"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తాపీ రాజమ్మ

From tewiki
Jump to navigation Jump to search

తాపీ రాజమ్మ ప్రథమ బుర్రకథ మహిళ కళాకారిణి.[1] [2] రంగస్థల నటి.[3]

తొలి జీవితం

కర్నూలుకు చెందిన రాజమ్మ, కృష్ణా జిల్లా వైజ్ఞానిక దళంలో బందరు అనసూయ, పరుచూరి సూర్యాంబలతో కళారూపాల్లో, పాటల్లో శిక్షణ పొందారు. తాపీ రాజమ్మ భర్త తాపీ మోహనరావు, మామ తాపీ ధర్మారావు.

కళారంగం

కొండేపూడి రాధ, వీరమాచనేని సరోజిని లతో బుర్రకథ దళంలో వంతదారుగా రాజకీయం చెప్పడం ప్రాంభించింది.

నాటకరంగం

ప్రజానాట్యమండలిలో చేరి గరికపాటి రాజారావు శిష్యురాలు అనేక ప్రదర్శలను ఇచ్చింది. ప్రజానాట్యమండలి ప్రథమ నాటకం ‘ముందడుగు’ (సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు ల రచన) లో మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, పెరుమాళ్లు, చదలవాడ కుటుంబరావు, తుమ్మల కేశవరావు, కొండేపూడి రాధ లతో కలిసి తాపీ రాజమ్మ నటించింది.[3]

మూలాలు

  1. విశాలాంధ్ర. "సాంఘిక దురాచారాలపై సమరభేరి". Retrieved 28 April 2017.
  2. తాపీ రాజమ్మ, విశిష్ట తెలుగు మహిళలు. దామెర వేంకట సూర్యారావు. రీమ్ పబ్లికేషన్స్. p. 209. ISBN 978-81-8351-2824. |access-date= requires |url= (help)
  3. 3.0 3.1 ఆంధ్రజ్యోతి. "అరుణోదయంలో మిక్కిలినేని". Retrieved 28 April 2017.