"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తుమ్మల వెంకయ్య

From tewiki
Jump to navigation Jump to search

నాగులుప్పలపాడు మండలంచేకూరపాడు గ్రామానికి చెందిన రైతు తుమ్మల వెంకయ్య .ఆయన సృష్టి పవర్‌వీడర్ ‌. ఆయన తయారుచేసిన పవర్‌వీడర్ తో కేవలం ముప్పాతిక లీటర్‌ డీజిల్‌ను వెచ్చిస్తే చాలు.. ఒక ఎకరం మెట్ట పొలాన్ని దున్నేయవచ్చు పత్తి, మిర్చి, పొగాకు, జామాయిల్‌, నిమ్మ, బత్తాయి లాంటి పొలాల్లో అంతర సేద్యానికి ఉపయోగపడుతుందీ పరికరం. ఎప్పటికప్పుడు చిన్నచిన్న మార్పుల ద్వారా ఈ యంత్రాన్ని వ్యవసాయంలో వివిధ పనులకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. మెట్ట పొలాల్లో ఈ యంత్రం ద్వారా గొర్రు, గుంటక తోలవచ్చు. పత్తి, పొగాకు, మిర్చి పంటల్లో ఒకేసారి ఐదు సాళ్లకు పురుగుమందు పిచికారీ చేసుకునే వీలుంది. ఒక్క బోల్టును బిగించటం ద్వారా బత్తాయి, నిమ్మతోటల్లో పాదులు తీసుకోవచ్చు. ఈ తోటల్లో ఎత్త్తెన చెట్లకు సైతం మందుకొట్టే విధంగా దీన్ని తయారు చేశారు. ఈ యంత్రంలో ఆరు అశ్వికశక్తి ఇంజిన్‌ వినియోగించారు. దీని సాయంతో పొలం సమీపంలో నీరుంటే నీళ్లు పెట్టుకోవచ్చు. వెంకయ్య తాను రూపొందించిన యంత్రానికి పేటెంట్‌ హక్కులు పొందారు. ఈయన రూపొందించిన పవర్‌ వీడర్‌కు ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ గుర్తింపునిచ్చింది. ఈ యంత్రం ఖరీదు ప్రస్తుతం రూ.79,040 కాగా దీన్ని కొనుగోలు చేసే రైతులకు రూ.30 వేలు రాయితీ ఇస్తోంది.