తిరుపతమ్మ తల్లి

From tewiki
Jump to navigation Jump to search
చిన్న తిరునాళ్ళు

ఈ గ్రామములోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం జిల్లాలోనేగాక రాష్ట్రంలోని వివిధప్రాంతాలలో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయంలో చిన్న తిరునాళ్ళు ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి నుండి 5 రోజులు వైభవంగా నిర్వహించెదరు. మొదటి రోజు ఉదయం ఆలయంలో [[అఖండజ్యోతి]] స్థాపన చేస్తారు. రెండవ రోజున, సాయంత్రం 5 గంటలకు, రథంలో గ్రామోత్సవం నిర్వహించెదరు. మూడవ రోజున, ప్రత్యేక అభిషేకం, అనంతరం ఆలయంలో వేలమంది మహిళలచే లక్షకుంకుమార్చన నిర్వహించెదరు. నాల్గవరోజు సాయంత్రం, ఆలయంలో ఉన్న ఇనుప ప్రభను విద్యుద్దీపాలతో అలంకరించి, దానితో తిరుపతమ్మ, గోపయ్యస్వా స్వామి విగ్రహాలను ఉంచి, ఆలయం చూట్టూ ప్రదక్షణ చేయించెదరు. ఐదవ రోజున, అమ్మవారికి అనిగండ్లపాడు లోని శ్రీ కొల్లా శ్రీనివాసరావుగారి ఇంటినుండి పుట్టింటి పసుపు, కుంకుమ తీసుకొని వస్తారు. ఆ బండి వెనుక గ్రామానికి చెందిన వందల బండ్లు పెనుగంచిప్రోలు వరకూ వేడుకగా వస్తవి. దీనిని అనిగండ్లపాడు, పెనుగంచిప్రోలులో పెద్ద ఉత్సవంగా చేస్తారు.[1]

మూలాలు

{మూలాలజాబితా}

వర్గం:కృష్ణా జిల్లా పుణ్యక్షేత్రాలు

  1. ఈనాడు కృష్ణా; 2014,మార్చ్-15; 11వ పేజీ.