"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తులిప్

From tewiki
Jump to navigation Jump to search

తులిప్
Tulipa suaveolens floriade to Canberra.jpg
Cultivated tulip - Floriade 2005, Canberra
Scientific classification
Kingdom:
(unranked):
Order:
Family:
Subfamily:
Genus:
Species

See text

మూస:Taxonbar/candidate

అందమైన పువ్వులతో అలరించే తులిప్ మొక్కలు తులిప అనే దుంప జాతికి చెందినవి. ఇందులో మొత్తం 109 రకాలు[1] ఉన్నాయి. ఇవి లిలియేసి[2] కుటుంబానికి చెందినవి. వీటి మూలాలు దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, ఆసియాలోని అనతోలియా, ఇరాన్, పశ్చిమ, ఈశాన్య చైనాలో విస్తరించాయి. పామిర్, హిందూ కుష్ పర్వత ప్రాంతాలు, కజకిస్తాన్లోని గడ్డి మైదానాలు ఈ జాతిలోని భిన్నత్వానికి కేంద్రంగా నిలుస్తాయి. సాధారణ, సంకరణ తులిప్ లను తోటల్లో పెంచుతున్నారు. వీటిని పూలకుండీల్లో అమర్చుకుంటారు. అలంకరణకు కూడా వీటిని ఉపయోగిస్తారు. తులిప జేస్నెరియానా నుంచి వచ్చిన సంకరణ జాతులనే ఎక్కువగా పెంచుతున్నారు.

వివరణ

టిప్ ఆఫ్ ఎ తులిప్ స్టెమెన్నోట్ ది గ్రెయిన్స్ ఆఫ్ పొల్లెన్

ఈ జాతి మొక్కల మూలం దుంపే. ఇవి నిత్యం దుపంతోనే ఉంటాయి. మొక్క మూలానికి చివర్లో ఈ చిన్న దుంపులు పుట్టుకొస్తాయి. కొన్ని చోట్ల వీటికి వేర్లు ఉండవు. మరికొన్ని చోట్ల వేర్లు ఉంటాయి. వీటిలో కొన్ని జాతులు పొట్టిగా ఉంటాయి. మరికొన్ని జాతులు పొడవుగా ఎదుగుతాయి. 10 నుంచి 70 సెంటీమీటర్లు(4-27 అంగుళాలు)ఎదుగుతాయి. ఇవి మంచుకురిసే చలికాలంలో కూడా బాగా ఎదుగుతాయి. ఈ మొక్కలకు సాధారణంగా 2 నుంచి 6 ఆకులు ఉంటాయి. కొన్ని జాతుల్లో 12 ఆకులు వరకు ఉంటాయి. ఆకులు కాండానికి అతికించిన పొడవైన పట్టీలా కనిపిస్తాయి. ఆకుపచ్చ రంగులోని ఆకులు కాండానికి అటొకటి, ఇటొకటి ఉంటాయి. ఆకులు మందంగా ఉంటాయి. పొడుగ్గా, సన్నగా ఉంటాయి. పెద్ద పెద్ద పువ్వులు కాండానికే పూస్తాయి, సాధారణంగా మొటికేలని కలిగి ఉండవు. కాండానికి ఆకులు ఉండవు. కొన్నింటికి తక్కువ ఆకులు ఉంటాయి. కొన్ని మొక్కల్లో ఆకుల మధ్య ఖాళీ ఎక్కువగా ఉంటుంది. కొన్నింటికి ఖాళీ బాగా తక్కువగా ఉంటుంది. చాలా మటుకు ఒక కాండానికి ఒక పువ్వే పూస్తుంది. కొన్ని జాతుల మొక్కల్లో నాలుగు పువ్వుల వరకు పూస్తాయి. అందంగా, ఆకర్షణీయంగా, గిన్నె ఆకారంలో ఉండే ఈ పువ్వులకు సాధారణంగా మూడు రేకులు ఉంటాయి. తొడిమ కూడా మూడు భాగాలుగా చీలి ఉంటుంది. వీటిని టేపల్స్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది పువ్వు రెక్కలతో కలిసిపోయి ఉంటుంది. కొన్నింటికి తొడిమ ఆరుభాగాలుగా చీలి ఉంటాయి. మూలం దగ్గర వీటి ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ పువ్వుల లోపల కాండానికి దగ్గరా ఉండే మధ్యభాగం ఆరు చిన్న చిన్న భాగాలుగా విభజించబడుతుంది.వీటిపై పుప్పొడి ఉంటుంది. అండాలు మూడు గదులుగా విభజించబడి ఉంటాయి. వీటి పండ్లు గొట్టం ఆకారంలో ఉంటాయి.కొన్ని అండాకారంలోనూ, మరికొన్ని గోళాకారంలోనూ ఉంటాయి. అందులో ఉండే విత్తనాలు గుండ్రంగా రెండు వరుసల్లో ఉంటాయి.[3] లేత కాఫీ రంగు లేదా ముదురు కాఫీ రంగులో ఉండే విత్తనాలు ఒక్కో గదిలోనూ రెండు వరుసలుగా ఉంటాయి. సన్నని విత్తనాలుపై పోషకపదార్ధాల పొర ఉంటుంది. మిగతా విత్తనాలకు ఇటువంటి పొర ఉండదు.[4]

