తంగిరాల పాల గోపాల కృష్ణ

From tewiki
Jump to navigation Jump to search
తంగిరాల పాల గోపాలకృష్ణ
తంగిరాల పాల గోపాలకృష్ణ
జననం (1940-12-15) 1940 డిసెంబరు 15 (వయస్సు 80)
జాతీయతభారతీయుడు
వృత్తితెలుగు పండితుడు
తల్లిదండ్రులుతండ్రి :తంగిరాల రామ సోమయాజి, తల్లి : సూరమ్మ.
పురస్కారాలు1996లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం .

తంగిరాల పాల గోపాల కృష్ణ తెలుగు రచయిత మరియు ఉత్తమ ఉపాధ్యాయుడు.

జీవిత విశేషాలు

తంగిరాల పాల గోపాల కృష్ణ డిసెంబరు 15 1940పశ్చిమ గోదావరి జిల్లా లోని తణుకు తాలూకా ఇరగవరం గ్రామంలో తంగిరాల రామ సోమయాజి, సూరమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన తండ్రి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. గోపాల కృష్ణ ఎం.ఎ భాషా ప్రవీణ చేసి, 1960 జూన్ లో ద్వితీయ శ్రేణి తెలుగు పండితుడుగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాడు. 1998 డిసెంబరులో పదవీ విరమణ చేశాడు.

సేవా కార్యక్రమాలు

 1. ఉద్యోగ సమయములో అధికారులచే పొందిన ప్రశంసలు.ఇరగవరం పాఠశాలకు చుట్టూ గ్రామ పెద్దలను ప్రోత్సహించి ఇనుప కంచె వేయించుట.
 2. రైతు సంఘము చేత విరాళము కట్టించి ప్రభుత్వము చేత బెంచీలు, డెస్కులు చేయించుట.
 3. పంచాయితీ తీర్మానములు చేయించి అధికారులకు, పెద్దలచేత చెప్పించి 10 వ తరగతి పరీక్షా కేంద్రము 1986-87 లో మంజూరు చేయించుట. విద్యార్థినీ విద్యార్థులకు పరీక్షా కేంద్రపు సౌకర్యము కలిగించుట.
 4. 10 వ తరగతి పరీక్షలలో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థికి/విద్యార్థినికి బహుమతి నిచ్చుటకు మొదటగా కొంత సొమ్ము డిపాజిట్ చేయుట జరిగింది.10 వేల రూపాయలు డిపాజిట్ నిధి ఇచ్చుట ఇరగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 15 వేలు విలువ చేయు మైకు సెట్టు కొని ఇచ్చుట జరిగింది.
 5. 1996 లో తణుకులో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ పొందుట, శ్రీ నన్నయ భట్టారక పీఠములో సన్మానము పొందుట.
 6. 1996 లో తణుకు పాఠశాలలో సరస్వతీ మందిరము నిర్మించి, Y.T.రాజా చే ప్రారంభోత్సవము చేయించుట. తణుకు పాఠశాలలో అధిక మార్కులు వచ్చిన విద్యార్థినికి ప్రోత్సాహక బహుమతి ఇచ్చుట. తణుకులోని సాహిత్య సంస్థలలో పాల్గొంటూ పద్య కవితలు చదువుచుండుట. శ్రీ నన్నయ భట్టారక పీఠంలో సుశర్మ ప్రోత్సాహంతో శాశ్వత సభ్యునిగా చేరారు."భోజరాజీయం " అను సాహిత్య రూపకంలో కవి సార్వభౌమ 'శ్రీనాధుని ' పాత్రధరించి అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చుట (రేలంగి, తాడేపల్లిగూడెం, ఉండ్రాజవరం, తణుకు లలో) జరిగింది.
 7. శ్రీ నన్నయ భట్టారక పీఠంలో వివిధ సందర్భములలో పద్యములు వ్రాసి చదువుట, తణుకు బాలుర ఉన్నత పాఠశాల క్రొత్త భవన సముదాయమున 2001 లో సభా వేదికకు ఇరువైపులా ప్రధానోపాధ్యాయుడు కె.నారాయణ రావు సూచనతో గణపతి మందిరము, సరస్వతీ దేవి మందిరము నిర్మించుట (వీరి తల్లి దండ్రులు స్వాతంత్ర్య సమర యోధుల స్మారకం గా) ఇరగవరం పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు సోమంచి రామచంద్ర రావు సూచనతో 2002 లో సరస్వతీ దేవి మందిరము నిర్మించారు. ఈయన వివిధ సందర్భాలలో వ్రాసిన పద్యములు స్థానిక పత్రికలలో ప్రచురించబడినవి.
 8. 2003 నుండి శ్రీ నన్నయ భట్టారక పీఠంలో కార్యవర్గ సభ్యునిగా ఉండి, ప్రతి సంవత్సరము ఉగాదికి జరుగు కార్యక్రమములలో ఉగాది మరునాడు సాహితీ పురస్కారము ప్రముఖ సాహితీ వేత్తలకు అందజేయుచున్నారు. ఈ సందర్భముగా ప్రముఖులైన
  1. ఎ.ఎస్.మూర్తి, హైదరాబాదు-2004,
  2. మల్లాప్రగడ.శ్రీమన్నారాయణ రావు-2005,
  3. వద్దిపర్తి పద్మాకర్ త్రిభాషా సహస్రావధాని-2006
  4. కాశీభొట్ల.సత్యనారాయణ - 2007,
  5. అన్నదానం చిదంబర శాస్త్రి-2008,
  6. ఎర్రాప్రగడ.రామకృష్ణ, రాజమండ్రి-2009,
  7. కడిమిళ్ళ వరప్రసాద్, నవ యుగళ సహస్రావధాని-2010,
  8. కోట.లక్ష్మీ నరసింహ మూర్తి-2012,
  9. గరికిపాటి నరసింహారావు-మహాసహస్రావధాని-2014,
  10. కొలా జగన్నాధ శాస్త్రి-ప్రొద్దుటూరు-2015,
  11. బి.శ్రీమన్నారాయణ తోడల్లుని కుమారుడు-కట్టమూరి చంద్రశేఖరం -విజయనగరం -2015 జనవరి,

