తాతిరెడ్డి పల్లె

From tewiki
Jump to navigation Jump to search

తాతిరెడ్డి పల్లె, వైఎస్‌ఆర్ జిల్లా, లింగాల మండలానికి చెందిన గ్రామం.[1]

  • వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామం. జనాభా సుమారు 1,000.
  • గతంలో కక్షలు, గృహదహనాలతో అట్టుడికిపోయిన తాతిరెడ్డిపల్లె గ్రామంలో నేడువర్గ కక్షలు తొలగిపోయినవి. అందరూ వొక్కటై 35 సంవత్సరాల తరువాత, తొలిసారిగా, 2014,ఏప్రిల్-13, ఆదివారం నాడు, గ్రామం మొత్తం వనభోజనాలకు వెళ్ళినారు. గ్రామస్థులు అందరూ ఉదయాన్నే ఆలయాలలో పూజలుచేసారు. మహిళలు భక్తిశ్రద్ధలతో గంపలను ఎత్తుకొని పొలాలలోకి వెళ్ళినారు. బి.సి.కాలనీ సమీపంలోని చెట్లక్రింద వంటచేసి సామూహిక వనభోజనాలు చేసారు. దైనందిన జీవితంలో వ్యవసాయం, ఇంటి పనులతో తీరిక లేకుండా గడిపిన వారిలో ఇది నూతన ఉత్సాహాన్ని నింపినది. మహిళలు, పిన్నలు, పెద్దలు అనే వయోభేదం లేకుండా కబడ్డీ, పరుగు పందెం, క్యారంస్ వంటి ఆటలు ఆడినారు. ఉత్సాహంగా ఊయలలు ఊగినారు. సాయంత్రం, వరకూ అక్కడే సంతోషంగా గడిపి, అనంతరం ఇళ్ళకు చేరుకున్నారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ కక్షలతో గ్రామం ఆర్థికం చితికిపోయింది. మళ్ళీ పూర్వపు స్థితికి చేరడంతో అందరూ కలిసి మెలిసి, వనభోజనాలలో పలు పంచుకున్నారు. ఇలా చేయడం వలన స్నేహం, సమైక్యత పెంపొందుతాయనీ, వర్షాలు బాగా కురుస్తాయనీ, మనస్పర్ధలు తొలగి అందరూ ఒకటౌతారని గ్రామస్తుల నమ్మకం. [1]
తాతిరెడ్డి పల్లె
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం లింగాల
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 516390
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు

మూలాలు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-04.

[1] ఈనాడు కడప;2014;ఏప్రిల్-14;15వ పేజీ.