తిమ్మాయపాలెం (అద్దంకి)

From tewiki
Jump to navigation Jump to search


తిమ్మాయపాలెం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

తిమ్మాయపాలెం, ప్రకాశం జిల్లా, అద్దంకి మండలానికి చెందిన గ్రామం [1] పిన్ కోడ్ నం. 523201., ఎస్.టి.డి. కోడ్ = 08593.

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామ చరిత్ర

కొంతకాలంగా ఈ గ్రామ సమీపాన గుండ్లకమ్మలో యంత్రాలతో ఇసుక త్రవ్వకాలు జరుగుచుండగా, 2016,జనవరి-15న ఇక్కడ పురాతన విగ్రహాలు బయల్పడినవి. వీటిలో క్రీ.శ. 16వ శతాబ్దంనాటి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఏర్పాటు చేసిన శ్రీ వేణుగోపాలస్వామివారి విగ్రహం, శాసనంతో కూడిన ఆంజనేయస్వామివారి విగ్రహం, ప్రక్కనే శివలింగాన్ని అమర్చే సానపట్టం ఉన్నవి. పగిలిపోయిన ఆంజనేయస్వామి విగ్రహానికి ఎడమవైపున శ్రీరామం ఆనంద సంవత్సరం మాఘశుద్ధ దశమిలు. రంవా అనంతభట్లు శాసనం వేయించెను. శ్రీ హనుమంతుడి మేర ఖ ఒకటికి ఆ రెండు లేమి అని వ్రాసి ఉన్నది. దీని అర్ధం రెండు ఎకరాల భూమిని శ్రీ హనుమంతుడికి దానం ఇచ్చినట్లు అని ఈ పురాతన శిల్పాలను చూసిన పురావస్తు శాస్త్రఙుల ఉవాచ. [8]

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

ఈ గ్రామం, గుండ్లకమ్మ నది సమీపంలో ఉన్నది.

గ్రామంలోని విద్యాసౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

ఈ గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న గొట్టం చిరంజీవి అను విద్యార్థి, తేనెలొలుకు తేట తెలుగు గొప్పదనాన్నీ, సంస్కృతీసాంప్రదాయ విలువలనూ, తన కలంతో ప్రకాశింపజేస్తూ, పల్లెదనాన్నీ, మట్టివాసననూ పరిమళింపజేస్తూ, అందరిచేతా శభాష్ అనిపించుకుంటున్నాడు. ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని, డిసెంబరు 2012లో ఒంగోలులో నిర్వహించిన తెలుగు వ్యాసరచన పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈతడు 2011 లో జాతీయ ప్రతిభా పురస్కారానికి ఎంపికైనాడు. ఇంకా జిల్లా స్థాయిలో తెలుగు వ్యాసరచన పోటీలలో పలు బహుమతులు సాధించాడు. ఇతని తల్లిదండ్రులిద్దరూ దర్జీ వృత్తిలో ఉన్నారు. [3] ఈ పాఠశాల ఆవిర్భావం వెనుక గ్రామస్థుల కృషి ఎంతో ఉంది. ఈ పాఠశాల పూర్వపు ప్రధానోపాధ్యాయులు శ్రీ అనంత కోటేశ్వరరావు, గ్రామానికి చెందిన స్టాంపురైటర్ శ్రీ ధర్మవరపు నరసింహారావుల విశేషకృషితోనే మంచిగుర్తింపు వచ్చింది. 2008లో పి.డి.ఎఫ్. నిధులు రు. 29.95 లక్షలూ ఆ తరువాత ఆర్.ఎం.ఎస్.ఏ. నిధులు రు. 31.31 లక్షల తో, 15 గదులతో ఈ పాఠశాల భవనం రూపుదిద్దుకున్నది. ఈ పాఠశాలలో విద్యనభ్యసించడానికి అద్దంకి పట్టణంలోని కట్టకిందపాలెం, పెరికపాలెం, మండలంలోని పార్వతీపురం, కొటికలపూడి, కుంకుపాడు, రామాయపాలెంతోపాటు, ముండ్లమూరు మండలంలోని శంకరాపురం, సుంకరవారిపాలెం, మక్కెనవారి పాలెం, పురిమెట్ల, భట్లపల్లి, పోలవరం తదితర గ్రామాలనుండి, 500 మందికి విద్యార్థులు వచ్చి, విద్యనభ్యసించుచున్నారు. ఈ పాఠశాల విద్యాప్రమాణాలలో అగ్రగామిగా నిలుచుచున్నది. నిష్ణాతులైన ఉపాధ్యాయులు తమ బిడ్డలనుగూడా ఈ పాఠశాలలోనే చదివించుచూ, మిగిలినవారికి ఆదర్శంగా నిలుచుచున్నారు. వీరికృషితోనే ఈ పాఠశాల విద్యార్థులు 10వ తరగతిలో 10/10 గ్రేడ్ మార్కులు సాధించుచున్నారు. వీరు ఐ.ఐ.ఐ.టిలో గూడా సీట్లు పొందుచున్నారు. 8వ తరగతిలో ప్రతి సంవత్సరం ఇద్దరైనా మెరిట్-కం-మీన్స్ స్కాలరుషిప్పులు పొందుచున్నారు. క్రీడాపరంగా ఛాంపియన్లుగా నిలుచుచూ పలు పతకాలు సాధించుచున్నారు. 2013-14 మరియూ 2014-15 సంవత్సరాలలో నలుగురు విద్యార్థులు క్రీడలలో అద్దంకి జోనల్ స్థాయిలో 4 బంగారు పతకాలు సాధించారు. [5]