అలాగే తణుకు లోని శ్రీ నన్నయ భట్టారక పీఠానికి శాశ్వత నిధికి విరాళముగా 25,000/-ఇచ్చి మహారాజపొషక సభ్యత్వము పొందాడు.

రచనలు

ఆయన స్వగ్రామమైన ఇరగవరమును గూర్చి సీస పద్యం

పంచపాల క్షేత్ర పాలేశ్వర స్వామి
         ఇలవేల్పుగానున్న ఇరగవరము
వేదముల్ శాస్త్రముల్ విహితకర్మలగూడి
         చక్కగా నర్తించు స్థావరమ్ము
బ్రాహ్మ్యమ్ము లౌక్యమున్ పటుతరమ్ముగ నొప్పు
         సంభావ్యసద్వంశ సంకులమ్ము
స్వాతంత్ర్యసిద్ధికై స్వార్ధమ్ము విడనాడు
        త్యాగధనుల గన్న యాగభూమి
వేదపాఠాలు నిత్యమ్ము వెలయునట్టి
శాస్త్రవాదంబు చక్కగా సాగునట్టి
ధర్మమార్గమ్ము నిరతమ్ము తప్పనట్టి
ఇరగవరమిది పండితపురమ్ము!

1995 సంవత్సరములో అవార్డ్ పొందిన తుట్టగుంట సుబ్రహ్మణ్యం, వి.వై.వి, సోమయాజి, ఎం.ఎస్.ఆర్.శాస్త్రి, సుశర్మ లకు 'నన్నయ భట్టారక పీఠం'సన్మానము చేసినప్పుడు వ్రాసిన పద్యము.

చిరునవ్వు శాంతమ్ము చెలిమి చేయుచు నుండ
          మాన్యతనొందిన మాష్టరొకడు
రామకృష్ణుని యొక్క రమ్య సాహితిలోని
          కామెడీ కధలెన్ను సోమయాజి
పాలనాపటిమతో పాఠశాలను తీర్చు
          సౌమ్యవర్తనుడగు శాస్త్రి యొకడు
కవనంపు పటిమతో కార్యనైపుణి తోడ
          సజ్జనాళిని చేర్చు శర్మ యొకడు
వీరినందర నొక్కచో వేదిపైన
చేర్చి చక్కగ సత్కృతి చేయుచున్న
పెద్దవారల సంగతిన్ వృద్ధిపొందు
నన్నపార్యుని పీఠంబు మిన్నగాదె!

