తిమ్మసముద్రం (నాగులుప్పలపాడు)

From tewiki
Jump to navigation Jump to search


తిమ్మసముద్రం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

తిమ్మసముద్రం, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 523185. ఎస్.టి.డి.కోడ్: 08594.

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయ తృతీయ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015,మే నెల 4వతేదీ, వైశాఖ పౌర్ణమి, సోమవారం నాడు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం మహిళలు భజన కార్యక్రమం నిర్వహించారు. తరలి వచ్చిన భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. [4]

తిమ్మసముద్రంలో శ్రీ గోరంట్ల సంస్కృత విద్యాపీఠము ఉంది.

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)

సినీ నటి వాసంతి, కరణం బలరాం స్వగ్రామం.

శ్రీ కె.సి.హెచ్.పున్నయ్య చౌదరి (కరణం చెంచు పున్నయ్య చౌదరి):- ఈ గ్రామంలో జనించిన వీరు ఇంకొల్లులో స్థిరపడినారు.వీరు, భారతదేశ బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి (టోర్నీలు) గానూ, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ సంఘం (ఏ.పి.బి.ఏ) సి.ఈ.వో గానూ, పనిచేయుచున్న వీరు, 50 సంవత్సరాలనుండి, బ్యాడ్మింటన్ క్రీడకు సేవలందించుచున్నారు. వీరిని 2016లో బ్రెజిల్ దేశంలోని రియో-డి.జెనీరియో నగరంలో జరుగు ఒలింపిక్స్ క్రీడా పోటీలకు నామినేట్ చేసినట్లు బాయ్ ప్రకటించింది. వీరు 1983లో భారత్ నుండి తొలి అంతర్జాతీయ అంపైరుగా విధులు నిర్వహించారు. [5]

గ్రామ విశేషాలు

  1. ఈ గ్రామంలో దాతల సహకారంతో 300 మొక్కల పంపిణీ చేపట్టినారు. ఒక్కో ట్రీ-గార్డు 500 రూపాయల చొప్పున ఒకటిన్నర లక్షల రూపాయలతో మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టినారు. ఈ ఏర్పాటు వలన గ్రామంలో పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా ఉంటుందని గ్రామస్థుల అభిలాష. [3]
  2. ఈ గ్రామంలో స్థలదాత శ్రీ కరణం బ్రహ్మయ్యచౌదరి తోడ్పాటుతో, బి.సి.సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా బి.సి.విద్యార్థుల వసతిగృహం నిర్మించారు. గ్రామంలో 2014,నవంబరు-8న నిర్వహించు జన్మభూమి కార్యక్రమంలో దీనిని ప్రారంభించనున్నారు. [3]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,991.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,599, మహిళల సంఖ్య 3,392, గ్రామంలో నివాస గృహాలు 1,683 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,587 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 5,993 - పురుషుల సంఖ్య 3,041 - స్త్రీల సంఖ్య 2,952 - గృహాల సంఖ్య 1,127

సమీప గ్రామాలు

వినోదరాయునిపాలెం 3 కి.మీ, మాచవరం 4 కి.మీ, దేవరంపాడు 4 కి.మీ, కనపర్తి 4 కి.మీ, అమ్మనబ్రోలు 6 కి.మీ.

సమీప పట్టణాలు

నాగులుప్పలపాడు 9.8 కి.మీ, చినగంజాం 12 కి.మీ, మద్దిపాడు 17.2 కి.మీ, ఒంగోలు 17.7 కి.మీ.

సమీప మండలాలు

ఉత్తరాన చినగంజాము మండలం, పశ్చిమాన మద్దిపాడు మండలం, దక్షణాన కొత్తపట్నం మండలం, పశ్చిమాన ఒంగోలు మండలం.

మూలాలు

వెలుపలి లంకెలు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; జనవరి-5,2014;1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,నవంబరు-8; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మే నెల-5వతేదీ; 3వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2016,ఆగస్టు-3; 1,11 పేజీలు.