రాష్ట్ర విభజన నేపథ్యంలో, ఒంగోలు డి.ఆర్.ఎం పాఠశాలలో, 2017,జులై-17న నిర్వహించిన జిల్లాస్థాయి వక్తృత్వపు పోటీలలో, ఈ పాఠశాల విద్యార్ధిని ఏ.పి.ఎల్.స్పందన ప్రథమస్థానంలో నిలిచి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనది. [9]

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి అడుసుమల్లి భారతి, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

  1. శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయం.
  2. ఈ గ్రామంలో 2013 మే 20 సోమవారం ఉదయం 8-24 గంటలకు 36 అడుగుల ఎత్తయిన ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ జరిగింది. [2]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి. అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులుతిమ్మాయపాలెం

గ్రామ విశేషాలు

  1. శ్రీ శామ్యూల్ ప్రసాద్:- ఈ గ్రామానికి చెందిన శ్రీ ప్రసాదు, రాణి దంపతుల కుమారుడు శ్రీ శామ్యూల్ ప్రసాద్, విశాళపట్నంలో కంప్యూటర్ సైన్స్ చదివి అనంతరం సంగీతం మీద అభిమానంతో, శ్రీ వంగపండు ప్రసాదరావుతో కలిసి విడుదల చేసిన "ఉత్తరాంధ్ర వాణి" ఆల్బం, ఇప్పుడు కళాభిమానుల ప్రశంసలనందుకుంటున్నది. [6]
  2. శ్రీ ధర్మవరపు వెంకటరావు:- ఈ గ్రామానికి చెందిన వీరు అద్దంకిలో నివాసమేర్పరచుకున్నారు. హిందీ ప్రచారకులుగా ఉన్న వీరికి 2006లో వరిష్ఠ ప్రచారక్ పురస్కారం అందజేసినారు. ఆయనకు వివిధరంగాలలో శిష్యులు ఉన్నారు. వీరిలో 150 మంది వరకు హిందీ ఉపాధ్యాయులుగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందటమేగాకుండా, వేలాదిమంది శిష్యులను తయారుచేసారు. ఆయన 84 సంవత్సరాల వయస్సులో, 2015,డిసెంబరు-31వతేదీనాడు విజయవాడలో పరమపదించారు. [7]

గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి. [1]

మూలాలు

వెలుపలి లంకెలు

[2] ఈనాడు దినపత్రిక; 2013,మే-21; పేజీ-8. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2013,డిసెంబరు-9; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,జనవరి-26; 1వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,జూన్-20; 2వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2015,సెప్టెంబరు-21; 2వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016,జనవరి-1; 2వపేజీ. [8] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017,జనవరి-16; 3వపేజీ. [9] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017,జులై-19; 1వపేజీ.