పేరు యొక్క ఉద్భవం

తులిప్స్ కి నెదర్లాండ్స్ తో అనుబంధం ఉన్నా,వ్యాపార సంబంధమైన సేద్యం మాత్రం ఓట్టోమన్ రాజ్యం లో మొదలైనది. తులిప్ ని ఇరాన్, టర్కీ దేశాల్లో లాల్ (ఈ పేరు షర్షియన్ నుంచి వచ్చింది) అని పిలుస్తారు. ఆఫ్రికా, ఆసియా, ఐరోపాల్లోని చాలా దేశాల్లో ఈ తులిప్ ను అనాదిగా పండిస్తున్నారు. తులిప్ అనే పదం మొదట్లో ఆంగ్లంలోనే కనిపించేది. తులిప , తులిప్యాంట్ అనే రూపాల్లో ఉండేధి. ఆ తర్వాత ఫ్రెంచ్ భాషలో తులిపే గా ప్రవేశించింది. మొదట్లో తులిపాన్ అనేవారు.. అదికాస్తా తులిపి గా మారిపోయింది. అలాగే ఆధునిక లాటిన్లో తులిప అని పిలుస్తున్నారు. ఒట్టోమన్ టర్కిష్ లో తులబింద్ (‘‘ముస్లిన్‘‘ లేదా ‘‘గాజి‘‘)అంటున్నారు. నిజానికి ఇది పర్షియన్ భాషకు చెందిన దులబడ్ (‘‘తురబన్‘‘)నుంచి వచ్చింది.

సేద్యం

తులిప్స్ సహజంగా కొండ ప్రాంతాల్లో సమశీతోష్ణ వాతావరణంలో పెరుగుతాయి.వీటికి చల్లని వాతావరణం కావాలి. ఇవి చల్లని వసంతకాలాల్లోనూ,వేసవి ఆరంభ సమయాల్లోనూ బాగా పెరుగుతాయి. వేడిమి ప్రాంతాల్లో ఈ మొక్కలు వసంతకాలంలో కొత్త కళను సంతరించుకుంటాయి. సహజంగా వీటికి బాగా నీటి సదుపాయం ఉన్న నేలలు అనుకూలం. వేసవి మరియు వర్షాకాలం చివరలో 10 నుంచి 20 (4 నుంచి 8 అంగుళాలు) సెంటీమీటర్లు లోతులో నాటుతారు. చల్లని వాతావరణంలేని ప్రాంతాల్లో ఈ మొక్కల్ని 9 అంగుళాలు లోతులో నాటుతారు.12 inches (300 mమీ.) దీనివల్ల వీటికి ఎండ వేడిమి నుండి సంరక్షణ లభిస్తుంది. అంతే కాకుండా ఈ మొక్కలు చిన్న చిన్న కొత్త దుంపల్ని తయారు చేయకుండా, ఒకే ఒక పెద్ద దుంపని తయారుచేస్తాయి. దీని వల్ల వేడిమి ప్రాంతాల్లో ఈ మొక్కలు కొన్ని సంవత్సరాల పాటు జీవించగలుగుతాయి. కాని ఇది దుంప నిర్వీర్యమై, మొక్క చనిపోవడాన్ని మాత్రం అడ్డుకోలేదు.

విస్తరణ

తులిప్ అంకురం,మొలకలు, కణాల ద్వారా వ్యాప్తి చెందుతుంది.[5] అంకురం, కణాల ద్వారా జరిగే వ్యాప్తిలో సంపర్కం ఉండదు. తల్లి మొక్క నుంచి జన్యుపరమైన క్లోనింగ్ చేసి వీటిని సృష్టిస్తారు. అంటే ఇది ఈ మొక్కల పెంపకంతో ఏకస్వరూపతను తీసుకొస్తుంది. విత్తనాలు తయారీ అయ్యే మొక్క చాలా విభిన్నంగా ఉంటుంది. విత్తనాలు ఈ జాతులు, వాటి ఉపజాతులు విస్తరించడంలో బాగా ఉపయోగపడతాయి. సంకరణ రకాలను తయాను చేయడానికి ఈ విత్తనాలే కీలకం. చాలా వరకు తుల్పి జాతి మొక్కలు ఒకదానితో మరొకటి ఫలదీకరణం చెందుతాయి. ఫలితంగా తులిప్ లో కొత్త ఉపజాతులు పుట్టుకొస్తాయి. తుల్పి మొక్కల సంకర ఫలదీకణం కారణంగా సంకరణ జాతులు ఏర్పడతాయి. సాధారణంగా ఈ తులిప్ ని సాగు చేసే రైతులంతా సంకరణ రకాలనే వాడతారు. వీటి నుంచి వచ్చే విత్తనాలు వాటి మాతృవర్గానికి భిన్నంగా ఉంటాయి.

