లోఫేసియల్ సర్జన్స్
 • యురోపియన్ అసోసియేషన్ ఫర్ ఓసియోఇంటిగ్రేషన్
 • బ్రిటిష్ సొసైటీ ఆఫ్ ఓరల్ ఇంప్లాంటాలజీ

సూచనలు

 1. Annali di Stomatologia - Su alcuni casi particolarmente interessanti di impianto endosseo con vite autofilettante - వాల్యూమ్ XV - ఏప్రిల్ 1966
 2. మూస:Ref patent
 3. Quirynen M, Van Assche N, Botticelli D, Berglundh T (2007). "How does the timing of implant placement to extraction affect outcome?". The International Journal of Oral & Maxillofacial Implants. 22 Suppl: 203–23. PMID 18437797.CS1 maint: multiple names: authors list (link)
 4. Crespi R, Capparé P, Gherlone E, Romanos GE (2008). "Immediate versus delayed loading of dental implants placed in fresh extraction sockets in the maxillary esthetic zone: a clinical comparative study". The International Journal of Oral & Maxillofacial Implants. 23 (4): 753–8. PMID 18807574.CS1 maint: multiple names: authors list (link)
 5. Gahlert M, Röhling S, Wieland M, Sprecher CM, Kniha H, Milz S (2009). "Osseointegration of zirconia and titanium dental implants: a histological and histomorphometrical study in the maxilla of pigs". Clinical Oral Implants Research. 20 (11): 1247–53. doi:10.1111/j.1600-0501.2009.01734.x. PMID 19531104. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 6. Depprich R, Zipprich H, Ommerborn M; et al. (2008). "Osseointegration of zirconia implants: an SEM observation of the bone-implant interface". Head & Face Medicine. 4: 25. doi:10.1186/1746-160X-4-25. PMC 2583968. PMID 18990214. Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
 7. Andreiotelli M, Kohal RJ (2009). "Fracture strength of zirconia implants after artificial aging". Clinical Implant Dentistry and Related Research. 11 (2): 158–66. doi:10.1111/j.1708-8208.2008.00105.x. PMID 18657150. Unknown parameter |month= ignored (help)
 8. ఆర్టురో N. నటాలి (ed.) (2003). "డెంటల్ బయోమెకానిక్స్". టైలర్ & ఫ్రాన్సిస్, లండన్ / న్యూయార్క్, 273 pp., ISBN 9-780-415-30666-9, pp. 69-87.
 9. ఓసియోఇంటిగ్రేషన్, జార్డ్ et al. క్వీన్టెసెన్స్ 2009.[verification needed]
 10. Palmer R (2007). "Ti-unite dental implant surface may be superior to machined surface in replacement of failed implants". The Journal of Evidence-based Dental Practice. 7 (1): 8–9. doi:10.1016/j.jebdp.2006.12.001. PMID 17403502. Unknown parameter |month= ignored (help)
 11. "Doing implants? Make sure you're up to scratch, warns GDC" (Press release). General Dental Council. October 30, 2008. Retrieved 2010-03-25.
 12. Melo MD, McGann G, Obeid G (2007). "Survey of implant training in oral and maxillofacial surgery residency programs in the United States". Journal of Oral and Maxillofacial Surgery. 65 (12): 2554–8. doi:10.1016/j.joms.2007.06.685. PMID 18022483. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 13. Jokstad A (2008). "Where can I learn how to place dental implants? Perspectives from Scandinavia and Canada". International Journal of Oral and Maxillofacial Surgery. 37 (7): 593–6. doi:10.1016/j.ijom.2007.12.009. PMID 18295450. Unknown parameter |month= ignored (help)
 14. Addy LD, Lynch CD, Locke M, Watts A, Gilmour AS (2008). "The teaching of implant dentistry in undergraduate dental schools in the United Kingdom and Ireland". British Dental Journal. 205 (11): 609–14. doi:10.1038/sj.bdj.2008.1027. PMID 19079107. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 15. Binon PP (2007). "Treatment planning complications and surgical miscues". Journal of Oral and Maxillofacial Surgery. 65 (7 Suppl 1): 73–92. doi:10.1016/j.joms.2007.03.014. PMID 17586352. Unknown parameter |month= ignored (help)
 16. Brisman DL (1996). "The effect of speed, pressure, and time on bone temperature during the drilling of implant sites". The International Journal of Oral & Maxillofacial Implants. 11 (1): 35–7. PMID 8820120.
 17. Berdougo M, Fortin T, Blanchet E, Isidori M, Bosson JL (2009). "Flapless Implant Surgery Using an Image-Guided System. A 1- to 4-Year Retrospective Multicenter Comparative Clinical Study". Clinical Implant Dentistry and Related Research. 12 (2): 142–52. doi:10.1111/j.1708-8208.2008.00146.x. PMID 19220842. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 18. Becker W, Goldstein M, Becker BE, Sennerby L, Kois D, Hujoel P (2009). "Minimally invasive flapless implant placement: follow-up results from a multicenter study". Journal of Periodontology. 80 (2): 347–52. doi:10.1902/jop.2009.080286. PMID 19186977. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 19. Gerds TA, Vogeler M (2005). "Endpoints and survival analysis for successful osseointegration of dental implants". Statistical Methods in Medical Research. 14 (6): 579–90. doi:10.1191/0962280205sm420oa. PMID 16355545. Unknown parameter |month= ignored (help)
