"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తుమ్మల నాగేశ్వరరావు

From tewiki
Jump to navigation Jump to search

తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ మాజీ రాజకీయనాయకుడు, మాజీ మంత్రి.ఖమ్మం జిల్లా లోని ఖమ్మం శాసనసభ నియొజక వర్గానికి ప్రాతినిధ్యం వహించాడు .పూర్వం ఖమ్మం జిల్లా లోని సత్తుపల్లి నియొజక వర్గానికి ప్రాతినిధ్యం వహింఛారు .ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నాడు. 2014 ఆగస్టు 30న ఇతడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడు.[1]

రాజకీయ నేపధ్యము

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మలది విశిష్ట స్థానము. రాష్ట్రంలోని ప్రధాన పార్టీని ఒంటిచేత్తో మూడు దశాబ్దాల పాటు ఆయన నడిపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. తన అనుచరులను ఎందరినో నాయకులుగా తీర్చిదిద్దారు. 1982 సెప్టెంబరులో చర్ల మండలం ఏటుపాక గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

ఆయనకు రాజకీయ జన్మనిచ్చింది సత్తుపల్లి నియోజకవర్గం. పూర్వ సత్తుపల్లి నియోజకవర్గంలోని దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామానికి చెందిన ఆయన తన రాజకీయాలను అక్కడి నుంచే ప్రారంభించారు. తెలుగుదేశం స్థాపించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఓటమి చవిచూశారు. మళ్లీ ఏడాదిన్నరకే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పుడే ఆయనకు ఎన్టీఆర్ కే బినెట్ ర్యాంకు ఇచ్చారు.

చిన్నతరహా నీటిపారుదల శాఖామంత్రిగా ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేశారు. ఆ తర్వాత 1994, 1999 ఎన్నికల్లో గెలిచిన తుమ్మల చంద్రబాబు కేబినెట్‌లో కీలకమైన ఎక్సైజ్, భారీనీటిపారుదల, ఆర్‌అండ్‌బీ శాఖలు నిర్వహించారు. మంత్రిగా ఉన్న కాలంలో జిల్లా అభివృద్ధికి కృషి చేశారన్న పేరు సంపాదించుకున్నారు. 2004 ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా ఖమ్మం నుంచే పోటీచేసి ఓడిపోయారు.

బయటి లంకెలు