తులిప్ ను సాగు చేసేవారు అంకురాలనే వాడతారు. ఫలితంగా నాణ్యమైన మొక్కలు తయారవుతాయి. ఇవి ఒక ఏడాదిలోనే పువ్వులు పూస్తాయి. విత్తనాల నుంచి వచ్చే మొక్కలు పువ్వులు పూయడానికి సాధారణంగా ఐదు నుంచి ఎనిమిదేళ్లు పడుతుంది. వీటిని వ్యాపారపరంగా పండించేవాళ్లు, వేసవి చివర్లో దుంపల్ని ఎండబెడతారు. వాటిని పరిమాణం అధారంగా వర్గీకరిస్తారు. పెద్ద దుంపల నుంచి మొక్కలు త్వరగా ఎదిగి పువ్వులు పుస్తాయి, కనుక వీటిని అమ్మేస్తారు. చిన్న దుంపల్ని తిరిగి భూమిలో పాతుతారు. వాణిజ్యపరంగా మొక్కల అమ్మకాల్లో హాలెండ్ దే పైచేయి. ఈ దేశంలో ఏటా 3 మిలియన్ల దుంపలను ఉత్పత్తి చేస్తారు.[6]

పశ్చిమ ఐరోపాలో తులిప్స్

నెదర్లాండ్స్ లో తులిప్ సాగు

వాయువ్య ఐరోపాకు ఈ తులిప్ లను మొదటగా తెచ్చింది ఎవరో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. చాలా మంది చెప్పే కథ ప్రకారం అయితే 1554లో ఫెర్డినాండ్1 రాయబారిగా ఓగ్రీ ఘీసలానీ ది బుష్ బెక్కా ఒట్టోమన్ సామ్రాజ్య సుల్తాన్ సులేమాన్ ది మాగ్నిఫిషియంట్ వద్దకి వెళ్ళాడు. బెక్కా లేఖల్లో తాను కొన్ని అద్భుతమైన మొక్కలు చూశానని, దుంపజాతికి చెందిన ఈ మొక్కల పువ్వులు అతడిని బాగా ఆకర్షించాయి అని, టర్కిష్ లో వాటిని లాలి అంటారని రాసుకున్నాడు. అతడిని ఆకట్టుకున్న మరో విషయం ఈ పువ్వులు చలికాలం మధ్యలో కూడా పూయడం. నిజానికి ఆ కాలం పువ్వులు పూయడానికి ఏ మాత్రం అనుకూలమైంది కాదు.(బుష్ బెక్కా, క్యూటిడి.ఇన్ బ్లన్ట్, 7 చూడండి) దీంతో వాటికి బాగా ప్రాచుర్యం దక్కింది. ఫలితంగా ఒట్టోమన్ సామ్రాజ్య ప్రాబల్యం పెరిగింది. నల్ల ఒట్టోమన్ సామ్రాజ్యం సుసంపన్నంగా ఉన్న కాలాన్ని తులిప్ యుగం అంటారు. టర్కిష్ లో అయితే లాలి దేవరి అని అంటారు. ఆధునిక పర్షియన్ సాహిత్యం ఈ అందమైన పువ్వుల పై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మధ్యకాలంలో వచ్చిన సిమిన్ బిహబాహని పద్యాల్లో కూడా తులిప్ ప్రస్థావన ఉంది. 13వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు షర్షియన్ కవులకు తులిప్ ఓ ప్రధాన అంశంగానే ఉంది. ముషర్రిఫ్ డి దిన్ సాదీ అనే కవి గులిస్తాన్ లో ఓ కవిత రాశాడు. తోట అందాల్ని వర్ణిస్తూ రాసిన ఆ కవితలో చల్లటి గాలి చేసే సడిని పక్షుల పాటతో పోల్చాడు. పండిన పళ్లను, కనువిందు చేస్తున్న తులిప్ పువ్వులి వర్ణించాడు. అతడి కవిత సారాంశం ఆ తులిప్ తోట భూలోక స్వర్గమని చెబుతోంది.[7]

1959లో కాన్ రెడ్ గిసానిర్, జర్మనీకి చెందిన ఆగ్స్ బర్గ్ నగరంలోని బవరియా ఎస్టేట్లో కౌన్సిలర్ హెర్ వర్ట్ తోటల్లోని తులిప్స్ గురించి వర్ణించాడు. తులిప్ దుంపలను సాధరణంగా జూన్ నెలలో తవ్వి బయటకు తీస్తారు. వాటిని సెప్టెంబర్లో తిరిగి పాతిపెడతారు. ఇదే జీవనచక్రం మళ్లీ, మళ్లీ జరగుతుంది. ఐరోపాలో తొలినాళ్లలో కనిపించిన తులిప్స్ కృత్రిమంగా ఉండేవని బుష్ బిక్యు అభిప్రాయడ్డాడు. ఐరోపాలో ఇవి ఎప్పుడు అగుడుపెట్టాయన్న విషయం పై సందిగ్ఢత ఉంది. బుష్ బిక్యు చెప్పిన ప్రకారమైతే 1558 మార్చిలోనే తులిప్ దుంపల్ని తెచ్చి పాతారు. కానీ గిసానీర్ మాత్రం 1959లో ఈ ప్రక్రియ జరిగిందని చెబుతున్నాడు.

