"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తిరుమలాంబ

From tewiki
Jump to navigation Jump to search

తిరుమలాంబా దేవి 16వ శతాబ్దపు సంస్కృత కవయిత్రి. ఈమె విజయనగర చక్రవర్తి అచ్యుతరాయల భార్య. ఈమె వరదాంబికా పరిణయమనే చంపూ కావ్యమును సంస్కృతములో రచించింది. తెలుగు వారు, కన్నడ వారు ఇరువురు ఈమె తెలుగు కవియిత్రి అని కన్నడ కవియిత్రి అని చెప్పుకున్నా నిర్ధారణగా ఈమె మాతృ భాష తెలియడము లేదు.

ఈమె బహు భాష పాండిత్యము కలదని, కావ్యాలు, అలంకారాలు, నాటకాలు, కవితలు, పురాణాలు, వేదాలు ఒక్కసారి విని గుర్తుపెట్టుకోగల ఏకసంథాగ్రాహి అని తన కావ్యము వరదాంబికా పరిణయము యొక్క కవిపరిచయములో చెప్పుకొన్నది.

అచ్యుతరాయల కాలములోనే ఓడూరి తిరుమలాంబ అనే విదూషీమణి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అచ్యుతరాయలు విఠ్ఠలనాథుని ఆలయానికి బహుకరించిన స్వర్ణ మేరువును పొగుడుతూ ఈమె రాసిన శ్లోకాలు హంపిలోని విఠ్ఠలనాధుని దేవాలయములో ఉన్నాయి[1]. ఈ ఓడూరి తిరుమలాంబ, వరదాంబికా పరిణయము రాసిన తిరుమలాంబ ఒకరేనని కొందరు భావిస్తున్నారు[2].

మూలములు

  • వరదాంబికా పరిణయ చంపూ - తిరుమలాంబ (ఆచార్య సూర్యకాంత శాస్త్రి సంపాదకత్వము)
  1. సమగ్ర ఆంధ్ర సాహిత్యం (ఏడవ సంపుటం, మలిరాయల యుగం) - ఆరుద్ర పేజీ.14,15
  2. వరదాంబికా పరిణయ చంపూ - తిరుమలాంబ (ఆచార్య సూర్యకాంత శాస్త్రి సంపాదకత్వము)

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).