తుర్కయంజల్

From tewiki
Jump to navigation Jump to search
తుర్కయంజల్
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం అబ్దుల్లాపూర్ మెట్
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

తుర్కయంజాల్,తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి చెందిన గ్రామం.ఇది జనగణన పట్టణం.[1] ఈ గ్రామం జిల్లా సరిహద్దులో ఉంది. ఇది ఈ మండలములో పెద్ద గ్రామం.తుర్కయంజల్ గ్రామ పరిధిలో మణిముత్యాలమ్మ కుంట, సంజీవరెడ్డి నగర్, శ్రీశ్రీ నగర్, కుర్మగూడ ఉప గ్రామాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న తుర్కయంజల్ పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]

గణాంకాలు

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా మొత్తం 8903 పురుషులు 4650, స్త్రీలు 4253.[3] నివాస గృహాలు 1927, విస్తీర్ణం 2053 హెక్టార్లు. ప్రధాన భాష తెలుగు.

రవాణ సౌకర్యాలు

ఈ గ్రామం హైదరాబాదు - నాగార్జున సాగర్ ప్రధాన రహదారిపైనున్నందున ఇక్కడినుండి అనేక ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఉంది. హయత్ నగర్ ఇక్కడికి 9 కి.మీ దూరంలో ఉంది. రోడ్డు సౌకర్యం ఉంది.

పాఠశాలలు

ఇక్కడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఒక అంగన్ వాడీ కేంద్రం ఉంది. సెయింట్ పాల్ స్కూలు, కె.బి.సైనిక హైస్కూలు ఉన్నాయి.[4]

ఇతర గ్రామ విశేషాలు

ఈ గ్రామంలో ఒక బిస్కట్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ వేంకటేశ్వరస్వామి దేవాలయం, బాలఏసు మందిరం అనే చర్చి ఉంది.

చిత్రమాలిక

మూలాలు

  1. https://www.census2011.co.in/data/town/574202-turkayamjal-andhra-pradesh.html
  2. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 26 March 2021.
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03[permanent dead link]
  4. http://www.onefivenine.com/india/villages/Rangareddi/Hayathnagar/Thurkayamjal[permanent dead link]

వెలుపలి లింకులు