"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఢిల్లీ పోలీస్

From tewiki
Jump to navigation Jump to search
ఢిల్లీ పోలీస్
140px
నినాదంCitizens First
ఏజెన్సీ అవలోకనం
ఏర్పడిన తేదీ1861
చట్టబద్దమైన అధికార పరిధిNational Capital Territory of Delhi

Sworn members57,500
ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్
 • Y.S. Dadwal, Chief
Facilities
Stations136
Lockups9
Helicopters1[1]
వెబ్‌సైటు
Official website

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ పోలీస్‌గా (డిఒపి) పిలిచే ఢిల్లీ పోలీస్ (హిందీ: दिल्ली पुलिस, Urdu: دلّی پولیس‎), ఢిల్లీ యొక్క నేషనల్ క్యాపిటల్ టేరిటరీ (ఎన్‌సిటి) యొక్క ప్రధాన శాంతి భద్రతల సంస్థ. జాతీయ రాజధాని పరిధిలోని పరిసర ప్రాంతాల పై దీనికి ఎలాంటి అధికారులు ఉండవు.

భారతీయ పోలీస్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత 1861లో దీన్ని స్థాపించారు. 1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు ఢిల్లీ పోలీస్ పంజాబ్ పోలీస్ లో భాగంగా ఉంది. 1966లో ఢిల్లీ పోలీస్‌ను పునర్వ్యవస్థీకరించి నాలుగు విభాగాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ దీనికి అధిపతి. ఇది 57,500 మందికి పైగా బలగాలతో ప్రపంచంలోని అతిపెద్ద మెట్రోపాలిటన్ పోలీస్ విభాగాల్లో ఒకటిగా నిలిచింది.[2] 2007 సంవత్సరం నాటికి NCT పరిధిలో 136 పోలీస్ స్టేషన్లను ఢిల్లీ పోలీస్ నిర్వహిస్తోంది. అయినా కూడా ఢిల్లీలో నానాటికీ పెరుగుతున్న నేరాల సంఖ్యతో ఢిల్లీ పోలీస్ చెడ్డ పేరు మూటగట్టుకుంది.2007లో ఢిల్లీ నేర శాతం ప్రతి లక్ష మందికి 357.2 కేసులుగా నమోదైంది. అయితే జాతీయ సగటు మాత్రం 167.7గా మాత్రమే ఉంది.[3]

సంస్థ

1948కి పూర్వం పంజాబ్ పోలీస్‌లో ఢిల్లీ ఒక విభాగంగా ఉండేది. 1948లో ఢిల్లీ పోలీస్‌ను పునర్వ్యవస్థీకరించారు. ఇన్‌స్పెక్టర్‌ జనరల్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్ మరియు సూపరింటెండెంట్స్ ను నియమించారు.డి.డబ్ల్యూ మెహ్రా గారు ఢిల్లీ పోలీస్ మొదటి చీఫ్ గా ఉన్నారు. 1966లో ఢిల్లీ పోలీస్ కమిషన్ ఏర్పాటైంది. ఇది జూలై 1, 1978 నుంచి పోలీస్ కమిషనర్ విధానాన్ని అమలు చేసింది. జెఎన్ చతుర్వేది తొలి ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం 149 పోలీస్‌స్టేషన్‌లతో ఢిల్లీ పోలీస్‌ ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ పోలీస్‌గా ఘనత సాధించింది. దీని ప్రధాన కార్యాలయం ఇంద్రప్రస్థ ఎస్టేట్‌లో ఉంది. ఢిల్లీ పోలీస్‌లో ఈ క్రింది అధికారులు ఉంటారు. ముగ్గురు స్పెషల్ కమిషనర్లు 17మంది జాయింట్ కమిషనర్లు ఏడుగురు అదనపు కమిషనర్లు 74 మంది డిప్యూటీ కమిషనర్లు 272 ACPలు విద్య, వ్యాపారం, ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో జనం ఢిల్లీకి వస్తుండటంతో నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రజల భద్రత కోసం ఢిల్లీ పోలీస్‌ అంకితభావంగా పనిచేస్తోంది. భారతదేశ రాజధానిగా, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక మరియు ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఢిల్లీ భాసిల్లుతోంది. శాంతి భద్రతల నిర్వహణ విషయానికొస్తే ఢిల్లీ పోలీస్ అనేక రకాల బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. ఢిల్లీ పోలీస్ ఈ క్రింది కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. నేరాల పరిశోధన నేర కార్యకలాపాలను నిరోధించడం మహిళలకు రక్షణ కల్పించడం ట్రాఫిక్ సమస్యను నియంత్రించడం భారత్‌లోనే ఢిల్లీ పోలీస్‌కు అధునాతన పరిపాలనా విధానం అందుబాటులో ఉందని చెప్పవచ్చు. ఇది ‘పౌరునికే తొలి ప్రధాన్యం’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతుంది. ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నియంత్రణ అనేది చాలా ముఖ్యం. ఈ విషయంలో ప్రజా భద్రత కోసం ఢిల్లీ పోలీస్ పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది.

