"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తల్లావజ్ఝుల సుందరం

From tewiki
Jump to navigation Jump to search
తల్లావజ్ఝుల సుందరం
జననం
తల్లావజ్ఝుల సుందరం

అక్టోబరు 29, 1950
వృత్తిరంగస్థల నటుడు, దర్శకుడు
తల్లిదండ్రులు
  • కృతివాస తీర్థులు (తండ్రి)
  • మహాలక్ష్మి (తల్లి)

తల్లావజ్ఝుల సుందరం రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయోక్త, కథ, నవలా రచయిత.[1]

జననం - విద్యాభ్యాసం

సుందరం1950, అక్టోబరు 29న మహాలక్ష్మి, కృతివాస తీర్థులకు ఒంగోలులో జన్మించాడు. బియస్సీ పూర్తిచేసిన తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం రంగస్థల కళళ శాఖలో పి.జి డిప్లొమా కోర్సుచేశాడు.

రంగస్థల ప్రస్థానం

1957లో బాల నటుడుగా రంగస్థల ప్రవేశంచేసి ఇప్పటివరకు దాదాపు రెండువందల నాటికలలో నటించడమేకాకుండా దర్శకుడిగా, ప్రయోక్తగా వ్యవహరించాడు. గార్దభాండం, అమీబా, కొక్కొరోకో, గోగ్రహణం, జంబుద్వీపం, చీకటింట్లో నల్లపిల్లి, పోస్టరు వంటి నాటికలూ, ఈహామృగం వంటి నాటకాన్ని నూతన ప్రయోగాలతో ప్రదర్శించి ప్రయోగాత్మక దర్శకుడిగా పేరు పొందాడు. దొంగలబండి, ప్రసన్నకు ప్రేమతో వంటి హాస్య నాటకాలు, జనమేజయం, మాధవి వంటి పౌరాణిక, ఇతిహాసిక నాటకాలూ, చలువ గుర్రం (చంద్రశేఖర్ కంబార్) వంటి వ్యంగ నాటకాలూ, హళ్ళికి-హళ్ళి, కేటు-డూప్లికేట్, సైలెన్స్ ప్లీజ్ వంటి హాస్య నాటికలకు దర్శకత్వం వహించాడు. పెద్దబాలశిక్ష, ఈ బస్సు మనదిరో, వెలుగొచ్చింది, ఎయిడ్స్ అవగాహన వంటి వీథి నాటికలకు కూడా దర్శకత్వం వహించాడు.

అవార్డులు - పురస్కారాలు

గోగ్రహణం నాటకాన్ని 1985లో ఎర్నాకులంలో జరిగిన సౌత్ జోన్ థియేటర్ ఫెస్టవల్ లో ప్రయోగాత్మకంగా ప్రయోగించాడు. మద్రాస్ కళాసాగర్ నాలుగు సంవత్సరాలకొకసారి ఇచ్చే థియేటర్ టెర్నియల్ అవార్డు, 1985లో ఇదే సంస్థ ఉత్తమ దర్శకుడి అవార్డు, 1992లో హైదరాబాదు లయన్స్ క్లబ్ ఉత్తమ రంగస్థల దర్శకుడి అవార్డు, 1994లో పినిసెట్టి శ్రీరామమూర్తి స్మారక గోల్డ్ మెడల్, తెలుగువిశ్వవిద్యాలయం 1993లో ధర్మనిధి పురస్కారం వంటి ఎన్నో అవార్డులు అఅందుకున్నారు.ప్రజానాట్య మండలి, చైతన్య భారతి, వంశీ కళా కేంద్రం, యువ కళావాహిని, సుమధుర కళానికేతన్ వంటి పలు సంస్థలు అవార్డులిచ్చి ఘనంగా సత్కరించాయి. 1999లో వర్చస్వికి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు.

1979 నుంచి దూరదర్శన్ లో దాదాపు 200 నాటకాలు, నాటికల్లో నటించాడు. వర్చస్వి, మూడు ముళ్ళాట, అభిషేకన్ టివీ సీరియళ్ళకి దర్శకత్వం వహించాడు. శ్రీ మురళి కళా నిలయం తరపున ఎందరో నటుల్ని, రచయితల్ని తెలుగు నాటకరంగానికి అందించారు.

మూలాలు

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.647.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).