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము పొందిన సందర్భముగా నన్నయ భట్టారక పీఠంలో 24-09-1997 సన్మానించినప్పుడు, ఆయన స్పందించి వ్రాసిన పద్యము.

పంచమ వేదమౌ భారతంబును తెల్గు
         సేతతో ప్రఖ్యాతి చెందెనెవడు
తెల్గుభాషకు తగు తీరు తెన్నులు కూర్చి
        ఆదికవి యనంగ అలరెనెవడు
తణ్కుపట్టణ కీర్తి తరతరాలుగ వెల్గ
        జమ్మి నీడను చేసె జన్నమెవడు
విద్వద్వరేణ్యులు వైద్యశిఖామణుల్
నిరతమ్ము స్మరియించు నెవని నిచట

అట్టి శబ్దశాసనుపేర పుట్టినట్టి
సరస సజ్జన సంగతిన్ సాగునట్టి
నన్నపార్యుని పీఠంబు నన్ను నేడు
గౌరవించుట నా పుణ్య సరమగును!

అనేక సందర్భములలో చెప్పిన పద్యములు:

 • 1. గాంధీ జయంతి రోజున : గాంధీని గురించి
 • 2. పాశర్లపూడిలో మొట్టమొదటి బ్లో అవుట్ గురించి.
 • 3. ముక్కామల క్షేత్రవర్ణనము అక్కడ జరిగిన లక్షపత్రి పూజ వర్ణనము,
 • 4. ఇరగవరంలో పాలేశ్వరక్షేత్రమున జరిగెడి లక్ష పత్రిపూజ, ఇరగవరము యొక్క ప్రాశస్త్యము వర్ణించుట,
 • 5. ముక్కామల లక్షపత్రి పూజ సందర్భముగా కడిమిళ్ళ వరప్రసాద్ ను సన్మానించినపుడు,
 • 6. నన్నయ భట్టారక పీఠంలో కోట లక్ష్మీనరసింహం అష్టావధానం చేసినప్పుడు ఆయనను గూర్చి వ్రాసిన పద్యాలు,
 • 7. నన్నయ భట్టారక పీఠంలో భారతం శ్రీమన్నారాయణకు సన్మానము చేసినప్పుడు, వీరి గ్రంథములు ఉత్తమమైనవిగా యెన్నిక చేసి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము సన్మానము చేసినప్పుడు, ఈయన ద్రౌపది గ్రంథావిష్కరణ సందర్భముగా వ్రాసిన పద్యాలు,
 • 8. 01.04.2014 న నన్నయ భట్టారక పీఠంలో గరికిపాటి నరసింహారావు కుసన్మానము చేసినప్పుడు,
 • 9. 22.03.2015 న తణుకు శాసన సభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణకు సన్మానము చేసినప్పుడు

యెన్నో పద్యాలు వ్రాశాడు.

భారత నీతిని ప్రజలకున్ వివరించి
        వ్యాసుని హృదయంబు విశదపరచు
భగవంతు లీలల పరమార్ధమును చెప్పి
           భక్తి సాగరమున ప్రజల ముంచు
శ్రీ కాళిదాసాది శిష్టకవుల యొక్క
           కావ్య కధలు చెప్పు కమ్మగాను
గరికపాటి వినుత కమనీయ వంశాభ్ది
         కలువల రాయుడై కళల నీను

ధారణా బ్రహ్మరాక్షస నారసింహ
రావు నిచ్చట నన్నయ ఠావునందు
సత్కరించుట మాకెంతో సంతసమ్ము
అందుకొనుమిదె మా యొక్క వందనమ్ము!!

చిత్రమాలిక

వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న సందర్భాలలో, సన్మాన కార్యక్రమాలలో తీసిన ఫోటోలు

మూలాలు

ఇతర లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.