"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తలసాని శ్రీనివాస్ యాదవ్

From tewiki
Jump to navigation Jump to search
తలసాని శ్రీనివాస్ యాదవ్
తలసాని శ్రీనివాస్ యాదవ్

పదవీ కాలము
2014 - Incumbent
ముందు మర్రి శశిధర్ రెడ్డి
నియోజకవర్గము సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1965-10-06) 6 అక్టోబరు 1965 (వయస్సు 55)
సికింద్రాబాద్
తల్లిదండ్రులు కీ.శే. వెంకటేశం యాదవ్
జీవిత భాగస్వామి శ్రీమతి స్వర్ణ
సంతానము ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు
నివాసము వెస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం
మతం హిందూ

తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, సనత్ నగర్ ఎమ్మెల్యే మరియు తెలంగాణ ప్రభుత్వ కేబినేట్ మంత్రి.[1] గతంలో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు.[2]

జననం

తలసాని శ్రీనివాస్ యాదవ్ 1965, అక్టోబరు 6న సికింద్రాబాద్, మోండా మార్కెట్ లోని మధ్యతరగతి కుటుంబమైన తలసాని వెంకటేశ్‌యాదవ్, లలితాభాయి దంపతులకు జన్మించాడు. ఆయన తండ్రి వెంకటేష్‌యాదవ్ మోండా మార్కెట్‌కు అధ్యక్షుడిగా పనిచేశాడు.

వివాహం - పిల్లలు

శ్రీనివాస్ యాదవ్ కు స్వర్ణతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ జీవితం

1986లో రాజకీయ అరంగ్రేటం చేసి, 1986లో 1986లో మోండా డివిజన్ నుంచి ఎంసిహెచ్‌కు కార్పోరేటర్‌గా పోటీచేశాడు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి మేరీ రవీంద్రనాథ్‌ను ఓడించి ఎంఎల్‌ఎగా మొదటిసారి గెలిపొందాడు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి మరోసారి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నాడు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి టి. పద్మారావు గౌడ్ చేతిలో ఓడిపోయాడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో 2008 జరిగిన ఉప ఎన్నికల్లో శ్రీనివాస్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందాడు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ చేతిలో ఓటమి చెందాడు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు. తరవాత జరిగిన పరిణామాలతో తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు మంత్రిమండలిలో మంత్రిగా బాధ్యతలను చేపట్టాడు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సనత్‌నగర్ నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి, కెసిఆర్ మంత్రిమండలిలో పశుసంవర్థక శాఖ మంత్రిగా నియామకమయ్యాడు.[3]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పర్యాటక మరియు కార్మికశాఖ మంత్రిగా పనిచేశాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2014లో కెసీఆర్ తొలి మంత్రివర్గంలో పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖల బాధ్యతలు నిర్వర్తించాడు. 2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా ఉన్నాడు.[4][5][6]

మూలాలు

  1. Talasani Srinivas Yadav Profile
  2. "Talasani Srinivas Yadav resigns as MLA to take oath as Cabinet minister". NewsWala. 16 December 2014. Retrieved 23 June 2015.
  3. మన తెలంగాణ, తాజా వార్తలు మూడోసారి మంత్రి పదవి (20 February 2019). "మూడోసారి మంత్రి పదవి". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 17 September 2019. Retrieved 17 September 2019.
  4. బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  5. టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  6. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).