"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తిట్ల దండకం

From tewiki
Jump to navigation Jump to search

Thitla dandakam: ఈ దండకమును వ్రాసినది పొలిపెద్ది వెంకటరాయకవి. ఈయన క్రీ. శ. 1800-1875వ సంవత్సర కాలమున కార్వేటి నగర ప్రభువులైన రాజకుమార వెంకట పెరుమాళ్ళు కోవూరి రామయ్య మీద చెప్పినదని ఈ దండకం చివర ఉన్న పంక్తుల వలన తెలియుచున్నది. దీనికొక కథ కూడా కార్వేటి వగరంలో ఇప్పటికీ వ్యాప్తిలో ఉంది. ఒక సంస్థానంలో కోవూరి రామయ్య ఉద్యొగి. రామయ్య గారి ఇల్లు కవి ఇల్లు పక్కపక్కనే ఉన్నాయి. ఒకరోజు కవిగారి బర్రె రామయ్య గారి దొడ్లొ పడి పచ్చని చెట్లు మొత్తం మేసినవి.

రామయ్య గారి భార్య కామాక్షమ్మ బర్రె విషయంలో కవి గారి భార్యతో తగవులాడింది. కవి గారు కూడా పొరపాటు అని చెప్పారు. అయినా కామాక్షమ్మ గారు కనబడినప్పుడల్లా తిడుతూ ఉండేది. రామయ్య ఆమెను వారించేవారు కాదు. ఈ విధంగా సంవత్సరం గడిచింది. అయినా ఆమె తిట్టుట మానలేదు. ఆమె బాధ బరించలేక కవిగారు రాజువద్ద ఫిర్యాదు చేయగ రాజుగారు మందలించుటకు రామయ్య ఆస్థానంనకు రప్పించారు. అతని రాకను చూసి కవి గారు ఈ తిట్ల దండకం అక్కడ చెప్పడం జరిగింది. ఆ తిట్ల వలనే రాజుగారి సమక్షంలో రామయ్యకు పరాభవం జరిగింది. ఆ భాధతో ఇంటికి తిరిగివచ్చి లోనికి ప్రవేశించుచుండగా ద్వారబంధం తలకు తగిలి గాయమై మంచం పట్టి కొంతకాలానికి మరణించాడు.

తిట్ల దండకం

"చీ చీ ఒరే పాతకా, ఘాతుకా, దుర్నీత, ఉచ్చిష్టవున్ రోత వారాంగనా మూత్రముల్ పట్టు పాత్రా, ఇదే చుడరా, ధాత నీ వ్రాత నా చేత పట్టిచ్చెరా నేడు, దుర్బీజమా, నైజమా సాజమా, ఏరా, కోవూరి రామా, హరామా, గులామా, పురీ షంపుతుమా, ఉపారాలవేటా, వలిక్కాలిచేటా, దగాకోరుషాజీ, దగుల్బాజీ, మాజి.....జూచి నీవైన ఏ మోసి ఏబ్రాసి, కస్మాలమా, చాకిబండా, చలంగల్లు ముండా, సగంకొయ రండా అమోద్యాలబొండా, అనాకారి తుండా... వికారాల బండా... ఒసేబోడిముండా... మహామైధుని... గండుకోతి..... రంకులాడి యటంచొక్క మారైన గద్దించి నీ కిద్ది మేల్బుద్ధి గాదంచు వాదింపరాదా? మదిం దోపలేదా? తుదిన్నీకు నాచేత జావయ్యోగాదా సదా దాని పాదాలకుం లొంగి వెంటాడుచుడున్ గూడుచున్నందువే మంకుకుంకా... నినుంబంక జాక్షుండునుం, బంకజాసీనుడున్, శంకరుండైన గావంగ లేరింక... నాదు శాపంబువమ్మౌనె ముమ్మాటికిం గాదుసుమ్మా, అదే మృత్యువేతెంచి కేల్సాచి నిన్ బ్బట్టగా బొంచి కాలంబు లెక్కించుచుంటన్ విలోకింవుమా... పోలి పెద్దాన్ వయాబ్దీందు తుల్కుండ శ్రీ వేంకనార్యుండ-సత్కవీంద్రుండ...ననుం దిట్టగాబూని నీయాలు కామాక్షి హా! దాని గర్వంబు నేమందురా... నీ పాడెగట్టా... యముండిట్టి నిన్ బట్టి కాల్జేతులం గట్టి కొంపోవగా వచ్చె, నీ కాలముం జెల్లె నా శాపమీడేరు, నిక్కంబు నీ వింటికిం బోయి వేవేగ కాల్పాలికి న్నేగుమా సాగి, కోవురి రామాయయోరామ రామా సమాప్తం సమాప్తం సమాప్తం.