 20. Fischer K, Stenberg T, Hedin M, Sennerby L (2008). "Five-year results from a randomized, controlled trial on early and delayed loading of implants supporting full-arch prosthesis in the edentulous maxilla". Clinical Oral Implants Research. 19 (5): 433–41. doi:10.1111/j.1600-0501.2007.01510.x. PMID 18371094. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 21. Bhola M, Neely AL, Kolhatkar S (2008). "Immediate implant placement: clinical decisions, advantages, and disadvantages". Journal of Prosthodontics. 17 (7): 576–81. doi:10.1111/j.1532-849X.2008.00359.x. PMID 18761580. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 22. Spector L (2008). "Computer-aided dental implant planning". Dental Clinics of North America. 52 (4): 761–75, vi. doi:10.1016/j.cden.2008.05.004. PMID 18805228. Unknown parameter |month= ignored (help)
 23. Ludlow JB (2008). "Regarding 'Influence of CBCT exposure conditions on radiation dose'". Oral Surgery, Oral Medicine, Oral Pathology, Oral Radiology, and Endodontics. 106 (5): 627–8, author reply 628–9. doi:10.1016/j.tripleo.2008.06.031. PMID 18801676. Unknown parameter |month= ignored (help)
 24. Viegas VN, Dutra V, Pagnoncelli RM, de Oliveira MG (2010). "Transference of virtual planning and planning over biomedical prototypes for dental implant placement using guided surgery". Clinical Oral Implants Research. 21 (3): 290–5. doi:10.1111/j.1600-0501.2009.01833.x. PMID 20074239. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 25. http://www.materialise.com/materialise/view/en/554529-SurgiGuide.html
 26. Esposito M, Grusovin MG, Willings M, Coulthard P, Worthington HV (2007). "The effectiveness of immediate, early, and conventional loading of dental implants: a Cochrane systematic review of randomized controlled clinical trials". The International Journal of Oral & Maxillofacial Implants. 22 (6): 893–904. PMID 18271370.CS1 maint: multiple names: authors list (link)
 27. Albrektsson T, Zarb GA (1993). "Current interpretations of the osseointegrated response: clinical significance". The International Journal of Prosthodontics. 6 (2): 95–105. PMID 8329101.
 28. Fransson C, Wennström J, Tomasi C, Berglundh T (2009). "Extent of peri-implantitis-associated bone loss". Journal of Clinical Periodontology. 36 (4): 357–63. doi:10.1111/j.1600-051X.2009.01375.x. PMID 19426183. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 29. Pye AD, Lockhart DE, Dawson MP, Murray CA, Smith AJ (2009). "A review of dental implants and infection". The Journal of Hospital Infection. 72 (2): 104–10. doi:10.1016/j.jhin.2009.02.010. PMID 19329223. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 30. Mavrogenis AF, Dimitriou R, Parvizi J, Babis GC (2009). "Biology of implant osseointegration" (PDF). Journal of Musculoskeletal & Neuronal Interactions. 9 (2): 61–71. PMID 19516081.CS1 maint: multiple names: authors list (link)
 31. Grant BT, Amenedo C, Freeman K, Kraut RA (2008). "Outcomes of placing dental implants in patients taking oral bisphosphonates: a review of 115 cases". Journal of Oral and Maxillofacial Surgery. 66 (2): 223–30. doi:10.1016/j.joms.2007.09.019. PMID 18201600. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 32. "Bisphosphonate medications and your oral health". Journal of the American Dental Association. 137 (7): 1048. 2006. PMID 16803833. Unknown parameter |month= ignored (help)
 33. Cartsos VM, Zhu S, Zavras AI (2008). "Bisphosphonate use and the risk of adverse jaw outcomes: a medical claims study of 714,217 people". Journal of the American Dental Association. 139 (1): 23–30. PMID 18167381. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 34. McCoy G (2002). "Recognizing and managing parafunction in the reconstruction and maintenance of the oral implant patient". Implant Dentistry. 11 (1): 19–27. PMID 11915541.
 35. http://www.gdc-uk.org/Our+work/Education+and+quality+assurance/Policy+statement+on+implantology.htm
 36. ట్రైనింగ్ స్టాండర్డ్స్ ఇన్ ఇంప్లాంట్ డైనిస్ట్రీ ది రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్; లండన్ 2008[page needed]
 37. పాలసీ స్టేట్‌మెంట్ ఆన్ ఇంప్లాంట్ డెంటిస్ట్రీ. ది జనరల్ డెంటల్ కౌన్సిల్; లండన్. 9 ఏప్రిల్ 2008[page needed]

బాహ్య లింకులు

మూస:Dentistry