"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తాపేశ్వరం కాజా

From tewiki
Jump to navigation Jump to search

తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలో తయారయ్యే మిఠాయి విశేషం, కాజా. దాని విశిష్టత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మన్ననలు పొంది, తాపేశ్వరం కాజాగా ప్రసిద్ధి చెందింది.

దస్త్రం:Telugu sweet-kaja-4.jpg
కాజాలలో పెద్దదైన జంబో కాజా (3 కేజీల నుండి 5 కేజీల వరకూ)

తాపేశ్వరం గ్రామానికి చెందిన పోలిశెట్టి సత్తిరాజు కాజాకు విశిష్టతను ఆపదించినవారిలో ప్రముఖుడు. అప్పట్లో మైదాపిండితో మడతలు పెట్టి కాజాలను కొత్తగా తయారు చేసి పంచదార పాకం పట్టి అమ్మగా వాటి కమ్మదనం, రుచి కారణంగా కొద్దికాలంలోనే కాజా ప్రజాభిమానం పొందింది. క్రమేణా తాపేశ్వరంకాజాగా ప్రశస్తమైంది.

శుభకార్యాలలో తాపేశ్వరం కాజా చోటు చేసుకుంది. 50 గ్రాముల నుంచి 500 గ్రాములు వరకు బరువుండే విధంగా రకరకాల సైజులలో వీటిని తయారు చేస్తారు. 1990లో సత్తిరాజు మరణించాక ఆయన వారసులు ఈ వ్యాపారాన్ని ఆధునిక పద్ధతుల్లో నిర్వహించడం మొదలుపెట్టారు. కాజా తయారిలో యంత్రాలను ప్రవేశపెట్టి, కాజాల తయారీని సులభతరం, వేగవంతం చేశారు.

దస్త్రం:Telugu sweet-kaja-1.jpg
పోలిశెట్టి సత్తిరాజు శ్రీ భక్తాంజనేయ స్వీట్ షాప్ వద్ద కల వివిధ రకాల కాజాలు

తాపేశ్వరం నుంచి కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు మొదలైన రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.

కాజా అంటే నోరూరని వారుండరు. అందరికీ అందుబాటు ధరలలో ఏ చిన్న షాపులోనైనా దొరికే మంచి మిఠాయిలు, కాజాలు

ఇతర విశేషాలు

ఇక్కడి కాజాలు పలు రాకాల సైజులలో లభ్యమౌతాయి. చిట్టి కాజాల దగ్గర నుండి సుమారు ఐదు కేజీల వరకూ బరువుండే జంబో కాజాల వరకూ లభ్యమౌతాయి.

కాజాతోపాటు, ఇతర పిండి వంటకాలైన అరిసెలు, సున్నుండలు, పూతరేకులు, బొబ్బట్లు, బూందీలడ్డూలు, కజ్జికాయలు, మైసూర్‌ పాక్‌, పొంగడాలు, గోరుమిఠాయిలు, పంచదారచిలకలను కూడా తాపేశ్వరంలో తయారుచేస్తారు.


కాజా తయారీ నేడు రాష్ట్రంలోని కొన్ని ఇతర ప్రాంతాల్లో కుటీర పరిశ్రమగా మారింది. తాపేశ్వరం కాజా పేరుతో పలుపట్టణాల్లో మిఠాయి దుకాణాలు ఏర్పడ్డాయి.


మూలాలు, వనరులు