పోలీస్‌ కమిషనర్‌ పరిధిలో ఢిల్లీ పోలీస్‌ను పన్నెండు భాగాలుగా విడదీశారు. వాటిలో ప్రధానమైన నాలుగు విభాగాలు: ప్రత్యేక C.P పరిపాలన ప్రత్యేక C.P శిక్షణ ప్రత్యేక C.P భద్రత మరియు సాయుధ పోలీసులు ప్రత్యేక C.P నిఘా విభాగం ఈ నాలుగు ప్రత్యేక పోలీస్ కమిషనర్ (C.P) లకు తోడు మరో 8 జాయింట్ పోలీస్ కమిషనర్లు ఉన్నారు.

ప్రత్యేక C.P పరిపాలన కింద ముగ్గురు జాయింట్ పోలీస్ కమిషనర్లు, ఇద్దరు అదనపు పోలీస్ కమిషనర్లు ఉంటారు. ఇందులో ఒకరు ప్రధాన కార్యాలయం బాధ్యతలు చూసుకుంటారు. ప్రతి జాయింట్ C.P మరియు అదనపు C.P కింద ఒక DCP ఉంటారు. ప్రధాన కార్యాలయాన్ని చూసుకునే పోలీస్‌ కమిషనరే ప్రజా సంబంధ బాధ్యతలను కూడా నిర్వహిస్తారు. ఇందు కోసం ఆయన కింద ఒక ప్రజా సంబంధాల అధికారి (PRO) ఉంటారు.

ప్రత్యేక C.Pకి బాధ్యునిగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ (DCP) పనిచేస్తారు. పోలీస్ శిక్షణ కళాశాల (PTC) వైస్‌ ప్రిన్సిపల్, DCPకి సమాధానపరునిగా ఉంటారు.

భద్రత, సాయుధ పోలీస్ ప్రత్యేక C.P కింద ముగ్గరు జాయింట్ C.Pలు పనిచేస్తారు.ప్రతి ఒక్కరి కింద ఒక అదనపు C.P ఉంటాడు. ప్రతి పోలీస్ బెటాలియన్‌ C.Pకి అదనపు C.P ఆదేశాలిస్తారు.

నిఘా ప్రత్యేక C.P కింద ముగ్గరు జాయింట్ C.Pలు మరియు ఒక అదనపు C.P పనిచేస్తారు. అదనపు C.P మరియు F.R.R.O సెక్షన్‌కు అదనపు C.P ఆదేశాలిస్తారు. ఢిల్లీ పోలీస్‌ పరిధిలో విదేశీయుల వివరాల నమోదు బాధ్యతను ఈయనే చూసుకుంటారు. అదనపు C.P కింద ఒక DCP పనిచేస్తారు. DCP కింద మరో అదనపు DCP ఉంటారు.

జాయింట్ C.Pని పోలీస్ కమిషనర్‌ నియంత్రిస్తారు. ఉత్తర, దక్షిణ, తూర్పు DCPలను జాయింట్ C.Pలు నియంత్రిస్తారు. DCP ఎస్టీఎఫ్ మరియు DCP సుప్రీంకోర్టును NDD జాయింట్ C.P నియంత్రిస్తారు.

పోలీస్‌ స్టేషన్‌కు వ్యక్తిగతంగా వెళ్లనవసరం లేకుండా పోలీసులతో ఎవరైనా మాట్లాడటానికి ఢిల్లీ పోలీస్‌కు కొన్ని సహాయతా నంబర్లు ఉన్నాయి. ఢిల్లీ పోలీస్‌కు ఉన్న వివిధ హెల్ప్‌లైన్ నంబర్లు ఇలా ఉన్నాయి. పోలీస్‌ కంట్రోల్ రూం – 100 విద్యార్థి లేదా సీనియర్ సిటిజన్ సెక్యూరిటీ సెల్ – 1291 (టోల్‌ ఫ్రీ) నిఘా సంబంధిత వివరాల కోసం – 23213355, 23210011 అవినీతి నిరోధక విభాగం – 23890018,23890019 ట్రాఫిక్ సమస్యలు – 23378888 మహిళా హెల్ప్‌లైన్ – 1091

