"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం

From tewiki
Jump to navigation Jump to search
తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం
తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం
స్థానము
దేశము:భారతదేశం
రాష్ట్రము:తెలంగాణ
జిల్లా:హైదరాబాద్
ప్రదేశము:సికింద్రాబాదు
నిర్మాణశైలి, సంస్కృతి
నిర్మాణ శైలి:మొగలులు - రాజపుత్రులు - కుతుబ్ షాహీలు


తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాదులో ఉన్న దేవాలయం.[1] ఇక్కడి ఆంజనేయస్వామి స్వయంభువుడని ప్రతీతి. మొగలులు - రాజపుత్రులు - కుతుబ్ షాహీలు మొదలైనవారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు.[2]

ఆలయ చరిత్ర

త్రేతాయుగంలో జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చిన ఆంజనేయుడు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించినట్టు చెబుతారు. 19 శతాబ్దం తొలినాళ్లలో ఓ భక్తుడికి ఆంజనేయుడు కలలో కనిపించి తన జాడను తెలియజేయడంతో, అప్పుడా భక్తుడు ఈ ప్రాంతవాసుల సహాయసహకారాలతో, నూతన ఆలయంలో స్వామికి పునఃప్రతిష్ఠ జరిపాడు. ఆనాటి నుంచి స్వామికి నిత్యపూజలు జరుగుతూ వస్తున్నాయి.[3]

పూజలు

ప్రతి మంగళ - శని వారాల్లో అనేకమంది భక్తులు స్వామి దర్శనానికి వస్తారు. ఇక్కడ హనుమజ్జయంతి, శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి.

మూలాలు

  1. ఆంధ్రప్రభ, ఫీచ‌ర్స్ (May 29, 2016). "శ్రీ అంజ‌నేయం…". Retrieved 17 January 2018.
  2. తెలుగు విశేష్, భక్తి. "స్వయంభువుడు తాడ్ బండ్ వీరాంజనేయుడు". /www.teluguwishesh.com. Retrieved 17 January 2018.
  3. ఏపి7ఏఎం, భక్తి. "శ్రీ తాడుబందు వీరాంజనేయుడు". www.ap7am.com. Retrieved 17 January 2018.