వియన్నాలోని ఇంపిరియల్ బొటానికల్ గార్డెన్ లో ఈ తులిప్స్ ను తొలిసారిగా 1573లో కార్లోస్ క్లూసియస్ నాటించాడు. ఆ తర్వాత ఆయన లిదియన్ విశ్వవిద్యాలయం కొత్తగా స్థాపించిన హార్టుస్ బొటానికస్ కి డైరెక్టర్ గా నియమితులైయ్యారు. అక్కడ కూడా ఆయన తలిప్ దుంపల్ని నాటించారు. అక్కడ ఆయన 1593 చివర్లో తులిప్ దుంపలను నాటించాడు. 1594లో తులిప్ నెదర్లాండ్ లో అధికారికంగా ప్రవేశించింది. కాని ఈ పువ్వుల్ని అంత్ వెర్ప్, ఆమ్స్టర్ డామ్ లోని కొన్ని వ్యక్తిగత తోటల్లో అంతకు పూర్వం రెండు మూడు శతాబ్దాల నుంచి పెంచుతున్నారనటానికి ఆధారాలు ఉన్నాయి. లిదియన్ లోనే తులిప్ విత్తనాల వెర్రి బాగా పెరిగింది. తులిప్ తోటలు పెంచడం ఓ పెద్ద వ్యాపార పరిశ్రమగా రూపొందింది. [8]

ఉడ్ బర్న్ లో తులిప్ ఉత్సవం, ఒరెగాన్

తులిప్ గురించి లొపో వాజ్ ది సమపయో కూడా కొన్ని వివరాలు ఇచ్చారు. ఈయన భారతదేశంలో పోర్చుగీస్ గవర్నర్ గా పని చేశారు. ఆయన అవమానకర రీతిలో పదవిని కొల్పోవడంతో పోర్చుగీసుకి వచ్చేశారు. వచ్చేటప్పుడు శ్రీలంక నుంచి తులిప్ దుంపల్ని తీసుకొచ్చారని ఓ కథ ప్రచారంలో ఉంది. కాని ఇది ఓ కట్టుకథే. ఎందుకంటే శ్రీలంకలో తులిప్స్ లేవు. సమపయో ప్రయాణించిన నౌక శ్రీలంక మీదగా వచ్చే అవకాశం కూడా లేదు.

ఈ పువ్వులు యూరప్ లోకి ఎలా ప్రవేశించాయన్న కథలు పెద్ద సంఖ్యలో ప్రచారంలోకి వచ్చాయి. వీటికి విపరీతమైన ఆదరణ ఉండేది. పదహారో శతాబ్దం చివర్లోనే తులిప్ దుంపలు యూరొప్ లో ప్రవేశించాయంటూ జరిగిన భారీ ప్రచారానికి చార్లెస్ ది లిఎక్లుజ్(క్లూసియస్) బాధ్యుడు. తులిప్ గురించి రాసిన తొలి వ్యక్తి ఆయనే. అవి 1592లో రాశాడు. రంగు రంగుల తులిప్ లను గుర్తించి ఆయన అంతకు ముందే రాయడం మొదలెట్టాడు. వాటి అందాలు ఆయన్ని విస్మయపరిచాయి. అది తొందరగానే మిగతావాళ్లకు పాకేసింది. లిదియన్ విశ్వవిద్యాలయం వైద్యవిభాగంలో పని చేసేటప్పుడు క్లూసియస్ కళాశాలలో విద్యార్థుల బోధన తోటతో పాటు తన వ్యక్తిగత తోటలో కూడా తులిప్ దుంపల్ని నాటించాడు. 1596లో క్లూసియస్ తన తోటలోని తులిప్ ల దొంగతనాలతో ఇబ్బంది పడ్డాడు. ఒక్కసారైతే ఏకంగా 100 దుంపల్ని ఎత్తుకుపోయారు.