వివాదాలు

కొన్నేళ్లుగా లాకప్ మరణాలు, లాకప్ మానభంగాలు, మొదటి సమాచార నివేదిక (FIR‌)ను నమోదు చేయడానికి నిరాకరించడం, చర్యలు తీసుకోకపోవడం, మత ఘర్షణల సమయంలో ఆయుధ విక్రయదారులతో కుమ్మక్కవడం, నకిలీ ఎన్‌కౌంటర్లు వంటి అనేక వివాదాలను ఢిల్లీ పోలీస్‌ మూటగట్టుకుంది. ఇవన్నీ భారత్‌లోని ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక పోలీస్ విభాగాలను పట్టి పీడిస్తున్న సమస్యల్లో మచ్చుకు కొన్ని అని చెప్పవచ్చు.

చాలా సార్లు చట్టం ముందు ఢిల్లీ పోలీస్ దోషిగా నిలిచింది. భారత సుప్రీంకోర్టు, కేంద్ర పరిశోధనా సంస్థ మరియు అనేక మానవ హక్కుల సంఘాలు ఢిల్లీ పోలీస్‌ను తప్పుపట్టాయి.[1]

1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో పాత్ర

అల్లర్ల సమయంలో సిక్కులను రక్షించడంలో విఫలమైందని, కొన్ని సందర్భాల్లో అల్లరి మూకలతో కలిసిపోయిందని ఢిల్లీ పోలీస్‌ అనేక విమర్శలను ఎదుర్కొంది. ఓటర్ జాబితా చేజిక్కుంచుకుని సిక్కుల ఇళ్లకు పెద్ద S గుర్తును పెట్టి సిక్కుల ఆవాసాల్లోకి పెద్ద సంఖ్యలో అల్లరిమూకలు చొచ్చుకుపోయాయి. హత్యలు, మానభంగాలు జరుగుతుంటే ఢిల్లీ పోలీసులు చూస్తూ ఊరుకున్నారని టైమ్‌ మ్యాగజైన్‌ ప్రత్యక్ష సాక్షుల కథనాలను అందించింది.[4] 1984 నవంబరులో హూ ఆర్ ద గిల్టీ పేరుతో ఢిల్లీకి చెందిన మానవ హక్కుల సంఘాలు PUDR, PUCL‌ ప్రచురించిన నివేదిక కూడా ఇలాంటి అనేక విమర్శలు గుప్పించింది. [2] [3]

Such wide-scale violence cannot take place without police help. Delhi Police, whose paramount duty was to upkeep law and order situation and protect innocent lives, gave full help to rioters who where working under able guidence of great leaders like Jagdish Tytler and H.K.L. Bhagat. It is a known fact that many jails, sub-jails and lock-ups were opened for three days and prisoners, for the most part hardened criminals, were provided fullest provisions, means and instruction to "teach the Sikhs a lesson". But it will be wrong to say that Delhi Police did nothing, for it took full and keen action against Sikhs who tried to defend themseleves. The SIkhs who opened fire to save their lives and property had to spend months dragging heels in courts afterwards.

-Jagmohan Singh Khurmi, The Tribune

ముఖ్యమైన ఫోన్‌ నంబర్లు

 • కంట్రోల్ రూం: 100
 • పిల్లలు: 1098
 • మహిళలు: 1091, 1096 & 011-24121234
 • సీనియర్‌ సిటిజన్స్‌:1091 & 1291
 • నేర సమాచారం: 1090
 • ట్రాఫిక్: 011-23010101
 • నిఘా విభాగం: 011- 23213355
 • అవినీతి నిరోధక విభాగం: 011-23890018 & 011-23890019
 • న్యాయ విభాగం: 011-23490258 & 011-23490010, Ext. 4258
 • ఈవ్‌ టీజింగ్, అవాంఛిత కాల్స్‌ వ్యతిరేక విభాగం హెల్ప్‌లైన్: 011-27894455

(ఈ నంబర్స్‌లో మార్పుచేర్పులను తెలియపరిచి వికీపీడియాకు సహాయం చేయండి. ఇవి పౌరులకు సమాచారం అందించే ఏకీకృత కేంద్రంగా పనిచేస్తాయి.)

గమనికలు

 1. The Hindu Business Line : Pawan Hans to provide copter to Delhi Police for surveillance
 2. "History of Delhi Police". Delhi Police Headquarters, New Delhi, India. Retrieved 2006-12-19.
 3. ^పెరుగుతున్న ఢిల్లీ నేర సూచీ‌ - ఢిల్లీ నగరాలు – ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా
 4. Mridu Khullar (October 28, 2009). "India's 1984 Anti-Sikh Riots: Waiting for Justice". TIME.

బాహ్య లింకులు

మూస:Law enforcement in India