"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
తీగ
వ్యాసంలో ఎక్కువగా ఆంగ్ల పాఠ్యం ఉంది ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయాన్ని వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/తీగ పేజీలో రాయండి. |
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
![]() | ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
తీగను ఆంగ్లంలో వైర్ అంటారు. సాధారణంగా ఒక తీగ స్థూపాకారంగా వంచుటకు అనువుగా ఉండేలా లోహంతో తయారు చేయబడి ఉంటుంది. తీగలు విద్యుత్త్ సరఫరా చేయడానికి, టెలీకమ్యూనికేషన్స్ సంకేతాలు మోసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. డై లేదా డ్రా ప్లేట్ రంధ్రం ద్వారా వచ్చే కరిగి ఘన రూపంలోకి మారుతున్న లోహంతో తీగలను రూపొందిస్తారు. ప్రామాణిక పరిమాణాల కొరకు వివిధ రకాల తీగలు వివిధ గేజ్లుగా నిర్ణయించబడ్డాయి. ఎక్కువగా విద్యుత్త్ సరఫరాకు ఉపయోగించే కేబుల్ వైర్లలో అనేక పోగులను ఒక కట్టగా ఉండేలా రూపొందిస్తారు. అనేక అవసరాల కొరకు ఉపయోగించే తీగలు అవసరాలకు అనుగుణంగా, అందంగా కనపడేందుకు తీగలను గుండ్రంగా, వంకరగా, దీర్ఘచతురస్రాకారంగా, చదనుగా ఉండేలా ఉపయోగించడం జరుగుతుంది. సాధారణంగా తీగలను ఒక చోట నుంచి మరొక చోటకి రవాణా చేయవలసి వచ్చినప్పుడు కాని లేదా భద్రపరచవలసి వచ్చినప్పుడుకాని తీగలను గుండ్రంగా చుట్ట చుడతారు.
చిత్రమాలిక
రాగి తీగ పోగులు