1634 -1637 మధ్య ఈ ఫువ్వులను చూడాలన్న ఉత్సాహం వెర్రిగా మారిపోయింది. ఇప్పుడు దాన్నే మనం తులిప్ వెర్రి అంటున్నాం. అప్పట్లోనే తులిప్ దుంపలను డబ్బుకు అమ్ముకునే పద్ధతి మొదలైంది. కత్తిరించిన తులిప్ పువ్వులను అమర్చుకునేందుకు పింగాణితో తులిపిరర్ అని పిలిచే ప్రత్యేక పాత్రలు తయారు చేసేవారు. పూలగుత్తిని పాత్రల్లో పెట్టుకోవడం 19వ శతాబ్దం వరకు అరుదైన విషయమే. మొదట్లో తులిప్ లను మాత్రమే పాత్రల్లో పెట్టేవారు. ఈ సంప్రదాయం డచ్ లో నిలకడగా ఉంది. అది డచ్ జీవన చిత్రంగా మారింది. నెదర్లాండ్ కి తులిప్ లతో ఇప్పటికీ విడదీయలేని అనుబంధం ఉంది. డచ్ తులిప్ అన్న పదం అక్కడి వ్యవసాయ క్షేత్రాల్లో తరచుగా వినిపించే పదం. తులిప్ ఉత్సవాలు కూడా చేస్తారు. నెదర్లాండ్, స్పాల్ డింగ్(ఇంగ్లాండ్), ఉత్తర అమెరికాల్లో ప్రతియేటా మే నెలలో ఈ ఉత్సవాలు జరుపుతారు. దీంతో బాటు తులిప్ లు పూచే సమయంలో ఉత్సవాలు జరుగుతాయి. హాలెండ్, మిచిగాన్, స్కాగిట్ లోయ(వాషింగ్టన్) వేడుకలు నిర్వహిస్తారు. తులిప్ ఉత్సవాలు మేలో అరెంజ్ నగరం, పిల్లా, లోవాలో జరుగుతాయి. కెనడా రాజధాని అట్టావాలో అయితే మూడు వారాల పాటు కెనెడియన్ తులిప్ వేడుకలు నిర్వహిస్తారు. ఆస్ట్రేలియాలో కూడా ఇవి బాగా ప్రసిద్ధి చెందాయి. దక్షిణార్థగోళంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చాలా చోట్ల వసంతకాలం. అప్పుడే చాలా తులిప్ పుష్ప వేడుకలు జరుగుతాయి. ప్రపంచంలోనే అతి పెద్ద, శాశ్వత తులిప్ ప్రదర్శన నెదర్లాండ్ లోని క్యుకినోఫ్ లో జరుగుతుంది. అయితే ఇక్కడికి సామన్య ప్రజలను ప్రత్యేక సమయాల్లో మాత్రమే అనుమతిస్తారు.

అమెరికాలో తులిప్స్

అమెరికాలో తొలిసారిగా ఈ పువ్వులు స్ప్రింగ్ పాండ్ సమీపంలోని లెన్ అండ్ సలీమ్ లోని మా ఆఫ్ ది ఫే ఎస్టేట్లో దర్శనమిచ్చాయి. లెన్ కి చెందిన ప్రముఖ భూస్వామి రిచర్డ్ సుల్లేవాన్ ఫే, పేరొందిన రైతు, వ్యాపారి కూడా. 1847 నుంచి 1865 మధ్య కాలంలో లెన్ లో కొంత భూమిని అక్రమించాడు. ప్రస్తుతం అదే ఫే ఎస్టేట్. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సింహాల శిబిరం, వాల్ మార్ట్ లు ఉన్నాయి.500 ఎకరాలు (2.0 కి.మీ2) ఈ ఎస్టేట్ డెనవర్ రోడ్డు వరకు విస్తరించింది. ఫే ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుంచి మొక్కలు తెప్పించి, ఖాళీ పచ్చిక బయళ్లలో పాతించేవాడు. ఇక్కడి విదేశీ మొక్కల్ని తిలకించాలన్న ఉత్సాహంతో ప్రజలు అటువైపుగా వచ్చేవారు.[9]

వ్యాధులు

TBV లేదా తులిప్ బ్రేకింగ్ వైరస్ ద్వారా ఉత్పత్తి చెయ్యబడిన వైవిధ్యమైన వర్ణాలు

హానికారకమైన బూజు వల్ల, తులిప్ మొక్కల్లో ఎక్కువగా బూజు తెగులు కనిపిస్తుంది. దీనివల్ల కణాలు చనిపోతాయి. మొక్క కుళ్లిపోతుంది.[10] కొన్ని రకాల బ్యాక్టీరీయాల కారణంగా మొక్క కుళ్లిపోతుంది. దీని వల్ల స్కెలిరోటియం రోల్ఫిసీ దెబ్బతింటుంది. ఫలితంగా మొక్క వివరణమైపోతుంది. దుంప పురుగులు కూడా మొక్క కుళ్లిపోయేలా చేస్తాయి. నీలం మోల్డ్, నల్ల మోల్డ్ వల్ల కూడా మొక్కలు పాడైపోతాయి మరియు గుజ్జులా మారి కుళ్లిపోతాయి.[11]

