"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తీగ (వృక్షం)

From tewiki
Jump to navigation Jump to search

సన్నగా, పొడవుగా పాకుతూ ఎగబాకే మొక్కలను తీగ జాతి మొక్కలంటారు. ఈ చెట్ల యొక్క కాడలను తీగలంటారు.

పై కెదిగెడు ప్రకాండములు కొన్ని ఏదైన నాధారముండిన కాని పోలేవు. చిక్కుడు మొదలైన తీగెలలో ప్రకాండ మే పందిరినో చెట్టునో చుట్టుకొని ఎగప్రాకును. ఇట్లు ప్రాకునవి తిరుగెడు తీగలు.

నులితీగ

పై కెదిగెడు ప్రకాండములు కొన్ని ఏదైన నాధారముండిన కాని పోలేవు. చిక్కుడు మొదలైన తీగెలలో ప్రకాండ మే పందిరినో చెట్టునో చుట్టుకొని ఎగప్రాకును. ఇట్లు ప్రాకునవి తిరుగెడు తీగలు. గుమ్మడి, బీర, పొట్లతీగెలు ఇట్లు చుట్టుకొనవు. వానికి నులితీగలు ఉన్నాయి. ఇవి దేనినైన గట్టిగ చుట్టుకొని ప్రకాండమును పైకిలాగును. మిరియాల తీగె వేరుమూలమున నెగబ్రాకుచున్నది. గచ్చపొద, ఆరుదొండ ముళ్ళమూలమున పైకి పోవుచున్నది. కొన్ని నులితీగలు ప్రకాండము యొక్క మార్పులే. నల్లేరు ద్రాక్ష తీగలలో కాడకొక ప్రక్కను ఆకును, దాని కెదురుగ నొకనులి తీగయుగలవు. ఈ నులితీగయె నిజమైన ప్రకాండము. దీనిమీదనే ఆకు పుట్టుచున్నది. ఈ ఆకు కణుపుసందులో నుండు మొగ్గయె పెరిగి కాడ (ప్రకాండము) యగుచున్నది. గుమ్మడి తీగెలో కొన్ని ఆకుల కణుపు సందులో నుండి పెరగవలసిన కొమ్మలు నులితీగెలుగ మారుచున్నవి. శిఖండి, పాలజెముడు, నాగజెముడు మొక్కలలో ఆకులు మిక్కిలి చిన్నవిగ నుండి త్వరగ రాలిపోవుటయో, లేకుండగనే పోవుటయో తటస్థించుచున్నది కనుక, కొమ్మలు ఆకుపచ్చగను, వెడల్పుగ నుండి ఆకులపనిని కూడా చేసికొనుచున్నవి.

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు