"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తపతీ నది

From tewiki
Jump to navigation Jump to search

తపతీనది తూర్పున సాత్పురా పర్వతశ్రేణిలో ఉద్బవించిన జీవనది. దీని నిడివి 720 కి.మీ. తపతీనది ' తాపీ ' తాప్తి అని కూడా అంటారు. ఖాన్ ప్రాంతంలో గుజరాత్ రాష్ట్రంలో ప్రవేశించి సూరత్ దగ్గిర అరేబియా సముద్రంలో ఈ నది సంగమిస్తూంది. ఈ నదీ తీరంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆషాఢమాసంలో ఉత్సవాలు జరుగుతాయి. సూరత్కు ఎగువను తపతీనది మీద ' కాకరపారా" వద్ద ఒక డామును నిర్మించి దాదాపు ఆరు లక్షల ఎకరాల పంటనేలకు సాగునీటిని అందిస్తున్నారు. యూకై గ్రామం వద్ద మరొక డామును నిర్మించడం వల్ల గుజరాత్‍లో దాదాపు నాలుగు లక్షల ఎకారాల భూమికి పంటనీరు అందుతూంది. ఈ రెండు డాములను నిర్మించడంవల్ల సూరత్కు తరచు సంభవించే వరద ప్రమాదం అరికట్టబడింది. దీనివల్ల జలవిద్యుచ్చక్తి కూడా ఉత్పత్తి అవుతూంది. తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే జలప్రవహాన్ని ' నది' అని, పడమటి దిక్కుగా ప్రవహించి అరేబియా సముద్రములో కలిసేదాన్ని ' నదం' అని సంస్కృతంలో అంటారు. ఆ అర్థంలో పశ్చిమాన అరేబియా సముద్రంలో కలిసే ' తపతి' నీ ' నర్మద' నీ నిజానికి ' నదులు అనడం కంటే ' నదాలు అనడం ఉచితం.