డచ్ తులిప్ వెర్రి కారణంగా రకరకాల రంగుల తులిప్ రకాలు ఉద్భవించాయి. అవి చాలా అకర్షణీయంగా ఉంటాయి. అయితే అందంతో పాటు సున్నితత్వాన్ని సంతరించుకున్నాయి. తులిప్ బ్రేకింగ్ పాట్ వైరస్ వల్ల సులభంగా తెగుళ్లు వచ్చేస్తాయి.మైజుస్ పెర్ సికా అనే పచ్చపురుగుల ద్వారా మొసకా వైరస్ సంక్రమిస్తుంది. పెర్ సికాలు మొదటగా యూరోపియన్ తోటల్లో 17వ శతాబ్దంలో బయటపడ్డాయి. ఈ వైరస్ వల్ల అద్భతమైన రంగుల్లో పువ్వులు పూయడం మొదలుపెట్టాయి. కానీ వాటివల్ల మొక్కలు బలహీనపడి నెమ్మది నెమ్మదిగా చనిపోయేవి. ప్రస్తుతం ఈ వైరస్ ను తులిప్ తోటల నుంచి పూర్తిగా తరిమికొట్టారు. మొజాయిక్ వైరస్ సోకిన తులిప్ లను ‘‘బ్రోకెన్ తులిప్స్‘‘ అంటారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో మాత్రమే రంగులు మారతాయి. కానీ ఇప్పటికీ ఈ వైరస్ తులిప్ లను వెంటాడుతోంది.

కొంతమంది చారిత్రక పెంపకందార్ల దగ్గర కొన్ని ప్రత్యేక రంగుల్లో పువ్వులు పూసే మొక్కలు ఉన్నాయి. కొన్ని కొత్తరకాల్లో కూడా విభిన్న రంగుల్లో పువ్వులు పూస్తున్నాయి. దీని ఫలితంగా తులిప్ పువ్వుల వర్ణంలో సహజసిద్ధమైన మార్పు సంభవించింది.

ది బ్లాక్ తులిప్ చారిత్రాత్మక శృంగార కావ్యం. దీనిని అల్జజాండర్ దమ్స్, పెరి 1850లో రచించాడు. నల్ల తులిప్ ను మొట్టమొదటిగారిగా ప్రపంచానికి పరిచయం చేసిన హార్లెమ్ నగరం గురించి ఇందులో ప్రస్తావించారు.

వర్గీకరణ

యోనినా తులిప్స్ ఆర ది డివిజన్ 6 కల్టివేటర్స్
తులిప్ ఇన్ సైడ్

ఫలపుష్ప అధ్యయన శాస్త్రం మొక్కల పరిమాణం, పువ్వుల బాహ్యరూపం ఆధారంగా తులిప్ లను 15 రకాలుగా విభజిస్తుంది.[12] [13]

 • మొదటి వర్గం:సింగిల్ ఎర్లి - కప్పు ఆకారంలో ఒకే ఒక పువ్వు ఉంటుంది. ఎనిమిది సెంటీమీటర్లు (3 అంగుళాలు) లోపే ఉంటుంది. అవి ఏడాది మధ్య కాలం తొలి రోజుల్లో వికసిస్తాయి. 15 నుంచి 45 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి.
 • రెండో వర్గం: డబుల్ ఎర్లి - పూర్తిగా రెండు పువ్వులు ఉంటాయి. గిన్నె ఆకారంలో 8 సెంటీమీటర్లు (3 అంగుళాలు) మొక్కలు సాధారణంగా 30 - 40 సెంటీమీటర్లు ఎదుగుతాయి.
 • మూడో వర్గం: ట్రంప్ - ఒక్కటే, కప్పు ఆకారంలో ఉండే పువ్వులు 6 సెంటీమీటర్లు వెడల్పు పెరుగుతాయి. మొక్క 35 నుంచి 60 సెంటీమీటర్లు పొడవు ఎదుగుతాయి. సంవత్సరం మధ్యకాలం నుంచి చివర వరకు పూస్తాయి.
 • నాలుగో వర్గం: డార్విన్ సంకరణ - ఒక్క పువ్వే పూస్తుంది. కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. 8 సెంటీమీటర్ల వెడల్పు పెరుగుతుంది. మొక్క 50 - 70 సెంటీమీటర్లు వరకు పెరుగుతుంది. సంవత్సరం మధ్య కాలం నుంచి చివరి వరకు పూస్తాయి. ఈ వర్గం, డార్విన్ పాత తులిప్ లతో కలగలిసి అయోమయాన్ని సృష్టించే అవకాశం లేదు. అవి మొదట ఒకటి ఆ తర్వాత ఎక్కువ పూవ్వులు పూసేవి.
 • ఐదో వర్గం: సింగిల్ లేట్ - కప్పు లేదా గుండ్రని ఆకారంలో ఉంటాయి పువ్వులు. ఇవి 8 సెంటీమీటర్ల వరకు ఎదుగుతాయి. మొక్కలు 45 - 75 సెంటీమీటర్ల పొడవు ఎదుగుతాయి. ఏడాది చివర్లో పూస్తాయి.
 • ఆరో వర్గం: లిల్లీ - ఫ్లవరింగ్
 • ఏడో వర్గం:ఫ్రింజ్ డ్ (క్రిస్ పా)
 • ఎనిమిదో వర్గం: విరిడిఫ్లోరా
 • తొమ్మిదో వర్గం: రిమ్ బ్రాండెట్
 • పదోవర్గం:పారెట్
 • డివిజన్ 11 : డబుల్ లేట్
 • పన్నెండో వర్గం: కఫ్ మేనియానా
 • పదమూడో వర్గం: ఫోస్ట్రియానా
 • పద్నాలుగో వర్గం: గిరిగీ
 • పదిహేనో వర్గం: స్పిసిస్ (బొటానికల్)
 • పదహారో వర్గం: మల్టిఫ్లవరింగ్ - ఇది అధికారిక విభజన కాదు. ఈ తులిప్ లు మొదటి 15 వర్గాలకు చెందినవే. కానీ తరచూ మిగతా వాటికంటే వేరుగా కనిపిస్తాయి. ఎందుకంటే ఒకే దుంపకు ఎక్కువ మొక్కలు వస్తాయి.

అవి పూసే సమయాన్ని బట్టి కూడా వాటి వర్గీకరణ జరుగుతుంది. [14]

 • త్వరిత పూత: సింగిల్ ఎర్లి తులిప్, డబుల్ ఎర్లి తులిప్, గిరిగీ తులిప్, కఫ్ మేనియానా తులిప్, ఫోస్ట్రియానా తులిప్, స్పిసిస్ తులిప్
 • మధ్య పూత: డార్విన్ సంకరణ తులిప్స్, ట్రంప్ తులిప్స్, పారెట్ తులిప్స్
 • చివరి పూత: సింగిల్ లేట్ తులిప్స్, డబుల్ లేట్ తులిప్స్, విరిడిఫ్లోరా తులిప్స్, లిల్లి-ఫ్లవరింగ్ తులిప్స్, ప్రింజ్ డ్ టులిప్స్, రిమ్ బ్రాడెంట్ తులిప్స్

ఎన్నికైన జాతులు

 • తులిపా అక్యుమినాటా (కొమ్మున్న తులిప్)
 • తులిపా అజినిన్సిస్ (కన్నున్న తులిప్)
 • తులిపా అలెప్పిన్సిస్ (అలెప్పో తులిప్)
 • తులిపా అర్మెనా
 • తులిపా అచెరియానా
 • తులిపా బటలినీ
 • తులిపా బకెరి
 • తులిపా బైఫ్లోరా
 • తులిపా బోర్స్ జోవీ
 • తులిపా బట్కోవీ
 • తులిపా కరినటా
 • తులిపా సెల్సియానా
 • తులిపా క్లుసియానా (ఆడ తులిప్)
 • తులిపా క్రెటికా
 • తులిపా సైప్రియా
 • తులిపా డాసిస్టమోన్
 • తులిపా దిదియరి
 • తులిపా దుబియా
 • తులిపా ఎడ్యులిస్
 • తులిపా ఫెర్గానికా
 • తులిపా జెస్నెరియానా
 • తులిపా గౌలిమ్యి
 • తులిపా గ్రెయిగీ
 • తులిపా గ్రెన్జియోలెన్సిస్
 • తులిపా హెటెరోఫిల్లా
 • తులిపా హూగియానా
 • తులిపా హ్యుమిలిస్
 • తులిపా హంగారికా
 • తులిపా ఇలియన్సిస్
 • తులిపా ఇంజెన్స్
 • తులిపా జులియా
 • తులిపా కాఫ్ మాన్నియానా (వాటర్ లిల్లీ తులిప్)
 • తులిపా కోల్పకోవ్స్ కియానా
 • తులిపా కొరొల్ కొవీ రీగెల్
 • తులిపా కుర్దికా
 • తులిపా కుష్ కెన్సిస్
 • తులిపా లనాటా
 • తులిపా లాటిఫోలియా
 • తులిపా లెహ్ మాన్నియానా
 • తులిపా లినిఫోలియా (బొఖారా తులిపా)
 • తులిపా మార్జొలెట్టీ
 • తులిపా మారిటానియా
 • తులిపా మిషెలియానా
 • తులిపా మంగోలికా
 • తులిపా మంటానా
 • తులిపా ఆర్ఫనిడియా (ఆరెంజ్ వైల్డ్ తులిప్)
 • తులిపా ఆస్ట్రోవ్ స్కియానా
 • తులిపా ప్లాటిస్టిగ్మా
 • తులిపా పాలిక్రోమా
 • తులిపా ప్రేకాక్స్
 • తులిపా ప్రేస్టాన్స్
 • తులిపా ప్రైములినా
 • తులిపా పుల్చెల్లా
 • తులిపా రెట్రోఫ్లెక్సా
 • తులిపా రోడోపియా
 • తులిపా సాక్సటిలిస్
 • తులిపా షారోనెన్సిస్
 • తులిపా స్ప్లెండెన్స్
 • తులిపా స్ప్రెంగెరీ బేకర్
 • తులిపా స్టాప్ఫీ
 • తులిపా సబ్ ప్రేస్టాన్స్
 • తులిపా సిల్వెస్ట్రిస్ (వైల్డ్ తులిప్)
 • తులిపా సిస్టోలా
 • తులిపా తాయిహాంగ్షనికా
 • తులిపా తార్దా
 • తులిపా టెట్రాఫిల్లా
 • తులిపా షింగనికా
 • తులిపా ట్యూబర్జెనియానా
 • తులిపా తుర్కెస్తానికా
 • తులిపా ఉందులాటిఫోలియా
 • తులిపా ఉరుమియన్సిస్
 • తులిపా ఉరుమఫ్ఫీ
 • తులిపా వయోలాషియా
 • తులిపా విట్టాల్లి

చిత్రకళా ప్రదర్శన

వీటిని కూడా చూడండి

 • తులిప్ సమయం
 • తులిప్ మానియా
 • తులిప్ రకాలు

సూచనలు

 1. "WCSP". World Checklist of Selected Plant Families. Retrieved 2010. Check date values in: |accessdate= (help)
 2. "Tulipa in Flora of North America @". Efloras.org. Retrieved 2009-12-07.
 3. ఫ్లోరా ఆఫ్ నార్త్ అమెరికన్ ఎడిటోరియల్ కమిటి. 2002. ఫ్లోరా ఆఫ్ నార్త్ అమెరికా. నార్త్ ఆఫ్ మెక్సికో వాల్. 26 , ఆర్కెడైల్స్.' న్యూయార్క్ : ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ ముద్రణాలయం. ISBN 0195152085 26 పేజి 199
 4. Botschantzeva, Z. P. (1982). Tulips: taxonomy, morphology, cytology, phytogeography and physiology. CRC Press. p. 120. ISBN 9061910293.
 5. నిశుచి, వై. 1986. మల్టిప్లికేషన్ ఆఫ్ తులిప్ బల్బు బై టిష్యూ కల్చర్ ఇన్ విట్రో . యాక్టా హార్టా. (ఐఎస్ హెచ్ ఎస్) 177 :279 -284 http://www.actahort.org/books/177/177_40.htm
 6. "Tulipa spp". Floridata. Retrieved 2009-12-07.
 7. పవార్డ్, అన్నా. 1999. ది తులిప్ బ్లూమ్స్ బర్రీ పబ్లిషింగ్ పిఎల్ సి. ISBN 1-58234-013-7 పేజీ 31
 8. ‘‘హౌ టర్కిష్ బ్లూమ్స్ ఎన్ ఫ్లేమ్ డ్, ది డచ్ ల్యాండ్ స్కేప్‘‘
 9. ది డైలీ ఐటమ్, లెన్, మా ఇండిపెండెంట్ న్యూస్ పేపర్, ప్రచురించిన తేదీ జనవరి 24 ,1952
 10. ఎ. లియన్ రేస్, టి.పి. ప్రిన్స్, జె.-పి. వాన్ ఎంపెల్, జె.ఎం. వాన్ తుయల్ ఐఎస్ హెచ్ఎస్ యాక్ట్ హార్టికల్చర్ 673 : XI ఇంటర్నేషనల్ సింపోజియమ్ ఆన్ ఫ్లవర్ బల్బుస్ డిఫరెన్సెస్ ఇన్ ఎపికల్చర్ వేక్స్ లయర్ ఇన్ తులిప్ కెన్ ఇన్ ఫ్లూయన్స్ రెసిస్టెన్స్ టు బొటరైటిస్ తులిప్
 11. వెస్ట్ కాట్, చైతన్య, కెనెత్ హారెస్ట్. 1979. 1997 . వెస్ట్ కాట్స్ ప్లంట్ డిసీజ్ హ్యాండ్ బుక్ . న్యూయార్క్: వాన్ నోస్ట్‌రాండ్ రీన్‌హోల్డ్, 1998. ISBN 1845110579, పేజి 288
 12. బ్రికెల్, క్రిస్టోఫర్, అండ్ జుడిత్ డి. జుక్. 1997. ది అమెరికన్ హార్టికల్చరర్ సొసైటీ A -Z ఎన్ సైక్లోపిడియా ఆఫ్ గార్డెన్ ప్లాంట్స్. న్యూయార్క్, ఎన్.వై.: డికె పియుబి. ISBN 0789419432 పేజీ 1028.
 13. ది ప్లాంట్ ఎక్స్ పర్ట్: తులిప్స్
 14. లోవా స్టేట్ విశ్వవిద్యాలయం: తులిప్ క్లాసెస్

మరింత చదవటానికి

 • బ్లంట్, విల్ ఫ్రైడ్. తులిప్ మానియా
 • క్లూసియస్, కారోలిస్. ఎ ట్రిటైజ్ ఆన్ తులిప్స్
 • డ్యాష్, మైక్. తులిప్ మానియా
 • పావర్డ్, అన్నా ది తులిప్
 • పోల్లాన్, మైకెల్. ది బాటనీ ఆఫ్ డిజైర్

బాహ్య లింకులు

kk:Сепкілгүл